72. క్రీస్తుని పునఃర్వాక్కులు

రాగం: సౌరాష్ట్ర తాళం: ఆట

(చాయ: మనసానందము బొందుట కన్నను)

( ఇది నాకే కాదు విశ్వాసులందరికి చెందును )

మనో విచారము కూడదు నీకు - మహిమ తలంపులె కావలెను = దిన క్రమాన శాంతి గుణంబులు - దీనులకిచ్చు చుందును || మనో ||

ఆదరణ

  1. ఆలస్యమైనంత మాత్రమున - అవి నెరవేర వనవద్దు = కాలము పరిపూర్ణంబు కాగా - ఖచ్చితముగ - అన్నియు నెరవేరును || మనో ||

  2. నిత్యానందము సత్యానందము - నీలో నే నమర్చితి = అత్యానందము అగపడు చుండును - ఆలోచించు చున్న కొలది || మనో ||

  3. కోరవు నీకు కావలసినవి - ఊరకనె నీకిచ్చెదను = ధారళముగ నిచ్చుటకు నా ధన నిధి - వస్తువు లన్నియు గలవు || మనో ||

  4. నీరస పడకుము నీరస పడకుము - నీవె నా ఆస్తి గదా = నా రక్తముతో సంపాదించితి - నన్ను నీ ఆస్తిగ గైకొనుము || మనో ||

  5. ఆనంద తైలముతో నిన్ను - అభిషేకించి యున్నాను = స్నానము ప్రభు భోజనము ప్రజలకు - జరుపుట సరియని అనుచున్నాను || మనో ||

  6. నీకు కావలసినవి అడుగుము - నేను తప్పక ఇచ్చెదను = నీకు ఇచ్చుట నాకానందము - నీవు అడుగుట ముచ్చట నాకు || మనో ||

  7. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకె అవి యుండవుగా = లేకుండగ జేసెదను అప్పుడు - లేడివలె గంతులు వేయుదువు || మనో ||

  8. నీ కవసరమైనవి కావలసిన - నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును = కాకుల కాజ్ఞ యిచ్చి ఏలి - యాకు ఆకలి తీర్చలేదా || మనో ||

  9. సైకిళ్ళు, స్టీమర్లు, బండ్లు - సంచారమునకు అవసరమా? = లోకులు కోరిన యెడల అవియు - నీకవి సుళువుగ లభియించు || మనో ||

  10. ఎండయు, చలియు, వానయు, గాలియు - ఏమియు చేయ నేరవు నిన్ను = తిండికి - బట్టకు, బసకు, శుద్దికి - తీరికకు యే కొదువయె యుండదు || మనో ||

  11. జంతువు, పశువు, పురుగు, పక్షి - జబ్బు ఏమియు చేయవు నీకు = సంతోషముతో నా సందేశము - చాటగ అదియు - చాటుచు నుండును || మనో ||

  12. నీ బలహీనత తట్టు చూడకు - నా బలము తట్టిదిగో చూడుము = నీ బలమునకు మించిన పనులు - నా బలమే గదా - చేయవలసెను || మనో ||

  13. పాపివని నీకెవడు చెప్పెను - పావనుడవై యుండగను = శాప మరణము రాదు నీకు - చావును చంపిన జేవము నేనే || మనో ||

  14. నా రూప లావణ్యములు - నీ రూప లావణ్యము లగును = నా రక్తము ప్రతి నిమిషము నీలో - ధారగ ప్రవహించును అది జీవము || మనో ||

శత్రువులు

  1. నేను నీ కొరకు నీ యొద్ద - లేనప్పుడున్నాను = నేను కలుగ జేసిన సృష్టిలో - నుండుట నా కిష్టము కాదా! || మనో ||

  2. నా దూతలు పరలోకపు శుద్ధులు - నరలోకము నందలి విశ్వాసులు - నా దరిని నిలిచి నీ కొరకు - నను ప్రార్ధింతురు ఏమి భయము || మనో ||

  3. శత్రువుల పత్రికాదులు నా - సన్నిధి లోనికి వచ్చినవి = స్తోత్రము చేయుము అపుడవి ధూళి - ధూళి క్రింద నెగుర గొట్టి వేతును || మనో ||

  4. నీ హత్య వార్తకు జడియకుము - నిన్నది యేమి చేయగలదు ? = నా హస్తము తోడైయుండగ - దేహము ఆత్మ స్థిరముగ నుండును || మనో ||

  5. శత్రు పటాలము కన్న నీ - సైనికులే యెక్కువ మంది = నేత్రాల్ తెరువ బడిన ఎలీషా - నిజ సేవకునివలె చూతువు || మనో ||

  6. ఇదివరలో యెవ్వరును నాపై - యెదురు ప్రశ్నలు వేయను లేదు = ఇదివరలో నిర్భయముగ చనువుగ - నెవరును సలహా లీయను లేదు || మనో ||

  7. నిన్నెవరైనను ఏమియు అన్నను - నేను ఊరుకొందునా = నన్నన్నట్టె భావించుకొని - నరులకు తీర్పు విధింపనా || మనో ||

  8. యెవరేమియు నిన్నన్నను నీవు - ఏమియు అనకు, బెదరకు , వినకు = అవి విని ప్రార్ధించుము క్షమించుము - అశీర్వాద మిమ్ము మనసున || మనో ||

  9. పగవారి యత్నములు చూచి - పకపక నవ్వు చుండుము = తెగ నరుకునది నీలో యున్నది - లెమ్ము వాడుము శూరుని వలెనె || మనో ||

  10. పగవారు హాని చేయుటకై - పట్టుకొందురు అయినను నీవు = ఎగిరి పోవుదువు గనుక వారు - యేమియు చేయ లేరు నిన్ను || మనో ||

సైతాను

  1. వెలుగు దూత వలె సైతాను - కలలో మాటలాడును = పలుకును చూపును బట్టి అతనిని - పారదోలుము పారిపోవును || మనో ||

  2. సాతానును మృత్యువును పాపా - శాపాదులను గెలిచితిని = నా తర్వాత వీటిని గెల్వ - నా సభకు సత్తువ నిచ్చితిని || మనో ||

  3. నీకు తెలియకుండ నిన్ను - నేలను పడ వేయును సాతాను = ఆ కార్యంబు నీ యపరాధ - మై యుండదు క్షమింతును నేను || మనో ||

  4. మరల ఆ స్థితి తట్టు నీవు - మరల రాదు మరలిన యెడల = బురదను కడిగిన జీవి మరల - బురదను పొరలిన దుస్థితి యబ్బును || మనో ||

  5. పేతురు పడెను తనకు తెలియదు - కూత వినబడె కోడి కూయగ = నా తట్టు చూచి విలపించెను - ఆ తరుణ మందె క్షమించితి || మనో ||

  6. అవిశ్వాసులతో హత్తి యుండకుము - అది నీకెంతయు అపాయము = ఇవి ఋజువులతో వివరించినను - ఎంత చెప్పినను నమ్మనె నమ్మరు || మనో ||

  7. వివిధములైన చెడుగులు మాని - వేయుచు నడుచు కొనవలెను = ఎవరైనను నను మాత్రమె ఆశ్ర - యించిన మోక్షములో చేర్చెదను || మనో ||

