64. స్థిమితము లేని బ్రతుకు
- స్థిమితము లేదు గదా - మానవునికి - క్షితి యందు శ్రమలే గదా
- మంచు రాత్రులు హాని - పిమ్మట వచ్చు - మండు వేసవి హాని
= వానా కాలము హాని - వరద దినములు హాని
గాలివాన హాని - ధూళి మేఘము హాని
= ప్రతికాలమును హాని - బ్రతుకంతయును హాని || స్థిమి || - నీటి యోడలు హాని - ప్రయాణములో - నింగి యోడలు హాని
= బండ్ల మీద హాని - వంతెనపై హాని
గనులలోను హాని - పనులన్నిటను హాని
బాటయందున హాని - ఆటయందున హాని
ఒంటియందున హాని - ఇంటియందున హాని
= యుద్ధభూమి హాని - యుద్ధాయుధము హాని || స్థిమి || - ద్రవ్య భాగ్యము హాని - ఇబ్బందులును - దారిద్ర్యంబును హాని
= దొంగ దోపిడి హాని - దూబరి తనము హాని
అప్పు చేయుట హాని - అప్పు తీర్చక హాని
జబ్బు వల్ల హాని - చావు వల్ల హాని
= ప్రతి స్థితియును హాని - బ్రతుకంతయును హాని || స్థిమి || - వేని వలన మేలో - వాని నమర్చి - పెట్టి యున్నాడు తండ్రి
= గాని ఆదిలోనే - మానవ జాతిలో
కాని గుణము చేర - గానే కీడే ప్రతి
దానిలో చొర బడుచు - మానవ హృదయాల
= లో నున్న దైవాభి - మానమున్ తొలగించె || స్థిమి || - విషపు పురుగులు హాని - దూరాన గల - విపిన మృగములు హాని
= పెంపుడు జీవులగు - పిల్లి కుక్క హాని
శత్రువులును హాని - మిత్రులును హాని
బంధువులును హాని - పర జనులును హాని
అధికారులు చేయు- అన్యాయము హాని
వారి మీదను తిరుగు - బాటు చేయుట హాని
రాలు కొండలును లో - హాలు ఇసుకయు హాని
కాయ గూరలు వృ - క్షాదుల్ మూలికల్ హాని
= అన్నియును హాని - అందరును హాని || స్థిమి || - అన్ని వేళల హాని - మనకందరకును - అన్ని ప్రక్కలును హాని
= భూమి శాపము బొందె - ముండ్లందు చేతనె
చెమటోర్చి పురుషుండు - సేద్యంబు జేయును
ప్రసవ వేదన స్త్రీకి - ప్రాణ భీతిగ నుండు
బిడ్డలు లేకున్న - బిడియముగా నుండు
భార్య భర్తల మైత్రి - పాడై పోవుచు నుండు
ఎంత జాగ్రత్తయున్న - యెదోయొక జబ్బుండు
ఎప్పటికైనను - తప్పదు మరణంబు
వాన కురియకున్న - పంట పండదు కరువు
వాన అధికమైన - పంట నాశనమౌను
పిడుగు తప్పుకొనెడి - వీలు లేక యుండు
= భూకంపమున పారి - పోవు - గడువుండదు || స్థిమి || - వాదాలు అలల వలెనె - జన సముద్రాన - వాగు చున్నవి ఘోష
= భేదాభిప్రాములు - ఛేదించు చున్నవి
వేదించు మనస్సును - విశ్రాంతి యుండదు
సాధించి పంతాలు - సఫలులౌ చుందురు
మాది సరియైనది - మీదే సరిగాదంచు
వేదాలలో నుండి - వివిధ వచనా లెత్తి
= బోధింప నుభయులకు - పోరాటములు గల్గు || స్థిమి || - దేవుడే ఉన్న యెడల - మనకీ కష్ట - స్థితులుండుట యెందుకు?
= సాతానును ఏల - చంపి వేయలేదు?
పాపమాది నేల - ఆపు చేయలేదు?
