46. క్రైస్తవ సంఘము
- క్రైస్తవ సంఘమా - ఘనకార్యములు చేయు - కాలము 1వచ్చును
- పరమ ధర్మంబులు - భాషలన్నిటి యందు - ప్రచురింతువని నీకు
తెలుసునా - నరుల రక్షకుడొక్క నజరేతు యేసని నచ్చ చెప్పుదు
వని తెలుసునా - నడిపింతువని నీకు తెలుసునా - నాధుని జూపిం
తువు తెలుసునా || క్రైస్తవ || - లెక్కకుమించిన - రొక్కము నీ చేత - చిక్కి యుండునని తెలుసునా
ఎక్కడికైనను ఎగిరి వెళ్ళి పనులు - చక్క బెట్టుదువని తెలుసునా -
చక్క పరతువని తెలుసునా - సఫల పరుతువని తెలుసునా || క్రైస్తవ || - యేసుని విషయాలు - ఎరుగని మానవులు - ఎచట - నుండరని
తెలుసునా - యేసులో చేరని ఎందరో యుందురు ఇదియు కూడా
నీకు తెలుసునా - ఇదియే నా దుఃఖము తెలుసునా - ఇదియే నీ దుఃఖము తెలుసునా || క్రైస్తవ || - నిన్ను ఓడించిన నిఖిల పాపములను - నీవే ఓడింతువు తెలుసునా
- అన్ని ఆటంకములు అవలీలగా దాటి - ఆవలకు చేరెదవు తెలుసునా
- అడ్డు రారెవరును తెలుసునా - హాయిగ నుందువు తెలుసునా || క్రైస్తవ || - నీ తండ్రి యాజ్ఞలన్నిటిని - పూర్తిగ నీవు నెరవేర్తువని నీకు తెలుసునా
పాతాళము నీ - బలము ఎదుట నిలువ బడనేరదని నీకు తెలుసునా -
భయపడునని నీకు తెలుసునా - పడిపోవునని నీకు తెలుసునా || క్రైస్తవ || - ఒక్కడవని నీవు ఒడలి పోవద్దు - నీ ప్రక్కననేకులు తెలుసునా
చిక్కవు నీవెవరి చేతిలో నైనను - చిక్కి పోవని నీకు తెలుసునా
నొక్కబడవని నీకు తెలుసునా - సృక్కి పోవని నీకు తెలుసునా || క్రైస్తవ || - నేటి అపజయములు - నేటి కష్టంబులు - కాటిపాలై పోవున్
తెలుసునా - బూటకపు బోధకులు - బోయి పర్వతాల - చాటున
దాగెదరు తెలుసునా - చాటింప కుందురు తెలుసునా - గోటు చేయలేరు తెలుసునా || క్రైస్తవ || - ఏ జబ్బునైనను యేసు నామము జెప్పి - ఎగుర గొట్టెదవని తెలు
సునా -
భూజనులు చావంగ - బోయి జీవము ధార - పోసి
బ్రతికించెదవు తెలుసునా - పూని బ్రతికించెదవు తెలుసునా - పున రుత్ధాన మిదియె తెలుసునా || క్రైస్తవ || - లేని వారందరికి లెక్క పంచి పెట్టి - లేమిని తీర్చెదవు తెలుసునా -
దాన బలముతోను ధన బలమును గూడ - తరుగక యుండును తెలుసునా -
దాతృత్వమిచ్చును తెలుసునా - దారిద్ర్యముండదు తెలుసునా || క్రైస్తవ || - లోక కార్యములెల్ల - నీ కార్య ధాటికి - లొక్కెయని నీకు తెలుసునా -
ఏ కార్యమైనను ఎంచి చేసిన యెడల - ఏకరీతిని జరుగు తెలుసునా
ఎంతో చక్కగా జరుగు తెలుసునా - ఎంతో వింతగ జరుగు తెలుసునా || క్రైస్తవ || - నేటి సత్కార్యములు - నేటి గెల్పులు ముందు - నాటికి పెంపొందు
తెలుసునా - లోటులున్నను క్రీస్తులోని వారలు వాటిని -
పాటింపరెప్పుడు తెలుసునా - కేటించు చుందురు తెలుసునా -
నాటింతురు జెండా తెలుసునా || క్రైస్తవ || - నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి - నెరవేర్చు నంతయు
