45. సంఘము
రాగం: కళ్యాణి తాళం: తిశ్రగతి
- షారోను మైదానముతో - సమమైన మైదానంబు = ఏ రాజ్య మందు లేదు - ఎంచి చూడగా
- ప్రభు యేసు రూపే సంఘ - వధువు ధరియించె నామె = విభవ మేమంచు నేను - వివరింప గలను ||షారోను||
- స్వీయ రక్తమున ప్రభువు - చిన్ని కన్నియను శుద్ధి = జేయ పావురము వంటి - దాయె స్థిరముగను ||షారోను||
- నిష్పక్ష పాతము తోడ - నిజము చెప్ప వలెనన్న = పుష్ప వన మిదియెకటియే - పూర్ణార్దంబున ||షారోను||
- పరమార్ధ కీర్తనంబు - పాడించినదియె యీ = సరసమైన పుష్పాల షారోను పొలము ||షారోను||
- షారోను పుష్పము వంటి - సంఘ వధువునకు క్రీస్తు = ఏ రూప మిచ్చెనో నే - నెన్న గలనా ||షారోను||
- నానా వర్ణాల పువ్వుల్ - నర దృష్టి నాకర్షించు = మానవ శుద్ధి ప్రభుని - మది నాకర్షించు ||షారోను||
- సర్వ పుష్పాల యందు - సంఘ వధువే పుష్పంబు = ఊర్విని సిద్ధమౌను - ఉండు పరమందు ||షారోను||
- సూర్యుండు పువ్వులకెంతో - సొగసైన రంగులద్దున్ = సూర్యుండై నట్టి యేసు - శుభ గుణము లద్దున్ ||షారోను||
- ఆ యద్దకంబు వాడి - అంతర్ధానంబై పోవు = ఈ యద్దకంబు పోదు - ఇది శాశ్వతముండు ||షారోను||
- వివిధ వర్ణములు గల - విశ్వాసులను పుష్పాలు = భువి మీద మొల్చునట్టి - పుష్ప సంఘంబు ||షారోను||
- సభను గురించియు నా - ప్రభుని గురించి యున్న = శుభవార్త వినుచు చెప్పుచు - సుఖియింప గలను ||షారోను||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
45. saMghamu
raagaM: kaLyaaNi taaLaM: tiSragati
- shaarOnu maidaanamutO - samamaina maidaanaMbu = ae raajya maMdu laedu - eMchi chooDagaa
- prabhu yaesu roopae saMgha - vadhuvu dhariyiMche naame = vibhava maemaMchu naenu - vivariMpa galanu ||shaarOnu||
- sveeya raktamuna prabhuvu - chinni kanniyanu Suddhi = jaeya paavuramu vaMTi - daaye sthiramuganu ||shaarOnu||
- nishpaksha paatamu tODa - nijamu cheppa valenanna = pushpa vana midiyekaTiyae - poorNaardaMbuna ||shaarOnu||
- paramaardha keertanaMbu - paaDiMchinadiye yee = sarasamaina pushpaala shaarOnu polamu ||shaarOnu||
- shaarOnu pushpamu vaMTi - saMgha vadhuvunaku kreestu = ae roopa michchenO nae - nenna galanaa ||shaarOnu||
- naanaa varNaala puvvul^ - nara dRshTi naakarshiMchu = maanava Suddhi prabhuni - madi naakarshiMchu ||shaarOnu||
- sarva pushpaala yaMdu - saMgha vadhuvae pushpaMbu = oorvini siddhamaunu - uMDu paramaMdu ||shaarOnu||
- sooryuMDu puvvulakeMtO - sogasaina raMguladdun^ = sooryuMDai naTTi yaesu - Subha guNamu laddun^ ||shaarOnu||
- aa yaddakaMbu vaaDi - aMtardhaanaMbai pOvu = ee yaddakaMbu pOdu - idi SaaSvatamuMDu ||shaarOnu||
- vividha varNamulu gala - viSvaasulanu pushpaalu = bhuvi meeda molchunaTTi - pushpa saMghaMbu ||shaarOnu||
- sabhanu guriMchiyu naa - prabhuni guriMchi yunna = Subhavaarta vinuchu cheppuchu - sukhiyiMpa galanu ||shaarOnu||