  8. నా మాటలు గల బైబిలు చొప్పున - నడుచుచు మాదిరి చూపుము = ఏ మానవునికైనను సరియె - యెంతయైనను బోధించుము || మనో ||

సేవ

  1. యెన్నో అద్భుతములు నీ చేత - యేసును స్వయముగ చేయింతు = సున్న చుట్టుదు వ్యతిరిక్తములకు చూచుకొనుము - నా శక్తి ప్రభావము || మనో ||

  2. నీ చేత మంచి పనులెన్నో - నేను చేయించు చున్నాను = ఈ చిత్రము నీకేమియు తెలియదు - ఇప్పుడే గంతులు వేయగలవు || మనో ||

  3. పనులు జరుగుట లేదని అనుకొన - వద్దు అనవద్దు మనమిద్దరము నందరము నా - పనిలో నుండగ ఫలమెట్లుండదు || మనో ||

  4. బహిరంగముగ ఫలితములు కన - బడకున్నవని అనవద్ధు = బహుగ అంతరంగము నందలి - ఫలములు నాకు కనబడు చున్నవి || మనో ||

  5. వాదములు కలహములు మాని - వరుసగ సత్యము వినవలెను = వాదము వలన భేదము పెరిగి - వరుసయె మొదలంటును చెడిపోవును || మనో ||

  6. ఎన్ని ప్రార్ధనలు చేసిన కొందరు - ఏమియు మారనే మారరుగా = ఖిన్నుడవై యుండకుము నీది - క్రీస్తుది నేరము కాదు కాదు || మనో ||

  7. ఎలియాజరును కార్యసిద్ధి - స్థలమునకు నడిపింప లేదా = తెలుపకుండనె - విశ్వాసులను తిన్నగ పనికి నడిపింప లేనా! || మనో ||

  8. అన్ని భాషలలో నా వార్త - అందరికి అందింతువు = ఇన్ని భాషలు ఎక్కడ నేర్చి - కొన్నారని ప్రజలందురు || మనో ||

  9. పెంతెకొస్తు పండుగనాడాత్మ - పేతురాది శిష్యులకు = వింతగ నొక్క నిమిషములోనే - విదేశ బాషలు నేర్ప లేదా || మనో ||

  10. నేను పనులు చెప్పిన వారికి - నేను సొమ్ము యిచ్చెదను = నేను చెప్పని పనులు నావి - యైనను చేసిన క్షమియించెదను || మనో ||

  11. పాపము పాప ఫలితము చెప్పి - భయ పెట్టుట మంచిదె కాని = పాపులు చెదిరి పోవుదురు నా - పంచకు రానే రారు || మనో ||

  12. పడినను పడిపోతినన వద్దు - వడిగా లెమ్ము రమ్ము రమ్ము = పడినా నన్న సైతానునకు - వశము చాడీ చెప్పును నాకు || మనో ||

  13. ముమ్మరముగ బోధించిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు = ముమ్మరముగ మేల్ చేసిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు || మనో ||

  14. నేను నీలో నీవు నాలో - లీనమైనట్టె యనుకొనుము = గాన నీకు లేని దేది - పోనిదేది రానిదేది || మనో ||

  15. సమస్త దేశములలో జీవ - సౌకర్యము కలుగును నీకు = అమాంతముగా దేశస్థులు నిన్ను - అన్ని చోట్ల కెత్తుకొని పోదురు || మనో ||

  16. అక్షయ దేహము దాల్చితి వీవు - ఆనంద పడవేల = శిక్షలు రక్షణ సౌధములని - శీఘ్రముగ గ్రహియింప వేల? || మనో ||

  17. అడిగిన వివిగో అని అన్నాను - అందు కొనక ఊరకనే యుంటివి = గడిచెను యిట్లు యెన్నో దినములు - కష్టములు తీర లేదు అయినను || మనో ||

  18. నీ వస్తువులను యెక్కడికైన - దేవ దూతలు కొనిపో గలరు = నీవు కోరిన వీలును బట్టి - నిన్ను కూడను కొనిపోగలరు || మనో ||

  19. ఎల్లవారిని రక్షించుటకు - ఎన్నో తిప్పలు పడు చున్నాను = అల్లరిగా మాట్లాడు కొందురు - అన్యులు ఈ సంగతి గ్రహింపక || మనో ||

  20. సంసోను బలము నీకిచ్చెద - సంతోషించుము సంతోషించుము = హింసలన్నియు ప్రోగు చేయుము ధ్వంసము చేయుము - ధ్వంసము చేయుము || మనో ||

  21. ఘనతయు కీర్తియు గలుగును నీకు - గానము చేయుము గానము చేయుము = వినయమును భూషణముగ దాల్చి - ఘనపర్చుము నా నామమంతట || మనో ||

  22. నిన్నాయాస పెట్టెడి వార్త - విన్నా బెదరకున్నా శాంతి = నన్నా సమయ మందున నీ - కన్ను చూచుచున్న విశ్రాంతి || మనో ||

  23. నా బోధలు కొందరికి కొన్ని - నచ్చ జెప్పిన ముగియునా = మీ భూగోళ మంతటికి అవి - మిగుల త్వరగా పంపలేవా! || మనో ||

  24. నేను నీ పాపములు క్షమింతును - గాని నరులు క్షమింతురా = గాన నీ తల వారి చేతుల - లోనికి వెళ్ళనీయ రాదు || మనో ||

  25. నీ పాపముల తట్టు చూడను - నీలో నున్న ఆశను జూతును = పాప క్షమాపణ కొరకై వేడుము - నా పరిశుద్ధత వైపే - చూడుము || మనో ||

  26. ఆకాశము భూమియును పోయిన - నాకు పోయిన దేమియు లేదు = నాకు నీ వొక్కడవే యున్న - నాకు సమస్తమున్నట్టే || మనో ||

  27. నా యవతారమునకు మొందే - నీ అపరాధములు మోసితిని = నీ యతిక్రమాలు గెల్చితిని - నీకు బదులైనాను గనుక || మనో ||

  28. రక్షణ పత్రికలెన్నో కోట్లు - రాజ్యములన్నిట చల్లవలెన్ = శిక్ష ప్రజలకు తొలగింపుము నీ - సిద్ధాంత బోధనల వలన || మనో ||

  29. అర్థము కాని విషయములకు నీ - వాందోళన పడకు చింతింపకు = అర్థమైన సంగతులను బట్టి - ఆనందించుము అనుసరించుము || మనో ||

  30. నేను పరిహారంబు చేయ - లేని కీడు లేనే లేదు = నేను భువిలో దివిలో చేయ లేని మేలు లేనే లేదు || మనో ||

  31. ప్రవచన రూపమందు పూర్వమె - ఇవి అన్నియును గెలిచితిని = భువికి వచ్చి బాహాటముగా ఇవి - యన్నియును గెలిచితిని || మనో ||

  32. గురువులలో భేదము గలదు అది - సరి యగును సరి కాకుండు = గురువుల కన్న గురుతులే గొప్ప - గురువులె యనుచున్నాను || మనో ||

  33. నన్ను నమ్మి విద్య - నేర్చుకొన్న యెడల పండితులే = అన్నిటిలో నీ అపజయమే జయ - మగును జయమును జయమగును || మనో ||

