సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

రక్షణదారి పాఠములు



మత్తయి 16:24 మార్కు 1:21.


ఆహ్వాన ఉద్యోగముయొక్క మొదటి వర్తమానములో O (సంపూర్ణము) ఉన్నది. మందిర ద్వారముయెధ్ద ఉన్న ఉపదేశములో రెండవ వర్తమానములో O (సంపూర్ణము) ఉన్నది. అక్కడే భూగోళమంతా ఉన్నది. ప్రజాసంఘమున్నది. ఆయన రక్షణాహ్వానమును వినడము, అంగీకరించడము, రావడము ఉన్నది. అనగా

3వ సందేశము: నాయొద్ద నేర్చుకొనండని మందిరములో వ్రాసియున్నారు. గనుక ఇదియొక పాఠశాల. ఇందులో ఆయన కూర్చుని బోధించుచున్నారు. నేర్చుకొనవలసిన విషయములు అనేకములు నేర్చుకొనవలెను. నరలోకమునుగూర్చి పరలోకమునుగూర్చి నేర్చుకొనవలెను.


ఆయన -

ఒకరి తరువాత ఒకరు వస్తున్నారు. మరి ఆ మందిరములోని బోధనాంశములు ఏమిటి?

ఇది భాగ్య వరప్రసాదము. ఈ మూడు గొప్ప పాఠములు ఆయనే ఈ మందిరములో స్వయముగా నేర్పించుచున్నారు. వీటికి సంబంధించిన గొప్ప పాఠములుకూడా వాక్యములో ఉన్నవి. యూదుల ఆచారము కూర్చుండి బోధించుట. దేశములో, జనాంగములో, దేవాలయములో; మూడు ముఖ్య విషయములు బోధిస్తున్నారు. మార్కు 1:21-27 నాలుగు సువార్తలు కలిసి క్రీస్తుయొక్క జీవితచరిత్ర అగును. క్రీస్తువారి జీవిత చరిత్రలో, ఆయన ఉద్యోగములోని వర్తమాన వాక్యములే బోధలు.


ఆ బోధలు వింటే మనశ్శాంతి కలుగునని, రోగులకు స్వస్థత కలుగునని ప్రజలందరూ వచ్చేవారు. దయ్యము బయటికి రావలెనని ప్రభువు చెప్పిరి. అపుడు అది బయటకు వచ్చినది. వానిని విలవిలలాడించినది, వెళ్ళిపోయినది. ఇదివరకు బోధ ఇప్పుడిది క్రియ. ఆయన సందేశము ఎన్ని విధములు? మాట, క్రియ. వాక్కు మూలముగా సందేశము; క్రియల మూలముగా నెరవేర్పు. ఈలాగు సర్వ ప్రపంచములకు ఆయన తన వాక్కును, క్రియను పంపుచున్నారు.

ఈ మూడు రూపములకు ఆశ్చర్యపడిరి, విస్మయమొంది, ధర్మశాస్త్రము చదువుకొని, ఆనందపడుచున్నారు. అప్పుడు ఆనందించినట్లు ఇప్పుడును అనేకులు ఆనందించుచున్నారు. ఆలకించవలెను, పరీక్షించవలెను, అంగీకరించవలెను. రావలెను, అనుభవించవలెను, ఆయన బోధలేమిటి అని అవన్నీ పరీక్షింపవలెను. ఆయన బోధల జాబితా పెద్దది. బోధ మూలముగా ఆయన చేసిన బోధలోనున్న అంశములలో నరవాత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అప్రమాణము చేయవద్దు అనునవి పర్వతముమీద చెప్పిన ధర్మ ఉపదేశములో ఉన్నది. వేదశాస్ర్రజ్ఞులు బోధించిన బోధలో ఇవి ఉన్నవి. అయితే ప్రభువు - చంపనక్కరలేదు, కోపపడితే చాలు అదే నరహత్య, నరహత్యతో సమానము అని చెప్పిరి. ఇది

మనమే దీవించవలెనట. ఈ శక్తి ఏలాగు వచ్చును. మీరు మొదట ఆ పని చేస్తే, ఆ శక్తి వచ్చును.


మీరు మొట్టమొదట మీకొరకు ప్రార్థించండి. అపుడు ఉండకూడని వాటిని విసర్జించగలరు ఆ పిదప ఎవరినైనను దీవించగలరు. అక్కడ అందరు ప్రభువుయొక్క ఈ క్రొత్త బోధ విని మన శాస్తులవలెకాక, వేదాంత పండితులవలెకాక అధికారము గలవానివలె బోధించెను అని ఆశ్చర్యపడ్డారు. ఇందులో రెండు వద్దులు (నరహత్య చేయవద్దు, కోపపడవద్దు). మూడు కావలెను (క్షమించవలెను, ప్రార్థింవలెను, దీవించవలెను).


