66. యేసునామస్మరణ


    యేసునామ స్మరణ చేయండి - ప్రియులారా క్రీస్తు
    - యేసు నామ స్మరణ చేయండి
    = యేసునామస్ మరణ వలన - ఎట్టి కష్టమైన తొలగును
    యేసునామ స్మరణ వలన - ఎట్టి సౌఖ్యమైన కలుగును
    యేసునామ స్మరణ వలన - ఏదిపోదు? ఏది రాదు? || యేసు ||

  1. యేసునామ స్మరణ మానకుడి
    ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
    = యేసునామ స్మరణ వలన - ఎట్టి పాపమైన పోవును
    యేసునామ స్మరణ వలన - ఎట్టి వ్యాధియైన కుదురును
    యేసునామ స్మరణ వలన - ఎట్టి కొదువయైన గడచును
    యేసునామ స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు
    = యేసునామ స్మరణ వలన - ఎట్టి భూతమైన వదలును || యేసు ||

  2. క్రీస్తునామ స్మరణ చేయండి - ప్రియులారా యేసుక్రీస్తు నామస్మరణ చేయండి
    = క్రీస్తునామ స్మరణ వలన - వాస్తవంబు బైలుపడును
    క్రీస్తునామ స్మరణ వలన - స్వస్థి స్థితులు దొరుకుచుండును
    క్రీస్తునామ స్మరణ వలన - సుస్థిరంబగు భక్తియబ్బును
    క్రీస్తునామ స్మరణ వలన - అస్థి పరము నందు నుండును
    = క్రీస్తునామ స్మరణ వలన - క్రియకు అన్నియు లభ్యమగును || యేసు ||

  3. యేసుక్రీస్తు స్మరణ మానకుడి - ప్రియులారా
    క్రీస్తు - యేసునామ స్మరణ మానకుడి
    = యేసుక్రీస్తు స్మరణవలన - ఎట్టిదుఃఖమైన ఉండదు
    యేసుక్రీస్తు స్మరణవలన - ఎట్టిచింతయైన ఉండదు
    యేసుక్రీస్తు స్మరణవలన - ఏ నిరాశయైన ఉండదు
    యేసుక్రీస్తు స్మరణవలన - ఎట్టి అజ్ఞానమును ఉండదు
    = యేసుక్రీస్తు స్మరణవలన - ఎట్టి భీతియైన ఉండదు || యేసు ||

  4. యేసునే ధ్యానించు చుండండి
    ఏకాంతమందు - యేసునే ధ్యానించు చుండండి
    = యేసుని ధ్యానించుటచే - ఏమియును సమయంబు పోదు
    యేసుని ధ్యానించుటచే - ఏమియును విశ్రాంతి పోదు
    యేసుని ధ్యానించుటచే - ఏమియును పని వెనుకబడదు
    యేసుని ధ్యానించుటచే - ఏమియును సుఖంబు తగ్గదు
    = యేసుని ధ్యానించుటచే - ఏమియును ఖర్చైపోదు || యేసు ||

  5. ఇట్టిధ్యానము చేయు చుండిన - మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున
    = ఇట్టిధ్యానము వలన మీకు - ఎట్టి అప్పులైన తీరును
    ఇట్టిధ్యానము వలన మీకు - ఎట్టి వ్యాజ్యమైన గెలుచును
    ఇట్టిధ్యానము వలన మీకు - ఎట్టి నిందయైన గెలుచును
    ఇట్టిధ్యానము వలన మీకు - ఎట్టి కలహమైన ఆగును
    = ఇట్టిధ్యానము వలన మీకు - వట్టిమాట వట్టిదగును || యేసు ||

  6. మనుష్య కుమారుండు మనుష్యుడే - ఆపద్ధతిని
    = దేవుని కుమారుడు కూడా దేవుండే
    దేవకుమారుని బట్టి - దేవుని బిడ్డలము మనము
    వాగ్ధానమును బట్టి - దేవుని వారసులమై యున్నాము
    యేసుప్రభువు ప్రవక్త యనిన - ఏమి చెప్పిన నమ్మవలెను
    ఏ మతస్థులైన నమ్మిన - యేసు మేలు చేయు చుండును
    యేసుదేవుడు మన నరుండు - ఎంతగానో మురియవలెను
    బైబిలునందున్న క్రీస్తుని - పావన చరిత్ర చదువుడి
    యేసు మనలో నున్నాడు - యేసులో మనమున్నాము
    = యేసునకు మనమె మనకు - యేసే యుండును ఏమి తక్కువ || యేసు ||