  34. నమ్మని మృతుల సంగతి ఎందుకు - నా వశమందున్నారు వారు = ఇమ్మహినున్న వారికి చెప్పుము - నమ్మినను నమ్మక పోయినను || మనో ||

  35. నిన్ను రక్షించిన నేను నీ స్వ - జనులను కూడ రక్షింతు = కనిపెట్టి చూడుము నీ కందరి - ననుగ్రహింతు నద్భుత రీతి || మనో ||

  36. నా నావకు అందరు చేరు వరకు - నీ వేల నిలువ వలసినది = ఆవల ఆవలె నీవు వచ్చి - ఆ వారిని అర్పించుము నాకు || మనో ||

  37. అందరకుపదేశించిన రక్షణ - అందింతు వది నీకు జయము = అందుకొనక తృణీకరింతు - రది వారలకు అపజయము || మనో ||

  38. నా యందతిశయించు మపుడు - నాకు మహిమ నీకు మేలు = నీ యందతిశయించిన యెడల - నీకు కీడు నా కవమానము || మనో ||

  39. సమస్త దేశములందు నీకు - సదుపాయము లెన్నో యుండున్ = నమాధానము దానికి తోడుగ - సాగిపోవుచునే యుండును || మనో ||

  40. లక్షలాది వెదచల్లి చల్లి - భిక్షకులను పోషించెదవు = రక్షణ మార్గము చూపుము వారికి - శిక్ష మార్గము తప్పించెదవు || మనో ||

  41. పాపములున్న మనో విచారము - పనికి వచ్చును పనికి వచ్చును = పాపక్షమాపణ పొందిన వెనుక - పనికి రాదు పనికి రాదు || మనో ||

  42. నీ మనవి విన నందులకు - నా మీద కోపము పడవద్దు = నీ మేలునకే అట్లు చేసితిని - నా మీద నీకుండుటకు || మనో ||

  43. మనో నిధానము కలిగి యుండిన - మనవులు సిద్ధముగా సిద్ధించు = మనో విచారము వలన మనవులు - మంటను కలిసి నశియించు || మనో ||

  44. అనుకొనుట విశ్వాసమైన - అగుపడదా నీ కంటికి = అనుకొన్నట్టి ఎలియాజరునకు - అగుపడలేదా కన్నియ రిబక్కా || మనో ||

  45. (B) అనుకొనని యాకోబునకు లే - యా జతగా ఏర్పడలేదా = అనుకొనని ధన్యత నే నెరుగుదు - అది నీకు సమకూడి రాదా || మనో ||

  46. విచారమునకు సబబుగా నుండు - వేర్వేరు కారణములు గలవు = విచారణ చేయుచు నను చూచి - విదిల్చి వేసి సంతోషించుము || మనో ||

  47. షారోను పురము విశ్వాసుల - కారోహణ స్థలమగును తగును = చేరవలసిన వారు నేడే - చేరిన యెడల క్షేమంబు || మనో ||

  48. బోధలు పూర్తిగ వినగోరిన సం - బోధన లేకుండగనే రండి = శోధనలు కష్టములు ఉన్నను - శోధించి చూచుటకు రండి || మనో ||

  49. నేను దేవుడనని నను గూర్చి - నిజము చెప్పినవి భూతములు = గాన నీ సాక్ష్యములు నంత - కన్న ఎక్కువ కావలెను గదా || మనో ||

  50. పక్షులు నన్ను ప్రార్ధించునని - బైబిలు గ్రంథము నందు గలదు = వృక్షములు నను స్తోత్రించునను - వృత్తాంతమును అందును గలదు || మనో ||

  51. గొప్ప కష్ట సుఖములు చెప్పు - కొని కోర్కె ప్రార్ధన చేయుదువా = అప్పుడు చిన్నవి కూడ చెప్పిన అవి మాత్రము విననా యేమి? || మనో ||

  52. నీ శరీరము నలిగి పోయిన - నా శరీరము కలదు నీకు = నీ శబ్దము నను రమ్మనకున్న - నీ యొద్దకు నేనే - వచ్చెదను || మనో ||

  53. నా మూలమున హింస గలిగిన - ఆమోదించుము ఆనందించుము = క్షేమము కలుగును పరలోకమున - చిరకాల బహుమానము దొరకును || మనో ||

  54. నాడు నేడు రేపు ఇంకను - కీడును గెల్చు శూరుడను = వేడుకొని నమ్మిన యెడల యే - విన్నపమైనను ఆలకింతును || మనో ||

  55. సాతానుపై కట్టు కట్టిన - అతనిని బంధించి యుందు = భూతల వాసు లనేకు లాతని - బోధకు లొంగి పోయిరయ్యా || మనో ||

  56. (B) సాతానుపై కట్టుకట్టి - సర్వజనులు నను వేడిన యెడల = పాతాళమున మట్టు వుండని గోతిలో అతని ఇప్పుడే వేసెద || మనో ||

  57. నరులకు ఇంత ధన్యత తెచ్చిన - నన్ను నమ్మరు ఈ నరులు = దురిత మరణము నరకము - తెచ్చిన దూతను నమ్ముదు రీ నరులు || మనో ||

  58. స్వస్థి శాలలు స్థాపన చేసిన - పాపులకు రోగులకు మేలు = వస్తున్న చందా సొమ్ము నా - పనులకు వాడుము ఆర్జింపకుము || మనో ||

  59. నరులకు సాధ్యము కానివి గలవు - నాకవి సాధ్యములగును గదా! = పరులును నీ మది పలుకు పలుకులు - పాటింపక నిర్భయముగ నుండుము || మనో ||

  60. సోదెకత్తెయు యొక రోగిని నా పాదము నొద్దకు పంపె గదా = నీ దరి నున్న వారినెల్ల నాదరికి పంపింప లేవా || మనో ||

  61. ఎక్కువ అద్భుతకరముగ నున్న - తక్కువయై పోవును విశ్వాసము = ఇక్కడ యిప్పుడు జరుగని వెందుకు - ఎవరికి గావలె ననవద్దు || మనో ||

  62. పేతురు నీడకె రోగులు బాగై - వేసిరి గంతులు సంతోషముతో = నా తలంపుతోనే రోగులు నయమై - గంతులు వేయరా? || మనో ||

  63. అక్షయ దేహము దాల్చితివిక్కడ - ఆనంద పడుట మానకు మీ = అక్షయ స్తుతి దీపమును శోధన - ఆర్పనీయ వద్దు వద్దు || మనో ||

  64. నా సింహాసన స్తుతిని నీవు -తీసికొనుట మంచిది కాదు = నీ సంగతులు స్తుతిగా కూర్చి - నీ తండ్రిని స్తుతించు చుండుము || మనో ||

  65. యావత్తు సృష్టి స్తుతించు - నని ప్రకటన పుస్తకమున నున్నది = ఈ విధ స్తుతి మూలముగా మాకు యెల్ల కాలము జయమే ఉండును || మనో ||

  66. నీవు నన్ను ఎట్లు తలంతువో - నేను అట్లే కనబడుదున్ - భావ శుద్ధి చేసికొనగా - ప్రత్యక్ష మగుదును స్పష్టముగ || మనో ||

