సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
పెంతెకొస్తు - ఆత్మస్నానము
అపో॥కార్య॥ 2:1-4.
ప్రార్ధన:- ఆత్మస్వరూపుడవైన తండ్రీ! సర్వసృష్టికి ఆధారమైన తండ్రీ! మీ పావన ఆత్మతో మా మానవ హృదయములను నింపుము. అపుడు మాకు ఆత్మానందము, ఆత్మోద్రేకము, ఆత్మోత్సాహము కలుగును. మీ మహిమ జ్ఞానముతోను, ఆత్మజ్ఞానముతోను, భవిష్యద్ జ్ఞానముతోను మా మానవ జ్ఞానమును నింపుము. అపుడు నీ అంతరంగములోని అన్ని సంగతులు గ్రహించగలము. ఈ కాలమునకు మీరు బైలుపర్చినవన్నియు గ్రహించగలము. తండ్రీ! మీ పరిపూర్ణాత్మతో, మా మానవ మనస్సాక్షిని నింపుము. అపుడు మీరు బోధించిన ప్రకారము, ప్రత్యక్షపర్చిన ప్రకారము నడుచుకొనగలము.
పరిశుద్దాత్మనకు మా హృదయమును శుద్ధిచేసి తండ్రీ, నీ ప్రేమ ఎప్పుడు ఒక్క రీతిగానే యున్నది. తండ్రీ మీరు కుమ్మరింపుగా వచ్చిన చరిత్రకు అప్పుడే ఆక్షేపణలు కాని నీ శిష్యులకు ఎల్లప్పుడూ జయము. మా అందరి హృదయములలో నివసించే తండ్రీ! వందనములు. ధనికుల మేడలలో, బీదల చిన్న ఇండ్లలో నివసించే తండ్రీ నిన్ను వేడిన యెడల మా హృదయములలోకూడ నుందువు. అట్టి ధన్యత నేడు మాకు దయచేయుమని యేసునామమున వందించుచున్నాము తండ్రీ! ఆమేన్.
ఆత్మ తండ్రిని నింపుకొనుటకు వచ్చిన వారలారా! మన మొదటి పండుగ క్రిస్మసు 2. ఈస్టరు. 3. పెంతెకొస్తు.
ఇవి ప్రతి సంవత్సరములో వస్తున్నవి. ఒక్కొక్క నెలలో వస్తున్నవి. చాలాకాలము నుండి ఈ పండుగ ప్రసంగములు వినుచూనే యున్నాము. అయితే, ఈ పండుగ ఏదనగా, మీరు నేను మాట్లాడి ఊరుకొని ఉన్నదే పండుగ. వారు కనిపెట్టిరి గనుక ఆత్మ చెప్పెను. గనుక ఈ కుమ్మరింపు పండుగ, కనిపెట్టే పండుగ. ఇది వరకు ఆత్మపొందిన వారికి ఉద్రేకము, క్రొత్త వారికి ఆత్మ బాప్తిస్మము జరుగును. అది పెంతెకొస్తు పండుగ. క్రిస్మసుకు తండ్రికి స్తుతి. మంచి శుక్రవారము కుమారునికి స్తుతి ప్రాణమిచ్చినందుకు. పెంతెకొస్తు దినమున పరిశుద్దాత్మకు స్తుతి. ఆయనే తనను తాను మనకు ఇచ్చివేసికొనెను.
