సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ఎన్నిక జనము - 2



క్రొత్త భూమ్యాకాశములు వచ్చినప్పుడు మనకు పాపమనగానేమియో చీకటి అనగానేమియో తెలియదు. వెయ్యేండ్లలోను మారిన భూమ్యాకాశములుండునుగాని గోగు, మాగోగు యుద్ధములో పాల్గొనే కఠిన హృదయము లుందురు. క్రొత్త భూమ్యాకాశములనగా పరలోకములో ఒక భాగము.


ఎన్నిక జనము:- వీరిని బానిసత్వములోనుండి రాజరికము వరకు తీసికొని వచ్చెను. రాజులైన తర్వాత మరియొక జాబితా వచ్చెను. అది ప్రవక్తలయొక్క సంఖ్య. ఇశ్రాయేలీయులలో లేచెను. ఎన్నిక జనములో బానిసలు లేచిరి. ఎన్నికజనము సంతోషపడు నిమిత్తమై వారిలోనుండి అందరిని మరియు ప్రవక్తలను కూడ లేపెను. వారి పని ఒకటి. పాతనిబంధన వారందరూ రక్షకుని కొరకు ఎదురుచూచిరి. వారన్ని తరగతులలోను వారికి మిక్కిలి కాంతిని కనబరచిరి. సంతోషితులైరి. అయితే ప్రవక్తలు రక్షకుని చరిత్ర పంచుకొనిరి. ఆయన ఏ ఊరులో పుట్టినారో ఎవరిలో పుట్టెనో ఆయనపని ఏలాగుండునో

ఇవన్నీ ఎలాగుండునో వారు పంచుకొనిరి. మోషే అబ్రాహాము కాలములో కొంచెము తెలుసునుగాని ప్రవక్తల కాలములో ఎంచుకొనెను. ఆఖరు ప్రవక్త మలాకీ (ఆయన ప్రవక్త/దూత) వస్తాడని చెప్పి చనిపోయెను. అప్పుడందురు (ప్రవక్త/దూత/ఏలియా) కొరకు చూస్తారు. ఆయన వస్తే క్రీస్తుప్రభువు వస్తారు.


అబ్రాహాము మొదలు యూదలు బబులోను చెఱలోనికి వెళ్ళువరకు కటుంబ చరిత్ర. తర్వాత ఐగుప్తు తర్వాత కుటుంబములు కలిపి జనాంగములైరి. తర్వాత గోత్రముల లెక్కవచ్చెను. అరణ్యములో గుడారమువేసి దానిచుట్టూ మాని, గోత్రమిక్కడ అని నిర్మించెను. అది పాలెస్తీనా దేశములో స్థిరపరచెను. తర్వాత భటులు, యాజకులు, తర్వాత ప్రవక్తలైరి.


ఒకదానికంటె ఒకటి గొప్పదానిగా చేసెను. కటుంబము - జనాంగము - గోత్రములు - యాజకులు - రాజులు - ప్రవక్తలుగా వచ్చిరి. అప్పుడు వాగ్ధానము స్థిరపడెను. మొదట మోషే ఒక్కడే దేవునితో మాట్లాడేవాడు గాని చివరికి 16 గురు ప్రవక్తలు మాటలాడిరి. వారు రెండు సంగతులు

పై 4 సంగతులు బోధిస్తూ వచ్చెను. ఇశ్రాయేలీయులను హింసించిన జనాంగములు ఐగుప్తీయులు వారువేరు. వారు దేవుని ప్రజలను హింసించిరి. గనుక దేశము ఉన్నది. ప్రజలు నశించిరి. దేవుని పట్టు నా ఎన్నిక జనము తప్పుచేస్తే నేను శిక్షిస్తాను గాని వారికేమి సంబంధము గనుక నేను వారిని నాశనము చేస్తానని నాశనము చేసెను.


ఎదోమీయులు వారిని వెళ్ళనీయగా నాశనమైరి. మోయాబీయులు - బిలామును శపించమనిరి గనుక నాశనమైరి. వారి నాశనమునకు కారణము దేవుని ప్రజలను నాశనముచేసిరి. దేశమునకు వచ్చిన తర్వాత కనానీయులు, పిలీష్తీయులు వీరందరూ నాశనమైరి. దేవుని ప్రజలలో తప్పులున్నవి సరే వారు తీర్పరులు కారు. తర్వాత అష్షూరు వారి ఖైదులో వేసిరి. వారు నాశనమైరి. బబులోనువారు లేరు. ఏ జనాంగము వారు లేరు ఇప్పుడు అదే జరుగును.


ఇతరులెవరైన దేవుని బిడ్డల మీదికి వెళ్తారో వారికదే జరుగును క్రమముగా నాశనముగును. దేవునివల్ల ఏర్పర్చబడినవారు. ఎన్నికజనము మొదటివాడైన అబ్రాహాము అతనిని శపించిన వారిని శిక్షిస్తానన్నది. జనాంగముల వారిమీద నెరవేరును. దమస్కు వారుకూడా నాశనమైరి.