  7. యేసుక్రీస్తు చరిత్ర వినరండి - భూజనులారా - యేసుక్రీస్తు చరిత్ర వినరండి
    = యేసుదేవుడు నరుడు భూ - వాసియాయెను బోధించెను
    ధర్మముల మార్గమునందు - తానె నడచి దారిచూపెను
    మందు లేకుండగనె జబ్బుల్ - మాన్పె మృతులకు జీవమిచ్చెను
    నరులలోని దయ్యములను - తరిమి వేసి సౌఖ్యమిచ్చెను
    పాపములను గెల్చి వేసెను - పాపులకాదరణ యిచ్చెను
    ఆకలితోనున్న వారికి - అప్పములు కల్పించి పెట్టెను
    ఆపద యందున్న వారికి - ఆపద తప్పించి వేసెను
    లెక్క లేకుండగను నిత్యము - లెక్కలేని మేళ్ళు చేసెను
    వాటినెల్లను వ్రాయ బూనిన - వయసు చాలదు వసుధ పట్టదు
    పాప పరిహారంబు కొరకు - ప్రాణ రక్తము బలిగ పెట్టెను
    మరణమొందియు తనకు తానె - మరల బ్రతికి పరము వెళ్ళెను
    తిరిగివచ్చి భక్తజనులను - పరమునకు కొంచుకొని పోవును
    = ఇట్టి దేవుడు ఇట్టి నరుడు - ఎవరును ఎక్కడను లేని || యేసు ||

  8. యేసుక్రీస్తు సంఘ దేశాలు - మన కాలమందు ఇలకుచేయు మేళ్ళు వినరండి
    = గ్రంధ ముద్ర కచ్చు కూర్పులు - క్రైస్తవ దేశాల పనులే
    గ్యాసు లైట్లు మెరుపు దీపాల్ - క్రైస్తవ దేశాల పనులే
    కార్లు ట్రైన్లు బైసైకిళ్ళు - క్రైస్తవ దేశాల పనులే
    కళాశాలలు వైద్యశాలలు - క్రైస్తవ దేశాల పనులే
    గాలి యోడలు స్టీమర్లు - క్రైస్తవ దేశాల పనులే
    కడను తెచ్చు దుర్భిణీలు - క్రైస్తవ దేశాల పనులే
    కడను వ్రాయు టెలిగ్రాములు - క్రైస్తవ దేశాల పనులే
    కడను అడ్డు టెలివిజన్లు - క్రైస్తవ దేశాల పనులే
    గ్రామఫోనులు బ్రాడ్ క్యాస్టులు - క్రైస్తవ దేశాల పనులే
    కండ్ల అద్దాల్ యక్సరేలు - క్రైస్తవ దేశాల పనులే
    కలములు మందులు మరలు - క్రైస్తవ దేశాల పనులే
    గడియారాల్ ఫోటో గ్రాపులు - క్రైస్తవ దేశాల పనులే
    ఇవియు పూర్వమందె గలవని - యెరిగిన వారన్న యెడల
    అవి ఇప్పుడు మనకు లేవు - ఇవి కండ్ల యెదుట ఉన్నవి
    ఇవియె వాడుక యందు గలవను - ఇచ్చు ప్రత్యుత్తరము సబబు
    క్రీస్తు యేసను నీతిసూర్యుని - కీ నీడ స్థలములెన్నో
    = యేసుక్రీస్తుని బట్టి సంఘము - ఎట్టి మేలును చేయుగాక || యేసు ||

  9. లక్ష యాభై వేలు వచ్చును - నీ పేరుమీద లక్ష యాభై వేలు వచ్చును
    = లక్ష యాభై వేలు రాగా - రక్షణార్ధమైన పనులకు - లక్షణముగా
    వాడినప్పుడు లక్షలాది వచ్చు చుండు || యేసు ||