  67. నను తలంచిన విధముగ నేను - కనబడి మాటలాడెదను = నను తలంపని వారికి కూడ - కనబడి మాటలాడెదను || మనో ||

  68. సిద్ధపరచితిని ఎన్నో నీకవి - సినిమాగా చూపించెదను = వద్దనక వందింతువు గనుక - వందింతును నిన్ను నేనే || మనో ||

  69. ఎన్ని ప్రార్ధనలు చేసిన నా - యెదుట ఊరకె కనిపెట్టనిచో = ఎన్నడును సత్యము సంతుష్టి - ఎరుగవు కనిపెట్టుము కనిపెట్టుము || మనో ||

  70. మోషే వేయించిన గుడార - మును పోలినది వేసెదవా = మోషేతో మాట్లాడిన విధముగ - మోదముతో నీతో - మాట్లాడెద || మనో ||

  71. నేను సృజించిన కొండలతోను - ప్రాణులతో వృక్షాదులతో = మానక మాటలాడుచు వాటి - మనవులు ఆలకింతును || మనో ||

రాకడ - సిద్ధపడుట

  1. వార్తా పత్రికలందు రాకడ - గుర్తులు తెలిసికొన గలవు = గుర్తులు తెలిసిన యెడల భక్తుల - కూడికలో సిద్ధపడగలవు || మనో ||

  2. నేటి గురుతులు రెండవ రాకడ - నిజముగ వచ్చునని యనుచున్నవి = నాటి చరిత్ర కూడ నిజమని - నేటి గురుతులే ఋజువై యున్నవి || మనో ||

  3. సిద్దపడు వారికి తోడ్పడుటకు - సిద్ధముగానే యున్నాను = సిద్ధ పడుదుమని గడిపిన ఇకను - సిద్ధము సిద్ధమె యను చున్నాను || మనో ||

  4. నన్ను సిద్దము చేయు మనుచు - నరుడు అడిగిన తోడ్పడనా? = నన్ను నా వాక్యమును సభను - మన్నన చేసిన కొనిపోనా || మనో ||

  5. మనసున నెమ్మది గాంచిన యెడల - మహిమ శరీరము దాల్చెదవు = అనుమానములను అణచి వేయుచు - ఆయత్తము చేసెదను నిన్ను || మనో ||

  6. నేను వచ్చు వరకు ఇచ్చట - నిలకడ కలిగి నిలిచి యుండుము = నేను వచ్చి రెప్పపాటు - లోనే నిన్ను కొనిపొయెదను || మనో ||

  7. నా రాకడకు ఎదురు చూడుము - నీ రాకడకు ఎదురు చూతును నా రాకడయు నీ రాకడయు - నా రాకడలో ఒకటే యగును || మనో ||

  8. సభను ప్రాణముతో కొనిపోవు - సమయము శీగ్రముగా వచ్చు = శుభ వచన మిదియె నా సభకని - సుళువుగ భోదింపగ వచ్చు || మనో ||

  9. వచ్చితినని నమ్మిన వారలు ఇక - వచ్చెదనని నమ్మరు ఏలా? = వచ్చి అనేకులకు నేడు కన - బడు చున్నది నమ్మరు ఏల? || మనో ||

  10. తీరా వచ్చిన రెప్పపాటున - చేరగలరా మేఘములో = ధారుణిపై శేషించిన వారికి - కలుగు శ్రమలు సహించుదురా ? || మనో ||

  11. ఏలియా, యెహెజ్కేలు పిలిప్పు - ఎగిరి ప్రయాణము చేసిన రీతి = గాలిలో ఆత్మ నిన్నుగూడ - గ్రక్కున కొనిపొవుట కష్టంబా || మనో ||

పరలోకము

  1. సిలువయె నీకిక్కడ గద్దె నా - సిలువయె దానిపై నుండు = సిలువలు రెండు నిన్ను పై గద్దెకు - సిద్దము చేయును యుద్ధ సమాప్తి || మనో ||

  2. ఇదివరకె పరలోకపు గద్దె - ఇచ్చి వేసి యున్నాను నీకు = అది క్రియగా కనబడు పర్యంతము - ఆత్మ కంటితో చూచుచు నుండుము || మనో ||

  3. నీవు నన్ను ఒప్పుకొని యు - న్నావని తండ్రికి చెప్పుదును = దేవదూతలు విని స్తుతి చేయగ - దివియంతయును - మ్రోగి పోవును || మనో ||

  4. దేవ లోకమున, దూత లోకమున - దివి లోకమున నేనే యుందును = నా వలన రక్షణ పొందిన నరులు - దూతల వలెనె యుందురు || మనో ||

  5. పరలోకమున తక్కువ చోటని - పరితాపము పొందుదురు కొందరు = సరియగు స్థితియని కంటి నీటిని - సరిగానే తుడిచి వేసెదను || మనో ||

  6. ప్రతిసేవకుని పనులెల్ల కన - పడకున్నవని అనవద్దు = మతికెప్పుడు తోచని గొప్ప బహు - మతులను అక్కడ అందింతు || మనో ||

  7. ఏమి చూచి నీ వసహ్యిచితివో - వానిని అక్కడ చూడవుగా = వేనిని కోరితివో అవియు వే - రైనవి, క్రొత్తవి అక్కడ చూతువు || మనో ||

రాకడ తర్వాత జరుగునవి

  1. సజీవ సంఘారోహణ మప్పుడు - జరుగును విందు ఏడేండ్లు = ప్రజేతర సంఘము బహుశ్రమల - పాలైపోవును ఎంతో దు:ఖము || మనో ||

  2. బిలమందలి సాతానును నేను - విడుదల చేసెద నప్పుడతడు = ఇలపై నాతో యుద్ధము చేసి - గెలువలేక నరకము పాలగును || మనో ||

  3. ఇప్పుడు కాదు నా శుభవార్త - ఇలయంతట ప్రకటన యగును = అప్పుడు వెయ్యియేండ్ల కాల - మందు వెంటనే అంతము వచ్చును || మనో ||

  4. సేవ ముగింపక ముందే మొక్షము - చేర వలసెనన వద్దు = భావిని ఎక్కువ కాలము ఎక్కువ - సేవ చేసెదవు ఇది నా పద్దు || మనో ||

  5. భూగోళ మంతట నా - బోధయు ఆరాధనయు నగును = నా గుళ్ళు పరలోకపు మహిమ - తో గనగన మని వెలుగు చుండును || మనో ||

  6. నరకమున బడు వారిని జూచి - పరిశుద్ధాత్మ విలపించున్ - నరుల ఆదరణయగు తండ్రిన్ - నరులెట్లాదరింప గలరు || మనో ||

  7. నరులు నా కృప కాలమంతయు - పరిత్యజించి వేసినారు = ఎరి గియు శిక్షకు లోనైనందున - ఎల్లకాలము నాకే జయము || మనో ||

  8. భూమిపై సైతానును అతని - పురుగే లేకుండగ చేసెదను = నా మనుష్యులే ఉందురు వారి - నడుమ నివాసము చేసెదను || మనో ||

బైబిలుమిషను

  1. భూ లోకమంతటికి సువార్త - పోవుట కిండియా ప్రధానము = పై లోకంబు నుండి వచ్చిన - బైబిలు మిషను ను ఎత్తి చూపుము || మనో ||