ఈ ఐదు బోధలేగాని, దయ్యములను వెళ్ళగొట్టుట ఇది క్రియ.

బోధకుడు బోధమూలముగా వర్తమానము అందించవలెను. క్రియ మూలముగా సందేశము అందించవలెను. బోధ చేయవచ్చు గాని క్రియ మూలముగా చేయలేరు. బోధించిన ప్రకారము ఎవ్వరు నడుస్తారో వారే పరలోకములో ధన్యులు. కొందరు నడవలేకపోవుచున్నారు.

బోధవేరు, అద్భుతక్రియ వేరు, ప్రవర్తన వేరు ఈ మూడు ప్రభువు కాలములో ప్రత్యక్షమైనవి. ఇప్పుడుకూడా అలాగే జరుగుచున్నది. శ్రమ చరిత్రలో ఏమి తెలుస్తున్నది? ఆయన వారిని హింసించలేదు. హింసించుటకు రాలేదుగాన, క్షమించినాడు. దూషణ, శాపము ఆయన చేయలేదు.


ఆయన చెప్పినట్లు చేసినాడు. ఇదే క్రొత్త బోధ. సిలువమీద బోధలో ఇరు పార్శ్వములలో బందిపోటు దొంగలున్నారు. వారివైపు జాలితో చూచి క్షమించినారు. బాగుపడితే బాగుండాలని తలంచినారు. తుదకు ఒకడు అంగీకరించెను. అందుకు ప్రభువేమి చేసినారు? ఆ చివరిలో బందిపోటు దొంగయొక్క కడవరి చరిత్ర ఉన్నది. ఇది మందిరములో జరిగిన కథ. అనగా బోధించిన చరిత్ర మందిరములో జరిగినది. ప్రవర్తనద్వారా రక్షించిన చరిత్ర సిలువపై జరిగినది. దొంగను ప్రభువు రక్షించినారు. ఇది చివరి క్రియ. ఏవిధముగా రక్షించినారు? ప్రవర్తన ద్వారా! ఇది అద్భుతములకు మించిన అధ్భుతము. ఏమి ప్రవర్తన? జాలిచూపుట. ఆ చూపులో జాలి, పేతురును చూచిన జాలిచూపు ఇదే. అనకూడదు గాని ప్రభువు చూపుకు పేతురు స్త్రీవలె ఏడ్చినారు. ఆ విధముగానే కుడివైపున ఉన్న దొంగనుకూడ తన జాలి ప్రవర్తనలోని చూపువల్ల మార్చివేసినారు. రెండవ దొంగ ఆయన శాంతిప్రవర్తన చూడలేదు. నన్నెందుకు సిలువవేసినారు అనే గొడవలో ఉన్నారు. అందునుబట్టి ఆయన ప్రవర్తనా ప్రభావమును అతడు చూడలేదు.

అదే అన్ని క్రియలలో గొప్ప క్రియ. క్షమించినారు, ప్రార్థించినారు, దీవించినారు; అనలేదుగాని నేను నిన్ను రక్షించలేను రక్షించి నీవు నాతోకూడ మోక్షములో ఉంటావు అన్నారు. పరదైసుకు తీసికొని వెళ్ళినారు. దొరకాని దొర. ఇతడు మొదట దొంగ తరువాత దొర. ఇది ఆఖరు ఉపకారము. ఇప్పుడు రక్షింపబడవచ్చు. ఆఖరు స్థితి ఏమగునో! ఒకసారి పడితే లేస్తారు. రెండవసారి పడిపోతేనో! గనుక ప్రభువు వచ్చి పడిపోకుండ చేయవద్దు, తనతో తీసికొని వెళ్ళెను.


ఉపకారములు:

క్రియచూచి కపెర్నహూములో "క్రొత్త బోధ" అన్నారు. చివరకు చూస్తే గొప్ప బోధ. గనుక ప్రభువుకు మహామహోపాధ్యాయుడు అను బిరుదు గలదు. ఈ సందేశము అందరి హృదయములకు చెందునుగాక, అందునుగాక. ఆమేన్.
కీర్తన: ఉపకారినుతినీకౌ , రక్షకానా వందనాలు.