  10. నామప్రార్ధన చేయు చుండండి రక్షకునికున్న - నామప్రార్ధన చేయు చుండండి
    = యేసు అనగా రక్షకుండు - ఎవరినైనను రక్షించును
    క్రీస్తు అనగా నియమితుండు - కేవల మేర్పాటు పురుషుడు
    దేవుడొకడె క్రీస్తునొకడె - దేవుని గ్రంధంబునొకటె
    సంఘమొకటె ఐఖ్యమొకటె - సత్య సిద్ధాంతమును ఒకటె
    = మహిమ జీవన మొకటె - మోక్ష మందిరమును ఒకటె ఆమేన్ || యేసు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


66. yaesunaamasmaraNa


    yaesunaama smaraNa chaeyaMDi - priyulaaraa kreestu
    - yaesu naama smaraNa chaeyaMDi
    = yaesunaamas^ maraNa valana - eTTi kashTamaina tolagunu
    yaesunaama smaraNa valana - eTTi saukhyamaina kalugunu
    yaesunaama smaraNa valana - aedipOdu? aedi raadu? || yaesu ||

  1. yaesunaama smaraNa maanakuDi
    priyulaaraa kreestuyaesu naama smaraNa maanakuDi
    = yaesunaama smaraNa valana - eTTi paapamaina pOvunu
    yaesunaama smaraNa valana - eTTi vyaadhiyaina kudurunu
    yaesunaama smaraNa valana - eTTi koduvayaina gaDachunu
    yaesunaama smaraNa valana eTTi aamekaina SiSuvulu
    = yaesunaama smaraNa valana - eTTi bhootamaina vadalunu || yaesu ||

  2. kreestunaama smaraNa chaeyaMDi - priyulaaraa yaesukreestu naamasmaraNa chaeyaMDi
    = kreestunaama smaraNa valana - vaastavaMbu bailupaDunu
    kreestunaama smaraNa valana - svasthi sthitulu dorukuchuMDunu
    kreestunaama smaraNa valana - susthiraMbagu bhaktiyabbunu
    kreestunaama smaraNa valana - asthi paramu naMdu nuMDunu
    = kreestunaama smaraNa valana - kriyaku anniyu labhyamagunu || yaesu ||

  3. yaesukreestu smaraNa maanakuDi - priyulaaraa
    kreestu - yaesunaama smaraNa maanakuDi
    = yaesukreestu smaraNavalana - eTTidu@hkhamaina uMDadu
    yaesukreestu smaraNavalana - eTTichiMtayaina uMDadu
    yaesukreestu smaraNavalana - ae niraaSayaina uMDadu
    yaesukreestu smaraNavalana - eTTi aj~naanamunu uMDadu
    = yaesukreestu smaraNavalana - eTTi bheetiyaina uMDadu || yaesu ||

  4. yaesunae dhyaaniMchu chuMDaMDi
    aekaaMtamaMdu - yaesunae dhyaaniMchu chuMDaMDi
    = yaesuni dhyaaniMchuTachae - aemiyunu samayaMbu pOdu
    yaesuni dhyaaniMchuTachae - aemiyunu viSraaMti pOdu
    yaesuni dhyaaniMchuTachae - aemiyunu pani venukabaDadu
    yaesuni dhyaaniMchuTachae - aemiyunu sukhaMbu taggadu
    = yaesuni dhyaaniMchuTachae - aemiyunu kharchaipOdu || yaesu ||

  5. iTTidhyaanamu chaeyu chuMDina - meelOni bhakti gaTTipaDunu kaalakramamuna
    = iTTidhyaanamu valana meeku - eTTi appulaina teerunu
    iTTidhyaanamu valana meeku - eTTi vyaajyamaina geluchunu
    iTTidhyaanamu valana meeku - eTTi niMdayaina geluchunu
    iTTidhyaanamu valana meeku - eTTi kalahamaina aagunu
    = iTTidhyaanamu valana meeku - vaTTimaaTa vaTTidagunu || yaesu ||

