43. సువార్త (రెండు దారులు)
రాగం: మాయామాళవగౌళ తాళం: ఆది
- చేరి జీవించుడి - దేవాది దేవుని - చేరి జీవించుడి = చేరి జీవనము
చేసిన యెడల - కోరిన మోక్షము ఊరకే దొరుకును || చేరి ||
- మంచినే చేరుడి - దానినే అనుస-రించి జీవించుడి - మంచి మార్గమున ఆటంకములు - మాటిమాటికి వచ్చును గాని - కించిత్తైనను మంచిని గూర్చి - వంచన దారి యటంచు తలంపక - మంచిచెడ్డలన్ గుర్తింపగల - మనస్సాక్షిని ఇమ్మని దేవుని = యెంచి ప్రార్ధన చేయుచు స్తుతితో || చేరి ||
- పాపముల్ మానుడి - ఆ చెడ్డదారి - వైపె చూడకుడి - పాపము పాప ఫలితమై యున్న - శాపము సాతాన్ అతని సైన్యము - చూపున కెంతో రమ్యములైన - ఆపదలును ఆ పాప మార్గమున - దాపరించి యుండును కావున - దాపున జేరిన అది నరకంబను = కూపములోనికి నడుపును గాన || చేరి ||
- చేసి చూడరాదా - దైవప్రార్ధన చేసి - తరచ రాదా = యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు - యేసే మార్గము - యేసే సత్యము - యేసే జీవము యేసే దేవుడు - యేసే సర్వము యేసే పాపికి - దోషముల పరిహారకుడు ఈ - వ్యాసము నిజమో కాదో తెలియ = జేసెడి ప్రార్ధన చేయుచు దేవుని || చేరి ||
- మోకరింప రాదా - మన దేవుని యెదుట - మోకరింప రాదా = మోక రించి ప్రార్ధించి యడిగిన - మీకే మనస్సున దేవుడు తెల్పును - లేకపొయిన మీజ్ఞానాక్షి కే - కన్పర్చి సత్యము నేర్పును - మీ కంటికి సృష్టిని గానంబడు - మేళ్ళ మూలముగ స్ఫురింప జేయును - కాక పోయిన బైబిలనంబడు - గ్రంధమున పూర్తిగ జూపించును - ఏ కల లోనో దర్శనంబులోనో - కథ నచ్చన్ ప్రదర్శించును - లోకైక రక్షకుడౌ క్రీస్తు = లో సమస్తము లభించు గాన || చేరి ||
- ఆని యుండరాదా - దైవ గ్రంధంబు నాని యుండరాదా - నానాటికి పాపాలు హెచ్చయి - నరులను పాడు చేయు చున్నవి - నానావిధ రోగములు చేరి - మానవుల నవి చంపు చున్నవి - మానవు లందు సోదర ప్రేమ - లేనందున కలహాలౌ చున్నవి - వానలు క్రమము తప్పినందున - పంటలు లేక కరువౌచున్నవి - లేనిపోని మత వాదా లున్నవి - దేనిలో నిజమో తెలియకున్నది - వీనికి విరుగుడు దైవ ప్రార్ధన = గాన దేవుని సన్నిధి యందు || చేరి ||
- చేయనే చేయను - తెలిసిన తప్పిదముల్ చేయనే చేయను = చేయను ఎవ్వరు చెప్పినగాని - చేయను నైజము చెప్పిన గాని - చేసెదను తండ్రి నీ చిత్తము - చొప్పున చేసెదను తండ్రి - చేసెదను నీ చిత్తము చొప్పున = చేదుగ నున్నను చేసి తీరెదను || చేరి ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
43. suvaarta (reMDu daarulu)
raagaM: maayaamaaLavagauLa taaLaM: aadi
- chaeri jeeviMchuDi - daevaadi daevuni - chaeri jeeviMchuDi = chaeri jeevanamu
chaesina yeDala - kOrina mOkshamu oorakae dorukunu || chaeri ||
- maMchinae chaeruDi - daaninae anusa-riMchi jeeviMchuDi - maMchi maargamuna aaTaMkamulu - maaTimaaTiki vachchunu gaani - kiMchittainanu maMchini goorchi - vaMchana daari yaTaMchu talaMpaka - maMchicheDDalan^ gurtiMpagala - manassaakshini immani daevuni = yeMchi praardhana chaeyuchu stutitO || chaeri ||
- paapamul^ maanuDi - aa cheDDadaarivaipae chooDakuDi - paapamu paapa phalitamai yunna - Saapamu saataan^ atani sainyamu - choopuna keMtO ramyamulaina - aapadalunu aa paapa maargamuna - daapariMchi yuMDunu kaavuna - daapuna jaerina adi narakaMbanu = koopamulOniki naDupunu gaana || chaeri ||
- chaesi chooDaraadaa - daivapraardhanachaesi - taracha raadaa = yaesukreestu prabhuvae mOkshamunaku - yaesae maargamu - yaesae satyamu - yaesae jeevamu yaesae daevuDu - yaesae sarvamu yaesae paapiki - dOshamula parihaarakuDu ee - vyaasamu nijamO kaadO teliya = jaeseDi praardhana chaeyuchu daevuni || chaeri ||
- mOkariMpa raadaa - mana daevuni yeduTa - mOkariMpa raadaa = mOka riMchi praardhiMchi yaDigina - meekae manassuna daevuDu telpunu - laekapoyina meej~naanaakshi kae - kanparchi satyamu naerpunu - mee kaMTiki sRshTini gaanaMbaDu - maeLLa moolamuga sphuriMpa jaeyunu - kaaka pOyina baibilanaMbaDu - graMdhamuna poortiga joopiMchunu - ae kala lOnO darSanaMbulOnO - katha nachchan^ pradarSiMchunu - lOkaika rakshakuDau kreestu = lO samastamu labhiMchu gaana || chaeri ||
- aani yuMDaraadaa - daiva graMdhaMbu naani yuMDaraadaa - naanaaTiki paapaalu hechchayi - narulanu paaDu chaeyu chunnavi - naanaavidha rOgamulu chaeri - maanavula navi chaMpu chunnavi - maanavu laMdu sOdara praema - laenaMduna kalahaalau chunnavi - vaanalu kramamu tappinaMduna - paMTalu laeka karuvauchunnavi - laenipOni mata vaadaa lunnavi - daenilO nijamO teliyakunnadi - veeniki viruguDu daiva praardhana = gaana daevuni sannidhi yaMdu || chaeri ||
- chaeyanae chaeyanu - telisina tappidamul^ chaeyanae chaeyanu = chaeyanu evvaru cheppinagaani - chaeyanu naijamu cheppina gaani - chaesedanu taMDri nee chittamu - choppuna chaesedanu taMDri - chaesedanu nee chittamu choppuna = chaeduga nunnanu chaesi teeredanu || chaeri ||