తెలుసునా -
నీ మదికి నీ తండ్రి నియమంబు లేనిదే నెగ్గనిది రాదని తెలుసునా -
నిరుకు లేనిదిరాదు తెలుసునా - నీయాత్మలో యాత్మ తెలుసునా || క్రైస్తవ || - అన్ని దేశములలో ఉన్న వీ - దేశమున ఉన్నవను సంగతి తెలు
సునా
మన్ను, గనులు, చెట్లు, మనుజులు, జీవులు - మతములు
గలవని తెలుసునా - ఎన్నిక మతమేదో తెలుసునా - యేసుక్రీస్తు మతమే || క్రైస్తవ || - ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల - ఏలిక ఎవ్వరో తెలుసునా
మున్ను భారతదేశ మునుల ధ్యానములందే ఉన్న ప్రజాపతియే
తెలుసునా - అన్నిటికి ఆ యేసే తెలుసునా - ఎన్నో గురుతులు గలవు తెలుసునా || క్రైస్తవ || - బిడియమెందుకు నీకు - భీతిగలుగదు పరుల - పై తీర్పు తీర్చెదవు
తెలుసునా - పుడమి యంతట వ్యాప్తి - పొందెదవు నీ యెదుట
బడి నిల్వదాయుధము తెలుసునా - జడియు శత్రువు నీకు తెలుసునా
కడకు నీకే జయము తెలుసునా || క్రైస్తవ || - ఏ పాటివారైనా - నీ పైన దోషారోపణ చేయరు నీకు తెలుసునా
నీ పాపములనెల్ల - నీ తండ్రి క్షమియించె జ్ఞాపకము రావని తెలుసునా
శాపాలు గతియించె తెలుసునా - పాపము చేయవు తెలుసునా || క్రైస్తవ || - లెక్కకు మించిన - స్టీమర్లు ఓడలు - ఇక్కడికే వచ్చును తెలుసునా
- ఎక్కడ లేనట్టి హితమైన బోధలు - ఇక్కడె విందువు తెలుసునా
- ఇండియాలోనే విందువు తెలుసునా
ఇదియె ముఖ్య స్థలము తెలుసునా || క్రైస్తవ || - 2హోద్దు దేశము పైన ఉన్న ఆకాశాన - ఓడలు తిరుగును తెలుసునా
యుద్ధమేమియు లే - కుండ యెరూషలేము ఉచితంబుగా దొరికె తెలుసునా
- సద్దు చేయకుండగ దొరికె తెలుసునా
- 2హోద్దనగా ఇండియా అని తెలుసునా || క్రైస్తవ || - లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక - లిక్కడనే లేచు తెలుసునా
అక్కరమాలిన అన్ని ప్రశ్నలకును - ఇక్కడనే సొడ్డు తెలుసునా
గ్రక్కున నెమ్మది తెలుసునా - జ్ఞానమునకు వృద్ధి తెలుసునా || క్రైస్తవ || - లెక్కకుమించిన - మ్రొక్కుబడుల సరుకు - ఇక్కడకే వచ్చు తెలుసునా
- మ్రొక్కుబళ్ళ సొమ్ము - ఒక్క దేవుని సేవ- కుపయోగపడునని తెలుసునా
అక్కర తీరును తెలుసునా - లెక్క వలన మహిమ తెలుసునా || క్రైస్తవ || - ఎక్కడ నీవున్న - అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా
- చక్కని నీమాట సబుగా నున్నట్లు - సర్వ జనులందరు తెలుసునా
- ధిక్కరింప లేరు తెలుసునా - వెక్కిరింప లేరు తెలుసునా || క్రైస్తవ || - మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు - మేలైన సాయము తెలుసునా
- బ్రతికియున్న నీవు - బ్రతికిన వారితో బలముగ తిరుగుదువు తెలుసునా
- విలువ గల పని జరుగు తెలుసునా - హిందూ దేశములోనే తెలుసునా || క్రైస్తవ || - ప్రతి దేశమందున - బ్రాడ్ క్యాష్టులు వుండి - వార్తలు వినిపించు తెలుసునా
