28. క్రీస్తు ప్రభుని చరిత్ర

రాగం: బిల్హరి తాళం: ఆది



    యేసుక్రీస్తు వారి కథవినుడి - దేశీయులారా - యేసు క్రీస్తువారి
    కథ వినుడి = దోసకారులన్ రక్షింప - దోసములంటని రీతిగనె
    దాసుని రూపంబుతో మన - ధరణిలో వెలసిన దేవుండౌ || యేసుక్రీస్తు ||

  1. రోగులన్ కొందరినిజూచి - బాగుచేయనని యనలేదు - రోగముల
    తీరది పరికించి - బాగుచేయ లేననలేదు - రోగముల నివారణకైన -
    యోగముల్ తాజెప్పలేదు - యోగ యోగుల మించు వైద్య - యోగి
    తానని ఋజువు గొన్న || యేసుక్రీస్తు ||

  2. పాపులను నిందించి యే విధ - శాప వాక్కుల్ పల్కలేదు - పాపులకు
    గతి లేదని చెప్పి - పారద్రోలి వేయలేదు కోపపడుచు పాపులను
    రా - కూడదని వచియింపలేదు = పాపములు పరిహారము చేసి -
    పరమదేవుడు తానని తెల్పిన || యేసుక్రీస్తు ||

  3. నరులకు దేవుడు తండ్రియను - వరుస బైలుపరచినాడు - పొరుగు
    వారు సోదరులన్న - మరొక వరుస తేల్చినాడు - మరియు దేవున్
    పొరుగు వారిన్ - సరిగ ప్రేమించు మన్నాడు = కొరత లేకుండ
    సర్వాజ్ఞల్ - నెరవేర్చి మాదిరి జూపిన || యేసుక్రీస్తు ||

  4. వాక్కు విన వచ్చిన వారలకు - వాక్యాహారమున్ తినిపించె - ఆకలితో
    నున్న ఆ - యైదు వేలన్ గనికరించె - మూకకు వండని రొట్టెలను
    బుట్టించి తృప్తిగా వడ్డించె = లోకమంతకు పోషకుడు తా - నే కదాయని మెప్పుగాంచిన || యేసుక్రీస్తు ||

  5. దురితములను తత్ఫలములను - దుష్టుడౌ సైతానును గెల్చె - తరుణ
    మందు మృతులన్ లేపె - దయ్యములను దరిమి వైచె - నరుల
    భారమున్ వహియించి - మరణమొంది తిరిగిలేచె = తిరుగవచ్చెద
    నంచు మోక్ష - పురము వెళ్ళి గూర్చున్న || యేసుక్రీస్తు ||

  6. పాపులకు రోగులకు బీద - వారికి దేవుండు యేసే - ఆపదలన్నిటిలో
    నిత్య - మడ్డు పడు మిత్రుండు క్రీస్తే - పాపమున పడకుండ గా -
    పాడెడు శిల యేసుక్రీస్తే = పాపులాశ్రయించిన యెడల - పర
    లోకమునకు గొంపోవు || యేసుక్రీస్తు ||

  7. మరల యూదుల్ దేశమునకు - మళ్ళుచున్నారిది యొక గుర్తు
    పరుగు లెత్తుచున్నవి కారుల్ - బస్సులు ఇది మరియొకగుర్తు -
    కరువులు మతవాదాలు భూ - కంపముల్ యుద్ధా లొకగుర్తు =
    గురుతులై పోయినవి గనుక - త్వరగ వచ్చుచున్న శ్రీ || యేసుక్రీస్తు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


28. kreestu prabhuni charitra

raagaM: bilhari taaLaM: aadi



    yaesukreestu vaari kathavinuDi - daeSeeyulaaraa - yaesu kreestuvaari
    katha vinuDi = dOsakaarulan^ rakshiMpa - dOsamulaMTani reetigane
    daasuni roopaMbutO mana - dharaNilO velasina daevuMDau || yaesukreestu ||

  1. rOgulan^ koMdarinijoochi - baaguchaeyanani yanalaedu - rOgamula
    teeradi parikiMchi - baaguchaeya laenanalaedu - rOgamula nivaaraNakaina -
    yOgamul^ taajeppalaedu - yOga yOgula miMchu vaidya - yOgi
    taanani Rjuvu gonna || yaesukreestu ||

  2. paapulanu niMdiMchi yae vidha - Saapa vaakkul^ palkalaedu - paapulaku
    gati laedani cheppi - paaradrOli vaeyalaedu kOpapaDuchu paapulanu
    raa - kooDadani vachiyiMpalaedu = paapamulu parihaaramu chaesi -
    paramadaevuDu taanani telpina || yaesukreestu ||

  3. narulaku daevuDu taMDriyanu - varusa bailuparachinaaDu - porugu
    vaaru sOdarulanna - maroka varusa taelchinaaDu - mariyu daevun^
    porugu vaarin^ - sariga praemiMchu mannaaDu = korata laekuMDa
    sarvaaj~nal^ - neravaerchi maadiri joopina || yaesukreestu ||

  4. vaakku vina vachchina vaaralaku - vaakyaahaaramun^ tinipiMche - aakalitO
    nunna aa - yaidu vaelan^ ganikariMche - mookaku vaMDani roTTelanu
    buTTiMchi tRptigaa vaDDiMche = lOkamaMtaku pOshakuDu taa - nae kadaayani meppugaaMchina || yaesukreestu ||

  5. duritamulanu tatphalamulanu - dushTuDau saitaanunu gelche - taruNa
    maMdu mRtulan^ laepe - dayyamulanu darimi vaiche - narula
    bhaaramun^ vahiyiMchi - maraNamoMdi tirigilaeche = tirugavachcheda
    naMchu mOksha - puramu veLLi goorchunna || yaesukreestu ||

  6. paapulaku rOgulaku beeda - vaariki daevuMDu yaesae - aapadalanniTilO
    nitya - maDDu paDu mitruMDu kreestae - paapamuna paDakuMDa gaa -
    paaDeDu Sila yaesukreestae = paapulaaSrayiMchina yeDala - para
    lOkamunaku goMpOvu || yaesukreestu ||

  7. marala yoodul^ daeSamunaku - maLLuchunnaaridi yoka gurtu
    parugu lettuchunnavi kaarul^ - bassulu idi mariyokagurtu -
    karuvulu matavaadaalu bhoo - kaMpamul^ yuddhaa lokagurtu =
    gurutulai pOyinavi ganuka - tvaraga vachchuchunna Sree || yaesukreestu ||