51. క్రీస్తు సర్వరోగ వైద్యుడు

రాగం: శంకరాభరణం తాళం: ఆది

(చాయ: దేవకుమారా - దీనోపకారా)


1వ భాగము


    యేసు ప్రభువా మా - హిత బోధకుండ
    దోసములు క్షమియించు - దొడ్డ జనకుండ || యేసు ||

  1. రోగములు మాన్పు - రూఢి వైద్యుండ
    బాగు చేసి పంపు - పరమ నాధుండ || యేసు ||

  2. తలమీద గల వెంట్రు - కలు రాలు వ్యాధి
    అలుము కొన్నను అవి - మొలిపింప గలవు || యేసు ||

  3. తలకున్న వ్యాధులు - తొలగించి ముదము
    కలిగించి ముఖమునకు - కళనియ్య గలవు || యేసు ||

  4. నిదుర రాని వేళ - నిన్ను ప్రార్ధింప
    నిదుర రానిత్తువు - నిజ విశ్రాంతి దొరకు || యేసు ||

  5. పీనసము నాసికను - పీడించు చుండ
    దీనిని మొదలంట - దీసి వేయుదువు || యేసు ||

  6. దంత వ్యాధులు నోటి - దరిని లోపల పైన
    అంతట నున్నవి - అణచి వేయుదువు || యేసు ||

  7. జలుబును దగ్గును - క్షయ రోగాదులను
    నిలువ కుండచేసి - నెమ్మది యిత్తువు || యేసు ||

  8. గొంతుక కాయలును - కంతులను వాపులను
    అంతర్ధానము చేసి - ఆదరింతువు || యేసు ||

  9. గుండె నొప్పులు లే - కుండ జేయుదువు
    మండు మంటను ఆర్పి - మహిమ చూపుదువు || యేసు ||

  10. ఉదర వ్యాధుల నెల్ల - వదలించి వేసి
    కదలని దుస్థితి - విదలింప గలవు || యేసు ||

  11. ప్రేగుప్ రక్కను చిన్న - ప్రేగు మొలవంగ
    సాగ కుండ దాని - లాగి వేయుదువు || యేసు ||

  12. మూత్ర వ్యాధులకు వి - ముక్తి దయ చేసి
    స్త్రోత్రంబు చేయగల - చురుకుదన మిత్తువు || యేసు ||

  13. మూల శంక యే - మూల నుండకుండ
    మూలము పెరికి అను - కూలపరతువు || యేసు ||

  14. చర్మ వ్యాధులు తత్ - సంబంధ బాధలు
    నిర్మూలించి కుదురు - నెలకొల్ప గలవు || యేసు ||

  15. పడి దెబ్బ తగిలిన - పగవారు కొట్టిన
    పడిన గాయము మాన్పి - బ్రతికింప గలవు || యేసు ||

  16. గుచ్చుకొన్నవి పైకి - వచ్చునట్లు చేసి
    స్వేచ్చగ నిక తిరుగ - వచ్చునన గలవు || యేసు ||

  17. పొడలు మచ్చలు కాల్పు - పులిపిరి కాయలు
    చిడుము కడిగి మరల - చేర నియ్యవు || యేసు ||

  18. విరిగిన శల్యముల్ - సరిగా చేసి యతికి
    కరుకుమను ధ్వనియైన - కలుగ నియ్యవు || యేసు ||

  19. రక్తము తగ్గిన - రక్తము హెచ్చిన
    రక్తము సరిజేసి - రంజిల్ల జేతువు || యేసు ||

2వ భాగము


  1. రక్త నాళములు నీ - రక్త బలముచే
    శక్తి శుద్ధి పొంది - జయ మొంద గలవు || యేసు ||

  2. శ్రమలు రక్తధార - శస్త్రములేని
    క్రమమందు ఆరోగ్య - క్రమ మియ్యగలవు || యేసు ||

  3. కలరా, పొంగును స్ఫొట - కములు బొబ్బలు తెగులు
    కలిగియున్న ఆపు - దల చేయగలవు || యేసు ||

