55. వేళ ప్రార్ధన

రాగం: మాయామాళవగౌళ తాళం: ఆట



    దేవ దేవుని మ్రొక్కలెండి - ఓ ప్రియులారా - దేవరాజుని గొల్వరండి = లేవంగానే త్వరగా - దేవుని స్మరియించి ఆ వెన్క మీ పనులు = ఆరంభించుట మేలు || దేవదేవుని ||

  1. మంచము దిగగానె మొదట - మోకాళ్ళూని మన తండ్రిని తలంచు కొనుట = మంచి పనులన్నిటిన్ - మించిన పని యౌను - కొంచెమైనను బద్దకించుట సరికాదు || దేవదేవుని ||

  2. అన్నము తినుటకు ముందు - వందనములు - ఆచరించుట గొప్ప విందు = అన్ని దేవుడు మీకు - అందించునని నమ్ము - కొన్న యెడల అందు - కొందు రానందముతో || దేవదేవుని ||

  3. పయనమై ప్రార్ధించుకొండి - దేవుడు మిమ్ము - పదిలమ్ముగా నడుపు నండి = భయము కల్గదు మీ - బాట చదునై యుండు - రయముగా వెళ్ళుదురు - రంజిల్లు మీ మనస్సు || దేవదేవుని ||

  4. ఆపదలో ప్రార్ధించుకొండి - అది తప్పును - అపుడాయనను స్తుతిం చండి మీ పైన దేవునికి - మెండైన ప్రేమయని - యీ పనిలో మీరు గ్ర - హించు కొనవలయును || దేవదేవుని ||

  5. ఇబ్బందిలో ప్రార్ధించండి - అది తీరును - ఎంతో సంతుష్టి పొందండి = జబ్బులో ప్రార్ధించి స్వస్థత - నొందండి - అబ్బును దేవుని - ఆశ్ర యించెడి వాలు || దేవదేవుని ||

  6. దేవుడే మన మానవుండై - యేసు క్రీస్తుగా - వెలసి తిరిగె నీ యిల పై = చావొంది చావును - చంపి జీవించెను - కావున మనకు మో - క్షంబు నమ్మిన యెడల || దేవదేవుని ||

  7. ఎన్ని తిరిగిన పోవు పోవు - పాపంబులు - ఎంత ఏడ్చిన పోవు పోవు ఎన్నాళ్ళు పుణ్యక్రియ - లెన్ని చేసిన పోవు - అన్ని చేసిన క్రీస్తు - నందు నమ్మిన గాని || దేవదేవుని ||




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


55. vaeLa praardhana

raagaM: maayaamaaLavagauLa taaLaM: aaTa



    daeva daevuni mrokkaleMDi - O priyulaaraa - daevaraajuni golvaraMDi = laevaMgaanae tvaragaa - daevuni smariyiMchi aa venka mee panulu = aaraMbhiMchuTa maelu || daevadaevuni ||

  1. maMchamu digagaane modaTa - mOkaaLLooni mana taMDrini talaMchu konuTa = maMchi panulanniTin^ - miMchina pani yaunu - koMchemainanu baddakiMchuTa sarikaadu || daevadaevuni ||

  2. annamu tinuTaku muMdu - vaMdanamulu - aachariMchuTa goppa viMdu = anni daevuDu meeku - aMdiMchunani nammu - konna yeDala aMdu - koMdu raanaMdamutO || daevadaevuni ||

  3. payanamai praardhiMchukoMDi - daevuDu mimmu - padilammugaa naDupu naMDi = bhayamu kalgadu mee - baaTa chadunai yuMDu - rayamugaa veLLuduru - raMjillu mee manassu || daevadaevuni ||

  4. aapadalO praardhiMchukoMDi - adi tappunu - apuDaayananu stutiM chaMDi mee paina daevuniki - meMDaina praemayani - yee panilO meeru gra - hiMchu konavalayunu || daevadaevuni ||

  5. ibbaMdilO praardhiMchaMDi - adi teerunu - eMtO saMtushTi poMdaMDi = jabbulO praardhiMchi svasthata - noMdaMDi - abbunu daevuni - aaSra yiMcheDi vaalu || daevadaevuni ||

  6. daevuDae mana maanavuMDai - yaesu kreestugaa - velasi tirige nee yila pai = chaavoMdi chaavunu - chaMpi jeeviMchenu - kaavuna manaku mO - kshaMbu nammina yeDala || daevadaevuni ||

  7. enni tirigina pOvu pOvu - paapaMbulu - eMta aeDchina pOvu pOvu ennaaLLu puNyakriya - lenni chaesina pOvu - anni chaesina kreestu - naMdu nammina gaani || daevadaevuni ||