48. దైవిక స్వస్థత

రాగం: కేదార తాళం: ఆది



    ఎందుకింత చింత నొందెదవు - వైద్యుడు లేనట్టు = అందిపుచ్చు కొన్నట్టి హృదయము - నందున నంతట - నలుముకొని యున్నాడు || ఎందు ||

  1. నీ రోగంబులు - నీ పాపంబులు - శ్రీ రక్షణకర్త - సిల్వపై మోసెన్ = భారమెల్ల ప్రభు - పైన వేసికొను - మారోగ్యమౌ సౌఖ్య - మౌ భాగ్యము కల్గు || ఎందు ||

  2. ఎన్ని శ్రమలో అన్ని దానము - లున్నవని విభు - సన్నుతించు మిలన్ - ఖిన్నుడవు గా - కున్న యెడల నీ - విన్నైన, అన్నైన ఎన్నైన గెల్తువు || ఎందు ||

  3. బాధలందున బోధ జేయుచు - నాధుడు నీ - నాధుడగు చుండెన్ = శోధనలన్ గెల్చుటకా ప్రభువే - ఆధారమై ధైర్య - మై శౌర్యమై యుండు || ఎందు ||

  4. నీలోని సద్గుణాలు పైకిక - తేలు వరకు - కష్టాల కొలిమి రాజున్ ఏల సణిగెదవు యేసు తండ్రి నిన్ - గాలించు పాలించు - నాలించు ప్రార్ధనల్ || ఎందు ||

  5. నీలోని దుర్గుణాలు కరుగుచు - కూలు వరకు - కష్టాల కొలిమి కాలున్ = మేలు కొరకె గదా - మూలుగుటల నిక - చాలించు చాలించు - చాలించుమో యాత్మ || ఎందు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


48. daivika svasthata

raagaM: kaedaara taaLaM: aadi



    eMdukiMta chiMta noMdedavu - vaidyuDu laenaTTu = aMdipuchchu konnaTTi hRdayamu - naMduna naMtaTa - nalumukoni yunnaaDu || eMdu ||

  1. nee rOgaMbulu - nee paapaMbulu - Sree rakshaNakarta - silvapai mOsen^ = bhaaramella prabhu - paina vaesikonu - maarOgyamau saukhya - mau bhaagyamu kalgu || eMdu ||

  2. enni SramalO anni daanamu - lunnavani vibhu - sannutiMchu milan^ - khinnuDavu gaa - kunna yeDala nee - vinnaina, annaina ennaina geltuvu || eMdu ||

  3. baadhalaMduna bOdha jaeyuchu - naadhuDu nee - naadhuDagu chuMDen^ = SOdhanalan^ gelchuTakaa prabhuvae - aadhaaramai dhairya - mai Sauryamai yuMDu || eMdu ||

  4. neelOni sadguNaalu paikika - taelu varaku - kashTaala kolimi raajun^ aela saNigedavu yaesu taMDri nin^ - gaaliMchu paaliMchu - naaliMchu praardhanal^ || eMdu ||

  5. neelOni durguNaalu karuguchu - koolu varaku - kashTaala kolimi kaalun^ = maelu korake gadaa - mooluguTala nika - chaaliMchu chaaliMchu - chaaliMchumO yaatma || eMdu ||