  4. పైత్య శ్లేష్మ మేహ - వాతములు మాన్పి
    నిత్యారోగ్యంబు - నియమింప గలవు || యేసు ||

  5. భూమిపై పడవేయు - మూర్చ రోగమును
    ఏమియు లేకుండ - ఎగుర గొట్టుదువు || యేసు ||

  6. సంతానము కొరకు - జట్టుగా వేడిన
    సంతానము గ - ల్గింతువు ముదిమైన || యేసు ||

  7. విలపించు గర్భిణిల - వేదనను మాన్పి
    సుళువుగా ప్రసవించు - సుఖమియ్య గలవు || యేసు ||

  8. తల్లి గ్రహింపని - పిల్లల బాధలు
    చల్లార్చి చిరకాల - సౌఖ్యము లిత్తువు || యేసు ||

  9. స్త్రీలకు గల ప్రత్యేక - మౌ మొరలు
    ఆలించు తండ్రివిగ - నగపడ గలవు || యేసు ||

  10. మగవారు ప్రత్యేక - మౌ బాధలొందు
    తెగతెంపు చేసి శాం - తిని నియ్యగలవు || యేసు ||

  11. స్థలము ఋతువు తిండి - జలము గాలి వీని
    వలన కలుగు హాని - పరిహరింతువు || యేసు ||

  12. పడని వస్తువులు లో - పట జొచ్చిన బయట
    పడిపో జేసి రోగి - భయము తీర్చుదువు || యేసు ||

  13. భయము వలన చింత - వలన వచ్చు వ్యాధి
    నయము చేసి జీవ - నము కాపాడుదువు || యేసు ||

  14. అనుకొనని రీతిగ - ఆరోగ్యము చెడగ
    అనుకొనని రీతిగ - ఆరోగ్యమిత్తువు || యేసు ||

  15. వృద్దాప్యమున మసల - వీలు లేనప్పుడు
    ఉద్దరించు సహా - యుల నంపగలవు || యేసు ||

  16. ఎన్నడు లేనట్టి - ఎన్నో జబ్బులు నేడు
    ఉన్నను అవికూడ - ఊడ్చి వేయుదువు || యేసు ||

  17. గుంటలు రంధ్రముల్ - కుదర గట్టుదువు
    అంటు వ్యాధులు మాకు - అంట నీయవు || యేసు ||

  18. జిల తీత తిమ్మురులు - సలుపు చురుకులు పోట్లు
    కలవాట్లు నిదుర నడ - కలు ఆపు చేతువు || యేసు ||

  19. పాములు నాడ - పాములు ఏటిక
    పాములను ఊడి - పడునట్లు చేతువు || యేసు ||

  20. పొరబాటుగా మందు - పుచ్చుకొనుట వలన
    దొరలి పడు జబ్బు - దొర్లించ గలవు || యేసు ||

  21. కండ తగనిది పెరుగు - ఖండించి వేతువు
    కొండ నాలుక బల్ల - ఉండ నీయవు || యేసు ||

  22. సురుపుడు కాయలు - చుండ్రు కురూపంబు
    మరియు పెట్టు మందు - పరిహరింతువు || యేసు ||

  23. మూల మూలనున్న - మురికి రక్తంబు
    మాలోని రాళ్ళను - తోలి వేయుదువు || యేసు ||

  24. స్థూలము తగ్గించి - సుళువు చేయుదువు
    శూల నొప్పులు అణచి - శోకమార్పుదువు || యేసు ||

3వ భాగము


  1. ఒడలు నీరు పట్ట - ఒడలి పోజేతువు
    పడుచున్నట్టి రక్త - వాంతి కట్టుదువు || యేసు ||

  2. బహిరంగముగ కన - బడుచున్న దయ్యము
    విహరింపకుండను - వెళ్ళ గొట్టుదువు || యేసు ||

