సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిష్టాఫర్
వాక్యానంద ప్రియులకు, ఆత్మ తండ్రి తాను సిద్ధపర్చిన ఆత్మీయ విందును అనుగ్రహించి, క్రీస్తును మోయగల ధన్యతనిచ్చునుగాక! ఆమన్.
బైబిలు గ్రంథములో "ఆయనను మోసిన గర్భము" అని స్పష్టముగా ఉన్నది. అయితే, బాప్తిస్మ కాలములోనె క్రీస్తును ధరించుట అనునది మర్మముగా ఉన్నది (గలతీ 3:27) గనుక నేడు క్రీస్తును మోయుట, క్రీస్తును మోయుట - క్రీస్తును ధరించుట అను క్రిష్టాఫర్ పాఠమునుగూర్చి నేర్చుకొందాము. బైబిలంతటిలో క్రీస్తును మోసినవారే ధరించినవారే. క్రిష్టాఫర్ లు. వారిని గూర్చి బాగా తెలుసుకోవాలంటే బైబిలు బాగా చదవాలి.
బైబిలు మీరు చదివిరి. గాని కనిపెట్టలేదు. బైబిలులోని మర్మములు, ధర్మములు కనిపెట్టకుండా ఊరికినే చదువుకుంటుపోతే అది బైబిలు చదువుటకాదు. బైబిలు చదవడానికి రెండు పద్ధతులున్నవి.
- 1) పారాయణము
- 2) అధ్యాయనము.
ఈ రెండు మాటలు హిందువులు వారి వేదము చదివేటప్పుడు వాడేమాటలు. ఒక బ్రాహ్మణుడు అరుగుమీద కూర్చుండి వేదము చదువుతుంటే, మరొక బ్రాహ్మణుడు వచ్చి దారిని వెళ్లుచు ఆగి అయ్యా! మీరు పారాయణము చేస్తున్నారా? అధ్యాయనము చేస్తున్నారా? అని అడుగుదురు. పారాయణమేనంటే సరే అని అంటారు. మరొక రోజున అదే బ్రాహ్మణుడు వచ్చేటప్పుడు అడిగితే అధ్యాయనమని జవాబు చెప్పవచ్చును. అప్పుడాయన అరుగుమీద కూర్చుండి నేను వింటాను అధ్యాయనమేలాగు చేస్తున్నావో, చూస్తానన్నారు.
పారాయణమంటే నక్కులు, నక్కులు లేకుండా ధారాళముగా చదవడం. ఇప్పుడు పాఠములోనికి వెళ్ళెదము. యోహాను. 14:10-17. ఆయన
- (1) మీతోకూడా నివసించును.
- (2) ఆయన మీలో ఉండును.
అనగానేమి? మీతో ఉండుట అనగా మన ప్రక్కను మనదగ్గర ఉండి కాపాడుట. మీలో ఉండుననగా మనలో ఉండుట. అదే క్రిష్టాఫర్ ఆయన మనలోనికి వస్తే మనము మోస్తాము. ఆయన మనలో ఉంటేనే ఆయనను మోస్తాము. మనదగ్గర ఉన్న ఆయన మనలోనికివస్తే ఆయనను మనము మోసేవారమగుదుము. కాబట్టి మనము క్రిష్టాఫర్ లమైయున్నాము. అది మర్మముగాయున్నది. మీలో, మీతో అను ఈ రెండు అనుభవములు సుందర్ సింగ్ గారి అనుభవములో ఉన్నవి.
ఆయన మనలోకి వచ్చినట్లు ఎవరికైన అనుభవమున్నదా? మనలో ఉండకపోయినా మనతో ఉండును. ఉన్నాడుగదా!
బైబిలులో ఎక్కడైనా క్రిష్టాఫర్ అనేమాట ఏవచనములో నైన ఉన్నదా? యోహాను 14:8లో. ప్రభువు మనము ఒక్కచోటనే ఉందుము. ఇదియు ఒక విధముగా క్రిష్టాఫర్ నే సూచించుచున్నది. ఆ భావము ఇక్కడ మర్మముగా యున్నది.