  6. manushya kumaaruMDu manushyuDae - aapaddhatini
    = daevuni kumaaruDu kooDaa daevuMDae
    daevakumaaruni baTTi - daevuni biDDalamu manamu
    vaagdhaanamunu baTTi - daevuni vaarasulamai yunnaamu
    yaesuprabhuvu pravakta yanina - aemi cheppina nammavalenu
    ae matasthulaina nammina - yaesu maelu chaeyu chuMDunu
    yaesudaevuDu mana naruMDu - eMtagaanO muriyavalenu
    baibilunaMdunna kreestuni - paavana charitra chaduvuDi
    yaesu manalO nunnaaDu - yaesulO manamunnaamu
    = yaesunaku maname manaku - yaesae yuMDunu aemi takkuva || yaesu ||

  7. yaesukreestu charitra vinaraMDi - bhoojanulaaraa - yaesukreestu charitra vinaraMDi
    = yaesudaevuDu naruDu bhoo - vaasiyaayenu bOdhiMchenu
    dharmamula maargamunaMdu - taane naDachi daarichoopenu
    maMdu laekuMDagane jabbul^ - maanpe mRtulaku jeevamichchenu
    narulalOni dayyamulanu - tarimi vaesi saukhyamichchenu
    paapamulanu gelchi vaesenu - paapulakaadaraNa yichchenu
    aakalitOnunna vaariki - appamulu kalpiMchi peTTenu
    aapada yaMdunna vaariki - aapada tappiMchi vaesenu
    lekka laekuMDaganu nityamu - lekkalaeni maeLLu chaesenu
    vaaTinellanu vraaya boonina - vayasu chaaladu vasudha paTTadu
    paapa parihaaraMbu koraku - praaNa raktamu baliga peTTenu
    maraNamoMdiyu tanaku taane - marala bratiki paramu veLLenu
    tirigivachchi bhaktajanulanu - paramunaku koMchukoni pOvunu
    = iTTi daevuDu iTTi naruDu - evarunu ekkaDanu laeni || yaesu ||

  8. yaesukreestu saMgha daeSaalu - mana kaalamaMdu ilakuchaeyu maeLLu vinaraMDi
    = graMdha mudra kachchu koorpulu - kraistava daeSaala panulae
    gyaasu laiTlu merupu deepaal^ - kraistava daeSaala panulae
    kaarlu Trainlu baisaikiLLu - kraistava daeSaala panulae
    kaLaaSaalalu vaidyaSaalalu - kraistava daeSaala panulae
    gaali yODalu sTeemarlu - kraistava daeSaala panulae
    kaDanu techchu durbhiNeelu - kraistava daeSaala panulae
    kaDanu vraayu Teligraamulu - kraistava daeSaala panulae
    kaDanu aDDu Telivijanlu - kraistava daeSaala panulae
    graamaphOnulu braaD^ kyaasTulu - kraistava daeSaala panulae
    kaMDla addaal^ yaksaraelu - kraistava daeSaala panulae
    kalamulu maMdulu maralu - kraistava daeSaala panulae
    gaDiyaaraal^ phOTO graapulu - kraistava daeSaala panulae
    iviyu poorvamaMde galavani - yerigina vaaranna yeDala
    avi ippuDu manaku laevu - ivi kaMDla yeduTa unnavi
    iviye vaaDuka yaMdu galavanu - ichchu pratyuttaramu sababu
    kreestu yaesanu neetisooryuni - kee neeDa sthalamulennO
    = yaesukreestuni baTTi saMghamu - eTTi maelunu chaeyugaaka || yaesu ||

  9. laksha yaabhai vaelu vachchunu - nee paerumeeda laksha yaabhai vaelu vachchunu
    = laksha yaabhai vaelu raagaa - rakshaNaardhamaina panulaku - lakshaNamugaa
    vaaDinappuDu lakshalaadi vachchu chuMDu || yaesu ||

  10. naamapraardhana chaeyu chuMDaMDi rakshakunikunna - naamapraardhana chaeyu chuMDaMDi
    = yaesu anagaa rakshakuMDu - evarinainanu rakshiMchunu
    kreestu anagaa niyamituMDu - kaevala maerpaaTu purushuDu
    daevuDokaDe kreestunokaDe - daevuni graMdhaMbunokaTe
    saMghamokaTe aikhyamokaTe - satya siddhaaMtamunu okaTe
    = mahima jeevana mokaTe - mOksha maMdiramunu okaTe aamaen^ || yaesu ||