  3. ఇట్టి రోగంబైన - అట్టి రోగంబైన
    ఎట్టి రోగంబైన - యేసే బాగుచేయు || యేసు ||

  4. పేరులేని వ్యాధి - పేరు లేకుండను
    వేరు లేకుండను - పెల్లగింప గలవు || యేసు ||

  5. అన్ని అవయవము లం - దున్న వ్యాధులన్ని
    కన్ను చూడకుండ - కడతేర్చ గలవు || యేసు ||

  6. పరులు విన్న బిడియ - పడి భయము పడుచు
    వెరువకుండ నీకు - వివరించుకొందు || యేసు ||

  7. ఒకదరిని జబ్బుండ - నొకదరిని మేలు
    ప్రకటితంబుగ నే - ర్పరచు చున్నావు || యేసు ||

  8. జబ్బు నిలువజేయు - సమయము నందు
    నిబ్బరమౌ భక్తి - నేర్పింప గలవు || యేసు ||

  9. మూలికాదులు రోగ - ముల నివారణకై
    నేలను మొల్పించు - నీకు స్తోత్రంబు || యేసు ||

  10. పశ్వాదులకు వచ్చు - వ్యాధులన్నిటిని
    విశాస ప్రార్ధనచే - వెడలగొట్టుదువు || యేసు ||

  11. పురుగులు జంతువు - కరచిన విషము
    హరించి వేతువు - ఆనందపర్తువు || యేసు ||

4వ భాగము


  1. భూతాలు రాకుండ - ధూతాళి ఖడ్గాలు
    చేతబట్టి నిలుచు - సేవకులై యున్నారు || యేసు ||

  2. పరలోక దూతలు - ప్రక్కనే యుందురు
    సరిగా నాకెపుడు పరి - చర్య చేయుదురు || యేసు ||

  3. నా శరీరమునందు - నా యాత్మయందు
    నీ శక్తికి దయకు - నిత్య సంస్తుతులు || యేసు ||

  4. రోగినై యుండగా - రోగబాధితుల
    బాగు కొరకు నేను - ప్రార్ధన చేతును || యేసు ||

  5. దేవుండవైనను - దీనులకోసమై
    ఈ వసుధపై నరుడ - వై వెలసినావు || యేసు ||

  6. పరలోకమందున - నరలోకమందున
    పరిశుద్ధు లందును - స్థిర వందనములు || యేసు ||

  7. నీ మతస్థులైన - ఏ మతస్థులైన
    నీ మాట నమ్మగా - క్షేమమిచ్చితివి || యేసు ||

  8. ఆశీర్వదించుట - నీ శక్తి యిష్టంబు
    ఆశీస్సు పొందుట - నాశక్తి యిష్టము || యేసు ||

  9. యేసు క్రీస్తుగా దేవు - డిలకు వచ్చిన తండ్రి
    నా సర్వమని నేను - నమ్ము కొన్నాను || యేసు ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


51. kreestu sarvarOga vaidyuDu


1va bhaagamu


    yaesu prabhuvaa maa - hita bOdhakuMDa
    dOsamulu kshamiyiMchu - doDDa janakuMDa || yaesu ||

  1. rOgamulu maanpu - rooDhivaidyuMDa
    baagu chaesi paMpu - parama naadhuMDa || yaesu ||

  2. talameeda gala veMTru - kalu raalu vyaadhi
    alumu konnanu avi - molipiMpa galavu || yaesu ||

  3. talakunna vyaadhulu - tolagiMchi mudamu
    kaligiMchi mukhamunaku - kaLaniyya galavu || yaesu ||

  4. nidura raani vaeLa - ninnu praardhiMpa
    nidura raanittuvu - nija viSraaMti doraku || yaesu ||

  5. peenasamu naasikanu - peeDiMchu chuMDa
    deenini modalaMTa - deesi vaeyuduvu || yaesu ||

  6. daMta vyaadhulu nOTi - darini lOpala paina
    aMtaTa nunnavi - aNachi vaeyuduvu || yaesu ||

  7. jalubunu daggunu - kshaya rOgaadulanu
    niluva kuMDachaesi - nemmadi yittuvu || yaesu ||

  8. goMtuka kaayalunu - kaMtulanu vaapulanu
    aMtardhaanamu chaesi - aadariMtuvu || yaesu ||