పాప విసర్జన - బలమేల ఇయ్యడు?
పడు వరకును ఉండి - పడగ, పడగ, పడగ,
నరకమున వేయుట - న్యాయమై యుండునా
పాపములు చేయించు - వాడునతడె అతడె
చేసిన తరువాత - శిక్షించు వాడతడె
ఇదియేమి న్యాయంబు - ఎవరికిది సరిపడును
= ఈరీతిగా తప్పు - లెంచు చున్నారకట || స్థిమి || - దేవ వ్యక్తియే లేడు - మోక్షము లేదు - దేవ దూతలును లేరు
= సాతానులేడు పి - శాచములు లేవు
శాశ్వతమగు నరక - స్థలము లేనే లేదు
మనసు సబబుగ నెంచు - పనులు చేయవచ్చు
నరులిన్ని శ్రమలందు - నలిగిపోవు చుండ
తండ్రి ఊరుకొనుట - దయకాదు దయకాదు
అనుచును కొందరు బో - ధన చేయు చున్నారు
ఇన్ని మాట లేల - ఇదిగో మీకొక సలహా || స్థిమి || - పాపంబు భువికి వచ్చె - దానివలన - శాపంబు గూడ జొచ్చె
= పాపంబుల కన్న - పాప ఫలితంబులె
ఎక్కువ బాధగ - ఎంచు చుందురు జనులు
పాప పరిహారము - శాప పరిహారంబు
కోరువారు త్వరగ - మారుమనసు పొంది
మోక్ష లోకము జేర - మొదట స్పష్ట మైన
= అది దేవుని కృపను - ఆశ్రయించిన మేలు || స్థిమి || - అందరకును దేవుడు - అడిగిన యెడల - అగుపడడు ఎందుకు?
= అగుపడుచును, మాట - లాడ కుండుట యేల?
కలలు దర్శనములు - కల్ల, కల్ల, కల్ల
లేని దేవుని తలచి - లేని వారైనారు
దేవుడు లేడనుట - స్థిరమైనట్టి బోధ
పాటుపడిన మనకు - బ్రతుకు వర్ధిల్లును
ప్రార్ధనల వల్ల - ఫలమేమియును లేదు
కొందరిట్లు విసుగు - కొనుచు అనుచున్నారు. || స్థిమి || - వివిధ మతముల వల్లనే - సహవాసము - విచ్చిన్నమై పోయెను
= బోధలలో చాలా - భేదాలు కనిపించు
ఒకరిట్లను చున్నారు - ఒకరట్లను చున్నారు
ఏది సత్యంబో తల - ఎగిరి పోవుచున్నది
మత భేదము లితర - మత భక్తులను చంపె
తండ్రి దొక మతమాయె - తనయుని దొక మతమాయె
మతము వల్ల ఈ - మనుజుడు చెడిపోయె
మతము లెందుకు మనకు - మతి చెడుటకే గాని
అని కొందరు యిట్లు - అడుగు చున్నారయ్యో
మతములన్నియు నొక్క- మతముగ గల్పిన
నేడు మనకందరకు - నిండు నెమ్మది దొరుకు || స్థిమి || - పరిశుద్ద దేవుడెట్లు - కారకుడౌను - పాపంబులకు ఫలములకు
= పరిశుద్ధుడే నరుని - పాపానికి నడిపిన
పరిశుద్ధుడే గొప్ప - పాపాత్ముడై యుండు
తల్లి తను కనియున్న - పిల్లన్ చెడ గొట్టునా!
సృష్టికర్త యేల - సృష్టిన్ చెడగొట్టును?
