92. ఈ పెండ్లి ఆత్మార్ధములను గూడ సూచించును

రాగం: సురటి తాళం: ఆది



    మంగళ 1ప్రమోదము - వివాహము - మంగళ వినోదము = మంగళకరమిది - మన యేసు ప్రభువైన మంగళనాయక - మహిమబట్టి = శృంగారాచార - సిద్ధాంతము లాత్మ - సంగతులను సూ - చనగా దెల్పుచు నుండు || మంగళ ||

  1. పందిటి నీడ తన - పయి నున్నట్లు మన - యందరిపై దేవ- హస్త చ్చాయ = పొందగ నున్న శు - భోజయమును చలవ - జెంది సుఖించు మన జీవన మంతయు || మంగళ ||

  2. పలువురతో బెండ్లి - పంక్తిలో గూర్చున్న - వెలలేని రక్షణ - విందు నందు = గల కాలంబు మో - క్షంబున భక్త దూతల గూడి యుండుట - తలంపునకున్వచ్చు || మంగళ ||

  3. కళ దెచ్చెడు నలం - కారంబులు క్రీస్తు - వలన గలుగు నీతి - వర్తనములం = గలిగి పెండ్లి శృంగా - రింపబడి 2తదా - జ్ఞలనెల్ల బాటింప - జ్ఞాపకంబు చేయు || మంగళ ||

  4. గుమ గుమ వాసన - గొట్టగ, బ్రార్ధ - నములు స్తుతులు నర్ప - ణములు 3నాహ్వా = నము దేవునికి 4స - న్నాహమౌ పరిమ - ళములై యుండవ లయు - నని యనిపించు || మంగళ ||

  5. నీరు పాత్రల నిండ - నింపిన కథ భక్తు - లారు రాతి బాన - లందు మన = సార ధ్యానముంచి - యక్షయ మోక్ష ద్రా - క్షా రస నిరీ - క్షణ సంతసింతురు || మంగళ ||

  6. మన తోటి వారికి - మా యింట బెండ్లి రం - డని శుభలేఖను - పంపుదుము = మనకు గూడ దేవ - మహిమైఖ్యత లభిం - పను రక్షణాహ్వాన - పత్రిక వచ్చెద || మంగళ ||


1. సంతోషము     2. ఆయన ఆజ్ఞలు     3. పిలుపు     4. సిద్ధము


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


92. ee peMDli aatmaardhamulanu gooDasoochiMchunu

raagaM: suraTi taaLaM: aadi



    maMgaLa 1pramOdamu - vivaahamu - maMgaLa vinOdamu = maMgaLakaramidi - mana yaesu prabhuvaina maMgaLanaayaka - mahimabaTTi = SRMgaaraachaara - siddhaaMtamu laatma - saMgatulanu soo - chanagaa delpuchu nuMDu || maMgaLa ||

  1. paMdiTi neeDa tana - payi nunnaTlu mana - yaMdaripai daeva- hasta chchaaya = poMdaga nunna Su - bhOjayamunu chalava - jeMdi sukhiMchu mana jeevana maMtayu || maMgaLa ||

  2. paluvuratO beMDli - paMktilO goorchunna - velalaeni rakshaNa - viMdu naMdu = gala kaalaMbu mO - kshaMbuna bhakta dootala gooDi yuMDuTa - talaMpunakunvachchu || maMgaLa ||

  3. kaLa dechcheDu nalaM - kaaraMbulu kreestu - valana galugu neeti - vartanamulaM = galigi peMDli SRMgaa - riMpabaDi 2tadaa - j~nalanella baaTiMpa - j~naapakaMbu chaeyu || maMgaLa ||

  4. guma guma vaasana - goTTaga, braardha - namulu stutulu narpa - Namulu 3naahvaa = namu daevuniki 4sa - nnaahamau parima - Lamulai yuMDava layu - nani yanipiMchu || maMgaLa ||

  5. neeru paatrala niMDa - niMpina katha bhaktu - laaru raati baana - laMdu mana = saara dhyaanamuMchi - yakshaya mOksha draa - kshaa rasa niree - kshaNa saMtasiMturu || maMgaLa ||

  6. mana tOTi vaariki - maa yiMTa beMDli raM - Dani Subhalaekhanu - paMpudumu = manaku gooDa daeva - mahimaikhyata labhiM - panu rakshaNaahvaana - patrika vachcheda || maMgaLa ||


1. saMtOshamu     2. aayana aaj~nalu     3. pilupu     4. siddhamu