111. సృష్టిలో ఉన్న దేవుని మహిమ
విశాఖపట్నం సముద్రతీరమున అయ్యగారు రచించిన కీర్తన
రాగం: ముఖారి తాళం: ఆది
- ఎవ్వారు గమనింప గలరు - మన దేవుని మహిమ - ఎవ్వారు
వివరింప గలరు = బూరకాండ్లు గలవారలు సముద్రపు - వారను
నిలుచుట కెపుడు వత్తురు || ఎవ్వారు ||
- ఎంతో గంభీరమైన ఘోష - జనులతో మాట్లాడు - సంతోష భరితమైన భాష = గంతులు వేయుచు కెరటాల్ భజనను - సంతోషముతో సలుపుచున్న పను || లెవ్వారు ||
- అంభో నిధి చూడ నాశ్చర్యంబు - ఇది మన దేవుని చేతి - గాంభీర్య మైన ఘన కార్యంబు = అంభోనిధి రాత్రిబగళ్ళు స్తో - త్రంబుతో దేవుని తలచుచున్న పను || లెవ్వారు ||
- చలువ ప్రదేశము వాల్తేరు - జనుల సౌఖ్యార్ధమై దొరలూ - వాసము చేయు చక్కనియూరు - చలువ గాలి బహు చక్కగ వీచును అలసిన ప్రాణికి హాయిగా నుండును || ఎవ్వారు ||
- కాచిన నెండ మెండుగాను - కొండ దిబ్బ మీద - వీచున్ వాయువు మెండు గాను = వాసిగ రాజమహేంద్ర వరము ని - వాసుడు దేవదాసు బల్కెను || ఎవ్వారు ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
111. viSaakhapaTnaM samudrateeramuna ayyagaaru rachiMchina keertana
raagaM: mukhaari taaLaM: aadi
- evvaaru gamaniMpa galaru - mana daevuni mahima - evvaaru
vivariMpa galaru = boorakaaMDlu galavaaralu samudrapu - vaaranu
niluchuTa kepuDu vatturu || evvaaru ||
- eMtO gaMbheeramaina ghOsha - janulatO maaTlaaDu - saMtOsha bharitamaina bhaasha = gaMtulu vaeyuchu keraTaal^ bhajananu - saMtOshamutO salupuchunna panu || levvaaru ||
- aMbhO nidhi chooDa naaScharyaMbu - idi mana daevuni chaeti - gaaMbheerya maina ghana kaaryaMbu = aMbhOnidhi raatribagaLLu stO - traMbutO daevuni talachuchunna panu || levvaaru ||
- chaluva pradaeSamu vaaltaeru - janula saukhyaardhamai doraloo - vaasamu chaeyu chakkaniyooru - chaluva gaali bahu chakkaga veechunu alasina praaNiki haayigaa nuMDunu || evvaaru ||
- kaachina neMDa meMDugaanu - koMDa dibba meeda - veechun^ vaayuvu meMDu gaanu = vaasiga raajamahaeMdra varamu ni - vaasuDu daevadaasu balkenu || evvaaru ||