42. సువార్త
రాగం: ఆనందభైరవి తాళం: ఖండగజాతి
- మిత్రుడా రా రమ్ము - మైత్రితో పార - మార్ధికమైన - మాటల్
వచింతు - మన్ననతో విను || మిత్రు ||
- పూర్వ జన్మము నందు - పూర్తిగా పాపిని అందుకె యీ బాధ -
పొందుచున్నాను - అని యిట్లు మనస్సులో - అనుకొననే వద్దు -
అది నిజమే యైన - అదికూడ పోగొట్టు రక్షకుడున్నాడు - తత్ క్షణమె
రమ్ము - ఆయన మానవుడైనట్టి దేవుండు ఈ మాట నమ్మిన - ఎంత
ధన్యుండవు = మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము || మిత్రు || - ఈ జన్మమున గూడ - ఎన్నెన్నో పాపాలు చేసి యున్నందున - చివరకు
నరకంబె అని ఆత్మ యందున - ఆలోచనెందుకు అవి సిల్వపై యేసు
అంతరింప జేసె ఆ వృత్తాంతంబును - ఆనందముగ నమ్మి
సుఖముగ నుండుము - సూక్ష్మ మార్గంబిది ఎంద రెన్నియన్న
- ఏ మాటల్ వినవద్దు = దేవ వాక్కే నిజము - దిక్కులు చూడకు || మిత్రు || - తల్లిదండ్రుల్ చేసిన - తగని కార్యంబులు నామీదికె పొర్లి - నను
జంపుచున్నవి ఆ శాపమును నేను - అడ్డగింపలేను అని పల్కుచును
నీవు - అదరి పోకూడదు పాపమని తెలియని - పాపాలు ఎన్నెన్నో
చేయబట్టి యిన్ని - చిక్కులు నను జుట్టె అని లేని పోనట్టి
వనుకొన కుండుము = నీ పాపముల కంటె - నీ తండ్రి దయ గొప్ప || మిత్రు || - నీ పాప శాపాలు - నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ - యేసు
దేవుడు ముందె నీ కీడు పోగొట్టి - నీ కెన్నియో మేళ్ళు సంపాదనము
చేసె - సర్వోప కారుండు దేవుండు మానవుడు - దివిలోన భువిలోన
నినుబట్టి పాపివి - నిను జూడనే వద్దు ప్రభు యేసుని బట్టి - పరిశుద్ధు
డవు నీవు = ఆయనను జూచిన - అంతయు సరియౌను || మిత్రు || - ఇంటిలోని పోరు - ఇంకి పోవునుగాక - వాదాలు బేదాలు - వాడి
పోవునుగాక కలహాలు నీటను - కలిసి పోవునుగాక యుద్ధాలు క్రమముగ
ఉడిగి పోవును గాక - అన్ని పాపాలును అంతరించును గాక - సర్వ
దేశములందు - శాంతి కలుగును గాక నాగరికత ప్రతి - నరుని
కబ్బునుగాక దేవుని మ్రొక్కుట - తేజరిల్లును గాక ఆయన బోధలే -
అలుము కొనును గాక ప్రజలందరికిని దైవ - భక్తి పెరుగునుగాక
మంచి జీవిని - కనికరించు చుందురు గాక పాడిపంటలు ప్రతి - వాని
కుండును గాక వెలుగు, నీరు, గాలి - కలుగజేసిన తండ్రి = మన
యందరి వలన - ఘనత నొందునుగాక! || మిత్రు || - దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక భూమి చేసిన వాడు - పోషిం
చును గాక రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక పరమ వైధ్యుడు స్వస్థ
పరచు చుండును గాక పనులన్నిటిని - సఫల - పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు - తెచ్చు చుండును గాక అంతాన మోక్షంబు -
అందజేయును గాక = విజయము ఈ పాట - వినువారికామెన్ || మిత్రు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
42. suvaarta
raagaM: aanaMdabhairavi taaLaM: khaMDagati
- mitruDaa raa rammu - maitritO paara - maardhikamaina - maaTal^
vachiMtu - mannanatO vinu || mitru ||
- poorva janmamu naMdu - poortigaa paapini aMduke yee baadha -
poMduchunnaanu - ani yiTlu manassulO - anukonanae vaddu -
adi nijamae yaina - adikooDa pOgoTTu rakshakuDunnaaDu - tat^ kshaName
rammu - aayana maanavuDainaTTi daevuMDu ee maaTa nammina - eMta
dhanyuMDavu = manassulO mudriMchu - koni SaaMti poMdumu || mitru || - ee janmamuna gooDa - ennennO paapaalu chaesi yunnaMduna - chivaraku
narakaMbe ani aatma yaMduna - aalOchaneMduku avi silvapai yaesu
aMtariMpa jaese aa vRttaaMtaMbunu - aanaMdamuga nammi
sukhamuga nuMDumu - sookshma maargaMbidi eMda renniyanna
- ae maaTal^ vinavaddu = daeva vaakkae nijamu - dikkulu chooDaku || mitru || - tallidaMDrul^ chaesina - tagani kaaryaMbulu naameedike porli - nanu
jaMpuchunnavi aa Saapamunu naenu - aDDagiMpalaenu ani palkuchunu
neevu - adari pOkooDadu paapamani teliyani - paapaalu ennennO
chaeyabaTTi yinni - chikkulu nanu juTTe ani laeni pOnaTTi
vanukona kuMDumu = nee paapamula kaMTe - nee taMDri daya goppa || mitru || - nee paapa Saapaalu - nee sarva vyaadhulu mOsikonnaTTi Sree - yaesu
daevuDu muMde nee keeDu pOgoTTi - nee kenniyO maeLLu saMpaadanamu
chaese - sarvOpa kaaruMDu daevuMDu maanavuDu - divilOna bhuvilOna
ninubaTTi paapivi - ninu jooDanae vaddu prabhu yaesuni baTTi - pariSuddhu
Davu neevu = aayananu joochina - aMtayu sariyaunu || mitru || - iMTilOni pOru - iMki pOvunugaaka - vaadaalu baedaalu - vaaDi
pOvunugaaka kalahaalu neeTanu - kalisi pOvunugaaka yuddhaalu kramamuga
uDigi pOvunu gaaka - anni paapaalunu aMtariMchunu gaaka - sarva
daeSamulaMdu - SaaMti kalugunu gaaka naagarikata prati - naruni
kabbunugaaka daevuni mrokkuTa - taejarillunu gaaka aayana bOdhalae -
alumu konunu gaaka prajalaMdarikini daiva - bhakti perugunugaaka
maMchi jeevini - kanikariMchu chuMduru gaaka paaDipaMTalu prati - vaani
kuMDunu gaaka velugu, neeru, gaali - kalugajaesina taMDri = mana
yaMdari valana - ghanata noMdunugaaka! || mitru || - divya daevuDu ninnu - deeviMchunu gaaka bhoomi chaesina vaaDu - pOshiM
chunu gaaka rakshakuMDau kreestu - rakshiMchunu gaaka parama vaidhyuDu svastha
parachu chuMDunu gaaka panulanniTini - saphala - parachu chuMDunu gaaka
daivaatma dhairyaMbu - techchu chuMDunu gaaka aMtaana mOkshaMbu -
aMdajaeyunu gaaka = vijayamu ee paaTa - vinuvaarikaamen^ || mitru ||