పరిశుద్ధ దేవుని - పద్దతుల్ విషయాలు
సరిగ తెలియకున్న - సద్ధణిగి యుండుట
నరునికి క్షేమంబు - నరునికి సౌఖ్యంబు
ఉన్న దేవుడు లే - డన్న మాట విన్న
ఉన్నాడని నమ్ము - కొన్న చూడ బోగా
ఉన్న పరలోకమున- ఉత్సహింపగలము
ఉన్న లేడన్న యెడల - ఉండకుండునే? క్షోభ || స్థిమి || - తన దివ్య లక్షణములు - దేవుడాదిన్ - మనలో పెట్టివేసెను
= సరిగా వాటిని వాడు - స్వాతంత్ర్య మిచ్చెను
అది వాడనప్పుడు - అపరాధము గలుగును
తప్పు తెల్పు జ్ఞాన - దారుఢ్యము గలదు
గనుక దేవుని వేడ - గల్గును విజయంబు
దేవునిలో తప్పు - దేవినా కనపడదు
అందుచే దేవునికి - వందనార్పణ తగును
అపరాధ కాలమున - అడ్డు వచ్చిన యెడల
ఇచ్చిన స్వాతంత్ర్య - మియ్యనట్టె యగును
కొన్నిటిలో ఊరు - కొనడు హేతువు గలదు
ఊరకె ఉండుట - ఊరుకొన కుండుట
= కనిపెట్టి దేవుని - ఘన పర్చుట మేలు || స్థిమి || - లోకాలు వాటికవియె - కల్గెనుగాని - ఏ కారకుడును లేడు
= అని కొందరను కొనుచు - హర్షించు చున్నారు
దైవమును తనకు - తానే కల్గినాడు
అని ఎందుకనరాదు - అని అడుగుట సబబు
సృష్టి నైజంబు మన - దృష్టికి అగబడుట
దైవ నైజంబు మన - దృష్టికి కానకుండు
తలపులు కూడ మన - కన్నులకు కానకుండు
కనబడనివి లే - వని చెప్పవచ్చునా!
దేవుండు పావనుండు - దేవుండు జ్ఞానియును
శక్తి మంతుండునై - సర్వ కార్యంబులు
క్రమము ననుసరించి - కలిగించి యున్నాడు
మానవుని పోలిన - మానవుండు లేడు
పక్షిని పోలిన - పక్షియును లేదు
వస్తువును పోలిన - వస్తువును లేదు
దేవుడెంత గొప్ప - దేవుడై యున్నాడు
స్తోత్రంబుల వెంబడి - స్తోత్రములు చేయుదము || స్థిమి || - తమది ఏమతమును కాదు - అని కొందరు - తరచుగా అనుచున్నారు
= అట్లు అనుటవారి - అనుకూల మతమగును
ఏ నలుసు మతమైన - లేని నరుడే లేడు
సమ్మతమే మతమన్న - సామెత గలదొకటి
జ్ఞానమే సంగతులు - మానవునికి తెల్పును
తన మనస్సాక్షియె - అనుమతించును వాటిన్
ఈ రెండును మనకు - హిత బోధ చేయును
గాని ప్రతి దినమును - ధ్యానింప వలయును
అప్పుడు మనశ్శాంతి - ఆవరించు కొనును
ప్రతి తలంపునకును - ప్రతి నోటి మాటకును = ప్రతి కార్యమునకును - ప్రతి ఫలముండును || స్థిమి || - నరులకు స్వాతంత్ర్యము - దేవుడిచ్చు - వరములలో ముఖ్యము
= పనిలో వరములు వాడు - కొనుటకది సాధనము
ఎవరి మతమువారు - వివరించు కొనవచ్చు
గాని భేదమున్న - కలహింప కూడదు
ఏమతము నైనను - ఏ మనుష్యునైనను
తుంచనాడుట మిగుల - దోషమై యుండును
= సహ మానవుల నెల్ల - సన్మానింప వలయు || స్థిమి || - బోధలన్నిటి కన్నను - ఎక్కువైన - బోధ వినిపింతునిప్పుడు
= దినమున కొక గంట - మనసున మీ అంశ
మును ధ్యానమున బెట్టి - కనిపెట్టు చుండిన
అనుకొన్నవి మీకు - అవలీలగా దొరుకు
హిందూదేశము లోని - ఋషులు దీర్ఘధ్యాన
కాలము నెంతయో - గౌరవించి రనుట
అతిశయోక్తి కాదు - ఆనందకరమైన
వృత్తాంతముగ నెంచి - వివరించు కొనవలయు
చెప్పవలసిన వన్ని - చెప్పినాము ధ్యాన
= మాపకున్న పార - మార్ధికు లౌదురు || స్థిమి ||
= శ్రమలే ఎచ్చోటను - శ్రమలే ఏ వేళను
శ్రమలు పోగా క్రొత్త - శ్రమలు వచ్చు చుండును
శ్రమలే మనము బ్రతుకు - సమయంబు పొడుగున
శ్రమ పెట్టుచున్నవి - సౌఖ్యమేది మనకు
= తమలో కొందరిట్లు - తలచుకొను చున్నారు || స్థిమి ||