- మతిలేక దయ్యాలు - మాటిమాటికి పడును ఇదియు కూడ నీకు తెలుసునా
- పాటు పాటునకు ఏడ్చును తెలుసునా - అదియు కూడా నీకు తెలుసునా || క్రైస్తవ || - దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు - దిట్టముగ వాడును తెలుసునా
- ఏ వస్తువైనను - ఏ జీవియైనను - సేవకుపయోగంబె - తెలుసునా
- నీ వలె పనిచేయు తెలుసునా - నిశ్చయమిదియని తెలుసునా || క్రైస్తవ || - సాతాను దయ్యాలు - సంఘ కార్యములకు - సాధనముగ నుండు తెలుసునా
- సాతాను మూలాన - స్వామి యేసుక్రీస్తు భూతలమున వెలసెను తెలుసునా
- పాతకులను చేర్చెను తెలుసునా - నీతి పరులుగ మార్చె తెలుసునా || క్రైస్తవ || - సాతాను శోధించు సమయాలు అతనికి - సలుపు బాణపు పోట్లు తెలుసునా
- పాతాళమున ఖైదు - జ్వాల నరక శిక్ష పశ్చాత్తాపము రాదు తెలుసునా
- పాపులకును శిక్ష తెలుసునా - ప్రభువునకే జయము తెలుసునా || క్రైస్తవ || - సజ్జన పుత్రులు దుర్జన పుత్రులు - సభ చేయు చున్నారు చూచితివా =
- ఉజ్జీవ కూటాలు వుద్రేకముగ జేయు చున్నారెంతో వింత చూచితివా
- పజ్జకు పయనమై చూచితివా - పరిశీలన చేసి చూచితివా || క్రైస్తవ || - అందరికి కనబడి - అందరితో మాటలాడుట నీకు తెలుసునా
- విందును మీ మొరలు - విజ్ఞాపనము నెరవేరునని - మీకు తెలియదా || క్రైస్తవ || - నా తండ్రి యింట - ననేక నివాసాలు - నేను వెళ్ళుదును గియ్యో
- నేను వెళ్ళిన వెనుక - నీవుండిపోదువు
- నిత్య నరకము నీకు గియ్యో || క్రైస్తవ || - పిత్రాత్మజాత్మల - పేరొందు జయమని - పేర్మితో చాటుట తెలుసునా
- స్తోత్ర కీర్తన సం - స్తుతుల రాగము హెచ్చు - శృతిపెట్టి పాడుట తెలుసునా
- మతి పెట్టి పాడుట తెలుసునా - స్తుతికి స్తుతి చేర్చుట తెలుసునా || క్రైస్తవ ||
తెలుసునా - క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగ - కీర్తి
పొందునని తెలుసునా - కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడ గొట్టుదువు తెలుసునా || క్రైస్తవ ||
1. వచ్చెను అని కాలాంతరమున పాడుకొనుచున్నను, ఇక్కడ అయ్యగారు వ్రాసినది వచ్చును అని ఉంచడం జరిగింది. క్రైస్తవ సంఘములో ముఖ్యముగా బైబిలుమిషనుకు రాకడ సమయములో గొప్ప మిషన్/ఘనకార్యము చేయు పని ఉన్నది.
2. హెబ్రూ భాషలో పురాతన ఇండియా పేరు హోదు అని లిఖించబడినది. హోదు తూర్పు దేశాధిపతి.
Reading Help
1. vachchenu ani kaalaaMtaramuna paaDukonuchunnanu, ikkaDa ayyagaaru vraasinadi vachchunu ani uMchaDaM jarigiMdi. kraistava saMghamulO mukhyamugaa baibilumishanuku raakaDa samayamulO goppa mishan^/ghanakaaryamu chaeyu pani unnadi.
2. hebroo bhaashalO puraatana iMDiyaa paeru hOdu ani likhiMchabaDinadi. hOdu toorpu daeSaadhipati.