  2. నేను చెప్పగ బైబిలు మిషను - లోనికి వచ్చిన క్షేమములు = జ్ఞానము మనస్సాక్షియును చెప్పిన - నేనేమియు ఆటంకము చేయను || మనో ||

  3. నేను రమ్మనగ వచ్చి ఏ - వాని కడకు పోరాదు = నా నియమిత కార్యములు మాత్రమె - నడుపుము మాను కొన రాదు || మనో ||

  4. బైబిలు మిషనును నేను బైలు - పరచిన సంగతి నమ్మని వారు = ప్రాబల్య బోధలు విని నన్ను - ప్రార్ధన జేసి కనుగొన రాదా || మనో ||

  5. క్రొత్త విషయములు లేనిదె ఈ - క్రొత్త మిషను ఎందుకు రావలెను = క్రొత్తవి రాగా అన్ని మిషనులు - గొప్పగ పెరిగి మేఘంబెక్కును || మనో ||

  6. అందరికి కనబడి మాట్లాడుదు - ననుటయె ఈ మిషను విశ్వాసము = కొందరి బోధలు వేరుగ నుండును - అందుకె మాటలాడను నేను || మనో ||

  7. నీ జన్మ దినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టియుంటి = ఈ జగతికి నీవు రాగానే - ఎంతో ఆనందించి యుంటి || మనో ||

  8. ఈ కీర్తన నాకే నాకే యని - ఎవరన గలరో వారికే చెల్లును = ఈ కాలమునకు తగినవి చెప్పితి - యెరిగి సహించు కొనదగును || మనో ||

  9. జనక సుతాత్మలను త్రైకునికి - సంస్తుతులు అని అనుకొనుము = అను దినము నీ యాత్మీయ జీ - వనము వృద్ధి యగును నమ్ముము || మనో ||



72. kreestuni puna@hrvaakkulu

( idi naakaekaadu viSvaasulaMdariki cheMdunu )


manO vichaaramu kooDadu neeku - mahima talaMpule kaavalenu = dina kramaana SaaMti guNaMbulu - deenulakichchu chuMdunu || manO ||

aadaraNa

  1. aalasyamainaMta maatramuna - avi neravaera vanavaddu = kaalamu paripoorNaMbu kaagaa - khachchitamuga - anniyu neravaerunu || manO ||

  2. nityaanaMdamu satyaanaMdamu - neelO nae namarchiti = atyaanaMdamu agapaDu chuMDunu - aalOchiMchu chunna koladi || manO ||

  3. kOravu neeku kaavalasinavi - oorakane neekichchedanu = dhaaraLamuga nichchuTaku naa dhana nidhi - vastuvu lanniyu galavu || manO ||

  4. neerasa paDakumu neerasa paDakumu - neeve naa aasti gadaa = naa raktamutO saMpaadiMchiti - nannu nee aastiga gaikonumu || manO ||

  5. aanaMda tailamutO ninnu - abhishaekiMchi yunnaanu = snaanamu prabhu bhOjanamu prajalaku - jarupuTa sariyani anuchunnaanu || manO ||

  6. neeku kaavalasinavi aDugumu - naenu tappaka ichchedanu = neeku ichchuTa naakaanaMdamu - neevu aDuguTa muchchaTa naaku || manO ||

  7. nee kashTamulu nee kOrikalu naakeruke avi yuMDavugaa = laekuMDaga jaesedanu appuDu - laeDivale gaMtulu vaeyuduvu || manO ||

  8. nee kavasaramainavi kaavalasina - nikhila vastuvula kaaj~naapiMtunu = kaakula kaaj~na yichchi aeli - yaaku aakali teerchalaedaa || manO ||

  9. saikiLLu, sTeemarlu, baMDlu - saMchaaramunaku avasaramaa? = lOkulu kOrina yeDala aviyu - neekavi suLuvuga labhiyiMchu || manO ||

  10. eMDayu, chaliyu, vaanayu, gaaliyu - aemiyu chaeya naeravu ninnu = tiMDiki - baTTaku, basaku, Suddiki - teerikaku yae koduvaye yuMDadu || manO ||

  11. jaMtuvu, paSuvu, purugu, pakshi - jabbu aemiyu chaeyavu neeku = saMtOshamutO naa saMdaeSamu - chaaTaga adiyu - chaaTuchu nuMDunu || manO ||

  12. nee balaheenata taTTu chooDaku - naa balamu taTTidigO chooDumu = nee balamunaku miMchina panulu - naa balamae gadaa - chaeyavalasenu || manO ||

  13. paapivani neekevaDu cheppenu - paavanuDavai yuMDaganu = Saapa maraNamu raadu neeku - chaavunu chaMpina jaevamu naenae || manO ||

  14. naa roopa laavaNyamulu - nee roopa laavaNyamu lagunu = naa raktamu prati nimishamu neelO - dhaaraga pravahiMchunu adi jeevamu || manO ||

Satruvulu

  1. naenu nee koraku nee yodda - laenappuDunnaanu = naenu kaluga jaesina sRshTilO - nuMDuTa naa kishTamu kaadaa! || manO ||

  2. naa dootalu paralOkapu Suddhulu - naralOkamu naMdali viSvaasulu - naa darini nilichi nee koraku - nanu praardhiMturu aemi bhayamu || manO ||

  3. Satruvula patrikaadulu naa - sannidhi lOniki vachchinavi = stOtramu chaeyumu apuDavi dhooLi - dhooLi kriMda negura goTTi vaetunu || manO ||

  4. nee hatya vaartaku jaDiyakumu - ninnadi yaemi chaeyagaladu ? = naa hastamu tODaiyuMDaga - daehamu aatma sthiramuga nuMDunu || manO ||

  5. Satru paTaalamu kanna nee - sainikulae yekkuva maMdi = naetraal^ teruva baDina eleeshaa - nija saevakunivale chootuvu || manO ||

  6. idivaralO yevvarunu naapai - yeduru praSnalu vaeyanu laedu = idivaralO nirbhayamuga chanuvuga - nevarunu salahaa leeyanu laedu || manO ||

  7. ninnevarainanu aemiyu annanu - naenu oorukoMdunaa = nannannaTTe bhaaviMchukoni - narulaku teerpu vidhiMpanaa || manO ||

  8. yevaraemiyu ninnannanu neevu - aemiyu anaku, bedaraku , vinaku = avi vini praardhiMchumu kshamiMchumu - aSeervaada mimmu manasuna || manO ||

  9. pagavaari yatnamulu choochi - pakapaka navvu chuMDumu = tega narukunadi neelO yunnadi - lemmu vaaDumu Sooruni valene || manO ||

  10. pagavaaru haani chaeyuTakai - paTTukoMduru ayinanu neevu = egiri pOvuduvu ganuka vaaru - yaemiyu chaeya laeru ninnu || manO ||

saitaanu

  1. velugu doota vale saitaanu - kalalO maaTalaaDunu = palukunu choopunu baTTi atanini - paaradOlumu paaripOvunu || manO ||

  2. saataanunu mRtyuvunu paapaa - Saapaadulanu gelichitini = naa tarvaata veeTini gelva - naa sabhaku sattuva nichchitini || manO ||