= ధ్యానములో నుండండి - జ్ఞానమిచ్చును సలహా
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
64. sthimitamu laeni bratuku
- sthimitamu laedu gadaa - maanavuniki - kshiti yaMdu Sramalae gadaa
- maMchu raatrulu haani - pimmaTa vachchu - maMDu vaesavi haani
= vaanaa kaalamu haani - varada dinamulu haani
gaalivaana haani - dhooLi maeghamu haani
= pratikaalamunu haani - bratukaMtayunu haani || sthimi || - neeTi yODalu haani - prayaaNamulO - niMgi yODalu haani
= baMDla meeda haani - vaMtenapai haani
ganulalOnu haani - panulanniTanu haani
baaTayaMduna haani - aaTayaMduna haani
oMTiyaMduna haani - iMTiyaMduna haani
= yuddhabhoomi haani - yuddhaayudhamu haani || sthimi || - dravya bhaagyamu haani - ibbaMdulunu - daaridryaMbunu haani
= doMga dOpiDi haani - doobari tanamu haani
appu chaeyuTa haani - appu teerchaka haani
jabbu valla haani - chaavu valla haani
= prati sthitiyunu haani - bratukaMtayunu haani || sthimi || - vaeni valana maelO - vaani namarchi - peTTi yunnaaDu taMDri
= gaani aadilOnae - maanava jaatilO
kaani guNamu chaera - gaanae keeDae prati
daanilO chora baDuchu - maanava hRdayaala
= lO nunna daivaabhi - maanamun^ tolagiMche || sthimi || - vishapu purugulu haani - dooraana gala - vipina mRgamulu haani
= peMpuDu jeevulagu - pilli kukka haani
Satruvulunu haani - mitrulunu haani
baMdhuvulunu haani - para janulunu haani
adhikaarulu chaeyu- anyaayamu haani
vaari meedanu tirugu - baaTu chaeyuTa haani
raalu koMDalunu lO - haalu isukayu haani
kaaya gooralu vR - kshaadul^ moolikal^ haani
= anniyunu haani - aMdarunu haani || sthimi || - anni vaeLala haani - manakaMdarakunu - anni prakkalunu haani
= bhoomi Saapamu boMde - muMDlaMdu chaetane
chemaTOrchi purushuMDu - saedyaMbu jaeyunu
prasava vaedana streeki - praaNa bheetiga nuMDu
biDDalu laekunna - biDiyamugaa nuMDu
bhaarya bhartala maitri - paaDai pOvuchu nuMDu
eMta jaagrattayunna - yedOyoka jabbuMDu
eppaTikainanu - tappadu maraNaMbu
vaana kuriyakunna - paMTa paMDadu karuvu
vaana adhikamaina - paMTa naaSanamaunu
piDugu tappukoneDi - veelu laeka yuMDu
= bhookaMpamuna paari - pOvu - gaDuvuMDadu || sthimi || - vaadaalu alala valene - jana samudraana - vaagu chunnavi ghOsha
= bhaedaabhipraamulu - ChaediMchu chunnavi
vaediMchu manassunu - viSraaMti yuMDadu
saadhiMchi paMtaalu - saphalulau chuMduru
maadi sariyainadi - meedae sarigaadaMchu
vaedaalalO nuMDi - vividha vachanaa letti
= bOdhiMpa nubhayulaku - pOraaTamulu galgu || sthimi || - daevuDae unna yeDala - manakee kashTa - sthituluMDuTa yeMduku?
