4. దేవ సంస్తుతి (103 దావీదు కీర్తన)
రాగం: ఆనంద భైరవి తాళం: త్రిపుట
- దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ మంతుడగు యె - హోవ సంస్తుతి చేయవే మనసా =
దేవసంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవ దేవుని - పావన నా - మము నుతింపుమా - నా యంతరంగము - లో వసించు - నో సమస్తమా
- జీవమా యోహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు = నీవు జేసిన పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే || దేవ ||
- చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను = జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవకిరీటముగ వేయును - ఆ కారణముచే || దేవ ||
- యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై వెలయు నట్లుగ - మేలిచ్చి నీదు - భావమును సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే || దేవ ||
- ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మీయున్ = విభుడు మార్గము తెలిపె మోషేకు - తన కార్యములను - విప్పెనిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే || దేవ ||
- అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘ శాంతపరుడు = నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు - నీ పై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే || దేవ ||
- పామరులమని - ప్రత్యపకార - ప్రతిఫలంబుల్ పంప లేదు = భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ భక్త జనులయందున - ఆ కారణముచే || దేవ ||
- పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు నంత యెడము కలుగజేసి యున్నాడు - మన పాపములను - నెడముగానె చేసియున్నాడు - ఆ కారణముచే || దేవ ||
- కొడుకలపై తండ్రి జాలి - పడువిధముగా భక్తి పరుల = యెడల జాలి పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల జాలి పడును దేవుండు - ఆ కారణముచే || దేవ ||
- మనము నిర్మితమైన రీతి - తనకు దెలిసి యున్న సంగతి = మనము మంటి వార మంచును - జ్ఞాపకము చేసి - కొనుచు స్మరణ చేయు చుండును - ఆ కారణముచే || దేవ ||
- పూసి గాలి వీవ నెగిరి - పోయి బసకు దెలియని వన = వాస పుష్పము వలెనె నరుడుండు - నరునాయువు తృణ - ప్రాయము శ్రీ దేవ కృపమెండు - ఆ కారణముచే || దేవ ||
- పరమ దేవ నిబంధనాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు = నిరతమును కృప నిలిచి యుండును - యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే || దేవ ||
- దేవుడాకాశమున గద్దె - స్థిరపరచుకొని సర్వమేలున్ = దేవ దూతలారా దైవాజ్ఞ - విని వాక్యము నడుపు - దిట్టమైన శూరులారా! - స్తోత్రంబు చేయుడి || దేవ ||
- దేవ సైన్యములారా ఆయన - దివ్య చిత్తము నడుపునట్టి సేవ కావళులారా! దేవుని - పరిపాలన చోట్ల - లో వసించు కార్యములారా - వందనము చేయుడి || దేవ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
4. daeva saMstuti (103 daaveedu keertana)
raagaM: aanaMda bhairavi taaLaM: tripuTa
- daeva saMstuti chaeyavae manasaa - Sree maMtuDagu ye - hOva saMstuti chaeyavae manasaa =
daevasaMstuti chaeyumaa naa - jeevamaa yehOva daevuni - paavana naa - mamu nutiMpumaa - naa yaMtaraMgamu - lO vasiMchu - nO samastamaa
- jeevamaa yOhOvaa neeku - jaesina maeLLan^ maruvaku = neevu jaesina paatakaMbulanu - manniMchi jabbu - laeviyun^ laekuMDa jaeyunu - aa kaaraNamuchae || daeva ||
- chaavu gOti nuMDi ninnu - laevanetti dayanu kRpanu = jeeva kireeTamuga vaeyunu - nee Sirasu meeda - jeevakireeTamuga vaeyunu - aa kaaraNamuchae || daeva ||
- yauvanaMbu pakshiraaju - yauvanaMbu valene krotta = yauvanaMbai velayu naTluga - maelichchi needu - bhaavamunu saMtushTi parachunugaa - aa kaaraNamuchae || daeva ||
- prabhuvu neeti panulu chaeyun^ - baadhitulaku nyaaya meeyun^ = vibhuDu maargamu telipe mOshaeku - tana kaaryamulanu - vippeniSraayaelu janamunaku - aa kaaraNamuchae || daeva ||
- atyadhika praema svaroopi - yaina deergha SaaMtaparuDu = nityamu vyaajyaMbu chaeyaDu - aa kRpOnnatuDu - nee pai nepuDu kOpamuMchaDu - aa kaaraNamuchae || daeva ||
- paamarulamani - pratyapakaara - pratiphalaMbul^ paMpa laedu = bhoomi kanna naakasaMbunna - yettuMDu daiva - praema bhakta janulayaMduna - aa kaaraNamuchae || daeva ||
- paDamaTiki toorpeMta yeDamO - paapamulakun^ manaku naMta yeDamu kalugajaesi yunnaaDu - mana paapamulanu - neDamugaane chaesiyunnaaDu - aa kaaraNamuchae || daeva ||
- koDukalapai taMDri jaali - paDuvidhamugaa bhakti parula = yeDala jaali paDunu daevuMDu - tana bhakti parula - yeDala jaali paDunu daevuMDu - aa kaaraNamuchae || daeva ||
- manamu nirmitamaina reeti - tanaku delisi yunna saMgati = manamu maMTi vaara maMchunu - j~naapakamu chaesi - konuchu smaraNa chaeyu chuMDunu - aa kaaraNamuchae || daeva ||
- poosi gaali veeva negiri - pOyi basaku deliyani vana = vaasa pushpamu valene naruDuMDu - narunaayuvu tRNa - praayamu Sree daeva kRpameMDu - aa kaaraNamuchae || daeva ||
- parama daeva nibaMdhanaaj~nal^ - bhaktitO gaikonu janulaku = niratamunu kRpa nilichi yuMDunu - yehOva neeti taramula pillalaku nuMDunu - aa kaaraNamuchae || daeva ||
- daevuDaakaaSamuna gadde - sthiraparachukoni sarvamaelun^ = daeva dootalaaraa daivaaj~na - vini vaakyamu naDupu - diTTamaina Soorulaaraa! - stOtraMbu chaeyuDi || daeva ||
- daeva sainyamulaaraa aayana - divya chittamu naDupunaTTi saeva kaavaLulaaraa! daevuni - paripaalana chOTla - lO vasiMchu kaaryamulaaraa - vaMdanamu chaeyuDi || daeva ||