79. సమర్పణ స్తుతి

రాగం: జంఝూటి తాళం: ఆట



    స్తుతియు మహిమయు నీకే - క్షితికిన్ దివికిన్ నీటి - వితతికిన్ కర్తవై - వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు - హితుడా మా ప్రేమ నీ - కెట్లు చూపుదును || స్తుతియు ||

  1. పసిడి వర్ణంపుటెండ - భాగ్య ధారల వాన - విసరు మంచి గాలి - విరియు పుష్పములు = రసమొల్కు పండ్లు నీ - రమ్య ప్రేమన్ చాటున్ - ప్రసరించు కోతలో - ఫల నొందు వీవు || స్తుతియు ||

  2. నెమ్మది గల యిండ్లు - నిజ సౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు - నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వంద - నమ్ములు ఋణపడి - యున్నాము నీకు || స్తుతియు ||

  3. దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికిన్ నీ పుత్రున్ ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున - కొరత దీర్చెడు సర్వ - వరములమర్చిన - పరమోపకారి || స్తుతియు ||

  4. జీవంబు ప్రేమను - జీవను గల్గించెడు - పావనాత్మను మాకై పంపితివి - దీవెనలేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు || స్తుతియు ||

  5. నరులకు విమోచ - నము గల్గె పాపంబుల్ - పరిహార మాయె గృ - పా సాధనములు = దొరికె మోక్షాంశంబు - స్థిరమాయె - మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనక! || స్తుతియు ||

  6. మాకై వాడుకొనెడి - రూకల్ వ్యర్ధంబగును - నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య శ్రేష్ట ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక || స్తుతియు ||

  7. జీవంబు వస్తువులు - శ్రేయస్సు దాన స్వ - భావంబు శక్తియు - భాగ్యంబులు = నీ వలననే లభ్య - మై వెలయు చున్నవి - నీ వాసమే మాకు - నిత్యానందంబు || స్తుతియు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


79. samarpaNa stuti

raagaM: jaMjhooTi taaLaM: aaTa



    stutiyu mahimayu neekae - kshitikin^ divikin^ neeTi - vitatikin^ kartavai - velayu maa daeva = prativastuvunu maaku bahumatigaa nichchu - hituDaa maapraema nee - keTlu choopudunu || stutiyu ||

  1. pasiDi varNaMpuTeMDa - bhaagya dhaarala vaana - visaru maMchi gaali - viriyu pushpamulu = rasamolku paMDlu nee - ramya praeman^ chaaTun^ - prasariMchu kOtalO - phala noMdu veevu || stutiyu ||

  2. nemmadi gala yiMDlu - nija saukhya kaalamulu - immahi phaliyiMchu - naiSvaryaadhikamul^ = immuga galigina - hRdayulamai vaMda - nammulu RNapaDi - yunnaamu neeku || stutiyu ||

  3. duritaMbu lonariMchi - daurbhaagya sthiti nunna - dharaNikin^ nee putrun^ dharmaMbu jaesi = narula kee dharmamuna - korata deercheDu sarva - varamulamarchina - paramOpakaari || stutiyu ||

  4. jeevaMbu praemanu - jeevanu galgiMcheDu - paavanaatmanu maakai paMpitivi - deevenalaeDu re - TlaavariMpanu mammu - nee vimalaatman^ maalO gummariMchu || stutiyu ||

  5. narulaku vimOcha - namu galge paapaMbul^ - parihaara maaye gR - paa saadhanamulu = dorike mOkshaaMSaMbu - sthiramaaye - maemu nee korakaemi taegalamu paripoorNa janaka! || stutiyu ||

  6. maakai vaaDukoneDi - rookal^ vyardhaMbagunu - neekai yappuga nichchu nikhila vastuvulu = SreekaraMbagu nitya SraeshTa dhana nidhiyai pai - lOkaMbu naMduMDu - lOpaMbu laeka || stutiyu ||

  7. jeevaMbu vastuvulu - Sraeyassu daana sva - bhaavaMbu Saktiyu - bhaagyaMbulu = nee valananae labhya - mai velayu chunnavi - nee vaasamae maaku - nityaanaMdaMbu || stutiyu ||