57. ప్రభువు ప్రార్ధన
రాగం: శహనా తాళం: ఆది
- పరలోకమందున - వసియించు మా తండ్రి = పరిశుద్ధ పరుప
- బడు గాక నీ పేరు || పరలోక ||
- నీ రాజ్యంబు వచ్చు - నీ చిత్తంబు దివిని - ఏ రీతిని జరుగునో - ఆ రీతి నిల జరుగు || పరలోక ||
- జీవనోపాధియై - చేలగు మా యన్నము = నీవు మా కోసమై - నేడు దయ చేయుము || పరలోక ||
- మా ఋణస్థుల మేము - మన్నించు చునట్లుగా = మా ఋణంబుల నీవు - మన్నించు చుండుము || పరలోక ||
- మము శోధనలోకి - మరల నీయకుము = మము కీడులో నుండి - మళ్ళించు కొని పొమ్ము || పరలోక ||
- నీదె సామ్రాజ్యంబు - నీదే యౌను శక్తి = నీదె యౌను మహిమ - నిత్యంబును నామెన్ || పరలోక ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
57. prabhuvu praardhana
raagaM: Sahanaa taaLaM: aadi
- paralOkamaMduna - vasiyiMchu maa taMDri = pariSuddha parupa
- baDu gaaka nee paeru || paralOka ||
- nee raajyaMbu vachchu - nee chittaMbu divini - ae reetini jarugunO - aa reeti nila jarugu || paralOka ||
- jeevanOpaadhiyai - chaelagu maa yannamu = neevu maa kOsamai - naeDu daya chaeyumu || paralOka ||
- maa RNasthula maemu - manniMchu chunaTlugaa = maa RNaMbula neevu - manniMchu chuMDumu || paralOka ||
- mamu SOdhanalOki - marala neeyakumu = mamu keeDulO nuMDi - maLLiMchu koni pommu || paralOka ||
- neede saamraajyaMbu - needae yaunu Sakti = needeyaunu mahima - nityaMbunu naamen^ || paralOka ||