67. యేసునామ ధారులు ధన్యులు


    యేసునామ ధారులందరు - ఎంతో ధన్యులు వారు - భాసురమైనట్టి స్థితిలో - బ్రతుక జూతురు || యేసునామ ||

  1. ఆదాము హవ్వల వలెనె - ఐక్య మొందుదురు
    వారు బేధమేమియు లేకుండగనె - పెరుగు చుందురు || యేసునామ ||

  2. హేబేలు వలెనె ప్రభువునకు మంచివి - ఇచ్చి వేతురు
    వారు - ఆ బాలుని వలెనె దేవుని - అనుమతి పొందుదురు || యేసునామ ||

  3. హనోకు వలెనె దేవుని - హత్తి యుందురు
    వారు - ఏనాడో ఒకనాడు పైకి - ఎగిరి పోదురు || యేసునామ ||

  4. నోవాహు వలెనె క్రీస్తుని - నావను జేరుదురు
    వారు - ఏవిధమైన ప్రళయంబును - ఎరుగకుందురు || యేసునామ ||

  5. షేమువలె దేవుని గలిగి - సిద్ధులౌదురు
    వారు - తాము తలంచు దేవునికి వందనము చేయుదురు || యేసునామ ||

  6. అబ్రామువలెనె పిలుపు - అందుకొందురు
    వారు - శుభ్రముగా యిలువిడిచి వేరు - చోటున చేరుదురు || యేసునామ ||

  7. ఇస్సాకు వలెనె చావు - నెదురుకొందురు
    వారు - డస్సిపోరు వెనుకాడరు - దాగి యుండరు || యేసునామ ||

  8. యాకోబువలె దీవెనలెన్నో - ఆర్జింప గలరు
    వారు -త్రైకునితో పోరాడి పగను - దించి వేయుదురు || యేసునామ ||

  9. యూదా వలెనె పరుల కొరకు - వాదింప గలరు
    వారు - వేదన గలవారికై క్రీస్తుని - వేడు కొనగలరు || యేసునామ ||

  10. యోసేపు వలెనె శోధన - లున్న గెలుతురు
    వారు - ఏ సమయ మందైన - మంచి ఏలిక లౌదురు || యేసునామ ||

  11. మోషే వలెనె దేవుని ముఖా - ముఖిగా జూతురు
    వారు - మోషే వలెనె విద్యకు - ప్రామ్ముఖ్యు లౌదురు || యేసునామ ||

  12. యెహోషువ వలె వాగ్దేశ - మేగుదురు త్వరలో
    వారు - మహా శూరులై వైరి యడ్డు - మడ ద్రొక్కుదురు || యేసునామ ||

  13. న్యాయాధిపతుల వలెనె - న్యాయము తీర్తురు
    వారు - ఆయా ఆపదలందు ప్రజల - నాదరింతురు || యేసునామ ||

  14. రూతు వలెనె పాతక జనులు - జాతిని విడుతురు
    వారు - నీతి సభలో జేరి క్రీస్తు - నియమితు లౌదురు || యేసునామ ||

  15. సమూయేలు వలె ప్రార్ధన సమా - జములు పెట్టుదురు
    వారు - క్రమ పరతురు జన సంఘములో - కలహము లేకుండ || యేసునామ ||

  16. రాజుల వలెనె నేటి దేవ - రాజ్యాసీనులు
    వారు - రాజులు యాజకులు శాంతి - రాజ్య ప్రచారకులు || యేసునామ ||

  17. నెహెమ్యా వలెనె పడిపోయినవి - నిలువ బెట్టుదురు
    వారు - నెమ్యా వలెనె ప్రజలను దిద్ది - నేర్పుదురు బుద్ది || యేసునామ ||

  18. ఎజ్రా వలెనె మరచిన బోధ - ఎరిగింప గలరు
    వారు - ఎజ్రా వలెనె శాస్త్రము నందు- ఎదిగింప గలరు || యేసునామ ||

  19. ఎస్తేరు వలె స్వంత వారి - స్వస్థి కోరుదురు
    వారు - ఎస్తేరుతో అత్యాదులు - ఎత్తి వేయుదురు || యేసునామ ||

