74. కలుగ జేయలేదు
రాగం: కళ్యాణి తాళం: రూపకం
- కలుగ జేయలేదు - ఘన దేవుండైన తండ్రి - కళ లేనట్టివి, మన
కన్నుల కందగ నట్టివి = మలిన పదార్ధంబులు, చేతుల కంట - రానట్టివి
బలహీనములైనట్టివి - దుష్ఫలములు, దుర్భుద్దులు || కలుగ ||
- దేవుండు లేడనుట - యే వస్తువునైన మ్రొక్కుట - దేవుని దూషించుట సద్భావము లేకుండుట = దేవుని గూర్చి యపార్ధము - ధిక్కరించి మెలగుట సేవలు పూజలు మానుట - యీవిధంబు దుర్భుద్దులు || కలుగ ||
- గౌరవింపక పెద్దవారిని ఎదిరించుట - చేరి పరుల తిట్టుట - పేదవారి చంపి చంపుకొనుట = ఊరకనె సోమరిగ గూరుచుండుట త్రాగుట పేరాశ - నిరాశ యసూయ - కౄరత్వంబు నశుభ్రత || కలుగ ||
- బిడియము చెందుట - మోహముపడి వ్యభిచారము - ద్రోహముబడి కొట్టుకొనుట = స్వలాభము కొరకై పాటుపడుట గుడి గోపురము నైనను - తడివి కొని దొంగిలించుట - చెడి జూద మాడుటయు - పైబడి లంచాలు కొనుట || కలుగ ||
- పరుల పేరు చెడగొట్టుట - మరి చాడీలు చెప్పుట - కరుణలేక నన్యాయము = దొరలించి - యసత్యమాడుట - చిరునవ్వుతో ముఖ స్తుతి చేయుట - త్వరపడి యనుమానించుట వెరువక నబద్ధ సాక్ష్యము - కోర కలిగెడి దుర్భుద్దులు || కలుగ ||
- కృతజ్ఞత లేనిస్థితి - మతిలేని తనంబు మరుపు - మత వాదములు అజ్ఞానము = అతి సౌఖ్యంబు గర్వంబును స్తుతి చేయ - మాని వేయుట మృతి విశ్వాసము కలుగుట ప్రతివిషయంబున అనాగరిత గలిగిన దుర్భుద్ధులు || కలుగ ||
- పాప ఫలితములైన శాపములు - ననర్ధములు భూ ఫలములు నాశన మగుట - ముండ్ల తుప్పలు మొలుచుట = తాపము భూకంపము - సంతాన విహీనము భోజన లోపము - విష జంతువుల ప్రతాపము - ఇబ్బంది కరువులు || కలుగ ||
- మనస్సు వేదన గ్రుడ్డి తనము - పిచ్చి చెవుడు కుంటి తనము - వాతములు కాకలును క్షయ ఉబ్బసము = తనువున కుష్టి మసూచికమును జ్వరమును వాంతి భేదియును రక్త స్రావనమును అతిసారము అజీర్తి || కలుగ ||
- నిజముగ దేవుడు పాపపు నైజంబును - మనుజులలో సృజియించిన పాపియని - పించుకొనడా యోచించుము = సజ్జనుల కష్టంబును గూర్చి రక్షించు దేవుడు విజయము చేసెను - క్రీస్తుగ వృజినమ్ము కలుగజేయునా || కలుగ ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
74
raagaM: kaLyaaNi taaLaM: roopakaM
- kaluga jaeyalaedu - ghana daevuMDaina taMDri - kaLa laenaTTivi, mana
kannula kaMdaga naTTivi = malina padaardhaMbulu, chaetula kaMTa - raanaTTivi
balaheenamulainaTTivi - dushphalamulu, durbhuddulu || kaluga ||
- daevuMDu laeDanuTa - yae vastuvunaina mrokkuTa - daevuni dooshiMchuTa sadbhaavamu laekuMDuTa = daevuni goorchi yapaardhamu - dhikkariMchi melaguTa saevalu poojalu maanuTa - yeevidhaMbu durbhuddulu || kaluga ||
- gauraviMpaka peddavaarini ediriMchuTa - chaeri parula tiTTuTa - paedavaari chaMpi chaMpukonuTa = oorakane sOmariga gooruchuMDuTa traaguTa paeraaSa - niraaSa yasooya - kRuratvaMbu naSubhrata || kaluga ||
- biDiyamu cheMduTa - mOhamupaDi vyabhichaaramu - drOhamubaDi koTTukonuTa = svalaabhamu korakai paaTupaDuTa guDi gOpuramu nainanu - taDivi koni doMgiliMchuTa - cheDi jooda maaDuTayu - paibaDi laMchaalu konuTa || kaluga ||
- parula paeru cheDagoTTuTa - mari chaaDeelu cheppuTa - karuNalaeka nanyaayamu = doraliMchi - yasatyamaaDuTa - chirunavvutO mukha stuti chaeyuTa - tvarapaDi yanumaaniMchuTa veruvaka nabaddha saakshyamu - kOra kaligeDi durbhuddulu || kaluga ||
- kRtaj~nata laenisthiti - matilaeni tanaMbu marupu - mata vaadamulu aj~naanamu = ati saukhyaMbu garvaMbunu stuti chaeya - maani vaeyuTa mRti viSvaasamu kaluguTa prativishayaMbuna anaagarita galigina durbhuddhulu || kaluga ||
- paapa phalitamulaina Saapamulu - nanardhamulu bhoo phalamulu naaSana maguTa - muMDla tuppalu moluchuTa = taapamu bhookaMpamu - saMtaana viheenamu bhOjana lOpamu - visha jaMtuvula prataapamu - ibbaMdi karuvulu || kaluga ||
- manassu vaedana gruDDi tanamu - pichchi chevuDu kuMTi tanamu - vaatamulu kaakalunu kshaya ubbasamu = tanuvuna kushTi masoochikamunu jvaramunu vaaMti bhaediyunu rakta sraavanamunu atisaaramu ajeerti || kaluga ||
- nijamuga daevuDu paapapu naijaMbunu - manujulalO sRjiyiMchina paapiyani - piMchukonaDaa yOchiMchumu = sajjanula kashTaMbunu goorchi rakshiMchu daevuDu vijayamu chaesenu - kreestuga vRjinammu kalugajaeyunaa || kaluga ||