  3. neeku teliyakuMDa ninnu - naelanu paDa vaeyunu saataanu = aa kaaryaMbu nee yaparaadha - mai yuMDadu kshamiMtunu naenu || manO ||

  4. marala aa sthiti taTTu neevu - marala raadu maralina yeDala = buradanu kaDigina jeevi marala - buradanu poralina dusthiti yabbunu || manO ||

  5. paeturu paDenu tanaku teliyadu - koota vinabaDe kODi kooyaga = naa taTTu choochi vilapiMchenu - aa taruNa maMde kshamiMchiti || manO ||

  6. aviSvaasulatO hatti yuMDakumu - adi neekeMtayu apaayamu = ivi RjuvulatO vivariMchinanu - eMta cheppinanu nammane nammaru || manO ||

  7. vividhamulaina cheDugulu maani - vaeyuchu naDuchu konavalenu = evarainanu nanu maatrame aaSra - yiMchina mOkshamulO chaerchedanu || manO ||

  8. naa maaTalu gala baibilu choppuna - naDuchuchu maadiri choopumu = ae maanavunikainanu sariye - yeMtayainanu bOdhiMchumu || manO ||

saeva

  1. yennO adbhutamulu nee chaeta - yaesunu svayamuga chaeyiMtu = sunna chuTTudu vyatiriktamulaku choochukonumu - naa Sakti prabhaavamu || manO ||

  2. nee chaeta maMchi panulennO - naenu chaeyiMchu chunnaanu = ee chitramu neekaemiyu teliyadu - ippuDae gaMtulu vaeyagalavu || manO ||

  3. panulu jaruguTa laedani anukona - vaddu anavaddu manamiddaramu naMdaramu naa - panilO nuMDaga phalameTluMDadu || manO ||

  4. bahiraMgamuga phalitamulu kana - baDakunnavani anavaddhu = bahuga aMtaraMgamu naMdali - phalamulu naaku kanabaDu chunnavi || manO ||

  5. vaadamulu kalahamulu maani - varusaga satyamu vinavalenu = vaadamu valana bhaedamu perigi - varusaye modalaMTunu cheDipOvunu || manO ||

  6. enni praardhanalu chaesina koMdaru - aemiyu maaranae maararugaa = khinnuDavai yuMDakumu needi - kreestudi naeramu kaadu kaadu || manO ||

  7. eliyaajarunu kaaryasiddhi - sthalamunaku naDipiMpa laedaa = telupakuMDane - viSvaasulanu tinnaga paniki naDipiMpa laenaa! || manO ||

  8. anni bhaashalalO naa vaarta - aMdariki aMdiMtuvu = inni bhaashalu ekkaDa naerchi - konnaarani prajalaMduru || manO ||

  9. peMtekostu paMDuganaaDaatma - paeturaadi Sishyulaku = viMtaga nokka nimishamulOnae - vidaeSa baashalu naerpa laedaa || manO ||

  10. naenu panulu cheppina vaariki - naenu sommu yichchedanu = naenu cheppani panulu naavi - yainanu chaesina kshamiyiMchedanu || manO ||

  11. paapamu paapa phalitamu cheppi - bhaya peTTuTa maMchide kaani = paapulu chediri pOvuduru naa - paMchaku raanae raaru || manO ||

  12. paDinanu paDipOtinana vaddu - vaDigaa lemmu rammu rammu = paDinaa nanna saitaanunaku - vaSamu chaaDee cheppunu naaku || manO ||

  13. mummaramuga bOdhiMchina balavaM - tammuga prajalanu taegalavu = mummaramuga mael^ chaesina balavaM - tammuga prajalanu taegalavu || manO ||

  14. naenu neelO neevu naalO - leenamainaTTe yanukonumu = gaana neeku laeni daedi - pOnidaedi raanidaedi || manO ||

  15. samasta daeSamulalO jeeva - saukaryamu kalugunu neeku = amaaMtamugaa daeSasthulu ninnu - anni chOTla kettukoni pOduru || manO ||

  16. akshaya daehamu daalchiti veevu - aanaMda paDavaela = Sikshalu rakshaNa saudhamulani - Seeghramuga grahiyiMpa vaela? || manO ||

  17. aDigina vivigO ani annaanu - aMdu konaka oorakanae yuMTivi = gaDichenu yiTlu yennO dinamulu - kashTamulu teera laedu ayinanu || manO ||

  18. nee vastuvulanu yekkaDikaina - daeva dootalu konipO galaru = neevu kOrina veelunu baTTi - ninnu kooDanu konipOgalaru || manO ||

  19. ellavaarini rakshiMchuTaku - ennO tippalu paDu chunnaanu = allarigaa maaTlaaDu koMduru - anyulu ee saMgati grahiMpaka || manO ||

  20. saMsOnu balamu neekichcheda - saMtOshiMchumu saMtOshiMchumu = hiMsalanniyu prOgu chaeyumu dhvaMsamu chaeyumu - dhvaMsamu chaeyumu || manO ||

  21. ghanatayu keertiyu galugunu neeku - gaanamu chaeyumu gaanamu chaeyumu = vinayamunu bhooshaNamuga daalchi - ghanaparchumu naa naamamaMtaTa || manO ||

  22. ninnaayaasa peTTeDi vaarta - vinnaa bedarakunnaa SaaMti = nannaa samaya maMduna nee - kannu choochuchunna viSraaMti || manO ||

  23. naa bOdhalu koMdariki konni - nachcha jeppina mugiyunaa = mee bhoogOLa maMtaTiki avi - migula tvaragaa paMpalaevaa! || manO ||

  24. naenu nee paapamulu kshamiMtunu - gaani narulu kshamiMturaa = gaana nee tala vaari chaetula - lOniki veLLaneeya raadu || manO ||

  25. nee paapamula taTTu chooDanu - neelO nunna aaSanu jootunu = paapa kshamaapaNa korakai vaeDumu - naa pariSuddhata vaipae - chooDumu || manO ||

  26. aakaaSamu bhoomiyunu pOyina - naaku pOyina daemiyu laedu = naaku nee vokkaDavae yunna - naaku samastamunnaTTae || manO ||

  27. naa yavataaramunaku moMdae - nee aparaadhamulu mOsitini = nee yatikramaalu gelchitini - neeku badulainaanu ganuka || manO ||

  28. rakshaNa patrikalennO kOTlu - raajyamulanniTa challavalen^ = Siksha prajalaku tolagiMpumu nee - siddhaaMta bOdhanala valana || manO ||

  29. arthamu kaani vishayamulaku nee - vaaMdOLana paDaku chiMtiMpaku = arthamaina saMgatulanu baTTi - aanaMdiMchumu anusariMchumu || manO ||

  30. naenu parihaaraMbu chaeya - laeni keeDu laenae laedu = naenu bhuvilO divilO chaeya laeni maelu laenae laedu || manO ||

  31. pravachana roopamaMdu poorvame - ivi anniyunu gelichitini = bhuviki vachchi baahaaTamugaa ivi - yanniyunu gelichitini || manO ||

  32. guruvulalO bhaedamu galadu adi - sari yagunu sari kaakuMDu = guruvula kanna gurutulae goppa - guruvule yanuchunnaanu || manO ||

