59. దావీదు కీర్తన 23
రాగం: అసావేరి తాళం: త్రిపుట
మొదటి భాగము
- నాకేమి కొదువ - నాధుడుండ - ఇక = శ్రీకరుండగు దేవుడే
- నా శ్రేష్ట పాలకుడు - నా - యేక రక్షకుడు గనుక || నాకేమి ||
- ఎన్నటికైన - ఎండనట్టి - ఇక = సన్న పచ్చిక వంటి తరుగని - సదుపాయం బుల్ - నా - కెన్నో చేయున్ గనుక || నాకేమి ||
- తనివి తీరన్ మేళ్ళనుభవింప - నేను = నను సదా మేళ్ళనెడి పచ్చిక నదిమి మృధువుగ - పండు - కొనజేయును గనుక || నాకేమి ||
- ఎంత శోధన - యెండయున్న - నాకు = ఎంతకు న్నోరిగర దెపుడు శాంత జలములు - నా చెంతనే యుండున్ గనుక || నాకేమి ||
- తప్పిపోయిన నన్ - దారింబెట్టి - నన్ను = తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను - నా తప్పు మన్నించున్ గనుక || నాకేమి ||
- నీతి మార్గమునన్ నిల్పును నన్ను - ప్రభువు = నీతిలేని నాకు తన సు - నీతి దయ చేయున్ స్వ - నీతిని ద్రుంచున్ గనుక || నాకేమి ||
- చావు చీకట్ల - శక్తి యుండు - ఆహా = లోయలోబడి పోవలసినను - నే వెరవకుండ - నా దేవుడే తోడు గనుక || నాకేమి ||
- కష్టంబులను చీ - కటి లోయలో - ఇక = స్పష్టముగ ఘన సౌఖ్యమును నా దృష్టికింజూపి - నా - నష్టముల్ దీర్చున్ గనుక || నాకేమి ||
- మీద పడునట్టి - శోధనలన్ - ధరను - నా దరికి రానీక దండము - నన్ను లాగుచును - నా - కాధరణ యౌను గనుక || నాకేమి ||
- పగవారల్ సిగ్గు - పడునట్లుగా - నా = జగతి యెరుగని - సౌఖ్య భో - జన మగుపరచుచున్ - హా - తగినదే పెట్టున్ గనుక || నాకేమి ||
- తన యాత్మనంద - తైలంబుతో - ప్రభువు = అనుదినము తలయంటి విసుగ - కొనక తుడుచును - నా - కను నీళ్ళన్ని గనుక || నాకేమి ||
- పలువిధములైన - భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగ - వెడలు నట్టి వెలగల గిన్నె - నా కలిమిగా జేయున్ గనుక || నాకేమి ||
- బ్రతుకంతటన్ కృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు - నా - పదలు సంపదలౌ గనుక || నాకేమి ||
- దురితంబులుండు - ధరణి నాకు - నిజము = నిరవు కాదిక - నెప్పటికి నా - పరమ దేవుని - మం - దిరమె నా యిల్లు గనుక || నాకేమి ||
- కావలసినవెల్ల - కనబడ గలవు - మనకు = ఏవియడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి || నాకేమి ||
- ధన సహాయంబు - మనకు గల్గు - నేడు = అనుదినంబు - తండ్రి మనకు అక్కరలు తీర్చు - మన || నాకేమి ||
- బస యేర్పాటులు మా - ప్రభువే చేయున్ - నా = బస దిగిన స్థలమందు మా - ప్రభువె నివసించున్ - మా || నాకేమి ||
- ప్రభువు దూతలును - పరిశుద్ధులున్ - ఇక = విభవముగ మన మధ్య - మసలుచు వెల్గు చుందురుగా - హా || నాకేమి ||
- జనకుని యిష్ట - జనము వచ్చు ఇక తనకు యిష్టము గాని జనమును దరికి రానీయడు - ఈ || నాకేమి ||
- మా మిత్రులైన - మహిమ దూతలే - ఇక = క్షేమమునకై మాచుట్టు - చేరి కాయుదురు - చుట్టు || నాకేమి ||
- అందరు మేళ్ళు - అనుభవింప - ఇపుడు = విందుగా సమకూడు వార్తలు వినిపించును - తండ్రి || నాకేమి ||
- ప్రభుని శరీర - రక్తములు - నా = ఉభయ జీవితములకు - మేలై ఉండును - నాకు || నాకేమి ||
- నైజ పాపములు - నశియించుటకే - మన = భోజనము వడ్డించును - రాజేస్ వయముగా - దేవ || నాకేమి ||
- నీ మనసు లోనివి - నెరవేరును - ఇక = క్షేమముగనే ఉండవలయు - చింత లేకుండ - నీవు - చింత లేకుండ - గనుక || నాకేమి ||
- నాకు నాతండ్రి - నరరూపముతో - ఇక = త్రైకుని రీతిగ కనబడి - ధైర్య మిచ్చును - నాకు - ధైర్యమిచ్చును - గనుక || నాకేమి ||
- జనక సుతాత్మ - లను దేవుడు - ఇక = ఘనముగా యుగములన్నిట వినుతు లొందును - నేనా - యన గొర్రెనే గనుక || నాకేమి ||
రెండవ భాగము
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
59. daaveedu keertana 23
raagaM: asaavaeri taaLaM: tripuTa
- naakaemi koduva - naadhuDuMDa - ika = SreekaruMDagu daevuDae
- naa SraeshTa paalakuDu - naa - yaeka rakshakuDu ganuka || naakaemi ||
