9. ఆదరణ కర్త స్తుతి, పరిశుద్ధాత్మ వశీకరణ
రాగం: మోహన తాళం: ఆది
- దైవాత్మా రమ్ము - నా తనువున వ్రాలుము - నా = జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మా ||
- స్వంత బుద్ధితోను - యేసు - ప్రభుని నెఱుగలేను - నే = నెంతగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మా ||
- స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే = నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను || దైవాత్మా ||
- పాప స్థలము నుండి - నీ సు - వార్త కడకు నన్ను - భువి నో = పరమాత్మ! నడుపు చుండుము - ఉత్తమ స్థలమునకు || దైవాత్మా ||
- పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ నీ = పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు || దైవాత్మా ||
- పరిశుద్ధుని జేసి - నీ - వరములు దయచేసి - నీ = పరిశుద్ధ సన్నిధిని జూపుమా - పావురమా! వినుమా || దైవాత్మా ||
- తెలివిని గలిగించు - నన్ను - దివ్వెగ వెలిగించు - నీ = కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు || దైవాత్మా ||
- నన్నును భక్తులను - యే - నాడును కృపతోను - నిల = మన్నించుము మా పాప రాసులను - మాపివేయు దేవా || దైవాత్మా ||
- వందనములు నీకు - శుభ - వందనములు నీకు - ఆ = నందముతో కూడిన నా హృదయ వందనములు నీకు || దైవాత్మా ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
9. aadaraNa karta stuti, pariSuddhaatma vaSeekaraNa
raagaM: mOhana taaLaM: aadi
- daivaatmaa rammu - naa tanuvuna vraalumu - naa = jeevamaMtayu neetO niMDa - jaeri vasiMpumu || daivaatmaa ||
- svaMta buddhitOnu - yaesu - prabhuni ne~rugalaenu - nae = neMtaga naalOchiMchina vibhuni - ne~rigi chooDa laenu || daivaatmaa ||
- svaMta SaktitOnu - yaesu - svaami jaeralaenu - nae = neMta naDachina prabhuni kalisikoni - cheMta jaeralaenu || daivaatmaa ||
- paapa sthalamu nuMDi - nee su - vaarta kaDaku nannu - bhuvi nO = paramaatma! naDupu chuMDumu - uttama sthalamunaku || daivaatmaa ||
- paapamulO marala - nannu paDakuMDaga jaesi - aa nee = pariSuddhamaina rekkala - neeDanu kaapaaDu || daivaatmaa ||
- pariSuddhuni jaesi - nee - varamulu dayachaesi - nee = pariSuddha sannidhini joopumaa - paavuramaa! vinumaa || daivaatmaa ||
- telivini galigiMchu - nannu - divvega veligiMchu - nee = kaligina bhaagyamulanniTini naa - kaMTiki joopiMchu || daivaatmaa ||
- nannunu bhaktulanu - yae - naaDunu kRpatOnu - nila = manniMchumu maa paapa raasulanu - maapivaeyu daevaa || daivaatmaa ||
- vaMdanamulu neeku - Subha - vaMdanamulu neeku - aa = naMdamutO kooDina naa hRdaya vaMdanamulu neeku || daivaatmaa ||