తండ్రి తన కుమారుని ఇచ్చెను. ఆత్మనుకూడ ఇచ్చెను. తండ్రి జరిగించిన పై రెండు కథలు, ఈ దానముల సంగతి తెలిసికొనుటకు మధ్యను బైబిలు గ్రంథము ఇచ్చెను. బైబిలు లేకపోతే, తండ్రి తన కుమారునిచ్చిన, ఆత్మ నిచ్చిన సంగతి తెలియదు. త్రియేక దేవుడిచ్చిన దానములు ఏవనగా, ఆయన కుమారుని దానము, ఆత్మదానము బైబిలు దానము, దేవునికి అనేక స్తోత్రములు. ఆయన చేసిన ధర్మములు అన్నిటిలో ఏది గొప్పది? ఏది మొదటిది? అన్ని మొదటివి? అన్నీ గొప్పవి, అన్నీ చివరివి. కుమారుని గురించి, ఆత్మ గురించి, తండ్రి గురించి బైబిలును గురించి బైబిలు వల్లనే తెలిసికొనుచున్నాము. వివరము మాత్రము పరిశుద్ధాత్మవల్ల తెలిసికొనుచున్నాము.
ఈవేళ పరిశుద్ధాత్మ బాప్తిస్మ కథ:-
పాదిరిగారు నీళ్ళతో బాప్తిస్మము ఇచ్చెదరు. అయితే క్రీస్తు ప్రభువు పరలోకమునకు వెళ్ళి పరిశుద్దాత్మ బాప్తిస్మమిచ్చెను.
క్రీస్తుప్రభువు ఏమి చెప్పెను? ఆదరణకర్తను పంపిస్తానని చెప్పెను. ఇది క్రీస్తుప్రభువు ఇచ్చేది. క్రీస్తుప్రభువుల వారు బాప్తిస్మము పొందిన వెంటనే ఆత్మ బాప్తిస్మముకూడ పొందెను. ఆయన వెంటనే పొందెను, తర్వాత పొందలేదు. న్యాయము చొప్పున మనమును అలాగే పొందవలెను అనగా రెండు బాప్తిస్మములు ఒక్క పర్యాయమే జరుగవలెను. ఆలాగు జరుగకపోవుటకు కారణములు మనకు తెలియదు. క్రీస్తు ప్రభువుపొందినట్లు తెలియును గాని మనము అట్లు పొందవలెనని తెలియదు. తర్వాత పొందు చున్నాము.
తెలిసినది రెండూ ఒక్కసారే పొందవలెనని గనుక బాప్తిస్మమొక్కటే. రెండును ఒక బాప్తిస్మములో కలిసే ఉన్నవి. విడదీయ వీలులేదు. క్రీస్తు ప్రభువునకు నీళ్ళ బాప్తిస్మము యోహాను మనలాంటి (బహిరంగముగా) మనిషివలె ఇచ్చెను. క్రీస్తుప్రభువుకు తండ్రి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చెను. మనకును క్రీస్తుప్రభువు ఆత్మబాప్తిస్మము ఇవ్వవలెను. నీటి బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్దాత్మ యొక్క ఏక నామమందు వస్తున్నది. అందులోనే రెండు అనుభవములు జంటగానే యున్నవి గాని తెలియదు. పాపమువలన ఎడముగా నున్నాము. గనుకనే నదిలో, నీళ్ళలో, స్నానము పొందుచున్నాము. అయితే ఆత్మబాప్తిస్మము ఎప్పుడు?
నమ్మి స్నానము పొందిన రక్షణ పొందుదుము. అయితే నమ్మి రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎందుకు? త్రియేక దేవుని నామమున రక్షణ ఇచ్చెను. అప్పుడు తండ్రిని కుమారుని మాత్రమే ఎరుగుదుము గానీ ఆత్మ తండ్రిని వ్యక్తిగతముగా, పూర్తిగా, అనుభవపూర్వకముగా ఎరుగముగదా!