- ennaTikaina - eMDanaTTi - ika = sanna pachchika vaMTi tarugani - sadupaayaM bul^ - naa - kennO chaeyun^ ganuka || naakaemi ||
- tanivi teeran^ maeLLanubhaviMpa - naenu = nanu sadaa maeLLaneDi pachchika nadimi mRdhuvuga - paMDu - konajaeyunu ganuka || naakaemi ||
- eMta SOdhana - yeMDayunna - naaku = eMtaku nnOrigara depuDu SaaMta jalamulu - naa cheMtanae yuMDun^ ganuka || naakaemi ||
- tappipOyina nan^ - daariMbeTTi - nannu = tepparilla chaesi naaku - teerchu nalasaTanu - naa tappu manniMchun^ ganuka || naakaemi ||
- neeti maargamunan^ nilpunu nannu - prabhuvu = neetilaeni naaku tana su - neeti daya chaeyun^ sva - neetini druMchun^ ganuka || naakaemi ||
- chaavu cheekaTla - Sakti yuMDu - aahaa = lOyalObaDi pOvalasinanu - nae veravakuMDa - naa daevuDae tODu ganuka || naakaemi ||
- kashTaMbulanu chee - kaTi lOyalO - ika = spashTamuga ghana saukhyamunu naa dRshTikiMjoopi - naa - nashTamul^ deerchun^ ganuka || naakaemi ||
- meeda paDunaTTi - SOdhanalan^ - dharanu - naa dariki raaneeka daMDamu - nannu laaguchunu - naa - kaadharaNa yaunu ganuka || naakaemi ||
- pagavaaral^ siggu - paDunaTlugaa - naa = jagati yerugani - saukhya bhO - jana maguparachuchun^ - haa - taginadae peTTun^ ganuka || naakaemi ||
- tana yaatmanaMda - tailaMbutO - prabhuvu = anudinamu talayaMTi visuga - konaka tuDuchunu - naa - kanu neeLLanni ganuka || naakaemi ||
- paluvidhamulaina - bhaagyamulatO - taMDri = velupaliki diga - veDalu naTTi velagala ginne - naa kalimigaa jaeyun^ ganuka || naakaemi ||
- bratukaMtaTan^ kR - paa kshaemamulu - naa = vadalakuMDaga vachchu naatO - sudinamulu galgu - naa - padalu saMpadalau ganuka || naakaemi ||
- duritaMbuluMDu - dharaNi naaku - nijamu = niravu kaadika - neppaTiki naa - parama daevuni - maM - dirame naa yillu ganuka || naakaemi ||
- kaavalasinavella - kanabaDa galavu - manaku = aeviyaDigina - vaani nichchi vaeyunu taMDri - ichchi || naakaemi ||
- dhana sahaayaMbu - manaku galgu - naeDu = anudinaMbu - taMDri manaku akkaralu teerchu - mana || naakaemi ||
- basa yaerpaaTulu maa - prabhuvae chaeyun^ - naa = basa digina sthalamaMdu maa - prabhuve nivasiMchun^ - maa || naakaemi ||
- prabhuvu dootalunu - pariSuddhulun^ - ika = vibhavamuga mana madhya - masaluchu velgu chuMdurugaa - haa || naakaemi ||
- janakuni yishTa - janamu vachchu ika tanaku yishTamu gaani janamunu dariki raaneeyaDu - ee || naakaemi ||
- maa mitrulaina - mahima dootalae - ika = kshaemamunakai maachuTTu - chaeri kaayuduru - chuTTu || naakaemi ||
- aMdaru maeLLu - anubhaviMpa - ipuDu = viMdugaa samakooDu vaartalu vinipiMchunu - taMDri || naakaemi ||
- prabhuni Sareera - raktamulu - naa = ubhaya jeevitamulaku - maelai uMDunu - naaku || naakaemi ||
- naija paapamulu - naSiyiMchuTakae - mana = bhOjanamu vaDDiMchunu - raajaes^ vayamugaa - daeva || naakaemi ||
- nee manasu lOnivi - neravaerunu - ika = kshaemamuganae uMDavalayu - chiMta laekuMDa - neevu - chiMta laekuMDa - ganuka || naakaemi ||
- naaku naataMDri - nararoopamutO - ika = traikuni reetiga kanabaDi - dhairya michchunu - naaku - dhairyamichchunu - ganuka || naakaemi ||
- janaka sutaatma - lanu daevuDu - ika = ghanamugaa yugamulanniTa vinutu loMdunu - naenaa - yana gorrenae ganuka || naakaemi ||