= saataanunu aela - chaMpi vaeyalaedu?
paapamaadi naela - aapu chaeyalaedu?
paapa visarjana - balamaela iyyaDu?
paDu varakunu uMDi - paDaga, paDaga, paDaga,
narakamuna vaeyuTa - nyaayamai yuMDunaa
paapamulu chaeyiMchu - vaaDunataDe ataDe
chaesina taruvaata - SikshiMchu vaaDataDe
idiyaemi nyaayaMbu - evarikidi saripaDunu
= eereetigaa tappu - leMchu chunnaarakaTa || sthimi || - daeva vyaktiyae laeDu - mOkshamu laedu - daeva dootalunu laeru
= saataanulaeDu pi - Saachamulu laevu
SaaSvatamagu naraka - sthalamu laenae laedu
manasu sababuga neMchu - panulu chaeyavachchu
narulinni SramalaMdu - naligipOvu chuMDa
taMDri oorukonuTa - dayakaadu dayakaadu
anuchunu koMdaru bO - dhana chaeyu chunnaaru
inni maaTa laela - idigO meekoka salahaa || sthimi || - paapaMbu bhuviki vachche - daanivalana - SaapaMbu gooDa jochche
= paapaMbula kanna - paapa phalitaMbule
ekkuva baadhaga - eMchu chuMduru janulu
paapa parihaaramu - Saapa parihaaraMbu
kOruvaaru tvaraga - maarumanasu poMdi
mOksha lOkamu jaera - modaTa spashTa maina
= adi daevuni kRpanu - aaSrayiMchina maelu || sthimi || - aMdarakunu daevuDu - aDigina yeDala - agupaDaDu eMduku?
= agupaDuchunu, maaTa - laaDa kuMDuTa yaela?
kalalu darSanamulu - kalla, kalla, kalla
laeni daevuni talachi - laeni vaarainaaru
daevuDu laeDanuTa - sthiramainaTTi bOdha
paaTupaDina manaku - bratuku vardhillunu
praardhanala valla - phalamaemiyunu laedu
koMdariTlu visugu - konuchu anuchunnaaru. || sthimi || - vividha matamula vallanae - sahavaasamu - vichchinnamai pOyenu
= bOdhalalO chaalaa - bhaedaalu kanipiMchu
okariTlanu chunnaaru - okaraTlanu chunnaaru
aedi satyaMbO tala - egiri pOvuchunnadi
mata bhaedamu litara - mata bhaktulanu chaMpe
taMDri doka matamaaye - tanayuni doka matamaaye
matamu valla ee - manujuDu cheDipOye
matamu leMduku manaku - mati cheDuTakae gaani
ani koMdaru yiTlu - aDugu chunnaarayyO
matamulanniyu nokka- matamuga galpina
naeDu manakaMdaraku - niMDu nemmadi doruku || sthimi || - pariSudda daevuDeTlu - kaarakuDaunu - paapaMbulaku phalamulaku
= pariSuddhuDae naruni - paapaaniki naDipina
pariSuddhuDae goppa - paapaatmuDai yuMDu
talli tanu kaniyunna - pillan^ cheDa goTTunaa!
sRshTikarta yaela - sRshTin^ cheDagoTTunu?
