81. ప్రభు భోజనము


    ప్రభు సంస్కారపు విందు - ప్రభు సంస్కారపు విందు - పరు గెత్తుకొని రండి - ప్రభువే మన విందు = ప్రభువు జతకిదే సందు - పాప వ్యాధికి మందు - సభలన్నిటి యందు - సంతుష్టి పెంపొందు || ప్రభు ||

  1. అందుకొను రొట్టెతో - ఆయన శరీరము - నందుకొందుము మర్మ మది యద్భుతంబు = యెందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో - వందించి తిన్నను - బాధయు తరుగ లేదు || ప్రభు ||

  2. అందుకొను రసముతో - ఆయన రక్తము - నందుకొందుము మర్మ - మది యద్భుతంబు = యెందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో వందించి త్రాగినను - బాధయు తరుగ లేదు || ప్రభు ||

  3. మన రక్షకుడు దేవ - తనయుండు రండని - కనిపెట్టు చున్నాడు గనుకనే రండి = మనసులోని అడ్డులను - నొత్తిగించి మీ - మనసు ప్రభువునకిచ్చి - వెనుకాడకను రండి || ప్రభు ||

  4. పాపాత్ములందరికి - ప్రభువే స్వయంబుగా - బంతి భోజనము యే - ర్పరచి యున్నాడు = పాపు లేక సహ - వాసులై యేసుని - దాపున నొక సభగా - ధన్యులౌ విందిదియె || ప్రభు ||

  5. పాపి పాపియంచు - ప్రభువు కలవరించు - ప్రభువు ప్రభువని కలవరించు చుండుము = నా పాపి విందునకు - నడచి రాకున్న నా తాపమెంతో చెప్ప - దగునా యను చున్నాడు || ప్రభు ||

  6. భోజన వస్తువులు - భుక్తికి గుర్తులు - భోజన వస్తువులు - ముక్తిభక్తి సాధ నముల్ = రాజు మన తండ్రి ఈ - రాత్రి భోజన కర్త - యే జన విశ్వాసి కిని - యేసును వడ్డించును || ప్రభు ||

  7. ఇది మోక్ష మందున - ఇకను జరుగబోవు - వధువు సంఘ వై - వా హికపు విందున్ = మదిని జ్ఞప్తికి తెచ్చు - మహిమానందము నిచ్చు - పదిలంబుగ సిద్ధ - పడుచు రండి రండి || ప్రభు ||

  8. ప్రభు భోజనము వలన - పాప పరిహారంబు - ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు = ప్రభుని బల్లకు తెల్ల - పావురము లన్నట్టు శుభ ముతో భక్తులు - శోభిల్లు చుందురు || ప్రభు ||

  9. మనము ప్రభుని ముట్టు - కొను భోజన పంక్తి - మనలనాయన ముట్టు - కొను భోజన పంక్తి = మన తండ్రితో యింత - చను వాయెను ఈ - చనువు చనువు మోక్ష - స్థలము వరకు పెరుగు || ప్రభు ||

  10. సరిగా నుండి భో - జనము గైకొనుచున్న - నరకమను రెండవ - మరణము లేదు = మరి కొన్నాళ్ళకు వచ్చు - మరణము పరలోక - పురమునకు ద్వారమై - మరణ మని పింపదు || ప్రభు ||

  11. రెండవ రాకడ - కుండు వారికి చావు - ఉండనే ఉండదు - ఉండు జీవంబు = నిండు మహిమ యుండు - నిజ శరీరము దాల్చి - యుండి యెగుర గలము - ఉర్ధ్వ లోకమునకు || ప్రభు ||

  12. జనక కుమారాత్మ - లను త్రైక దేవుండీ - దినమున మనలను - దీవించు చుండు = మన మనసులను బట్టి - జనకత్రైకు డొందు ఘనత మహిమ స్తోత్ర - గానముల్ సత్కీర్తి || ప్రభు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


81. prabhu bhOjanamu


    prabhu saMskaarapu viMdu - prabhu saMskaarapu viMdu - paru gettukoni raMDi - prabhuvae mana viMdu = prabhuvu jatakidae saMdu - paapa vyaadhiki maMdu - sabhalanniTi yaMdu - saMtushTi peMpoMdu || prabhu ||

  1. aMdukonu roTTetO - aayana Sareeramu - naMdukoMdumu marma madi yadbhutaMbu = yeMdarennO maarlee - vaMdala aeMDlalO - vaMdiMchi tinnanu - baadhayu taruga laedu || prabhu ||

  2. aMdukonu rasamutO - aayana raktamu - naMdukoMdumu marma - madi yadbhutaMbu = yeMdarennO maarlee - vaMdala aeMDlalO vaMdiMchi traaginanu - baadhayu taruga laedu || prabhu ||

  3. mana rakshakuDu daeva - tanayuMDu raMDani - kanipeTTu chunnaaDu ganukanae raMDi = manasulOni aDDulanu - nottigiMchi mee - manasu prabhuvunakichchi - venukaaDakanu raMDi || prabhu ||

  4. paapaatmulaMdariki - prabhuvae svayaMbugaa - baMti bhOjanamu yae - rparachi yunnaaDu = paapu laeka saha - vaasulai yaesuni - daapuna noka sabhagaa - dhanyulau viMdidiye || prabhu ||

  5. paapi paapiyaMchu - prabhuvu kalavariMchu - prabhuvu prabhuvani kalavariMchu chuMDumu = naa paapi viMdunaku - naDachi raakunna naa taapameMtO cheppa - dagunaa yanu chunnaaDu || prabhu ||

  6. bhOjana vastuvulu - bhuktiki gurtulu - bhOjana vastuvulu - muktibhakti saadha namul^ = raaju mana taMDri ee - raatri bhOjana karta - yae jana viSvaasi kini - yaesunu vaDDiMchunu || prabhu ||

  7. idi mOksha maMduna - ikanu jarugabOvu - vadhuvu saMgha vai - vaa hikapu viMdun^ = madini j~naptiki techchu - mahimaanaMdamu nichchu - padilaMbuga siddha - paDuchu raMDi raMDi || prabhu ||

  8. prabhu bhOjanamu valana - paapa parihaaraMbu - prabhu bhOjanamu valana svastha kaaryaMbu = prabhuni ballaku tella - paavuramu lannaTTu Subha mutO bhaktulu - SObhillu chuMduru || prabhu ||

  9. manamu prabhuni muTTu - konu bhOjana paMkti - manalanaayana muTTu - konu bhOjana paMkti = mana taMDritO yiMta - chanu vaayenu ee - chanuvu chanuvu mOksha - sthalamu varaku perugu || prabhu ||

  10. sarigaa nuMDi bhO - janamu gaikonuchunna - narakamanu reMDava - maraNamu laedu = mari konnaaLLaku vachchu - maraNamu paralOka - puramunaku dvaaramai - maraNa mani piMpadu || prabhu ||

  11. reMDava raakaDa - kuMDu vaariki chaavu - uMDanae uMDadu - uMDu jeevaMbu = niMDu mahima yuMDu - nija Sareeramu daalchi - yuMDi yegura galamu - urdhva lOkamunaku || prabhu ||

  12. janaka kumaaraatma - lanu traika daevuMDee - dinamuna manalanu - deeviMchu chuMDu = mana manasulanu baTTi - janakatraiku DoMdu ghanata mahima stOtra - gaanamul^ satkeerti || prabhu ||