89. జయ మంగళం

రాగం: ముఖారి తాళం: ఏక



    జయ మంగళమ్ - మహో - త్సవ మంగళమ్ - పెండ్లి - నయ పూరితము - జీవ - నము నిరతము || జయ ||

  1. ఆది దంపతులైన - యాదాము - హవ్వలు యాది ప్రేమాదులను - ననుసరించి = యే దివసమందును - నేక దేహాత్ములై - పాదు కొను జీవితము - పాలించిన || జయ ||

  2. అబ్రహాము శార - యనురాగ ఘననీయు - లై బ్రదికి వాగ్ద - త్తాళి బొంది, హెబ్రీయ వంశాది - హిత దంపత వరులై - హెబ్రోనులో నున్న = ట్లే యుండిన || జయ ||

  3. ఈసాకు రిబెకయను - నీ యిరువురి పవిత్ర - మౌ సాదృశ్య జీవ నౌన్నత్యము = కోసంబు ప్రార్ధించు - కొని మాదిరిగా నుండ - భాసు రాశీస్సును - బడయు నేని || జయ ||

  4. యాకోబు మనసులో - ననుకొనిన లేయాను - శ్రీకరుండు యెహోవ - స్థిరము చేసి = లోక సంపదలు బర - లోక సౌభాగ్యములు - నేకముగ భువి నిడినట్లు - లిచ్చునేని || జయ ||

  5. జకరియ ఎలీజబెతు - జంటగా దేవుని - సకలాజ్ఞలలో సదా - చార ములలో = నకళంకునగుచు నీ - త్యాత్ములై బ్రతికిన - ప్రకటితంబగు బ్రతుకు - ప్రాప్తించిన || జయ ||

  6. కానా వధూవరులు కడు - నద్భుత కరుని - దానాద్భుతము సన్ని - ధానంబు ధ్యానాంశముగ జీవి - తమున పొందిన రీతి - గానే వీరును బొంద - గలిగిన మహా || జయ ||

  7. శుభకరముగ వీరు - శోభిల్లు నట్లుగా - అభయ హస్తంబిచ్చి - హర్షమొసగి - ఉభయులు నేకమై - ఉండునట్లుగ జేసి - సభయందు - స్థిరముగ స్థాపించుమీ || జయ ||

  8. శోభిల్లు క్రైస్తవ - సూత్ర జీవితమెల్ల - శోభిల్లు శారీర - సుఖజీవము = శోభిల్లు మాదిరి - చూపెడి జీవము - శోభిల్లు సేవ సం - స్తుతుల తోడ || జయ ||

  9. షారోను ప్రార్ధన - శాలలో గూడిన - వారలందరకును - వచ్చు మహిమ రారాజు పెండ్లి - కుమారుని రాకడ - ధారిత్రి యంతట జేరుగాక || జయ ||

  10. పెండ్లి కొడుకైన మన - ప్రియ ప్రభువు యేసును - బెండ్లి కూతురైన - ప్రియ సభను = గండ్లతో మోక్షమున - గాంచి కలియు వరకు - బెండ్లి దంపతుల కుం - భ్రీతియున్న || జయ ||

  11. ఈ వివాహ కార్య - మిది వరకునైన భ - క్తావళి పెండ్లిండ్ల యందుజేర = పావన గృహముల లో - పల వీరి గృహమొక - టై వెలుగ గృప యున్న - ట్లైన గొప్ప || జయ ||

  12. జనక కుమారాత్మలను త్రైక దేవుడు - ఘనత నొందు చుండుగాక వీరి - అనుదిన జీవిత మాయన సన్నిధి - వినయ పూరితమై - వెలయు గాక || జయ ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


89. jaya maMgaLaM

raagaM: mukhaari taaLaM: aeka



    jaya maMgaLam^ - mahO - tsava maMgaLam^ - peMDli - naya pooritamu - jeeva - namu niratamu || jaya ||

  1. aadi daMpatulaina - yaadaamu - havvalu yaadi praemaadulanu - nanusariMchi = yae divasamaMdunu - naeka daehaatmulai - paadu konu jeevitamu - paaliMchina || jaya ||

  2. abrahaamu Saara - yanuraaga ghananeeyu - lai bradiki vaagda - ttaaLi boMdi, hebreeya vaMSaadi - hita daMpata varulai - hebrOnulO nunna = Tlae yuMDina || jaya ||

  3. eesaaku ribekayanu - nee yiruvuri pavitra - mau saadRSya jeeva naunnatyamu = kOsaMbu praardhiMchu - koni maadirigaa nuMDa - bhaasu raaSeessunu - baDayu naeni || jaya ||

  4. yaakObu manasulO - nanukonina laeyaanu - SreekaruMDu yehOva - sthiramu chaesi = lOka saMpadalu bara - lOka saubhaagyamulu - naekamuga bhuvi niDinaTlu - lichchunaeni || jaya ||

  5. jakariya eleejabetu - jaMTagaa daevuni - sakalaaj~nalalO sadaa - chaara mulalO = nakaLaMkunaguchu nee - tyaatmulai bratikina - prakaTitaMbagu bratuku - praaptiMchina || jaya ||

  6. kaanaa vadhoovarulu kaDu - nadbhuta karuni - daanaadbhutamu sanni - dhaanaMbu dhyaanaaMSamuga jeevi - tamuna poMdina reeti - gaanae veerunu boMda - galigina mahaa || jaya ||

  7. Subhakaramuga veeru - SObhillu naTlugaa - abhaya hastaMbichchi - harshamosagi - ubhayulu naekamai - uMDunaTluga jaesi - sabhayaMdu - sthiramuga sthaapiMchumee || jaya ||

  8. SObhillu kraistava - sootra jeevitamella - SObhillu Saareera - sukhajeevamu = SObhillu maadiri - choopeDi jeevamu - SObhillu saeva saM - stutula tODa || jaya ||

  9. shaarOnu praardhana - SaalalO gooDina - vaaralaMdarakunu - vachchu mahima raaraaju peMDli - kumaaruni raakaDa - dhaaritri yaMtaTa jaerugaaka || jaya ||

  10. peMDli koDukaina mana - priya prabhuvu yaesunu - beMDli kooturaina - priya sabhanu = gaMDlatO mOkshamuna - gaaMchi kaliyu varaku - beMDli daMpatula kuM - bhreetiyunna || jaya ||

  11. ee vivaaha kaarya - midi varakunaina bha - ktaavaLi peMDliMDla yaMdujaera = paavana gRhamula lO - pala veeri gRhamoka - Tai veluga gRpa yunna - Tlaina goppa || jaya ||

  12. janaka kumaaraatmalanu traika daevuDu - ghanata noMdu chuMDugaaka veeri - anudina jeevita maayana sannidhi - vinaya pooritamai - velayu gaaka || jaya ||