39. బైబిలు (దావీదు మొదటి కీర్తన )
రాగం: యదుకుల కాంభోజీ తాళం: ఆది
- ధన్యుడు దేవ మానవుడు - ధన్యుడు - ధన్యుడు దైవజనుడు =
ధరణి జనులందరి కన్న - అన్యులెంతటి వారైన అతనికి సాటిరారు || ధన్యుడు ||
- చెడుగుల యోచన లందు - నడువని వాడై పాపులు = అడుగు బెట్టు దారుల - యందు నిలువని యతడు || ధన్యుడు ||
- పరిహసించు వ్యతిరేక - ప్రజలు గుమిగా గూర్చుండు = దరిని గూర్చుండనట్టి - నరుడెవ్వడో యతడు || ధన్యుడు ||
- మరియు దైవాజ్ఞలున్న - పరిశుద్ధ శాస్త్రము జూచి = మురియుచు రేబగళ్ళు - స్మరియించు చుండు నతడు || ధన్యుడు ||
- అతడేటి యోర మొలిచి - ఆకు వాడనిదై తగిన = ఋతువున గాయు చెట్టై - హెచ్చరిల్లును గాన || ధన్యుడు ||
- అతడు తలపెట్టి చేయ - యత్నించు నెల్ల పనులు = సతతము సంపూర్ణముగ సఫలమగు చుండును గాన || ధన్యుడు ||
- అలా గుండకను దుష్టుల్ - గాలికొట్టిన పొట్టున్ = బోలిన వారై చెదరి - పోదు రంతర్ధానంబై || ధన్యుడు ||
- కాన దుష్టుల్ తీర్పు - లో నిల్వనే లేరు = హీనుల్ నీతిపరుల - లో నాగనే లేరు || ధన్యుడు ||
- పరమ దేవునికి నీతి - పరుల మార్గంబు తెలియు = దురితుల పన్నాగములు - సరిగా కీడునకే నడుపు || ధన్యుడు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
39. baibilu (daaveedu modaTi keertana )
raagaM: yadukula kaaMbhOjee taaLaM: aadi
- dhanyuDu daeva maanavuDu - dhanyuDu - dhanyuDu daivajanuDu =
dharaNi janulaMdari kanna - anyuleMtaTi vaaraina ataniki saaTiraaru || dhanyuDu ||
- cheDugula yOchana laMdu - naDuvani vaaDai paapulu = aDugu beTTu daarula - yaMdu niluvani yataDu || dhanyuDu ||
- parihasiMchu vyatiraeka - prajalu gumigaa goorchuMDu = darini goorchuMDanaTTi - naruDevvaDO yataDu || dhanyuDu ||
- mariyu daivaaj~nalunna - pariSuddha Saastramu joochi = muriyuchu raebagaLLu - smariyiMchu chuMDu nataDu || dhanyuDu ||
- ataDaeTi yOra molichi - aaku vaaDanidai tagina = Rtuvuna gaayu cheTTai - hechcharillunu gaana || dhanyuDu ||
- ataDu talapeTTi chaeya - yatniMchu nella panulu = satatamu saMpoorNamuga saphalamagu chuMDunu gaana || dhanyuDu ||
- alaa guMDakanu dushTul^ - gaalikoTTina poTTun^ = bOlina vaarai chedari - pOdu raMtardhaanaMbai || dhanyuDu ||
- kaana dushTul^ teerpu - lO nilvanae laeru = heenul^ neetiparula - lO naaganae laeru || dhanyuDu ||
- parama daevuniki neeti - parula maargaMbu teliyu = duritula pannaagamulu - sarigaa keeDunakae naDupu || dhanyuDu ||