ఆలాగు ఎరిగినపుడే నామకార్ధ క్రైస్తవ సంఘములోనుండి అంతరంగ సభలోనికి రాగలము. ఆలాగున ఆ కాలములో త్రియేక దేవుని నామమున రక్షణపొందిన వారిని ఆయనే మేడగదిలోనికి చేర్చెను. చేరిన తర్వాత ఏమి పని లేదా? 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది అన్య భాషలలోను సువార్త ప్రకటన జరిగించిరి. అదివరకు చేసిన ప్రకటనలో సంపూర్ణ సువార్త ప్రకటించలేదు. ప్రభువుయొక్క మరణము కథ, పునరుత్థాన కథ, ఆరోహణ కథ, ప్రకటించలేదు. అంతకుముందు క్రీస్తు ప్రభువు జన్మము, అద్భుతములు చూచినాము, ఆయనతో ఉన్నాము అని చెప్పిరి. అప్పటికి పైవి జరుగలేదు గనుక బోధించలేదు. సిలువ, పునరుత్థాన ఆరోహణలు జరుగలేదు. ముఖ్యమైనవే జరుగలేదు.
ఈ 3 గొప్ప నిత్య చరిత్రలు జరుగలేదు. గనుక చెప్పలేదు. అయితే ఇప్పుడు వారు ఆత్మబాప్తిస్మము పొందిరి గనుక సంపూర్ణ సువార్త ప్రకటించగలరు. క్రొత్తవి కూడా చెప్పగలరు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు చరిత్రకూడా చెప్పగలరు. మేము ఇప్పుడే పొందినాము. మీరును పొందండి. గనుక పెంతెకొస్తు పండుగప్పుడు చేసినది సంపూర్ణ సువార్త. “మనముకూడా సంపూర్ణ సువార్త చేయవలెను”. అని చెప్పితేనే సంపూర్ణ సువార్త యగును. ప్రభువు చరిత్రలోనివి అన్ని ఎంత ముఖ్యమో, పరిశుద్దాత్మను పొందుటకూడ అంతముఖ్యము. అదికూడ త్రియేక దేవుని పనియే శిష్యులిది గ్రహించగలిగిరి. మన కాలములో క్రొత్తది రెండవ రాకడ జరుగనైయున్నదని చెప్పుచున్నాము. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరిగెనని చెప్పుదుము.
ఉదా:- 12గం॥లకు భోజనం చేసారా? అని 4 గం॥కు అడిగితే అన్ని చేసినట్టే. మీరు స్నానం పొందారా? అంటే నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము పొందినారా అనే అర్ధము. క్రీస్తుప్రభువు అట్లు పొందెను. ఒక్క స్నానములోనే రెండును పొందెను.
- 1) నీళ్ళు
- 2) ఆత్మ ఇంకొకటి.
- 3) అగ్ని ఈ మూడింటి స్నానము ఒకటే.
అన్నము తిన్నావా అంటే కూరతినలేదా! నీళ్ళు త్రాగలేదా? అన్నీ తిని, త్రాగినట్లేగదా! అలాగే స్నానము అంటే అన్నీ అని అర్ధము.
క్రీస్తుప్రభువు నీళ్ళ బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము ఎప్పుడు పొందవలెను.
- 1) ఒకే సమయమందా?
- 2) కొంచెను సేపు అయిన తర్వాతనా? యోహాను బాప్తిస్మము ముగించి ఒక నిమిషము అయిన తరువాత వెంటనే పొందెను.
మనకు చాలా ఆలస్యమైపోతుంది. ఈ ఆత్మబాప్తిస్మమును అంత్యదినము వరకు పొందుచూనే యుందురు.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణపొందును. అపో॥కార్య॥ 2:38.
- 1) మారుమనస్సు
- 2) పాప క్షమాపణ పొందుట
- 3) అప్పుడు పరిశుద్దాత్మ వరము పొందుదురు.
గనుక మొదటిది నీళ్ళ స్నానము రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది క్రమము. రెంటికి దూరమున్నదా? క్రీస్తుప్రభువు బాప్తిస్మములో రెండు స్నానములకు 1 నిమిషము ఎడము. అయితే పేతురు చెప్పినదానిలో “అప్పుడు” అన్నదానిలో మూడు అక్షరములు అనుటకెంత నమయము పట్టునో, అంత సమయములో ఆత్మబాప్తిస్మమునుకూడ అపుడే పొందవలెను. మార్కు 1:10లో వెంటనే అని వ్రాయించుటకును, పేతురు చెప్పిన అప్పుడు అనుమాటకు సంబంధము కలదు.
