94. పెండ్లి యేర్పాటు కృపాద్భుత భరితమైనది

రాగం: కళ్యాణి తాళం: ఆట



    ఎన్నతరంబే యిది - పెండ్లి యేర్పా - టెంతో యద్భుత మైనది = మన్ను తీసి పురుషుని ని - ర్మాణము చేయుటె వింత, - పన్నుగా నాతని యెముకతో - భార్యను చేయుట యంత = కన్న వింత, వీరివలన - గ్రమముగ నిందరిని 1ను - త్పన్నము గావించు దేవుని - పనిని నేమని పలుక గలము || ఎన్న ||

  1. పురుష పాదము నుండి - స్త్రీ వెడల నె - ప్పుడు ద్రొక్కబడుచు నుండు = శిరసునుండి సృజింప - బడిన - స్త్రీ యధికురాలౌను గనుక - నర శరీరము నెడమ బ్రక్కను - 2నారి కలిగెను: గాన భర్తకు = సరిసమాన సతిగ హృదయము సరసున కుదిరి ప్రీతి - కర ముగ నొప్పుచును 3త - త్కరము క్రిందనే పోషిత యగును || ఎన్న ||

  2. ఒకటి కన్నను రెండు -మే లుభయు - లొనగూడు బలమై యుండు = సకల దేహాత్మల విషయములందేకమై - యొకరి కొకరు తోడై యొకటె యారాధన - యొకటి విశ్వాసము నిరీక్షణ - నొంది స్త్రీ పురుషులు ధరణిని = వికసితులుగ వసింప బెండ్లిని - విభుడు నియ మించెను గృపామతి || ఎన్న ||

  3. పాపంబు భువి జొచ్చెను - తత్పరిహార - వరుడౌ యేసు వచ్చెను - పాపి యాత్మకు మోక్ష సం - బంధమగు హర్షంబు రక్షణ = యీ పవిత్ర విమోచకు - డీ యిలను గల సంతోషములలో - వ్యాప నంబున శుభమగు వి - వాహ మందె రక్షణ కర - మౌ పనికి నారం భమైన - యద్భుతము తొలిసారి జేసె || ఎన్న ||

  4. పతనమప్పుడు పల్కిన - శాపమందున - బహుగా నున్నది దీవెన = సతి ప్రసవ కష్టమును దీర్పను - సంతతి నొసంగు దేవుడు - పతి పొలమునంబడు శ్రమమునకు - ఫలము భూమి పంటగలద; జన = వితతి బ్రోవను వనిత వంశజ - వీరునిగను బురుష రూపిగ - హిత విమోచకు నంపె స్రష్ట - యిదియె స్త్రీ పురుషులకు గొప్ప || ఎన్న ||


1. పుట్టించు    2. స్త్రీ    3. ఆయన చేతి క్రిందనే


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


94. peMDli yaerpaaTu kRpaadbhutabharitamainadi

raagaM: kaLyaaNi taaLaM: aaTa



    ennataraMbae yidi - peMDli yaerpaa - TeMtO yadbhuta mainadi = mannu teesi purushuni ni - rmaaNamu chaeyuTe viMta, - pannugaa naatani yemukatO - bhaaryanu chaeyuTa yaMta = kanna viMta, veerivalana - gramamuga niMdarini 1nu - tpannamu gaaviMchu daevuni - panini naemani paluka galamu || enna ||

  1. purusha paadamu nuMDi - stree veDala ne - ppuDu drokkabaDuchu nuMDu = SirasunuMDi sRjiMpa - baDina - stree yadhikuraalaunu ganuka - nara Sareeramu neDama brakkanu - 2naari kaligenu: gaana bhartaku = sarisamaana satiga hRdayamu sarasuna kudiri preeti - kara muga noppuchunu 3ta - tkaramu kriMdanae pOshita yagunu || enna ||

  2. okaTi kannanu reMDu -mae lubhayu - lonagooDu balamai yuMDu = sakala daehaatmala vishayamulaMdaekamai - yokari kokaru tODai yokaTe yaaraadhana - yokaTi viSvaasamu nireekshaNa - noMdi stree purushulu dharaNini = vikasituluga vasiMpa beMDlini - vibhuDu niya miMchenu gRpaamati || enna ||

  3. paapaMbu bhuvi jochchenu - tatparihaara - varuDau yaesu vachchenu - paapi yaatmaku mOksha saM - baMdhamagu harshaMbu rakshaNa = yee pavitra vimOchaku - Dee yilanu gala saMtOshamulalO - vyaapa naMbuna Subhamagu vi - vaaha maMde rakshaNa kara - mau paniki naaraM bhamaina - yadbhutamu tolisaari jaese || enna ||

  4. patanamappuDu palkina - SaapamaMduna - bahugaa nunnadi deevena = sati prasava kashTamunu deerpanu - saMtati nosaMgu daevuDu - pati polamunaMbaDu Sramamunaku - phalamu bhoomi paMTagalada; jana = vitati brOvanu vanita vaMSaja - veeruniganu burusha roopiga - hita vimOchaku naMpe srashTa - yidiye stree purushulaku goppa || enna ||


1. puTTiMchu   2. stree    3. aayana cEti krindanE