54. ప్రార్ధన

రాగం: తిల కాంభోజి తాళం: ఆట



    బహుగా ప్రార్ధన చేయుడి - ఇక మీదట - బహుగా ప్రార్ధన చేయుడి = బహుగా ప్రార్ధన చేసి - బలమున్ సంపాదించి - మహిలో కీడును గెల్వుడి - దేవుని కెపుడు - మహిమ కలుగ నీయుడి || బహు ||

  1. చెడుగెక్కువగు చున్నది - భూలోకమున చెడుగెక్కువగు చున్నది = చెడుగుపై - మంచి పై - చేయ గలదౌనట్లు - విడువక ప్రార్ధించుడి - మీ ప్రార్ధన - కడ వరకు బోనీయుడి || బహు ||

  2. వాగ్ధానములు చూడుడి - దేవుని గ్రంధ వాగ్ధానములు జూడుడి = వాగ్ధానములె జరుగ - వలసిన కార్యంబుల్ - వాగ్ధానములు నమ్ముడి - ఈ రీతిగా - ప్రభువును సన్మానించుడి || బహు ||

  3. విన్‌దు నన్న దేవుని వాగ్ధానము - విందుగా ధ్యానించుడి = విందులో నుండగా - వింతగ నెరవేర్పు - బొంది యానందింతురు - ఇది రెండవ విందంచు గ్రహియింతురు || బహు ||

  4. విసుగుదల జెందరాదు - ప్రార్ధన నెరవేర్పు తత్ క్షణమె రాదు = విసుగున్నచో సిద్ధి - వెనుకకే పోవును - వసియించుడి దేవుని వాగ్ధానమున - భటులవలె నిల్వుడి || బహు ||

  5. సంశయము పనికి రాదు - లేశంబైన - సంశయము పనికి రాదు = సంశయింపక దైవ - సన్నిధి యందు మీ - యంశము విడ జెప్పుడి - దానికి గొప్ప - యంశ బట్టనీయుడి || బహు ||

  6. సిద్ధి కనుపింపకున్న - వాగ్ధానములో - సిద్ధియున్నది చూడుడి = సిద్ధి యప్పుడు మీకై - సిద్ధమై వెడలి ప్ర - సిద్ధి లోనికి వచ్చును - మీ నమ్మిక వృద్ధి గాంచి - నిల్చును || బహు ||

  7. సంతోష మందరారె - మన దేవుని సంస్తుతి చేయ రారె - సంతోష బలముచే - సర్వ కష్టములను - అంతరింప జేతుము - మన దేవుని - సంతోష పరచెదము || బహు ||

  8. అంతయు మనదే గదా - యేసునికున్న - దంతయు మనదే గదా = అంతయు మన ప్రభువు - ఆర్జించి యున్నాడు - స్వంతమని అందుగొనుడి - మీ ఆత్మకు - శాంతి జెంద నీయుడి || బహు ||

  9. విజయ జీవనము మనదే - క్రీస్తిచ్చిన - విజయ జీవనము మనదె = విజయ జీవనము మనదె - విశ్వమంతయు మనదె - భజన సంఘంబు మనదె దేవుండున్న - పరలోకమెల్ల మనదే || బహు ||



Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


54. praardhana

raagaM: tilakaaMbhOji taaLaM: aaTa



    bahugaa praardhana chaeyuDi - ika meedaTa - bahugaa praardhana chaeyuDi = bahugaa praardhana chaesi - balamun^ saMpaadiMchi - mahilO keeDunu gelvuDi - daevuni kepuDu - mahima kaluga neeyuDi || bahu ||

  1. cheDugekkuvagu chunnadi - bhoolOkamuna cheDugekkuvagu chunnadi = cheDugupai - maMchi pai - chaeya galadaunaTlu - viDuvaka praardhiMchuDi - mee praardhana - kaDa varaku bOneeyuDi || bahu ||

  2. vaagdhaanamulu chooDuDi - daevuni graMdha vaagdhaanamulu jooDuDi = vaagdhaanamule jaruga - valasina kaaryaMbul^ - vaagdhaanamulu nammuDi - ee reetigaa - prabhuvunu sanmaaniMchuDi || bahu ||

  3. vin^du nanna daevuni vaagdhaanamu - viMdugaa dhyaaniMchuDi = viMdulO nuMDagaa - viMtaga neravaerpu - boMdi yaanaMdiMturu - idi reMDava viMdaMchu grahiyiMturu || bahu ||

  4. visugudala jeMdaraadu - praardhana neravaerpu tat^ kshaName raadu = visugunnachO siddhi - venukakae pOvunu - vasiyiMchuDi daevuni vaagdhaanamuna - bhaTulavale nilvuDi || bahu ||

  5. saMSayamu paniki raadu - laeSaMbaina - saMSayamu paniki raadu = saMSayiMpaka daiva - sannidhi yaMdu mee - yaMSamu viDa jeppuDi - daaniki goppa - yaMSa baTTaneeyuDi || bahu ||

  6. siddhi kanupiMpakunna - vaagdhaanamulO - siddhiyunnadi chooDuDi = siddhi yappuDu meekai - siddhamai veDali pra - siddhi lOniki vachchunu - mee nammika vRddhi gaaMchi - nilchunu || bahu ||

  7. saMtOsha maMdaraare - mana daevuni saMstuti chaeya raare - saMtOsha balamuchae - sarva kashTamulanu - aMtariMpa jaetumu - mana daevuni - saMtOsha parachedamu || bahu ||

  8. aMtayu manadae gadaa - yaesunikunna - daMtayu manadae gadaa = aMtayu mana prabhuvu - aarjiMchi yunnaaDu - svaMtamani aMdugonuDi - mee aatmaku - SaaMti jeMda neeyuDi || bahu ||

  9. vijaya jeevanamu manadae - kreestichchina - vijaya jeevanamu manade = vijaya jeevanamu manade - viSvamaMtayu manade - bhajana saMghaMbu manade daevuMDunna - paralOkamella manadae || bahu ||