సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
సిలువ - నేను (CROSS-SELF)
“నేను క్రీస్తుతో కూడ సిలువవేయబడి యున్నాను గలతీ. 2:20.
వాక్యాసక్తిగల ప్రియులారా! క్రీస్తు సిలువానంద ప్రియులారా! శ్రమల ధ్యాన దీక్షాపేక్ష పరులారా! మీకు క్రీస్తు సిలువను ధ్యానించి, శరీరమును సిలువవేయు భాగ్యము కలుగును గాక. ఆమేన్.
నేటి దినము ఈ శరీరమును సిలువవేయుకొన్ని ప్రత్యేక అంశములను ధ్యానించెదము.
పై వచనమునుబట్టి పౌలు 'నేను' అనువానిని సిలువవేస్తున్నాడు.
- ప్రధాన దూతయైన లూసివర్ 'నేను ఆకాశమునకు ఎక్కిపోయెదను' యెష 14:13 అని అనుకొనెను. వెంటనే దేవుడు గర్వించిన ఆ దూతను క్రిందికి పడవేసెను.
- 2. గొల్యాతుకూడ ఇశ్రాయేలీయులను బెదిరించాడు. “యుద్ధపంక్తులు తీర్చుటకై మీరెందుకు బైలుదేరి వచ్చితిరి. నేను ఫిలిప్తీయుడనుకానా? నేను అతనిని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై దాసత్వము చేయుదురు. ఈ దినమున ఇశ్రాయేలీయుల సైన్యములను నేను తిరస్కరించుచున్నాను” 1సమూ. 17:8-10 అంటూ తన్నుతాను పెద్ద చెసికొంటూ ముందుకు వస్తున్నాడు గొల్యాతు. నేను అనే దానిమీద ఆధారపడి వస్తున్నాడు.
- 3. దావీదు నేను అను వానిని చంపాలి నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను అంటూ తన్ను తాను మరచిపోయి దేవుని పేరిట గొల్యాతును సునాయాసముగా చంపగలిగెను. ఆలాగే మనమును "నేను" అనే వానిని చంపివేయవలెను.
- 4. నేను అనేవానిని పెంచి పెద్దచేసేది శరీరము, గనుక శరీరమును అణచినచో నేను అనేవానికి చావు మూడినట్లే అగును. మనలను పాడుచేసేది శరీరమే. అది ఒకనిని గర్వింపచేస్తుంది, ఉన్నదానికంటే అధికంగా చూపించుచున్నది. ఒక గదిలో 1000 అద్ధములుంటే ఒకడు ఒకేసారి ఆ 1000 అద్ధములలో కనిపిస్తాడు. అలాగు శరీరము ఒకనిని హెచ్చించుచున్నది. ఒకనికి ఉన్న అతిశయమంతా తన శరీరమునుబట్టియే కలుగుచున్నది. Selfishness is specialist అనగా శరీరము "నేను" అనువానికి నిపుణుడు గనుక మొదట శరీరమును అణచవలెను. దానిని మనము నిర్లక్ష్యపెట్టవలెను. పౌలు అన్నట్లు శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు బుణస్తులముకాము. (రోమా. 8:12) అని శరీరమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా మానవలెను. కులమునుబట్టిగాని, నాగరికతనుబట్టిగాని, అంతస్థునుబట్టిగాని శరీరమునకు ప్రాధాన్యత లేకుండా చేయవలెను.
-
5. కోరలు తీయబడిన పామువలె శరీరము ప్రాధాన్యత లేనిదిగా విడువబడవలెను. శరీరమందేదైనా మంచి ఉన్నదా? ఉంటే అందులో ఏమియు
లేదు.
“నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును రోమా. 7:18 అని పౌలు స్పష్టముగా చెప్పుచున్నాడుగదా!
మంచి
చేయాలి అని అనుకున్నాను గానీ నా శరీరము చేయనీయదు గనుక శరీరముయొక్క తత్వమును బాగుగా ఎరిగినవారమై, మనము శరీరమును
ఆస్పదముచేసికొనకూడదని ఫిలిప్పీ. 3:3లో పౌలు తెలియజేసెను. We have no confidence in flesh.
