61
రాగం: హరికాంభోజి తాళం: ఆట
- పరమ దేవుండే నా పక్షమై యుండగా - నరుడేమి చేయగలడు -
ఆ = పరమ జనకుండే నా - పట్టై యుండగ పాప - పరుడేమి చేయగలడు
- రక్షకుండే నా పక్షమై యుండగ - శిక్షించు వాడెవ్వడు - నన్ను =
రక్షించు ప్రభువే నా - శిక్ష పొందగ నన్ను - భక్షించు వాడెవ్వడు ||పరమ||
- దైవాత్మయే నా తనువులో నుండ సై - తానింకేమి చేయును - ఆ = జీవాత్మయే నా - జీవమై యుండగ ని - ర్జీవుడేమి చేయును ||పరమ||
- దైవ దూతలే నా - దరిని నుండగ నన్ను - దయ్యాలేమి చేయును = సావ - ధానంబుగ కావలియుండ పి - శాచు లేమి చేయును ||పరమ||
- కీడు కేవలముగా కీడంచు భావించి - ఖిన్నుడనై పోదునా - ఆ = కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు - చూడకుండగ నుందునా ||పరమ||
- శత్రువులెల్ల నను జంపజూచిన లే - శంబైన నే జడియను - నా = మిత్రులౌ భక్తుల మేలైన ప్రార్దనల్ - మించున్ ధైర్యము విడువను ||పరమ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
61
raagaM: harikaaMbhOji taaLaM: aaTa
- parama daevuMDae naa pakshamai yuMDagaa - naruDaemi chaeyagalaDu -
aa = parama janakuMDae naa - paTTai yuMDaga paapa - paruDaemi chaeyagalaDu
- rakshakuMDae naa pakshamai yuMDaga - SikshiMchu vaaDevvaDu - nannu =
rakshiMchu prabhuvae naa - Siksha poMdaga nannu - bhakshiMchu vaaDevvaDu ||parama||
- daivaatmayae naa tanuvulO nuMDa sai - taaniMkaemi chaeyunu - aa = jeevaatmayae naa - jeevamai yuMDaga ni - rjeevuDaemi chaeyunu ||parama||
- daiva dootalae naa - darini nuMDaga nannu - dayyaalaemi chaeyunu = saava - dhaanaMbuga kaavaliyuMDa pi - Saachu laemi chaeyunu ||parama||
- keeDu kaevalamugaa keeDaMchu bhaaviMchi - khinnuDanai pOdunaa - aa = keeDu chaaTuna prabhuvu kreestu daachina maelu - chooDakuMDaga nuMdunaa ||parama||
- Satruvulella nanu jaMpajoochina lae - SaMbaina nae jaDiyanu - naa = mitrulau bhaktula maelaina praardanal^ - miMchun^ dhairyamu viDuvanu ||parama||