యం. దేవదాసు అయ్యగారి అనుభవము:- ఇది చాలా కాలము క్రింద ఉన్న అనుభవముకాదు. అది వేరే. అది ఉన్నా ఇప్పుడు చెప్పనుగాని పోయినవారపు అనుభవము. ఇది క్రిష్టాఫర్ అనుభవమునకు తగినది. మీకును అదే ఉండాలని కోరుచున్నాను. ఇది సన్నిధి కూటస్తులకు చాలా సులువు. పోయివారము అయ్యగారు తన స్వంత అనుభవములను గూర్చి పరుండి ప్రార్ధించుచున్నాము. ప్రభువు వచ్చి చాలా సంగతులు మాట్లాడి
- 1) నీ హృదయము దుఃఖముతో నిండియున్నది అని నాకు తెలుసు.
- 2) "నేను నీకు తోడైయుండుట మాత్రమేగాక నీలోకూడా ఉన్నాను" అన్నారు.
ఆ మాట చెప్పేసరికి అయ్యగారికి చాలా బలము వచ్చింది.
ఆయన నాకు తోడైయుండుట. చుట్టు ఉండి కాపాడుట. నాలో ఉన్నారు అనగా నాలోనే బస చేయుట. అప్పుడు నేను ప్రభువును మోసినట్టుకాదా. అది బైబిలు వాక్యముకాదు. అయ్యగారి అనుభవమునకు సంబంధించిన అనుభవము. మీలో ఎవరికైన మీతో ఉండడము మాత్రమేకాదు మీలో ఉన్నానని ఎవరికైనా ఆయన చెవులకు వినబడిన స్వరముతో ప్రభువే స్వయముగా చెప్పినట్లు తెలియునా? ఆ అనుభవము కలిగినవారు చేతులెత్తితే వినేవారికి ప్రేరేపన కలుగును.
“నేను లోకమునకు వెలుగైయున్నాను” అని ఆయన అన్నారు. ఆ వెలుగు క్రీస్తే. ఆ వెలుగునకు సంబంధించిన మాట బైబిలులో ఎక్కడున్నదనగా క్రిష్టాఫర్ ను జ్ఞాపకము తెచ్చి, ఆ మాటలోనే వెలుగు యున్నది అని ప్రభువు వివరించారు.
తో, లో, తో=మనతో, మనతో ఉండి సహాయము చేయుట. అది అవసరమే. లో = మనలో ఉండడము ఎందుకంటే ఆయన సమస్తమైన ఐశ్వర్యమును మనము అనుభవించుటకు మనలో ఉండడము.
యెష. 14:10-12. పరలోకమందు దేవునియొక్క సింహాననముయొద్ద ప్రధానదూత ఉండేవాడు. అతడు తప్పిపోయినాడు గనుక సింహాసనము దగ్గరనుండి వాయు మండలమునకు పడిపోయినాడు. అందుచేత అతనికి ఆది సర్పము, సైతాను, క్రీస్తువిరోధి అనుపేర్లు ఉన్నాయి. సింహాసనము వద్ద ఉన్నపుడు లూసిఫర్ అనే పేరున్నది. లూసిఫర్ అనగా తేజోనక్షత్రము అని అర్ధము. తేజోమయముగా ఉన్న నక్షత్రమైయున్న ఆ నక్షత్రము = ఆ దూత పడిపోయి, అంధకార స్థితిలోకి వచ్చి ఇప్పుడు అక్కడే భద్రము చేయబడి ఉన్నాడు. ఇది సృష్టికి ముందు జరిగిన కథ. ఎంత గొప్ప ధన్యత పోగొట్టుకొన్నాడు!
- 1. సింహాసనము దగ్గరుండే ధన్యత పోగొట్టుకున్నాడు,
- 2. ప్రధానదూత అనే ధన్యత,
- 3. ప్రధానదూతలలో ఒకదూత అనే ధన్యత,
- 4. తోజేమయ నక్షత్రమనే ధన్యత ఈ నాలుగు ధన్యతలు పోగొట్టుకొన్నాడు. ఇదే దుఃఖకరమైనది.
