75. భయపడకుడి (విశ్వాసికి ఆదరణ)
రాగం: దేవగాంధారి తాళం: ఆది
- భయపడ రాదు - క్రీస్తు విశ్వాసి - భయపడి దిగులు - పడరాదు సుమీ
- భయపడుటెందుకు - బైబిలునందున - నయమగు వాగ్ధానంబులు గలవు
= భయపడకుడనెడి పలుకులు నీకు - జయము గలుగ మూడు వందల
అరువై - అయిదు గలవు - ఏ - డాది పొడుగున - భయపడకు నిరాశ పడకు
మెందున || భయ ||
- చిమ్మ చీకటులు - కమ్మిన రీతిగ - ఇమ్మహి కష్టము లెన్నో గలుగగ - నమ్మించు ద్రోహము నష్టము దుఃఖము - సొమ్మసిల్లునటుల చుట్టు కొనంగ = నమ్మిన వారికి వెలుగుగ నక్ష - త్రమ్ములవలె వేన వేలు వాగ్ధాన - మ్ములుండ ద్రోసి కీడు నిను - దూరమ్ము చేయ దొమ్మిగ రాగలదా || భయ ||
- నీవే స్వయముగ - నీ కష్టములలో - దేవా యని ప్రార్ధించుచు నుండగ దేవుని వగ్ధా - నావళి నానుకొని దీవెన కొరకై - దిట్టముగ వేడుగ - దైవ గ్రంధమందునున్న వాక్యము - లే వరాల మూటయంచు దానిలో జీవ మొంద నీవు చేయు ప్రార్ధన - నే విధాన దాటి కీడు రాగలదా || భయ ||
- పాటలు ప్రార్ధన - వాక్య పఠనము - ధాటియౌ శుభవార్త ప్రకటనలు దీటగు కానుకల్ - తెచ్చు సమర్పణ - నీటుగ జేసిన - నిలబడ గలవు = లోటు లేక యీ యాచారములను - మేటియనగ నీవు చేయుచుండగ వీటినెల్ల - నడ్డగించి నిజముగా - దాటి మీదికి కీడు రాగలదా || భయ ||
- దిన దినమును ప్రార్ధించి నీ కొరకు - మనవులు విజ్ఞాపనలు చేయు టకు - ఘనులగు భక్తులు - పని బూనిరి గదా - విని వర్ధిల్లుము విశ్వాసముతో = కనికరించి తండ్రి వాక్యము నరు - లనయ మటులు చేయు మనిన విజ్ఞా - పనలను భక్తుల - నెగసి దాటుకొని నిను చిక్కుబెట్ట రాగలదె కీడు || భయ ||
- గాలి తుఫాను - బోలిన శ్రమలును - వేల దురాత్మలు తూలజేయ గను - వేల వేల - సైన్యాల దూతలు - తోలి వేతురు దయ్యాలను దూరము = భూ లోకుల కంటే గూడ యోధులు - కాల జ్ఞాను లాత్మ రూపులా దూ - తాళి నంత ఢీకొనుచు కీడు ఈ - వేళ నీ పైకి దండెత్త గలదా || భయ ||
- పరలోకంబున - పరిశుద్ధులు నీ - కొరకై ప్రార్ధన - నిరతము చేయగ అరమర యేలను - మురియుచు నుండుము - గురిదరి లేనట్లు వెరువగ నేల = ధరణి లోన వారుకూడ నీ వలె - మరి మరి కష్టంబు లొంది నేడీ - తరుణమందు ప్రార్ధించు ప్రార్ధనలు - దొరలించి పైకి కీడు రా గలదా || భయ ||
- శోధనలందున - బాధల యందున - ఆదరించు పరిశుద్ధాత్మ యుం డగా - మోదమొంద రా - బోవు సంగతులు - నీ దౌర్భల్యము నెరిగి వచించుచు = వేదమందు చెప్పియున్న విధముగ - నీదు హృదయ మందు నిండియు - బోధ చేయు నాత్మతోడ కీడు - వాదులాడి నీ దరికి రాగలదా || భయ ||
- దిక్కైనట్టి - దేవుడే నరుడై - మిక్కిలి ప్రేమతో - మేలు చేయుచు ఇక్కడ ఎన్నో హింసలు పొంది - ఎక్కడ లేని మృతి జెంది బ్రతికి = ఎక్కివెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్కనుండి ప్రార్ధించు రక్షకుని చక్కని విజ్ఞాపనల నెల్లను - ధిక్కరించి కీడు రా గలుగునా || భయ ||
- నేను సృజించిన - ఈ నరులందరు - మానక ప్రార్ధనల్ గానముల్ చేయగ - నేను వినక పో - యిన నా సృష్టిని - నేనే నాశనము చేసి నట్లుండును = గాన వారి ప్రార్ధనాలకించెద - పూని కృపను జూపిం చెదనంచు - ఏనాటికి విడువననెడి తండ్రిని - గానకుండ కీడు దుమికి వచ్చునా || భయ ||
- శ్రమలు ఇబ్బందులు - సకల శోధనలు విమల మార్గము గా - వించు సాధనములు - సుమతి యోబొందిన - శోధనలన్నియు - సమయము రాగా - సాగిపొయెను = విమలాత్మ స్నానమొందిన నీకు - శ్రమలలోన గలిగినట్టి యను - భవము నిరర్ధకము చేసి నీ సమీ - ప మునకైన కీడు చేర గలదా || భయ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
75. bhayapaDakuDi (viSvaasiki aadaraNa)
raagaM: daevagaaMdhaari taaLaM: aadi
- bhayapaDaraadu - kreestuviSvaasi - bhayapaDi digulupaDaraadu sumee
bhayapaDuTeMduku - baibilunaMduna - nayamagu vaagdhaanaMbulu galavu