  33. nannu nammi vidya - naerchukonna yeDala paMDitulae = anniTilO nee apajayamae jaya - magunu jayamunu jayamagunu || manO ||

  34. nammani mRtula saMgati eMduku - naa vaSamaMdunnaaru vaaru = immahinunna vaariki cheppumu - namminanu nammaka pOyinanu || manO ||

  35. ninnu rakshiMchina naenu nee sva - janulanu kooDa rakshiMtu = kanipeTTi chooDumu nee kaMdari - nanugrahiMtu nadbhuta reeti || manO ||

  36. naa naavaku aMdaru chaeru varaku - nee vaela niluva valasinadi = aavala aavale neevu vachchi - aa vaarini arpiMchumu naaku || manO ||

  37. aMdarakupadaeSiMchina rakshaNa - aMdiMtu vadi neeku jayamu = aMdukonaka tRNeekariMtu - radi vaaralaku apajayamu || manO ||

  38. naa yaMdatiSayiMchu mapuDu - naaku mahima neeku maelu = nee yaMdatiSayiMchina yeDala - neeku keeDu naa kavamaanamu || manO ||

  39. samasta daeSamulaMdu neeku - sadupaayamu lennO yuMDun^ = namaadhaanamu daaniki tODuga - saagipOvuchunae yuMDunu || manO ||

  40. lakshalaadi vedachalli challi - bhikshakulanu pOshiMchedavu = rakshaNa maargamu choopumu vaariki - Siksha maargamu tappiMchedavu || manO ||

  41. paapamulunna manO vichaaramu - paniki vachchunu paniki vachchunu = paapakshamaapaNa poMdina venuka - paniki raadu paniki raadu || manO ||

  42. nee manavi vina naMdulaku - naa meeda kOpamu paDavaddu = nee maelunakae aTlu chaesitini - naa meeda neekuMDuTaku || manO ||

  43. manO nidhaanamu kaligi yuMDina - manavulu siddhamugaa siddhiMchu = manO vichaaramu valana manavulu - maMTanu kalisi naSiyiMchu || manO ||

  44. anukonuTa viSvaasamaina - agupaDadaa nee kaMTiki = anukonnaTTi eliyaajarunaku - agupaDalaedaa kanniya ribakkaa || manO ||

  45. (B) anukonani yaakObunaku lae - yaa jatagaa aerpaDalaedaa = anukonani dhanyata nae nerugudu - adi neeku samakooDi raadaa || manO ||

  46. vichaaramunaku sababugaa nuMDu - vaervaeru kaaraNamulu galavu = vichaaraNa chaeyuchu nanu choochi - vidilchi vaesi saMtOshiMchumu || manO ||

  47. shaarOnu puramu viSvaasula - kaarOhaNa sthalamagunu tagunu = chaeravalasina vaaru naeDae - chaerina yeDala kshaemaMbu || manO ||

  48. bOdhalu poortiga vinagOrina saM - bOdhana laekuMDaganae raMDi = SOdhanalu kashTamulu unnanu - SOdhiMchi choochuTaku raMDi || manO ||

  49. naenu daevuDanani nanu goorchi - nijamu cheppinavi bhootamulu = gaana nee saakshyamulu naMta - kanna ekkuva kaavalenu gadaa || manO ||

  50. pakshulu nannu praardhiMchunani - baibilu graMthamu naMdu galadu = vRkshamulu nanu stOtriMchunanu - vRttaaMtamunu aMdunu galadu || manO ||

  51. goppa kashTa sukhamulu cheppu - koni kOrke praardhana chaeyuduvaa = appuDu chinnavi kooDa cheppina avi maatramu vinanaa yaemi? || manO ||

  52. nee Sareeramu naligi pOyina - naa Sareeramu kaladu neeku = nee Sabdamu nanu rammanakunna - nee yoddaku naenae - vachchedanu || manO ||

  53. naa moolamuna hiMsa galigina - aamOdiMchumu aanaMdiMchumu = kshaemamu kalugunu paralOkamuna - chirakaala bahumaanamu dorakunu || manO ||

  54. naaDu naeDu raepu iMkanu - keeDunu gelchu SooruDanu = vaeDukoni nammina yeDala yae - vinnapamainanu aalakiMtunu || manO ||

  55. saataanupai kaTTu kaTTina - atanini baMdhiMchi yuMdu = bhootala vaasu lanaeku laatani - bOdhaku loMgi pOyirayyaa || manO ||

  56. (B) saataanupai kaTTukaTTi - sarvajanulu nanu vaeDina yeDala = paataaLamuna maTTu vuMDani gOtilO atani ippuDae vaeseda || manO ||

  57. narulaku iMta dhanyata techchina - nannu nammaru ee narulu = durita maraNamu narakamu - techchina dootanu nammudu ree narulu || manO ||

  58. svasthi Saalalu sthaapana chaesina - paapulaku rOgulaku maelu = vastunna chaMdaa sommu naa - panulaku vaaDumu aarjiMpakumu || manO ||

  59. narulaku saadhyamu kaanivi galavu - naakavi saadhyamulagunu gadaa! = parulunu nee madi paluku palukulu - paaTiMpaka nirbhayamuga nuMDumu || manO ||

  60. sOdekatteyu yoka rOgini naa paadamu noddaku paMpe gadaa = nee dari nunna vaarinella naadariki paMpiMpa laevaa || manO ||

  61. ekkuva adbhutakaramuga nunna - takkuvayai pOvunu viSvaasamu = ikkaDa yippuDu jarugani veMduku - evariki gaavale nanavaddu || manO ||

  62. paeturu neeDake rOgulu baagai - vaesiri gaMtulu saMtOshamutO = naa talaMputOnae rOgulu nayamai - gaMtulu vaeyaraa? || manO ||

  63. akshaya daehamu daalchitivikkaDa - aanaMda paDuTa maanaku mee = akshaya stuti deepamunu SOdhana - aarpaneeya vaddu vaddu || manO ||

  64. naa siMhaasana stutini neevu -teesikonuTa maMchidi kaadu = nee saMgatulu stutigaa koorchi - nee taMDrini stutiMchu chuMDumu || manO ||

  65. yaavattu sRshTi stutiMchu - nani prakaTana pustakamuna nunnadi = ee vidha stuti moolamugaa maaku yella kaalamu jayamae uMDunu || manO ||

  66. neevu nannu eTlu talaMtuvO - naenu aTlae kanabaDudun^ - bhaava Suddhi chaesikonagaa - pratyaksha magudunu spashTamuga || manO ||

  67. nanu talaMchina vidhamuga naenu - kanabaDi maaTalaaDedanu = nanu talaMpani vaariki kooDa - kanabaDi maaTalaaDedanu || manO ||

  68. siddhaparachitini ennO neekavi - sinimaagaa choopiMchedanu = vaddanaka vaMdiMtuvu ganuka - vaMdiMtunu ninnu naenae || manO ||

  69. enni praardhanalu chaesina naa - yeduTa oorake kanipeTTanichO = ennaDunu satyamu saMtushTi - erugavu kanipeTTumu kanipeTTumu || manO ||

