3. సర్వాంశ స్తుతి కీర్తన
రాగం: సింహేంద్రియ మధ్యమము తాళం: ఆట
- దేవా తండ్రీ నీకు - దిన దిన స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు
- అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు || దేవా ||
- చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు || దేవా ||
- చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదలనీయవు || దేవా ||
- పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు || దేవా ||
- పాప ఫలితము లెల్ల - పారదోలితివి = శాప సాధనములు - ఆపివేసితివి || దేవా ||
- దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం - పద యిచ్చినావు || దేవా ||
- ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు || దేవా ||
- అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ వీవే || దేవా ||
- ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు || దేవా ||
- సైతాను క్రియలకు - సర్వ నాశనము = నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము || దేవా ||
- సాతాను ఆటలిక - సాగనియ్యవు = పాతాళాగ్ని కతని పంపి వేసెదవు || దేవా ||
- అన్ని ప్రార్థనలు నీ - వాలించి యున్నావు - అన్నిటిలో మహిమ అందుకొన్నావు || దేవా ||
- సర్వంబులో నీవు - సర్వమై యున్నావు = నిర్వహించితివి నా - నిఖిల కార్యములు || దేవా ||
- హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ తండ్రీ = కలకాల మున్నట్టి హల్లెలూయ తండ్రీ! || దేవా ||
- జనక కుమారాత్మ - లను త్రైకుడొందు = ఘనత కీర్తి మహిమ చనువు నాయందు || దేవా ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
3. sarvaaMSa stuti keertana
raagaM: siMhaeMdriya madhyamamu taaLaM: aaTa
- daevaa taMDree neeku - dina dina stutulu = naavinnapamu vinna naadhaa saMstutulu
- apavitraatmala darSana - maapiyunnaavu = epuDaina avi naa - kaesi raaneeyavu || daevaa ||
- cheDDa aatmala maaTal^ - chevini baDaneeyavu = gaDDu palukula nOLLu - gaTTiyunnaavu || daevaa ||
- cheDu talaMpulu puTTiM - cheDi dushTaatmalanu naa = kaDaku raaneeyavu - kadalaneeyavu || daevaa ||
- paapaMbulanu doora - parachi yunnaavu = paapaMbulanu gelchu - balamichchinaavu || daevaa ||
- paapa phalitamulella - paaradOlitivi = Saapasaadhanamulu - aapivaesitivi || daevaa ||
- durita naijapu vaeru - periki yunnaavu = pariSuddha naija saM -pada yichchinaavu || daevaa ||
- prati vyaadhinin^ svastha - parachi yunnaavu = matiki aatmakunu ne - mmadi yichchinaavu || daevaa ||
- anna vastraadula - kaadhaara meeve = anni chikkulalO sa - haayuMDa neevae || daevaa ||
- nanugaava gala doota - lanu nuMchinaavu = ninu nammu viSvaasa - munu nichchinaavu || daevaa ||
- saitaanu kriyalaku - sarva naaSanamu = nee talaMpulakella - neravaerpu nijamu || daevaa ||
- saataanu aaTalika - saaganiyyavu = paataaLaagni katani paMpivaesedavu || daevaa ||
- anni praarthanalu nee - vaaliMchi yunnaavu - anniTilO mahima aMdukonnaavu || daevaa ||
- sarvaMbulO neevu - sarvamai yunnaavu = nirvahiMchitivi naa - nikhila kaaryamulu || daevaa ||
- halleluya halleluya - halleluya taMDree = kalakaala munnaTTi halleluya taMDree || daevaa ||
- janaka kumaaraatma - lanu traikuDoMdu = ghanata keerti mahima chanuvu naayaMdu || daevaa ||