“విశ్వాసరాహిత్య తీర్మానమును” శరీరముమీద పౌలు ప్రకటించుచున్నాడు. శరీరము నమ్మకమును పోగొట్టుకొన్నది. శరీరమును అణచు విధమేది? ఆత్మచేత శరీర క్రియలను చంపివేసినయెడల జీవించెదరు (రోమా. 8:13). శరీరమును అణచేవిధము లేకపోలేదు. అనేకులకు బోధించిన తరువాత నన్ను నేనే నలుగగొట్టుకొనుచున్నాను అని పౌలు చెప్పుచున్నాడు (1కొరింథి. 9:27). - 6. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కొంతదూరము ప్రయాణముచేసి, రెఫీదీము అరణ్యములో దిగిరి. అంతలో అమాలేకీయులు అడ్డువచ్చి ఇశ్రాయేలీయులు సాగిపోకుండా వారితో యుద్ధము చేయనారంఖించిరి. అంతట మోషే తెలియజేసినట్లు యెహోషువా వారితో యుద్ధమారంభించెను. మోషే దేవునికర్ర చేతపట్టుకొని శిఖరముమీద నిలిచెను. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినపుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా అహరోను, హూరులు ఒక రాయి తీసికొని వచ్చి మోషే కూర్చుండుటకు వేసిరి. అహరోను, హూరులు కుడి ఎడమల చేతులు పట్టుకొనిరి. మోషే చేతులు నిలిపి ఇశ్రాయేలీయులకు జయము సమకూర్చిరి. ఇందులో గొప్ప సత్యము గలదు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు బైట శత్రువులు. కనాను దేశము వెలుపల శత్రువులు. కానాను దేశములోని 7 జనాంగములలో శత్రువులు లోపలి శత్రువులు. అయితే మన శరీరమే మన అమాలేకీయుడు. మొదట మనము జయించవలసిన మొదటి శత్రువు శరీరమే. చేతులెత్తుటద్వారా మోషే ఇశ్రాయేలీయులను జయించునట్లు చేసెను. చేతులెత్తుట అనగా ప్రార్థించుట. ప్రార్ధన ద్వారానే శరీరము, దాని క్రియలు నాశనమగునుగానీ వేరే మార్గములేదు. ప్రార్థన ద్వారానే శోధనలను జయింపవచ్చును. అమాలేకీయులు తమ చేతిని ఇశ్రాయేలీయులకు విరోధముగా ఎత్తిరి. గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను నిర్గ. 17:16. అలాగే నిరంతరము ప్రార్థించుచుండిన యెడలనే శరీరమును మనముకూడ జయించగలము.
- 7. పాత ఆదాము అనగా ముసలి ఆదాముకూడా అప్పుడప్పుడు పైకి వచ్చుచుండును. ముసలివారుకూడ అప్పుడప్పుడు ఇతరులవలె ప్రవర్తించెదరు, అందుకనే శరీరమును కనిపెట్టుచుండవలెను. గిద్యోను మొదలు అమాలేకీయులను నాశనము చేస్తునే వచ్చిరి. అయితే సౌలు మాత్రము దైవాజ్ఞ ప్రకారము అమాలేకీయులనందరిని హతముచేయ గలిగినను, రాజును ప్రాణముతో బ్రతుకనిచ్చెను. అందుకని దేవుని కోపము సౌలుమీద రగులుకొనెను. దావీదైతే అమాలేకీయులనందరిని, సౌలు మరణ వార్త తీసికొని వచ్చిన ఆఖరు అమాలేకీయునితో సహా చంపినందున హెబ్రోనును స్వాస్థముగా పొందెను.
హెబ్రోను అనగా దేవుని సహవాసము. శరీరమును ప్రార్ధన, దైవ సహవాసముద్వారా మొదలగు వాటిచేత జయింపవలెను. అప్పుడు యోహానువలె దేవుని భుజముమీద మనమానుకొనగలము. దైవ సహవాసములో ప్రవేశింపగలము. ఇట్టి భాగ్యము మనకందరికి ఆత్మ తండ్రి సహాయమున సహవాసమున లభించునుగాక! ఆమేన్.