101. పది ఆజ్ఞలు

రాగం: జంఝూటి తాళం: త్రిపుట

(చాయ: పోయెగ పోయెకాలము)


    పాప వృత్తిని మానుకొనుమీ - మనసా = శాపాలు నరకంబు సహింపలేవు || పాప ||

  1. ఎంత పాపమైన - ఎట్టి పాపమైన = అంతయు దేవుని - కవగాహనంబె || పాప ||

  2. అనుకొన్న పాపాలు - అన్ని దేవుని కెరుకే = పనిగట్టుకొని మాన - వలెను మరువకుమి || పాప ||

  3. నీవాడు ప్రతి మాట - నీవు మరతువు గాని = దేవుండు మరచునా - తీర్పుండు సుమ్ము || పాప ||

  4. కాని మాటలు లేని - పోని మాటలు నీకు = హాని తెచ్చును అవ - మానంబు గలుగు || పాప ||

  5. దేవుని విడిచియు - దేవుండు చేసిన = ఏ వస్తువునైన - ఎంచి మ్రొక్కకుము || పాప ||

  6. కష్టాలలో - సృష్టికర్తపై విసుగకు = నష్టాలలో ప్రభుని - నమ్మి కనిపెట్టు || పాప ||

  7. ఆరాధన దినంబు - ఆచరింపగ వలయు = ఏ రోజు కన్నను ఈ రోజే గొప్ప || పాప ||

  8. తల్లి దండ్రులన్ మర్యా - దస్తులన్ పెద్దలన్ = నిల దీర్గాయువు గల్గ - నెంచు ఘనముగను || పాప ||

  9. కల్లు సారా బ్రాంది! ఇల్లు నొడల గుల్ల = తల్లి పిల్లలు నీవు - దారిద్ర్యము పాలు || పాప ||

  10. తిట్టులాడుట తుదకు - కొట్టులాడుట యగును = ఇట్టి మాదిరి పిల్లల - కెట్టి మాదిరియౌ || పాప ||

  11. యౌవనేచ్చలు పరి - హారంబు చేయుడి = భావ శుద్ధి గడింప - బ్రతుకు వర్ధిల్లు || పాప ||

  12. దొంగ బుద్ధి చెరకు - త్రొవ జూపును నీకు = అంగీకరింపరు - ఆత్మ బంధువులె || పాప ||

  13. పాపాలన్ గెల్చిన - ప్రభు యేసు నడిగిన = పాపాల నోడించు - బలమిచ్చు నీకు || పాప ||

  14. పడుచు వారలారా! - పడుచు వారిని జూచి = చెడు బుద్ధులను మీలో - చేర నీయకుడి || పాప ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


101. padi aaj~nalu

raagaM: jaMjhooTi taaLaM: tripuTa

(chaaya: pOyega pOyekaalamu)


    paapa vRttini maanukonumee - manasaa = Saapaalu narakaMbu sahiMpalaevu || paapa ||

  1. eMta paapamaina - eTTi paapamaina = aMtayu daevuni - kavagaahanaMbe || paapa ||

  2. anukonna paapaalu - anni daevuni kerukae = panigaTTukoni maana - valenu maruvakumi || paapa ||

  3. neevaaDu prati maaTa - neevu maratuvu gaani = daevuMDu marachunaa - teerpuMDu summu || paapa ||

  4. kaani maaTalu laeni - pOni maaTalu neeku = haani techchunu ava - maanaMbu galugu || paapa ||

  5. daevuni viDichiyu - daevuMDu chaesina = ae vastuvunaina - eMchi mrokkakumu || paapa ||

  6. kashTaalalO - sRshTikartapai visugaku = nashTaalalO prabhuni - nammi kanipeTTu || paapa ||

  7. aaraadhana dinaMbu - aachariMpaga valayu = ae rOju kannanu ee rOjae goppa || paapa ||

  8. talli daMDrulan^ maryaa - dastulan^ peddalan^ = nila deergaayuvu galga - neMchu ghanamuganu || paapa ||

  9. kallu saaraa braaMdi! illu noDala gulla = talli pillalu neevu - daaridryamu paalu || paapa ||

  10. tiTTulaaDuTa tudaku - koTTulaaDuTa yagunu = iTTi maadiri pillala - keTTi maadiriyau || paapa ||

  11. yauvanaechchalu pari - haaraMbu chaeyuDi = bhaava Suddhi gaDiMpa - bratuku vardhillu || paapa ||

  12. doMga buddhi cheraku - trova joopunu neeku = aMgeekariMparu - aatma baMdhuvule || paapa ||

  13. paapaalan^ gelchina - prabhu yaesu naDigina = paapaala nODiMchu - balamichchu neeku || paapa ||

  14. paDuchu vaaralaaraa! - paDuchu vaarini joochi = cheDu buddhulanu meelO - chaera neeyakuDi || paapa ||