53. పశ్చాత్తాపము
రాగం: ముఖారి తాళం: త్రిపుట
- నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయన =
నీవు - కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయన || నన్ను ||
- దూరమునకు బోయి నీదరి - జేరనైతిని నాయనా = నేను - కారు మూర్ఖపు బిడ్డనైతిని - కారు వనమున నాయనా || నన్ను ||
- మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుడ నాయనా = నేను - వంచితుండనైతి నీ ప్ర - పంచ మందున నాయనా || నన్ను ||
- చాలామారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా = నా - చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా || నన్ను ||
- జ్ఞానమంతయు పాడు చేసి - కాననైతిని నాయనా = నీవు - జ్ఞానము గల తండ్రివని - జ్ఞప్తి వచ్చెను నాయనా || నన్ను ||
- కొద్ది నరుడను దిది నను నీ - యొద్ద జేర్పుము నాయనా = నీ - యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దునైతిని నాయనా || నన్ను ||
- ఎక్కడను నీ వంటి మార్గము - నెరుగనైతిని నాయనా = నీ - రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా || నన్ను ||
- శత్రువగు సైతాను నన్ను - మిత్రు జేయును నాయనా = ఎన్నో - సూత్రములు గల్పించెను నా - నేత్రములకో నాయనా || నన్ను ||
- వాసిగానే పాపలోకపు - వాసుడనో నాయనా - నీ - దాసులలో నొకనిగా నను - జేసి కావుమి నాయనా || నన్ను ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
53. paSchaattaapamu
raagaM: mukhaari taaLaM: tripuTa
- nannu diddumu chinna praayamu - sannutuMDagu naayana =
neevu - kanna taMDri vanuchu naenu - ninnu jaeriti naayana || nannu ||
- dooramunaku bOyi needari - jaeranaitini naayanaa = naenu - kaaru moorkhapu biDDanaitini - kaaru vanamuna naayanaa || nannu ||
- maMchi maargamu laedu naalO - maraNa paatruDa naayanaa = naenu - vaMchituMDanaiti nee pra - paMcha maMduna naayanaa || nannu ||
- chaalaamaarulu tappipOtini - maelu gaanaka naayanaa = naa - chaala morala naalakiMchumu - jaaligala naa naayanaa || nannu ||
- j~naanamaMtayu paaDu chaesi - kaananaitini naayanaa = neevu - j~naanamu gala taMDrivani - j~napti vachchenu naayanaa || nannu ||
- koddi naruDanu didi nanu nee - yodda jaerpumu naayanaa = nee - yodda jaerchi buddhi cheppumu - moddunaitini naayanaa || nannu ||
- ekkaDanu nee vaMTi maargamu - neruganaitini naayanaa = nee - rekka chaaTuna nannu jaerchi - chakkaparachumu naayanaa || nannu ||
- Satruvagu saitaanu nannu - mitru jaeyunu naayanaa = ennO - sootramulu galpiMchenu naa - naetramulakO naayanaa || nannu ||
- vaasigaanae paapalOkapu - vaasuDanO naayanaa - nee - daasulalO nokanigaa nanu - jaesi kaavumi naayanaa || nannu ||