  20. యోబు వలెనె కష్టా లెల్ల - ఓర్చు కొందురు
    వారు - ఏ బాధయందైన దేవుని - హెచ్చుగ జూతురు || యేసునామ ||

  21. దావీదు వలెనె దేవుని - సేవకు లౌదురు
    వారు - పావన కీర్తనల కవులై - ప్రబలు చుందురు || యేసునామ ||

  22. సొలోమోను వలె జ్ఞానంబు - కలిగి యుందురు
    వారు - కలిమి గలిగి క్రొత్త పనులు - కల్పన చేయుదురు || యేసునామ ||

  23. ముగ్గురు బాలుర వలెనే మండు - అగ్గికి జడియరు
    వారు - అగ్గిని కాల్చి అగ్గినుండి - దిగ్గున లేతురు || యేసునామ ||

  24. దానియేలు వలెనే శ్రమలో - ధైర్యవంతులు
    వారు - ఆ నిమిషమందే ప్రార్ధన - అధికము జేతురు || యేసునామ ||

  25. ప్రవక్తల వలెనె దేవ - వాక్కు చెప్పుదురు
    వారు - ప్రవచనముల అర్ధములెల్ల - వివరింప గలరు || యేసునామ ||

  26. మరియంబ వలెనె - క్రీస్తుని - ధరియింప గలరు
    వారు - పరిశుద్ధ వార్త హృదయమున - భద్ర పరతురు || యేసునామ ||

  27. పేతురు వలెనె స్వజనులకు - 1ప్రేషితు లౌదురు
    వారు - రాతి పునాదులౌదురు - నూతన సభలందు || యేసునామ ||

  28. పౌలు వలెనె పరజనులు సు - వార్తికులౌదురు
    వారు - పౌలు వలెనె సిలువను నొక్కి - ప్రజలకు జూపుదురు || యేసునామ ||

  29. స్తెఫను వలె ఎదురాడని - తెలివిని చూపుదురు
    వారు - అపరాదులు కాకున్నను హత - సాక్షులౌదురు || యేసునామ ||

  30. యోహాను వలె మూడు లోకా - లుండుట జూతురు
    వారు - యోహాను వలె మూడు కాలా - లుండుట జూతురు || యేసునామ ||

  31. యేసు వలె అద్భుతాలు - చేసి చూపుదురు
    వారు - దాసులగుట చేత రక్షణ - దారి చూపుదురు || యేసునామ ||

  32. క్రీస్తువలె నడువ గలుగు - క్రియలు చేయుదురు
    వారు - వాస్తవ మైనవన్ని ఋజువు - పరుప నేర్తురు || యేసునామ ||


1. మిషనరీ


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


67. yaesunaama dhaarulu dhanyulu



    yaesunaama dhaarulaMdaru - eMtO dhanyulu vaaru - bhaasuramainaTTi sthitilO - bratuka jooturu || yaesunaama ||

  1. aadaamu havvala valene - aikya moMduduru
    vaaru baedhamaemiyu laekuMDagane - perugu chuMduru || yaesunaama ||

  2. haebaelu valene prabhuvunaku maMchivi - ichchi vaeturu
    vaaru - aa baaluni valene daevuni - anumati poMduduru || yaesunaama ||

  3. hanOku valene daevuni - hatti yuMduru
    vaaru - aenaaDO okanaaDu paiki - egiri pOduru || yaesunaama ||

  4. nOvaahu valene kreestuni - naavanu jaeruduru
    vaaru - aevidhamaina praLayaMbunu - erugakuMduru || yaesunaama ||

  5. shaemuvale daevuni galigi - siddhulauduru
    vaaru - taamu talaMchu daevuniki vaMdanamu chaeyuduru || yaesunaama ||

  6. abraamuvalene pilupu - aMdukoMduru
    vaaru - Subhramugaa yiluviDichi vaeru - chOTuna chaeruduru || yaesunaama ||

  7. issaaku valene chaavu - nedurukoMduru
    vaaru - DassipOru venukaaDaru - daagi yuMDaru || yaesunaama ||

  8. yaakObuvale deevenalennO - aarjiMpa galaru
    vaaru -traikunitO pOraaDi paganu - diMchi vaeyuduru || yaesunaama ||

