62. రక్షణానందం - క్రీస్తే విశ్వాసికి ప్రోత్సహానందము
రాగం: కాంభోజి తాళం: త్రిపుట
- నాకింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట - కే కర్త ఘన మైన -
హేతువై యుండు = నాకు గల యున్నత కారణమే నాధుడగును
నేను మురియు - శ్రీ కరంబగు నామమేది - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
- ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - ఎవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల భారము - నెత్తుకొని - దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కల్పిరి - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
- నేను నా విధులెల్ల - నిశ్చయంబుగ నెరుగ - జ్ఞానమిచ్చుచు నుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యదార్ధ - పరునిగా గా - వించి యవి నా - చే నెరవేర్పించు నెవరు - సిల్వబడ్డ యేసు క్రీస్తే || నాకింత ||
- ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - ఎవరు నా శోకంబు - నెగురగొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేద దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
- మరణంబులో నాకు - చిర జీవ మెవ్వారు - మరణంబునకై గొప్ప - మరణ మెవ్వారు = విరివి లేని మహిమ సేనలు - దరిని నుండగ - నన్ను చెంతను స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
- నన్ను రక్షింప మర - ణం బొందియు సమాధి - నెన్నటికిని - గెల్చి యున్న ప్రభునందు = నున్న విశ్వాసంబె నాకు - నుత్సవంబును - గలుగ జేయును - చెన్నగు నా ప్రభువు వింకెవ్వరు - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
62. rakshaNaanaMdaM
raagaM: kaaMbhOji taaLaM: tripuTa
- naakiMta prOtsaahaa - naMdaMbul^ galguTa - kae karta ghana maina -
haetuvai yuMDu = naaku gala yunnata kaaraNamae naadhuDagunu
naenu muriyu - Sree karaMbagu naamamaedi - silvabaDDa yaesukreestae || naakiMta ||
- evaru naa bhaktiki - hitamainaTTi punaadi - evaru naa kaMThaMbu - netten^ paaTalatO = evaru naa paapamula bhaaramu - nettukoni - daevuniki naakunu - chivarakun^ snaehaMbu kalpiri - silvabaDDa yaesukreestae || naakiMta ||
- naenu naa vidhulella - niSchayaMbuga neruga - j~naanamichchuchu nuMDu j~naani yevvaaru = vaani yeDala nanu yadaardha - parunigaa gaa - viMchi yavi naa - chae neravaerpiMchu nevaru - silvabaDDa yaesu kreestae || naakiMta ||
- evaru naa Satruvu - nediriMchi gelchiri - evaru naa SOkaMbu - neguragoTTiri = evaru naa hRdayaMpu moorchanu - neeDchi saeda deerchi manasu - chivuku manu gaayaMbu maanpiri - silvabaDDa yaesukreestae || naakiMta ||
- maraNaMbulO naaku - chira jeeva mevvaaru - maraNaMbunakai goppa - maraNa mevvaaru = virivi laeni mahima saenalu - darini nuMDaga - nannu cheMtanu sthiramuga sthaapiMchu nevaru - silvabaDDa yaesukreestae || naakiMta ||
- nannu rakshiMpa mara - NaM boMdiyu samaadhi - nennaTikini - gelchi yunna prabhunaMdu = nunna viSvaasaMbe naaku - nutsavaMbunu - galuga jaeyunu - chennagu naa prabhuvu viMkevvaru - silvabaDDa yaesukreestae || naakiMta ||