తేజోనక్షత్రము = వేకువచుక్క ఈ వేకువచుక్క అనేపేరుగలవాడు యేసుప్రభువు అని అర్ధము. లూసిఫర్ కు దేవుని సింహాసనము దగ్గరున్నపుడు వేకువచుక్కని పేరు. ప్రధానదూతకు సింహాసనము దగ్గర వేకువ చుక్క అనేపేరు ఉండేది. ప్రభువుకు కూడ వేకువచుక్కనిపేరు. ప్రధానదూత ప్రభువులోను, ప్రభువు ప్రధానదూతలో ఉండేవారుకూడా. ప్రధాన దూత దగ్గర ప్రభువు, ప్రభువు దగ్గర ప్రధానదూతలో ఉండుట: ప్రధాన దూతలో ప్రభువు, ప్రభువులో ప్రధానదూత ఉండేవారు. ఆలాగే మనుష్యులమైన మనతోను, మనలోను దేవుడుంటున్నాడు.
బాప్తిస్మమునుండి అది తెలియుటలేదు. ఇద్దరు ముగ్గురున్నా చోట నేనున్నానన్నారు. అది మనతో ఉండుట. అయితే, ఆత్మ బాప్తిస్మము పొందిన పిమ్మట, ఆయన కుమ్మరింపుగా మనలోనికి వస్తున్నారు. అది మనలో ఉండుట. అదే ఏకమైయుండుట. అదే క్రిష్టాఫర్ వరుస. అయితే యెష. 14:12లో మర్మముగా ఉన్నది.
సైతానుకు
- 1. మొదట క్రిష్టాఫర్,
- 2. లూసిఫర్ అనే రెండు పేర్లున్నవి.
క్రిష్టాఫర్ కథ ముగిసింది.
లూసిఫర్ అనగా వేకువచుక్క క్రిష్టాఫర్ అనగా ప్రభువును మోసినవాడు. అక్కడ ఫర్ , ఇక్కడ ఫర్ , ఉన్నది. అధ్యాయనమనగా ఇది తెలిసికొనుటే ఇంతవరకు బైబిలు చదువుట పారాయణము యెష. 14:12 ఎన్నోసార్లు చదివినాము, పారాయణము చేసినాము. పారాయణము అనగా ఊరకనే చదువుకుపోవడము. తెలుగు బైబిలులో వేకువచుక్క అని ఉంటే బాగా తెలిసేది.
మా నాన్నగారు రామాయణము అనర్గళంగా అనగా ఎక్కడ తప్పులు లేకుండా అప్పగించేవారు. అనర్గళం అధ్యాయనము అనుమాటలోనుండి వచ్చినమాట అని మీకందరికి తెలుసు. అధ్యాయము, అదే అధ్యాయనము అనగా నేర్చుకొనుట అని అర్ధము. మీరు నాయొద్ద నేర్చుకొనుడి అని ప్రభువు అన్నారు. అదే అధ్యాయనము గనుక మనము బైబిలు అనర్గళముగా చదువవచ్చునుగాని పూర్తిగా ప్రభువు వద్దనుండి నేర్చుకోవాలి.
ఎవరైనా బైబిలును అపశబ్దములు, నక్కులు లేకుండ చదివేవారెవరైనా ఉన్నారా? ఉంటారా? నక్కులు, అపశబ్దములు, తప్పులు లేకుండా వరుసగా చదవాలి. కొందరు మొదటి పంక్తి చదివి రెండు వదలి మూడు చదువుతారు. ఈలాగు చదివేవారు చాలామంది ఉంటారు. తప్పులేకుండ చదివేవారు రాజమండ్రి లూథర్ గిరిలో ముగ్గురున్నారు.
- 1. జేమ్స్ పాదిరిగారు
- 2. రిచర్డ్ జేమ్స్ పాదిరిగారు
- 3. బెంజిమన్ పాదిరిగారు.
ఆలాగు చదువుటకు నేర్చుకొనండి. అప్పుడు దేవుని వాక్యము మనలోనికి వచ్చినట్లు, ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము దేవునియొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడైయుండెను. అదే క్రిష్టాఫర్.
పారాయణము వల్ల, అధ్యాయమువల్ల వాక్యము మనలోనికి వచ్చును. ఆ వాక్యమే దేవుడై యుండెను. అదే ఆయనను మోయుట. కాబట్టి మీరందరు దేవుని వాక్యమైయున్న బైబిలును మోసేవారును, ఆ ప్రకారముగా క్రీస్తును మోసేవారును, తండ్రి, కుమార, పరిశుద్దాత్మలను త్రియేకదేవుని మోసేవారగునట్టి ధన్యత కలుగును గాక!. ఆమన్.