  9. yoodaa valene parula koraku - vaadiMpa galaru
    vaaru - vaedana galavaarikai kreestuni - vaeDu konagalaru || yaesunaama ||

  10. yOsaepu valene SOdhana - lunna geluturu
    vaaru - ae samaya maMdaina - maMchi aelika lauduru || yaesunaama ||

  11. mOshae valene daevuni mukhaa - mukhigaa jooturu
    vaaru - mOshae valene vidyaku - praammukhyu lauduru || yaesunaama ||

  12. yehOshuva vale vaagdaeSa - maeguduru tvaralO
    vaaru - mahaa Soorulai vairi yaDDu - maDa drokkuduru || yaesunaama ||

  13. nyaayaadhipatula valene - nyaayamu teerturu
    vaaru - aayaa aapadalaMdu prajala - naadariMturu || yaesunaama ||

  14. rootu valene paataka janulu - jaatini viDuturu
    vaaru - neeti sabhalO jaeri kreestu - niyamitu lauduru || yaesunaama ||

  15. samooyaelu vale praardhana samaa - jamulu peTTuduru
    vaaru - krama paraturu jana saMghamulO - kalahamu laekuMDa || yaesunaama ||

  16. raajula valene naeTi daeva - raajyaaseenulu
    vaaru - raajulu yaajakulu SaaMti - raajya prachaarakulu || yaesunaama ||

  17. nehemyaa valene paDipOyinavi - niluva beTTuduru
    vaaru - nemyaa valene prajalanu diddi - naerpuduru buddi || yaesunaama ||

  18. ejraa valene marachina bOdha - erigiMpa galaru
    vaaru - ejraa valene Saastramu naMdu- edigiMpa galaru || yaesunaama ||

  19. estaeru vale svaMta vaari - svasthi kOruduru
    vaaru - estaerutO atyaadulu - etti vaeyuduru || yaesunaama ||

  20. yObu valene kashTaa lella - Orchu koMduru
    vaaru - ae baadhayaMdaina daevuni - hechchuga jooturu || yaesunaama ||

  21. daaveedu valene daevuni - saevaku lauduru
    vaaru - paavana keertanala kavulai - prabalu chuMduru || yaesunaama ||

  22. solOmOnu vale j~naanaMbu - kaligi yuMduru
    vaaru - kalimi galigi krotta panulu - kalpana chaeyuduru || yaesunaama ||

  23. mugguru baalura valenae maMDu - aggiki jaDiyaru
    vaaru - aggini kaalchi agginuMDi - digguna laeturu || yaesunaama ||

  24. daaniyaelu valenae SramalO - dhairyavaMtulu
    vaaru - aa nimishamaMdae praardhana - adhikamu jaeturu || yaesunaama ||

  25. pravaktala valene daeva - vaakku cheppuduru
    vaaru - pravachanamula ardhamulella - vivariMpa galaru || yaesunaama ||

  26. mariyaMba valene - kreestuni - dhariyiMpa galaru
    vaaru - pariSuddha vaarta hRdayamuna - bhadra paraturu || yaesunaama ||

  27. paeturu valene svajanulaku - 1praeshitu lauduru
    vaaru - raati punaadulauduru - nootana sabhalaMdu || yaesunaama ||

  28. paulu valene parajanulu su - vaartikulauduru
    vaaru - paulu valene siluvanu nokki - prajalaku joopuduru || yaesunaama ||

  29. stephanu vale eduraaDani - telivini choopuduru
    vaaru - aparaadulu kaakunnanu hata - saakshulauduru || yaesunaama ||

  30. yOhaanu vale mooDu lOkaa - luMDuTa jooturu
    vaaru - yOhaanu vale mooDu kaalaa - luMDuTa jooturu || yaesunaama ||

  31. yaesu vale adbhutaalu - chaesi choopuduru
    vaaru - daasulaguTa chaeta rakshaNa - daari choopuduru || yaesunaama ||

  32. kreestuvale naDuva galugu - kriyalu chaeyuduru
    vaaru - vaastava mainavanni Rjuvu - parupa naerturu || yaesunaama ||


1. missionary