అయితే దేవుని జనము ఉంటారా? అన్యులు ఎవరిని ధిక్కరిస్తే నాశనమైరి. ఎన్నికజనము దేవుని ధిక్కరిస్తే వారు నాశనమైరి. క్రీస్తుప్రభువు సిలువవేసిరి. ఇశ్రాయేలీయుల వారు ఇప్పుడు శిక్షలో నున్నారు. రెండవ శతాబ్దము నుండి శిక్షలో నున్నారు. పెంతెకొస్తు అయిన తర్వాత, 70సం॥లో వెళ్ళుట ప్రారంభించిరి. 15వ శతాబ్దము తర్వాత కొన్నాళ్ళకు యెరూషలేములో ఎక్కడ యూదులు లేరు. దేవుని ధిక్కరించిరి గనుక మొదటి వెయ్యిసం॥లో పోయినవారు ఇంకాచేరుకోలేదు. 1900 ఏండ్లనుండి శిక్షలోనున్నారు. ఇంకా ఉన్నది. రాకడవరకు శిక్ష 7 ఏండ్ల వరకు నుండును. అప్పుడు జనాంగ మంతరించి క్రైస్తవులైపోతారు.


పాఠములు:-

ఎన్నిక జనము పొరపాట్లు:-

ఐగుప్తులో నేర్చుకొన్న పాఠము అంతది వచ్చెను. రాజుల కాలములో స్వతంత్రులైరి. గనుక ఇంక ఎక్కువ విగ్రహారాధన చేసిరి. తర్వాత రెండు ఖైదులలో నుండిరి.

ఇవి రెండు అయిన తర్వాత క్రీస్తుప్రభువు వచ్చిన తర్వాతను విగ్రహారాధన తలంపుపోయెను. మరల ఎజ్రా, నెహెమ్యాలు తీసికొని వెళ్లిన తర్వాత గుడిలోకి వచ్చి పూజచేసెను. విగ్రహారాధన పోగొట్టుకొనుటకు ఇన్ని కష్టములు సంవత్సరములు పట్టెను. సంతోషమే విగ్రహారాధనను మానివేసిరి.


ఎన్నికజన మేళ్ళు:-

మోషేద్వారా మాట్లాడెను. ఇశ్రాయేలీయులు Pentateuch ( 5 కాండముల ధర్మశాస్త్రము) పెట్టుకొనిరి. మోషే నీవు మాట్లాడితే వింటాము గాని ఆ దేవుడు మాట్లాడితే చస్తాము అన్నారు. ఆ విధముగా నెరవేరెను.


ఈ కాలములో దేవుడు కనబడితే ఎవరికి అక్కరలేదు. దేవుడు నరావతారి వ్యక్తిగా క్రీస్తుప్రభువుగా బజారులలో, వేదాలలో కనబడెను. పండుగలకు అన్నిరకముల మనుష్యుల దగ్గరకు వెళ్ళి నేను కనబడుటకే వచ్చానని చెప్పుట; ఈ కాలములో ప్రయత్నము చేసిన వారికి కన్పించును.


3) కావలసినవి కురిపించుట: బండ్లలో నుండి నీళ్ళు, ఆహారము, మన్నా మొదలగునవన్నీ మేళ్ళు. బండలో నీళ్ళు, మన్నా. ఈ రెండు వారెన్నడు మరువరు. మాంసము, పూరేళ్ళు వచ్చి ముమ్మారు తినండి అన్నది. 40 సం॥లు బట్టలు మాయలేదు. కాళ్ళు వాయలేదు. దేవుడు ఎప్పుడు వారిమధ్య నున్నాడు. చిన్నిచిన్ని సంగతులు కూడ చెప్పెను. ముఖ్యమైనవి అముఖ్యమైనవి కూడ చెప్పెను.


రేపు సంఘమునకేమి ప్రభువు చేసెనో చెప్పవలెను. గొడుగు పట్టెను, లాంతరు పట్టెను. చీకటికి వెలగు - ఎండకు గొడుగు పట్టెను. 40 సం॥లు పట్టెను. దుఃకాణములన్నీ తెచ్చిపెట్టెను. దేవుడు తన జనమునకు అన్ని సదుపాయములు చేసెను. ఆ జనాంగమునకు చేసినట్లుగా అన్నిచేయును. ఎన్నిక జనమునకు ఎన్ని సదుపాయములు ఎన్నైన సదుపాయములు చేస్తాడు, చేశాడు. కుమ్మరించెను. కష్టములు తోడివేసెను. ఆకాశములో నుండి కుమ్మరింపు కాపరి కొదువలేదు. గిన్నె నిండి పొర్లును. అవన్ని తిన్నగానుంటేను.

ఈ కాలములో సంఘమనే ఎన్నిక జనమును పోషకుడవు. పాపక్షమాపణకర్తవు, వైద్యుడవు, నన్ను స్వస్థపరచు యెహోవా, నడిపించే కర్తవు, సముద్రములో, అరణ్యములో, రాజువు, గ్రంథకర్తవు, ప్రవక్తలను రప్పించి చెప్పి వ్రాయించి పాత నిబంధనలో పెట్టించినావు. నేటివరకు వారు ఆ పుస్తకమును చంకపెట్టుకొని తిరుగుచున్నారు. బహు ఆశ్చర్యకరమైన దస్తావేడు. నిన్ను నమ్మే వారందరికి అన్ని చేస్తావు. ఆమేన్.