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
46. kraistava saMghamu
- kraistava saMghamaa - ghanakaaryamulu chaeyu - kaalamu 1vachchunu
- parama dharmaMbulu - bhaashalanniTi yaMdu - prachuriMtuvani neeku
telusunaa - narula rakshakuDokka najaraetu yaesani nachcha cheppudu
vani telusunaa - naDipiMtuvani neeku telusunaa - naadhuni joopiM
tuvu telusunaa || kraistava || - lekkakumiMchina - rokkamu nee chaeta - chikki yuMDunani telusunaa
ekkaDikainanu egiri veLLi panulu - chakka beTTuduvani telusunaa -
chakka paratuvani telusunaa - saphala parutuvani telusunaa || kraistava || - yaesuni vishayaalu - erugani maanavulu - echaTa - nuMDarani
telusunaa - yaesulO chaerani eMdarO yuMduru idiyu kooDaa
neeku telusunaa - idiyae naa du@hkhamu telusunaa - idiyae nee du@hkhamu telusunaa || kraistava || - ninnu ODiMchina nikhila paapamulanu - neevae ODiMtuvu telusunaa
- anni aaTaMkamulu avaleelagaa daaTi - aavalaku chaeredavu telusunaa
- aDDu raarevarunu telusunaa - haayiga nuMduvu telusunaa || kraistava || - nee taMDri yaaj~nalanniTini - poortiga neevu neravaertuvani neeku telusunaa
paataaLamu nee - balamu eduTa niluva baDanaeradani neeku telusunaa -
bhayapaDunani neeku telusunaa - paDipOvunani neeku telusunaa || kraistava || - okkaDavani neevu oDali pOvaddu - nee prakkananaekulu telusunaa
chikkavu neevevari chaetilO nainanu - chikki pOvani neeku telusunaa
nokkabaDavani neeku telusunaa - sRkki pOvani neeku telusunaa || kraistava || - naeTi apajayamulu - naeTi kashTaMbulu - kaaTipaalai pOvun^
telusunaa - booTakapu bOdhakulu - bOyi parvataala - chaaTuna
daagedaru telusunaa - chaaTiMpa kuMduru telusunaa - gOTu chaeyalaeru telusunaa || kraistava || - ae jabbunainanu yaesu naamamu jeppi - egura goTTedavani telu
sunaa -
bhoojanulu chaavaMga - bOyi jeevamu dhaara - pOsi
bratikiMchedavu telusunaa - pooni bratikiMchedavu telusunaa - puna rutdhaana midiye telusunaa || kraistava || - laeni vaaraMdariki lekka paMchi peTTi - laemini teerchedavu telusunaa -
daana balamutOnu dhana balamunu gooDa - tarugaka yuMDunu telusunaa -
daatRtvamichchunu telusunaa - daaridryamuMDadu telusunaa || kraistava || - lOka kaaryamulella - nee kaarya dhaaTiki - lokkeyani neeku telusunaa -
ae kaaryamainanu eMchi chaesina yeDala - aekareetini jarugu telusunaa
eMtO chakkagaa jarugu telusunaa - eMtO viMtaga jarugu telusunaa || kraistava || - naeTi satkaaryamulu - naeTi gelpulu muMdu - naaTiki peMpoMdu
telusunaa - lOTulunnanu kreestulOni vaaralu vaaTini -
paaTiMpareppuDu telusunaa - kaeTiMchu chuMduru telusunaa -
naaTiMturu jeMDaa telusunaa || kraistava || - nee manavi vinagaanae nee taMDri ookoTTi - neravaerchu naMtayu
telusunaa -
nee madiki nee taMDri niyamaMbu laenidae negganidi raadani telusunaa -
niruku laenidiraadu telusunaa - neeyaatmalO yaatma telusunaa || kraistava || - anni daeSamulalO unna vee - daeSamuna unnavanu saMgati telu
sunaa
mannu, ganulu, cheTlu, manujulu, jeevulu - matamulu
galavani telusunaa - ennika matamaedO telusunaa - yaesukreestu matamae || kraistava || - ennika janulaina iSraayaeleeyula - aelika evvarO telusunaa
munnu bhaaratadaeSa munula dhyaanamulaMdae unna prajaapatiyae
telusunaa - anniTiki aa yaesae telusunaa - ennO gurutulu galavu telusunaa || kraistava || - biDiyameMduku neeku - bheetigalugadu parula - pai teerpu teerchedavu
telusunaa - puDami yaMtaTa vyaapti - poMdedavu nee yeduTa
baDi nilvadaayudhamu telusunaa - jaDiyu Satruvu neeku telusunaa
kaDaku neekae jayamu telusunaa || kraistava || - ae paaTivaarainaa - nee paina dOshaarOpaNa chaeyaru neeku telusunaa
nee paapamulanella - nee taMDri kshamiyiMche j~naapakamu raavani telusunaa
