37. ఈష్టరు



    ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను

  1. మొదటి తల్లిని జూచి - మోస వాక్యంబులు
    వెదజల్లి దైవాజ్ఞ - విడుచునట్లు జేయ
    పిదప వచ్చినవారు - పెరుగంగ పాపాలు
    ఎదిగి ఎన్నెన్నియో - విధములై వ్వాపింప
    వదిలించుటకు దైవ - వ్యక్తియైన యేసు
    పథమై రాగ మోక్ష - పథమును తప్పించి
    తుదకు పాపములోకి - త్రోయ జూచిన దుష్ట =
    వధకుడు పన్నిన - వరుస ప్రయత్నాలు || ఏమా ||

  2. పరమాత్ముని యాజ్ఞ - పాటింప నందున
    మరణంబు కల్గునను - మాట ప్రకారంబు
    నరుడు పొందు రెండు - మరణముల్ రానుండె
    మరణంబు ముక్తికి - మార్గమైనందున
    మరణంబు ఆనంద - కరమైన స్థితియాయె
    నరకమను రెండవ - మరణంబు తప్పింప
    మరణ మొందను సిద్ధ - మైయున్న రక్షకుని
    = మరణింప జేసిన - మానవుల యత్నాలు || ఏమా ||

  3. తలమీదను హస్త - ముల యందును పాద
    ముల యందును పార్శ్వ - ముల యందును రక్త
    = ములు గారిన గాయ - ములును వేదనబాధ || ఏమా ||

  4. రాతిగోడలు నాలుగు - ప్రక్కలందుడగను
    మూతగ బండయు - ముద్రయు వేయగను
    దూత వచ్చి రాయి - దొర్లించినప్పుడు
    = మా తండ్రి క్రీస్తు స - మాధి యావత్తును || ఏమా ||

  5. చావనై యున్నను - లేవనై యున్నట్లు
    ఆ వంచకుడు చెప్పె - జీవించి యున్నప్పుడు
    కావున శిష్యుల - క్కడి శవము నెత్తికొని
    పోవుదు రప్పుడు - మొదటి వంచన కంటె
    ఈ వంచనయె చెడ్డ - దై వెల్లడగునని
    ఈ విధముగ చెప్పి - ఈర్ష్యపరులు రాత్రి
    కావలిపెట్టిన - ఘాటు జాగ్రత్తలు || ఏమా ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


37. eeshTaru



    emaayenu! emaayenu! apavaadi yatnaalu aemaayenu

  1. modaTi tallini joochi - mOsa vaakyaMbulu
    vedajalli daivaaj~na - viDuchunaTlu jaeya
    pidapa vachchinavaaru - perugaMga paapaalu
    edigi ennenniyO - vidhamulai vvaapiMpa
    vadiliMchuTaku daiva - vyaktiyaina yaesu
    pathamai raaga mOksha - pathamunu tappiMchi
    tudaku paapamulOki - trOya joochina dushTa =
    vadhakuDu pannina - varusa prayatnaalu || emaa ||

  2. paramaatmuni yaaj~na - paaTiMpa naMduna
    maraNaMbu kalgunanu - maaTa prakaaraMbu
    naruDu poMdu reMDu - maraNamul^ raanuMDe
    maraNaMbu muktiki - maargamainaMduna
    maraNaMbu aanaMda - karamaina sthitiyaaye
    narakamanu reMDava - maraNaMbu tappiMpa
    maraNa moMdanu siddha - maiyunna rakshakuni
    = maraNiMpa jaesina - maanavula yatnaalu || emaa ||

  3. talameedanu hasta - mula yaMdunu paada
    mula yaMdunu paarSva - mula yaMdunu rakta
    = mulu gaarina gaaya - mulunu vaedanabaadha || emaa ||

  4. raatigODalu naalugu - prakkalaMduDaganu
    mootaga baMDayu - mudrayu vaeyaganu
    doota vachchi raayi - dorliMchinappuDu
    = maa taMDri kreestu sa - maadhi yaavattunu || emaa ||

  5. chaavanai yunnanu - laevanai yunnaTlu
    aa vaMchakuDu cheppe - jeeviMchi yunnappuDu
    kaavuna Sishyula - kkaDi Savamu nettikoni
    pOvudu rappuDu - modaTi vaMchana kaMTe
    ee vaMchanaye cheDDa - dai vellaDagunani
    ee vidhamuga cheppi - eershyaparulu raatri
    kaavalipeTTina - ghaaTu jaagrattalu || emaa ||