  70. mOshae vaeyiMchina guDaara - munu pOlinadi vaesedavaa = mOshaetO maaTlaaDina vidhamuga - mOdamutO neetO - maaTlaaDeda || manO ||

  71. naenu sRjiMchina koMDalatOnu - praaNulatO vRkshaadulatO = maanaka maaTalaaDuchu vaaTi - manavulu aalakiMtunu || manO ||

raakaDa - siddhapaDuTa

  1. vaartaa patrikalaMdu raakaDa - gurtulu telisikona galavu = gurtulu telisina yeDala bhaktula - kooDikalO siddhapaDagalavu || manO ||

  2. naeTi gurutulu reMDava raakaDa - nijamuga vachchunani yanuchunnavi = naaTi charitra kooDa nijamani - naeTi gurutulae Rjuvai yunnavi || manO ||

  3. siddapaDu vaariki tODpaDuTaku - siddhamugaanae yunnaanu = siddha paDudumani gaDipina ikanu - siddhamu siddhame yanu chunnaanu || manO ||

  4. nannu siddamu chaeyu manuchu - naruDu aDigina tODpaDanaa? = nannu naa vaakyamunu sabhanu - mannana chaesina konipOnaa || manO ||

  5. manasuna nemmadi gaaMchina yeDala - mahima Sareeramu daalchedavu = anumaanamulanu aNachi vaeyuchu - aayattamu chaesedanu ninnu || manO ||

  6. naenu vachchu varaku ichchaTa - nilakaDa kaligi nilichi yuMDumu = naenu vachchi reppapaaTu - lOnae ninnu konipoyedanu || manO ||

  7. naa raakaDaku eduru chooDumu - nee raakaDaku eduru chootunu naa raakaDayu nee raakaDayu - naa raakaDalO okaTae yagunu || manO ||

  8. sabhanu praaNamutO konipOvu - samayamu Seegramugaa vachchu = Subha vachana midiye naa sabhakani - suLuvuga bhOdiMpaga vachchu || manO ||

  9. vachchitinani nammina vaaralu ika - vachchedanani nammaru aelaa? = vachchi anaekulaku naeDu kana - baDu chunnadi nammaru aela? || manO ||

  10. teeraa vachchina reppapaaTuna - chaeragalaraa maeghamulO = dhaaruNipai SaeshiMchina vaariki - kalugu Sramalu sahiMchuduraa ? || manO ||

  11. aeliyaa, yehejkaelu pilippu - egiri prayaaNamu chaesina reeti = gaalilO aatma ninnugooDa - grakkuna konipovuTa kashTaMbaa || manO ||

paralOkamu

  1. siluvaye neekikkaDa gadde naa - siluvaye daanipai nuMDu = siluvalu reMDu ninnu pai gaddeku - siddamu chaeyunu yuddha samaapti || manO ||

  2. idivarake paralOkapu gadde - ichchi vaesi yunnaanu neeku = adi kriyagaa kanabaDu paryaMtamu - aatma kaMTitO choochuchu nuMDumu || manO ||

  3. neevu nannu oppukoni yu - nnaavani taMDriki cheppudunu = daevadootalu vini stuti chaeyaga - diviyaMtayunu - mrOgi pOvunu || manO ||

  4. daeva lOkamuna, doota lOkamuna - divi lOkamuna naenae yuMdunu = naa valana rakshaNa poMdina narulu - dootala valene yuMduru || manO ||

  5. paralOkamuna takkuva chOTani - paritaapamu poMduduru koMdaru = sariyagu sthitiyani kaMTi neeTini - sarigaanae tuDichi vaesedanu || manO ||

  6. pratisaevakuni panulella kana - paDakunnavani anavaddu = matikeppuDu tOchani goppa bahu - matulanu akkaDa aMdiMtu || manO ||

  7. aemi choochi nee vasahyichitivO - vaanini akkaDa chooDavugaa = vaenini kOritivO aviyu vae - rainavi, krottavi akkaDa chootuvu || manO ||

raakaDa tarvaata jarugunavi

  1. sajeeva saMghaarOhaNa mappuDu - jarugunu viMdu aeDaeMDlu = prajaetara saMghamu bahuSramala - paalaipOvunu eMtO du:khamu || manO ||

  2. bilamaMdali saataanunu naenu - viDudala chaeseda nappuDataDu = ilapai naatO yuddhamu chaesi - geluvalaeka narakamu paalagunu || manO ||

  3. ippuDu kaadu naa Subhavaarta - ilayaMtaTa prakaTana yagunu = appuDu veyyiyaeMDla kaala - maMdu veMTanae aMtamu vachchunu || manO ||

  4. saeva mugiMpaka muMdae mokshamu - chaera valasenana vaddu = bhaavini ekkuva kaalamu ekkuva - saeva chaesedavu idi naa paddu || manO ||

  5. bhoogOLa maMtaTa naa - bOdhayu aaraadhanayu nagunu = naa guLLu paralOkapu mahima - tO ganagana mani velugu chuMDunu || manO ||

  6. narakamuna baDu vaarini joochi - pariSuddhaatma vilapiMchun^ - narula aadaraNayagu taMDrin^ - naruleTlaadariMpa galaru || manO ||

  7. narulu naa kRpa kaalamaMtayu - parityajiMchi vaesinaaru = eri giyu Sikshaku lOnainaMduna - ellakaalamu naakae jayamu || manO ||

  8. bhoomipai saitaanunu atani - purugae laekuMDaga chaesedanu = naa manushyulae uMduru vaari - naDuma nivaasamu chaesedanu || manO ||

baibilumishanu

  1. bhoo lOkamaMtaTiki suvaarta - pOvuTa kiMDiyaa pradhaanamu = pai lOkaMbu nuMDi vachchina - baibilu mishanu nu etti choopumu || manO ||

  2. naenu cheppaga baibilu mishanu - lOniki vachchina kshaemamulu = j~naanamu manassaakshiyunu cheppina - naenaemiyu aaTaMkamu chaeyanu || manO ||

  3. naenu rammanaga vachchi ae - vaani kaDaku pOraadu = naa niyamita kaaryamulu maatrame - naDupumu maanu kona raadu || manO ||

  4. baibilu mishanunu naenu bailu - parachina saMgati nammani vaaru = praabalya bOdhalu vini nannu - praardhana jaesi kanugona raadaa || manO ||

  5. krotta vishayamulu laenide ee - krotta mishanu eMduku raavalenu = krottavi raagaa anni mishanulu - goppaga perigi maeghaMbekkunu || manO ||

  6. aMdariki kanabaDi maaTlaaDudu - nanuTaye ee mishanu viSvaasamu = koMdari bOdhalu vaeruga nuMDunu - aMduke maaTalaaDanu naenu || manO ||

  7. nee janma dinamu nimittamai naeneMtO kanipeTTiyuMTi = ee jagatiki neevu raagaanae - eMtO aanaMdiMchi yuMTi || manO ||

  8. ee keertana naakae naakae yani - evarana galarO vaarikae chellunu = ee kaalamunaku taginavi cheppiti - yerigi sahiMchu konadagunu || manO ||

  9. janaka sutaatmalanu traikuniki - saMstutulu ani anukonumu = anu dinamu nee yaatmeeya jee - vanamu vRddhi yagunu nammumu || manO ||