93. వివాహము ఘనమైనది
రాగం: దుర్గా తాళం: ఆది
- ఆనంద వివాహంబీ ధరణిన్ - ఆహా! మహోత్త - మంబన్నిటిలో
= మానవ విశ్వాసాత్మకులారా! మానక ఘన పరచుడి పరిణయమున్ || ఆనంద ||
- నర కుల మంతటి కాది కార్యమీ - వర వివాహమె జరిగెను జగతిన్ = పరిణయము లేనిదే - నర కుల ముండదు - ధరన్ ఘనత కర్హంబిదియె కదా || ఆనంద ||
- దేవ దేవుని సంకల్పంబిది - దివ్యమైన లోకాధారం బిది = పావ నంబుగా భావించెను ప్రభు - భావము నెరిగియు - ఘనముగ నెంచుడి || ఆనంద ||
- ఆది వివాహము ఆ - ప్రభు జేసెను - ఆ సమయంబున - సర్వ జీవులును = మోదమొందె పరిశుద్ధత తోడను - ఏదేన్ వనంబున నిది ఘనమయ్యెన్ || ఆనంద ||
- న్యాయమైన వివాహములందున - నీయవనిన్ ప్రభువానందించును = ఆయభవున్ - డారంభించిన యీ - ఆచారంబు సాగుచు నున్నందున || ఆనంద ||
- దేవుడు నరుడై - కానాన్ పెండ్లిలో - దిటమగు తొలి అ - ద్భుతమును జేసెను = ఆ వరుడే భువి నన్ని వివాహముల్ - స్థిరముగ/నొనరగ చేసెను ఘనముగ నెంచుడి || ఆనంద ||
- సంఘము వధువుగ - సార్ధకమయ్యన్ - సంఘ వరుడు శ్రీ - యేసుం డయ్యెన్ = సంఘము క్రైస్తవ - సహవాసమునన్ - సంతోషమున ఘనపర్చుడీ దీనిన్ || ఆనంద ||
- నీ వివాహమున - నీ దంపతులగు - నీ...కును నీ...కున్ = దైవోద్దేశపు దీవెనలన్నియు ధరన్ - విరివిగ కలుగును గాక || ఆనంద ||
- శుభకార్యంబును చూడ జేరిన - సోదర సోదరిమణులకు మంగళ = విభవంబున నా - నందపు జీవిత - విమలపు స్థితి లభియించును గాక || ఆనంద ||
- పరిణయమును జతపర్చిన పితకున్ - స్థిరము జేసిన దేవ సుతు నకున్ = ఉరు సాయంబిడు - పరిశుద్ధాత్మకున్ - యుగముల నెప్పుడు - కలుగును స్తోత్రము || ఆనంద ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
93. vivaahamu ghanamainadi
raagaM: durgaa taaLaM: aadi
- aanaMda vivaahaMbee dharaNin^ - aahaa! mahOtta - maMbanniTilO
= maanava viSvaasaatmakulaaraa! maanaka ghana parachuDi pariNayamun^ || aanaMda ||
- nara kula maMtaTi kaadi kaaryamee - vara vivaahame jarigenu jagatin^ = pariNayamu laenidae - nara kula muMDadu - dharan^ ghanata karhaMbidiye kadaa || aanaMda ||
- daeva daevuni saMkalpaMbidi - divyamaina lOkaadhaaraM bidi = paava naMbugaa bhaaviMchenu prabhu - bhaavamu nerigiyu - ghanamuga neMchuDi || aanaMda ||
- aadi vivaahamu aa - prabhu jaesenu - aa samayaMbuna - sarva jeevulunu = mOdamoMde pariSuddhata tODanu - aedaen^ vanaMbuna nidi ghanamayyen^ || aanaMda ||
- nyaayamaina vivaahamulaMduna - neeyavanin^ prabhuvaanaMdiMchunu = aayabhavun^ - DaaraMbhiMchina yee - aachaaraMbu saaguchu nunnaMduna || aanaMda ||
- daevuDu naruDai - kaanaan^ peMDlilO - diTamagu toli a - dbhutamunu jaesenu = aa varuDae bhuvi nanni vivaahamul^ - sthiramuga/nonaraga chaesenu ghanamuga neMchuDi || aanaMda ||
- saMghamu vadhuvuga - saardhakamayyan^ - saMgha varuDu Sree - yaesuM Dayyen^ = saMghamu kraistava - sahavaasamunan^ - saMtOshamuna ghanaparchuDee deenin^ || aanaMda ||
- nee vivaahamuna - nee daMpatulagu - nee...kunu nee...kun^ = daivOddaeSapu deevenalanniyu dharan^ - viriviga kalugunu gaaka || aanaMda ||
- SubhakaaryaMbunu chooDa jaerina - sOdara sOdarimaNulaku maMgaLa = vibhavaMbuna naa - naMdapu jeevita - vimalapu sthiti labhiyiMchunu gaaka || aanaMda ||
- pariNayamunu jataparchina pitakun^ - sthiramu jaesina daeva sutu nakun^ = uru saayaMbiDu - pariSuddhaatmakun^ - yugamula neppuDu - kalugunu stOtramu || aanaMda ||