ప్రభువు మీతో, మీలో ఉన్నారనే తలంపు కలిగి ఉండండి.
- 1. జబ్బులున్నవారలారా!
- 2. అప్పులున్నవారలారా!
- 3. ఇబ్బందులున్నవారలారా!
- 4. పిల్లలనుగూర్చి విచారించుచున్నవారలారా! అవమానములపాలైనవారలారా!
- 5. తలంచిన పని సఫలముకానివారలారా! సంతానము కావలసినవారలారా!
- 6. అప్పుడప్పుడు అవిశ్వాసము కలవారలారా!
క్రిష్టాఫర్ పాఠమును తలంచుకొని, ఆయన మీతోను, మీలోను ఉన్నారని నమ్మండి. అప్పుడు మీ కొరతలు, కష్టములు అన్నియు కదురుకొనును. రావల్సిన మేళ్ళు కలుగును. అన్నిటికంటె ముఖ్యముగా, ఆయనయే మీలోనికి వచ్చివేయును. గనుక ఇన్నిబోధలు విన్న తరువాత అవిశ్వాసముంటే అది అపాయము.
యేసుప్రభువునుగూర్చి సాక్ష్యము చెప్పేశక్తి, ధైర్యము లేనివారున్నారా? ఈ పాఠము నమ్మండి. అపుడు మీకు సాక్ష్యశక్తి, ధైర్యము కలుగును.
సైతానును దిట్టంగా దౌడుతీసి పరుగెత్తించే ధైర్యశాలులు ఉన్నారా? అయితే అన్నిటికొరకు ఇపుడు ప్రార్ధన చేతును. ఈ అవస్తలుకాక క్రొత్త అవస్తలున్నవా?
ప్రార్ధన:- దయారసముగల తండ్రీ! నీవెంత గొప్పవాడవో, నీవెంత దయగలవాడవో మాకు తెలుసును. అందుచేతనే నీవు మాతోను, మాలోను, మాకొరకును ఉన్నావు అనే సంగతి ఈ దినములలో జ్ఞాపకము తెచ్చుకొని నిన్ను వందించుచున్నాము. యేసుప్రభువా! మాకొరకు పుట్టినావు, మాకొరకు బోధించినావు, మాకొరకు కష్టపడ్డావు, మా కొరకు సిలువ మరణముపొందినావు, మా కొరకు భూస్థాపన అయినావు, మాకొరకు సిలువ మోసినావు. “మీరును నాకొరకు సిలువమోయండని చెప్పినావు. నా కాడి సులువు”. అన్నావు కాబట్టి నీకు వందనములు. ఇన్ని బోధలు విన్న తరువాత మా హృదయములో చిన్న కళంకమైన ఉండకూడదు. ఇప్పుడు ప్రార్ధనకోరే వారందరి హృదయములోనుండి ఈ చెత్త అంత తుడిచివేయుమనియు, వారి కోర్కెలన్నియు నెరవేర్చుమనియు ప్రార్ధించుచున్నాము.
తైలమును గూర్చిన ప్రార్థన:-
తండ్రీ! ఈ తైలము నీవు చెప్పిన తైలము. తైలము ఎంత బజారులో అమ్మిన, అమ్ముచున్న తైలమైనా బైబిలులో నీవు వ్రాయించినది కాబట్టి అది అన్ని అవస్థలకు సరిపడిన ఒకటే తైలము. వీనికిమించిన తైలము బైబిలులో ఎక్కడనులేదు. గాని పరిశుద్దాత్మ అభిషేకలైలము, ఆనందతైలము, ఆత్మీయ తైలమైయున్నది. మాది శరీరతైలము. కాబట్టి ప్రభువా! ఇది సరిగా వాడుకునేటట్లు, పూర్వము దీవించినట్లుగా ఇప్పుడుకూడా ఈ తైలమును దీవించుము, మేము మరచిపోయిన మనవులుకూడా ప్రార్ధనలో పెట్టినట్లుగానే భావించుము అని వేడుకొంటున్నాము. ఆమేన్.