రెండు ఒక్కసారే గనుక వెంటనే అని కనబడుచున్నది. మనము అంత ధన్యులము కాలేదు. ఎప్పుడు పొందాము. క్రీస్తు ప్రభువు చరిత్రలోను వెంటనే; పేతురు అనుభవ సాక్ష్యములోను వెంటనే అని ఉన్నది. దీనిలో రెండు కథలు కలవు.
120 మంది పరిశుద్ధాత్మను పొందటము చాల ఆలస్యము. క్రీస్తుప్రభువు ఎప్పుడో చెప్పెను. యోహానుకూడ ఎప్పుడో చెప్పెను. వారు మొదట యోహాను శిష్యులు. క్రీస్తుప్రభువు పరలోకము వెళ్ళిన తర్వాత ఆత్మ బాప్తిస్మమును గూర్చిన సంగతి వారికి తెలియబడెను. అయినను ఎప్పుడో ఒకప్పుడు పొందుట ముఖ్యము.
యోహాను పాతనిబంధన ప్రకటించెను. అది అందరికి అని ప్రకటించెను. ప్రవచించెను. యోహానుకు ముందు కొందరు ప్రవక్తలు అనగా అబ్రాహాము, సమూయేలు, యోవేలు ప్రవచించిరి. అందరిలో చివరివాడు యోహాను. కొద్ది దినములలో క్రీస్తుప్రభువు ఆత్మతో బాప్తిస్మమిచ్చుననెను. యోవేలు చెప్పిన సంగతినే యోహాను చెప్పెను. క్రీస్తుప్రభువు అపో॥కార్య॥ 1వ అధ్యాయములో కొద్ది దినములలో పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుదురని చెప్పెను. ముగ్గురు చెప్పినట్టుగా జరిగెను. కొన్ని సంవత్సరములు, కొంతకాలము, కొన్ని దినములు అయిన తర్వాత ప్రవచనము నెరవేరెను. యోవేలుకు, యోహానుకు మధ్య నున్నవారు ఆత్మను పొందారని లేదు. యోహాను మొదలు క్రీస్తుప్రభువు ఆరోహణము వరకు, ఆత్మకుమ్మరింపు మధ్య వరకు ఎవరు ఆత్మబాప్తిస్మము పొందలేదు.
పెంతెకొస్తు దినముననే పొందవలెను. వారికి వాగ్ధానము, మనకును వాగ్ధానము. ఇది జరుగుచుండెను. పెంతెకొస్తు ముందు జరుగలేదు. ఆరోహణము తర్వాత నియమింపబడినది. ఈ బాప్తిస్మమునుగూర్చి ఎవరిని అడిగిన పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందినావా అని అడిగితే తెలియదంటారు. ఈ కాలములో కొందరు అక్కరలేదంటున్నారు. కావలసినవారు మాత్రమే పొందండి. పొందితే చెప్పవలెనా? శిష్యులు పొందిరి గనుక పొందితిమని చెప్పిరి.
- 1. మారుమనస్సు
- 2. పాపక్షమాపణ
- 3. బాప్తిస్మము తర్వాత ఆ వరము పొందుదురని చెప్పిరి.
గనుక మీరు పైవన్ని పొందినారా? ప్రార్ధనచేసి పొందవలెను.
120 మంది 10 రోజుల ప్రార్ధనచేసి కనిపెట్టి పొందిరి. పై మూడును చేసినప్పుడు పొందిరి. మనము కూడ మూడు పనులు చేస్తే పొందగలము. రాకడ సమీపమగుకొలది అందరు పొందవలెను.
అట్టి మహాధన్యత నేడు మనకెల్లరకూ తన కుమ్మరింపుద్వారా ఆత్మతండ్రి అనుగ్రహించును గాక! ఆమేన్.