83. క్రొత్త సంవత్సరము
రాగం: యమునా కళ్యాణి తాళం: ఆది
- ఉపకారీ నుతి నీకౌ -
ఉపకారులన్ మించిన = ఉపకారి వీవె కావా - నెపముల
నెంచకనె - కృప నధికముగా - జూపించు మా
- అపకారములను మాపు || ఉప ||
- రేయి యంతటను మేము - హాయిగా నిదుర బోవ = కాయునట్టి దూ - తను మా - కై ఏర్పచినావు - ఏ యపాయము నైనను రా - నీయ నట్టి గొప్ప || ఉప ||
- మంచు కురియు కాలమున - సంచరింప లేము స్వేచ్ఛన్ = ఎంచు కొనిన పనుల్ - సాగవు సరిగా - మంచివారికి సహితంబు - పొంచి యుండు న - నారోగ్యంబు - త్రుంచి వేయ గలమా || ఉప ||
- ఎండకు గాడ్పులు కొట్టు - మండుచు పొక్కును కాళ్ళు = ఉండ నందున నీ - రెక్కడను నోరు - ఎండుకొని పోవును - అండ యుండదు ఇండ్లు కాలి - గండములను దాటించు || ఉప ||
- వానకు పడిసెము పట్ట - నానుపు వరదలు రాగ = మానవు లెందరో - మరణము కాగా - ఈనాడు మా చేత - గానములు చే - యించుట కొరకై - హానిని పరిహరించిన మా || ఉప ||
- కలహములు వ్యాధులును - పలు విధములైన లేముల్ = నిలువున మ్రింగు భూకంపములు - పలుమారు దుర్వార్తలు - కలుగుట వలన - కలిగిన కలతలు - తొలగించుచు వచ్చిన మా || ఉప ||
- దురితాత్మల పీడలను - నరుల వలన వచ్చు బాధల్ = తిరిగెడు మృగముల వలన కీడు - పురుగుల కాటును మరి - జలచర పక్షుల - వలన హాని - దొరలగ దొర్లించిన మా || ఉప ||
- పాపకారకు డపవాది - పాప నైజమొక యపవాది = పాప ఫలితంబు నొక యపవాది - శాపమొక యపవాది - పాప శోధన - యొక యపవాది - ఆపుచు వచ్చుచున్న మా || ఉప ||
- జీవితము మేలొంద - నేవి కలుగ జేసితివో = ఆ వస్తువుల వలననే మాకు - చావు వచ్చె నకటా! - నీ వాక్యాతి - క్రమ ఫలమిదియే - మా విచారము బాపు || ఉప ||
- జనక సుతాత్మల ప్రభువునకు - అనయము మహిమ భక్తులౌ = మనుజు లలో దూ - తలలో మోక్ష - జనులలో నా మదిలో - తనదు సృష్టి యంతటి లోను - ఘనత లభించును గాక || ఉప ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
83. krotta saMvatsaramu
raagaM: yamunaa kaLyaaNi taaLaM: aadi
- upakaaree nuti neekau -
upakaarulan^ miMchina = upakaari veeve kaavaa - nepamula
neMchakane - kRpa nadhikamugaa - joopiMchu maa
- apakaaramulanu maapu || upa ||
- raeyi yaMtaTanu maemu - haayigaa nidura bOva = kaayunaTTi doo - tanu maa - kai aerpachinaavu - ae yapaayamu nainanu raa - neeya naTTi goppa || upa ||
- maMchu kuriyu kaalamuna - saMchariMpa laemu svaechChan^ = eMchu konina panul^ - saagavu sarigaa - maMchivaariki sahitaMbu - poMchi yuMDu na - naarOgyaMbu - truMchi vaeya galamaa || upa ||
- eMDaku gaaDpulu koTTu - maMDuchu pokkunu kaaLLu = uMDa naMduna nee - rekkaDanu nOru - eMDukoni pOvunu - aMDa yuMDadu iMDlu kaali - gaMDamulanu daaTiMchu || upa ||
- vaanaku paDisemu paTTa - naanupu varadalu raaga = maanavu leMdarO - maraNamu kaagaa - eenaaDu maa chaeta - gaanamulu chae - yiMchuTa korakai - haanini parihariMchina maa || upa ||
- kalahamulu vyaadhulunu - palu vidhamulaina laemul^ = niluvuna mriMgu bhookaMpamulu - palumaaru durvaartalu - kaluguTa valana - kaligina kalatalu - tolagiMchuchu vachchina maa || upa ||
- duritaatmala peeDalanu - narula valana vachchu baadhal^ = tirigeDu mRgamula valana keeDu - purugula kaaTunu mari - jalachara pakshula - valana haani - doralaga dorliMchina maa || upa ||
- paapakaaraku Dapavaadi - paapa naijamoka yapavaadi = paapa phalitaMbu noka yapavaadi - Saapamoka yapavaadi - paapa SOdhana - yoka yapavaadi - aapuchu vachchuchunna maa || upa ||
- jeevitamu maeloMda - naevi kaluga jaesitivO = aa vastuvula valananae maaku - chaavu vachche nakaTaa! - nee vaakyaati - krama phalamidiyae - maa vichaaramu baapu || upa ||
- janaka sutaatmala prabhuvunaku - anayamu mahima bhaktulau = manuju lalO doo - talalO mOksha - janulalO naa madilO - tanadu sRshTi yaMtaTi lOnu - ghanata labhiMchunu gaaka || upa ||