Saapaalu gatiyiMche telusunaa - paapamu chaeyavu telusunaa || kraistava || - lekkaku miMchina - sTeemarlu ODalu - ikkaDikae vachchunu telusunaa
- ekkaDa laenaTTi hitamaina bOdhalu - ikkaDe viMduvu telusunaa
- iMDiyaalOnae viMduvu telusunaa
idiye mukhya sthalamu telusunaa || kraistava || - 2hOddu daeSamu paina unna aakaaSaana - ODalu tirugunu telusunaa
yuddhamaemiyu lae - kuMDa yerooshalaemu uchitaMbugaa dorike telusunaa
- saddu chaeyakuMDaga dorike telusunaa
- 2hOddanagaa iMDiyaa ani telusunaa || kraistava || - lekkaku miMchina vyaakhyaana patrika - likkaDanae laechu telusunaa
akkaramaalina anni praSnalakunu - ikkaDanae soDDu telusunaa
grakkuna nemmadi telusunaa - j~naanamunaku vRddhi telusunaa || kraistava || - lekkakumiMchina - mrokkubaDula saruku - ikkaDakae vachchu telusunaa
- mrokkubaLLa sommu - okka daevuni saeva- kupayOgapaDunani telusunaa
akkara teerunu telusunaa - lekka valana mahima telusunaa || kraistava || - ekkaDa neevunna - akkaDakae janamu egiri egiri vachchu telusunaa
- chakkani neemaaTa sabugaa nunnaTlu - sarva janulaMdaru telusunaa
- dhikkariMpa laeru telusunaa - vekkiriMpa laeru telusunaa || kraistava || - mRtulaina bhaktulu bratiki raagaa neeku - maelaina saayamu telusunaa
- bratikiyunna neevu - bratikina vaaritO balamuga tiruguduvu telusunaa
- viluva gala pani jarugu telusunaa - hiMdoo daeSamulOnae telusunaa || kraistava || - prati daeSamaMduna - braaD^ kyaashTulu vuMDi - vaartalu vinipiMchu telusunaa
- matilaeka dayyaalu - maaTimaaTiki paDunu idiyu kooDa neeku telusunaa
- paaTu paaTunaku aeDchunu telusunaa - adiyu kooDaa neeku telusunaa || kraistava || - daevuni sRshTilO daeninainaa prabhuvu - diTTamuga vaaDunu telusunaa
- ae vastuvainanu - ae jeeviyainanu - saevakupayOgaMbe - telusunaa
- nee vale panichaeyu telusunaa - niSchayamidiyani telusunaa || kraistava || - saataanu dayyaalu - saMgha kaaryamulaku - saadhanamuga nuMDu telusunaa
- saataanu moolaana - svaami yaesukreestu bhootalamuna velasenu telusunaa
- paatakulanu chaerchenu telusunaa - neeti paruluga maarche telusunaa || kraistava || - saataanu SOdhiMchu samayaalu ataniki - salupu baaNapu pOTlu telusunaa
- paataaLamuna khaidu - jvaala naraka Siksha paSchaattaapamu raadu telusunaa
- paapulakunu Siksha telusunaa - prabhuvunakae jayamu telusunaa || kraistava || - sajjana putrulu durjana putrulu - sabha chaeyu chunnaaru choochitivaa =
- ujjeeva kooTaalu vudraekamuga jaeyu chunnaareMtO viMta choochitivaa
- pajjaku payanamai choochitivaa - pariSeelana chaesi choochitivaa || kraistava || - aMdariki kanabaDi - aMdaritO maaTalaaDuTa neeku telusunaa
- viMdunu mee moralu - vij~naapanamu neravaerunani - meeku teliyadaa || kraistava || - naa taMDri yiMTa - nanaeka nivaasaalu - naenu veLLudunu giyyO
- naenu veLLina venuka - neevuMDipOduvu
- nitya narakamu neeku giyyO || kraistava || - pitraatmajaatmala - paeroMdu jayamani - paermitO chaaTuTa telusunaa
- stOtra keertana saM - stutula raagamu hechchu - SRtipeTTi paaDuTa telusunaa
- mati peTTi paaDuTa telusunaa - stutiki stuti chaerchuTa telusunaa || kraistava ||
telusunaa - kreestu prabhuvu nee kriyala moolaMbuga - keerti
poMdunani telusunaa - keeDu nODiMtuvu telusunaa - kiTuku viDa goTTuduvu telusunaa || kraistava ||
1. vachchenu ani kaalaaMtaramuna paaDukonuchunnanu, ikkaDa ayyagaaru vraasinadi vachchunu ani uMchaDaM jarigiMdi. kraistava saMghamulO mukhyamugaa baibilumishanuku raakaDa samayamulO goppa mishan^/ghanakaaryamu chaeyu pani unnadi.
2. hebroo bhaashalO puraatana iMDiyaa paeru hOdu ani likhiMchabaDinadi. hOdu toorpu daeSaadhipati.