73. దేవుడు న్యాయస్థుడు
రాగం: నవరోజు తాళం: ఆది
- చేసి కొనరాదు - అపార్ధము చేసికొన రాదు - దేవుని నపార్ధము
చేసికొన రాదు - పరిశుద్ధుని నపార్ధము చేసికొన రాదు || చేసికొన ||
- పరమ దేవుడే ప్రేమం - పరమ న్యాయ సంధానం - గురుతర శక్తి విధానం - నిరుపమాన సుజ్ఞానం = వరగుణ ధీరోధారీ స్థా - వరగుణ ధీరోధారి గాన || చేసికొన ||
- సర్వ వ్యాపకత్వుండు - నిర్వికార దేవుండు - నిర్వచన సజీవుండు సర్వత్ర స్వతంత్రుండు = సర్వ సులక్షణ ధారి - శ్రీ - సర్వ సులక్షణ ధారి గాన || చేసికొన ||
- నిత్యమౌ మహాత్యంబు - అత్యధిక ప్రభావంబు - ప్రత్యక్ష పరాక్రమంబు - సత్యమైన తేజంబు = నిత్య సులక్షణధారి - ఔ - నిత్య సులక్షణ ధారి గాన || చేసికొన ||
- దైవ ప్రేమ కొనియాడ - దైవ న్యాయమును బాడ - దైవ శక్తి గొని వేడ - దైవ జ్ఞాన మొనగూడ = జీవ సులక్షణధారి - స - జీవ సులక్షణ ధారి గాన || చేసికొన ||
- కష్టము వచ్చిన గాని - నష్టము వచ్చిన గాని - ఇష్టము లేక పోనీ భ్రష్టుడవైనను గాని = స్రష్టననుట మేలా - నీ - దృష్టి కిదియన వీలా గాన || చేసికొన ||
- ప్రార్ధనాలకించినను - ప్రార్ధన వినకుండినను - వ్యర్ధంబై పోయినను అర్ధముగాకుండినను = సార్ధక పరచుము గాని అ - పార్ధము చేయుట హాని గాన || చేసికొన ||
- ఇబ్బందులు రోగములు - సిబ్బందివలె శ్రమలు - అబ్బో భూకంపములు - మబ్బువంటి దురితములు = తబ్బిబ్బు చేసిన కాని - హా - తప్పు తలంచుట హాని గాన || చేసికొన ||
- ఆకాశంబులన్ని లోకానందము లన్ని - నీకై యిచ్చిన వన్ని - ప్రాకటముగ పోదన్ని = నాకేమి యిడె నటంచు - నీ - కేకలు మాని తలంచు గాన || చేసికొన ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
73. daevuDu nyaayasthuDu
raagaM: navarOju taaLaM: aadi
- chaesi konaraadu - apaardhamu chaesikona raadu - daevuni napaardhamu
chaesikona raadu - pariSuddhuni napaardhamu chaesikona raadu || chaesikona ||
- parama daevuDae praemaM - parama nyaaya saMdhaanaM - gurutara Sakti vidhaanaM - nirupamaana suj~naanaM = varaguNa dheerOdhaaree sthaa - varaguNa dheerOdhaari gaana || chaesikona ||
- sarva vyaapakatvuMDu - nirvikaara daevuMDu - nirvachana sajeevuMDu sarvatra svataMtruMDu = sarva sulakshaNa dhaari - Sree - sarva sulakshaNa dhaari gaana || chaesikona ||
- nityamau mahaatyaMbu - atyadhika prabhaavaMbu - pratyaksha paraakramaMbu - satyamaina taejaMbu = nitya sulakshaNadhaari - au - nitya sulakshaNa dhaari gaana || chaesikona ||
- daiva praema koniyaaDa - daiva nyaayamunu baaDa - daiva Sakti goni vaeDa - daiva j~naana monagooDa = jeeva sulakshaNadhaari - sa - jeeva sulakshaNa dhaari gaana || chaesikona ||
- kashTamu vachchina gaani - nashTamu vachchina gaani - ishTamu laeka pOnee bhrashTuDavainanu gaani = srashTananuTa maelaa - nee - dRshTi kidiyana veelaa gaana || chaesikona ||
- praardhanaalakiMchinanu - praardhana vinakuMDinanu - vyardhaMbai pOyinanu ardhamugaakuMDinanu = saardhaka parachumu gaani a - paardhamu chaeyuTa haani gaana || chaesikona ||
- ibbaMdulu rOgamulu - sibbaMdivale Sramalu - abbO bhookaMpamulu - mabbuvaMTi duritamulu = tabbibbu chaesina kaani - haa - tappu talaMchuTa haani gaana || chaesikona ||
- aakaaSaMbulanni lOkaanaMdamu lanni - neekai yichchina vanni - praakaTamuga pOdanni = naakaemi yiDe naTaMchu - nee - kaekalu maani talaMchu gaana || chaesikona ||