  9. guMDe noppulu lae - kuMDa jaeyuduvu
    maMDu maMTanu aarpi - mahima choopuduvu || yaesu ||

  10. udara vyaadhula nella - vadaliMchi vaesi
    kadalani dusthiti - vidaliMpa galavu || yaesu ||

  11. praegup^ rakkanu chinna - praegu molavaMga
    saaga kuMDa daani - laagi vaeyuduvu || yaesu ||

  12. mootra vyaadhulaku vi - mukti daya chaesi
    strOtraMbu chaeyagala - churukudana mittuvu || yaesu ||

  13. moola SaMka yae - moola nuMDakuMDa
    moolamu periki anu - koolaparatuvu || yaesu ||

  14. charma vyaadhulu tat^ - saMbaMdha baadhalu
    nirmooliMchi kuduru - nelakolpa galavu || yaesu ||

  15. paDi debba tagilina - pagavaaru koTTina
    paDina gaayamu maanpi - bratikiMpa galavu || yaesu ||

  16. guchchukonnavi paiki - vachchunaTlu chaesi
    svaechchaga nika tiruga - vachchunana galavu || yaesu ||

  17. poDalu machchalu kaalpu - pulipiri kaayalu
    chiDumu kaDigi marala - chaera niyyavu || yaesu ||

  18. virigina Salyamul^ - sarigaa chaesi yatiki
    karukumanu dhvaniyaina - kaluga niyyavu || yaesu ||

  19. raktamu taggina - raktamu hechchina
    raktamu sarijaesi - raMjilla jaetuvu || yaesu ||

2va bhaagamu


  1. rakta naaLamulu nee - rakta balamuchae
    Sakti Suddhi poMdi - jaya moMda galavu || yaesu ||

  2. Sramalu raktadhaara - Sastramulaeni
    kramamaMdu aarOgya - krama miyyagalavu || yaesu ||

  3. kalaraa, poMgunu sphoTa - kamulu bobbalu tegulu
    kaligiyunna aapu - dala chaeyagalavu || yaesu ||

  4. paitya Slaeshma maeha - vaatamulu maanpi
    nityaarOgyaMbu - niyamiMpa galavu || yaesu ||

  5. bhoomipai paDavaeyu - moorcha rOgamunu
    aemiyu laekuMDa - egura goTTuduvu || yaesu ||

  6. saMtaanamu koraku - jaTTugaa vaeDina
    saMtaanamu ga - lgiMtuvu mudimaina || yaesu ||

  7. vilapiMchu garbhiNila - vaedananu maanpi
    suLuvugaa prasaviMchu - sukhamiyya galavu || yaesu ||

  8. talli grahiMpani - pillala baadhalu
    challaarchi chirakaala - saukhyamu littuvu || yaesu ||

  9. streelaku gala pratyaeka - mau moralu
    aaliMchu taMDriviga - nagapaDa galavu || yaesu ||

  10. magavaaru pratyaeka - mau baadhaloMdu
    tegateMpu chaesi SaaM - tini niyyagalavu || yaesu ||

  11. sthalamu Rtuvu tiMDi - jalamu gaali veeni
    valana kalugu haani - parihariMtuvu || yaesu ||

  12. paDani vastuvulu lO - paTa jochchina bayaTa
    paDipO jaesi rOgi - bhayamu teerchuduvu || yaesu ||

  13. bhayamu valana chiMta - valana vachchu vyaadhi
    nayamu chaesi jeeva - namu kaapaaDuduvu || yaesu ||

  14. anukonani reetiga - aarOgyamu cheDaga
    anukonani reetiga - aarOgyamittuvu || yaesu ||

  15. vRddaapyamuna masala - veelu laenappuDu
    uddariMchu sahaa - yula naMpagalavu || yaesu ||

  16. ennaDu laenaTTi - ennO jabbulu naeDu
    unnanu avikooDa - ooDchi vaeyuduvu || yaesu ||