bhayapaDakuDaneDi palukulu neeku jayamu galuga mooDu vaMdala
aruvai - ayidu galavu = ae - Daadi poDuguna - bhayapaDaku niraaSapaDaku
meMduna || bhaya ||
- chimmacheekaTulu - kammina reetiga - immahikashTamu lennOgalugaga - nammiMchu drOhamu nashTamu du@hkhamu sommasillunaTula chuTTu konaMga = namminavaariki veluguga naksha - trammulavale vaenavaelu vaagdhaana - mmuluMDa drOsi keeDu ninu doorammu chaeyadommiga raagaladaa || bhaya ||
- neevae svayamuga - nee kashTamulalO - daevaa yani praardhiMchuchu nuMDaga daevuni vagdhaa - naavaLinaanukoni deevenakorakai - diTTamuga vaeDuga - daivagraMdhamaMdununna vaakyamu - laevaraalamooTayaMchu daanilO jeeva moMda neevu chaeyupraardhana - nae vidhaana daaTikeeDu raagaladaa || bhaya ||
- paaTalu praardhana - vaakyapaThanamu - dhaaTiyau Subhavaarta prakaTanalu deeTagu kaanukal^ - techchu samarpaNa - neeTugajaesina - nilabaDagalavu = lOTulaekayee yaachaaramulanu - maeTiyanaga neevu cheyuchuMDaga veeTinella - naDDagiMchi nijamugaa daaTi meediki keeDu raagaladaa || bhaya ||
- dinadinamunu praardhiMchi nee koraku - manavulu vij~naapanalu chaeyu Taku - ghanulagu bhaktulu - paniboonirigadaa - vini vardhillumu viSvaasamutO = kanikariMchi taMDri vaakyamu naru - lanaya maTulu chaeyumanina vij~naa-panalanu bhaktula - negasidaaTukoni ninuchikkubeTTa raagalade keeDu || bhaya ||
- gaalituphaanu - bOlina Sramalunu - vaela duraatmalu toolajaeya ganu - vaela vaela - sainyaaladootalu - tOlivaeturu dayyaalanu dooramu = bhoolOkulakaMTae gooDayOdhulu - kaalaj~naanu laatma roopulaa doo - taaLinaMta Dheekonuchu keeDu ee - vaeLa nee paiki daMDettagaladaa || bhaya ||
- paralOkaMbuna -pa riSuddhulu neekorakai praardhana - niratamuchaeyaga aramara yaelanu - muriyuchu nuMDumu - guridari laenaTlu veruvaganaela - dharaNilOna vaarukooDa neevale - mari marikashTaMbu loMdi naeDitaruNamaMdu praardhiMchu praardhanalu - doraliMchi paiki keeDu raagaladaa || bhaya ||
- SOdhanalaMduna - baadhalayaMduna - aadariMchu pariSuddhaatma yuM Dagaa - mOdamoMda raa - bOvu saMgatulu - nee daurbhalyamu nerigi vachiMchuchu = vaedamaMdu cheppiyunnavidhamuga - needu hRdaya maMdu niMDiyu - bOdhachaeyunaatmatODakeeDu - vaadulaaDi nee dariki raagaladaa || bhaya ||
- dikkainaTTi - daevuDae naruDai - mikkili praematO maeluchaeyuchu ikkaDa ennO hiMsalupoMdi - ekkaDalaeni mRtijeMdi bratiki = ekkiveLLiparamaMdu taMDrikuDi prakkanuMDi praardhiMchurakshakuni chakkani vij~naapanalanellanu - dhikkariMchi keeDu raagalugunaa || bhaya ||
- naenu sRjiMchina - ee narulaMdaru - maanaka praardhanal^ gaanamul^ chaeyaga - naenu vinaka pO - yina naa sRshTini - naenae naaSanamu chaesi naTluMDunu - gaanavaari praardhanalaalakiMcheda - pooni kRpanu joopiM chedanaMchu - aenaaTiki viDuvananeDi taMDrini - gaanakuMDa keeDu dumiki vachchunaa || bhaya ||
- Sramalu ibbaMdulu - sakala SOdhanalu vimala maargamu gaa - viMchu saadhanamulu - sumati yOboMdina - SOdhanalanniyu - samayamuraagaa - saagipoyenu = vimalaatma snaanamoMdina neeku SramalalOna galiginaTTi yanubhavamu nirardhakamu chaesi neesamee - pa munakaina keeDu chaeragaladaa || bhaya ||