63. యోబు చరిత్ర
రాగం: మోహన తాళం:చాపు
- మానవుడు శ్రమను - పొందక దైవ - మానవుడెటు కాగలడో =
కానక బడిన - వానిని దైవ మానవునిగా చేయంగ - శ్రమలు
పరమా - శ్రమము చేసె || మాన ||
- కాలకుండ నే - మేలిమి యగునే - కనకము కొలిమి యందు = కాలిన మష్టు - రాలిపోవును - కలుగును విలువగు కాంతి - ఆలాగుననే - ఈ లోకమున || మాన ||
- విజయుడు యోబును - ఋజువు చేయనై - వృజిన మూర్తికిడె సెలవు = నిజ సౌఖ్యంబు - నిలిచి పోయెను - భుజములపై శ్రమ లున్న - భక్తి పోదు - రక్తి పోదు || మాన ||
- పశువులు భాగ్యము - బిడ్డలు పోయి - నష్టము కలిగిన గాని = అసువులూడిన విసుగు పడునె - యశము గణింపడె యోబు - సణగ కెపుడు - సంతోషించుము || మాన ||
- నిందలు అవమా - నములు దూషణ - గందర గోళములున్నా = నెందును దేవుని - దూషింపక కడు - భూషించెను గదా యోబు - సందియములు - చాలించు మిక || మాన ||
- హితుల తర్కము - సతి దూషణములు - నతి కల్పన లుండినను = అతనిభక్తి - అధికంబాయె - అదియేగద నిజ భక్తి - మతిదలంచి - నుతి చేయుమిక || మాన ||
- శ్రమలుపకారం - శ్రమలే హారం - శ్రమలాత్మకు శృంగారం = శ్రమలవల్లనే - సకల స్వనీతి - సమసి పోవును గాన - శ్రమలయందే సంతోషించుము || మాన ||
- ఎన్ని శపించిన - తన జన్మమునే - తననె శపించును గాని = ఎన్నడు దేవుని - ఏమియు ననడు - ఎంతటి దొడ్డబుద్ధి - బుద్ధి - గలిగి పూజింపుమిక || మాన ||
- మహిని యేసే - మహా శ్రమ పొంది - మహిమకు వెళ్ళెనుగాదే = మహిమ కోరని - మనుజుడెవ్వడు - మర్యాదగా నెవడిచ్చు - శ్రమలులేక - స్వర్గము లేదు || మాన ||
- శ్రమల మార్గమే - విమల మార్గము - శ్రమ భక్తుని కాశ్రమము = శ్రమలే సంపూ - ర్ణంబగు దైవ - మానవునిగ జేయు గదా - శాంతి గలుగు - కాంతి వెలుగు || మాన ||
- పేద క్రైస్తవుడా - సేద దీర్చుకో - నీదే గదాయా ముక్తి = బాధలు - పొందిన ఖేదము పొందకు - వాదము లాడకు మరల - మోద మొందుము - మోక్షమొందుము || మాన ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
63. yObu charitra
raagaM: mOhana taaLaM:chaapu
- maanavuDu Sramanu - poMdaka daiva - maanavuDeTu kaagalaDO =
kaanaka baDina - vaanini daiva maanavunigaa chaeyaMga - Sramalu
paramaa - Sramamu chaese || maana ||
- kaalakuMDa nae - maelimi yagunae - kanakamu kolimi yaMdu = kaalina mashTu - raalipOvunu - kalugunu viluvagu kaaMti - aalaagunanae - ee lOkamuna || maana ||
- vijayuDu yObunu - Rjuvu chaeyanai - vRjina moortikiDe selavu = nija saukhyaMbu - nilichi pOyenu - bhujamulapai Srama lunna - bhakti pOdu - rakti pOdu || maana ||
- paSuvulu bhaagyamu - biDDalu pOyi - nashTamu kaligina gaani = asuvulooDina visugu paDune - yaSamu gaNiMpaDe yObu - saNaga kepuDu - saMtOshiMchumu || maana ||
- niMdalu avamaa - namulu dooshaNa - gaMdara gOLamulunnaa = neMdunu daevuni - dooshiMpaka kaDu - bhooshiMchenu gadaa yObu - saMdiyamulu - chaaliMchu mika || maana ||
- hitula tarkamu - sati dooshaNamulu - nati kalpana luMDinanu = atanibhakti - adhikaMbaaye - adiyaegada nija bhakti - matidalaMchi - nuti chaeyumika || maana ||
- SramalupakaaraM - Sramalae haaraM - Sramalaatmaku SRMgaaraM = Sramalavallanae - sakala svaneeti - samasi pOvunu gaana - SramalayaMdae saMtOshiMchumu || maana ||
- enni SapiMchina - tana janmamunae - tanane SapiMchunu gaani = ennaDu daevuni - aemiyu nanaDu - eMtaTi doDDabuddhi - buddhi - galigi poojiMpumika || maana ||
- mahini yaesae - mahaa Srama poMdi - mahimaku veLLenugaadae = mahima kOrani - manujuDevvaDu - maryaadagaa nevaDichchu - Sramalulaeka - svargamu laedu || maana ||
- Sramala maargamae - vimala maargamu - Srama bhaktuni kaaSramamu = Sramalae saMpoo - rNaMbagu daiva - maanavuniga jaeyu gadaa - SaaMti galugu - kaaMti velugu || maana ||
- paeda kraistavuDaa - saeda deerchukO - needae gadaayaa mukti = baadhalu - poMdina khaedamu poMdaku - vaadamu laaDaku marala - mOda moMdumu - mOkshamoMdumu || maana ||