  17. guMTalu raMdhramul^ - kudara gaTTuduvu
    aMTu vyaadhulu maaku - aMTa neeyavu || yaesu ||

  18. jila teeta timmurulu - salupu churukulu pOTlu
    kalavaaTlu nidura naDa - kalu aapu chaetuvu || yaesu ||

  19. paamulu naaDa - paamulu aeTika
    paamulanu ooDi - paDunaTlu chaetuvu || yaesu ||

  20. porabaaTugaa maMdu - puchchukonuTa valana
    dorali paDu jabbu - dorliMcha galavu || yaesu ||

  21. kaMDa taganidi perugu - khaMDiMchi vaetuvu
    koMDa naaluka balla - uMDa neeyavu || yaesu ||

  22. surupuDu kaayalu - chuMDru kuroopaMbu
    mariyu peTTu maMdu - parihariMtuvu || yaesu ||

  23. moola moolanunna - muriki raktaMbu
    maalOni raaLLanu - tOli vaeyuduvu || yaesu ||

  24. sthoolamu taggiMchi - suLuvu chaeyuduvu
    Soola noppulu aNachi - SOkamaarpuduvu || yaesu ||

3va bhaagamu


  1. oDalu neeru paTTa - oDali pOjaetuvu
    paDuchunnaTTi rakta - vaaMti kaTTuduvu || yaesu ||

  2. bahiraMgamuga kana - baDuchunna dayyamu
    vihariMpakuMDanu - veLLa goTTuduvu || yaesu ||

  3. iTTi rOgaMbaina - aTTi rOgaMbaina
    eTTi rOgaMbaina - yaesae baaguchaeyu || yaesu ||

  4. paerulaeni vyaadhi - paeru laekuMDanu
    vaeru laekuMDanu - pellagiMpa galavu || yaesu ||

  5. anni avayavamu laM - dunna vyaadhulanni
    kannu chooDakuMDa - kaDataercha galavu || yaesu ||

  6. parulu vinna biDiya - paDi bhayamu paDuchu
    veruvakuMDa neeku - vivariMchukoMdu || yaesu ||

  7. okadarini jabbuMDa - nokadarini maelu
    prakaTitaMbuga nae - rparachu chunnaavu || yaesu ||

  8. jabbu niluvajaeyu - samayamu naMdu
    nibbaramau bhakti - naerpiMpa galavu || yaesu ||

  9. moolikaadulu rOga - mula nivaaraNakai
    naelanu molpiMchu - neeku stOtraMbu || yaesu ||

  10. paSvaadulaku vachchu - vyaadhulanniTini
    viSaasa praardhanachae - veDalagoTTuduvu || yaesu ||

  11. purugulu jaMtuvu - karachina vishamu
    hariMchi vaetuvu - aanaMdapartuvu || yaesu ||

4va bhaagamu


  1. bhootaalu raakuMDa - dhootaaLi khaDgaalu
    chaetabaTTi niluchu - saevakulai yunnaaru || yaesu ||

  2. paralOka dootalu - prakkanae yuMduru
    sarigaa naakepuDu pari - charya chaeyuduru || yaesu ||

  3. naa SareeramunaMdu - naa yaatmayaMdu
    nee Saktiki dayaku - nitya saMstutulu || yaesu ||

  4. rOginai yuMDagaa - rOgabaadhitula
    baagu koraku naenu - praardhana chaetunu || yaesu ||

  5. daevuMDavainanu - deenulakOsamai
    ee vasudhapai naruDa - vai velasinaavu || yaesu ||

  6. paralOkamaMduna - naralOkamaMduna
    pariSuddhu laMdunu - sthira vaMdanamulu || yaesu ||

  7. nee matasthulaina - ae matasthulaina
    nee maaTa nammagaa - kshaemamichchitivi || yaesu ||

  8. aaSeervadiMchuTa - nee Sakti yishTaMbu
    aaSeessu poMduTa - naaSakti yishTamu || yaesu ||

  9. yaesu kreestugaa daevu - Dilaku vachchina taMDri
    naa sarvamani naenu - nammu konnaanu || yaesu ||