pariSuddha daevuni - paddatul^ vishayaalu
sariga teliyakunna - saddhaNigi yuMDuTa
naruniki kshaemaMbu - naruniki saukhyaMbu
unna daevuDu lae - Danna maaTa vinna
unnaaDani nammu - konna chooDa bOgaa
unna paralOkamuna- utsahiMpagalamu
unna laeDanna yeDala - uMDakuMDunae? kshObha || sthimi || - tana divya lakshaNamulu - daevuDaadin^ - manalO peTTivaesenu
= sarigaa vaaTini vaaDu - svaataMtrya michchenu
adi vaaDanappuDu - aparaadhamu galugunu
tappu telpu j~naana - daaruDhyamu galadu
ganuka daevuni vaeDa - galgunu vijayaMbu
daevunilO tappu - daevinaa kanapaDadu
aMduchae daevuniki - vaMdanaarpaNa tagunu
aparaadha kaalamuna - aDDu vachchina yeDala
ichchina svaataMtrya - miyyanaTTe yagunu
konniTilO ooru - konaDu haetuvu galadu
oorake uMDuTa - oorukona kuMDuTa
= kanipeTTi daevuni - ghana parchuTa maelu || sthimi || - lOkaalu vaaTikaviye - kalgenugaani - ae kaarakuDunu laeDu
= ani koMdaranu konuchu - harshiMchu chunnaaru
daivamunu tanaku - taanae kalginaaDu
ani eMdukanaraadu - ani aDuguTa sababu
sRshTi naijaMbu mana - dRshTiki agabaDuTa
daiva naijaMbu mana - dRshTiki kaanakuMDu
talapulu kooDa mana - kannulaku kaanakuMDu
kanabaDanivi lae - vani cheppavachchunaa!
daevuMDu paavanuMDu - daevuMDu j~naaniyunu
Sakti maMtuMDunai - sarva kaaryaMbulu
kramamu nanusariMchi - kaligiMchi yunnaaDu
maanavuni pOlina - maanavuMDu laeDu
pakshini pOlina - pakshiyunu laedu
vastuvunu pOlina - vastuvunu laedu
daevuDeMta goppa - daevuDai yunnaaDu
stOtraMbula veMbaDi - stOtramulu chaeyudamu || sthimi || - tamadi aematamunu kaadu - ani koMdaru - tarachugaa anuchunnaaru
= aTlu anuTavaari - anukoola matamagunu
ae nalusu matamaina - laeni naruDae laeDu
sammatamae matamanna - saameta galadokaTi
j~naanamae saMgatulu - maanavuniki telpunu
tana manassaakshiye - anumatiMchunu vaaTin^
ee reMDunu manaku - hita bOdha chaeyunu
gaani prati dinamunu - dhyaaniMpa valayunu
appuDu manaSSaaMti - aavariMchu konunu
prati talaMpunakunu - prati nOTi maaTakunu = prati kaaryamunakunu - prati phalamuMDunu || sthimi || - narulaku svaataMtryamu - daevuDichchu - varamulalO mukhyamu
= panilO varamulu vaaDu - konuTakadi saadhanamu
evari matamuvaaru - vivariMchu konavachchu
gaani bhaedamunna - kalahiMpa kooDadu
aematamu nainanu - ae manushyunainanu
tuMchanaaDuTa migula - dOshamai yuMDunu
= saha maanavula nella - sanmaaniMpa valayu || sthimi || - bOdhalanniTi kannanu - ekkuvaina - bOdha vinipiMtunippuDu
= dinamuna koka gaMTa - manasuna mee aMSa
munu dhyaanamuna beTTi - kanipeTTu chuMDina
anukonnavi meeku - avaleelagaa doruku
hiMdoodaeSamu lOni - Rshulu deerghadhyaana
kaalamu neMtayO - gauraviMchi ranuTa
atiSayOkti kaadu - aanaMdakaramaina
vRttaaMtamuga neMchi - vivariMchu konavalayu
cheppavalasina vanni - cheppinaamu dhyaana
= maapakunna paara - maardhiku lauduru || sthimi ||
= Sramalae echchOTanu - Sramalae ae vaeLanu
Sramalu pOgaa krotta - Sramalu vachchu chuMDunu
Sramalae manamu bratuku - samayaMbu poDuguna
Srama peTTuchunnavi - saukhyamaedi manaku
= tamalO koMdariTlu - talachukonu chunnaaru || sthimi ||
= dhyaanamulO nuMDaMDi - j~naanamichchunu salahaa