20. క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు



    దేవ స్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో - దేవమారు గానముల్ భూ - దేశ స్థలములో = దేవలోక పావనులును - దీన నరులును బోవ జూడ - భువి దివి క్రిస్మస్ (లూకా 2:9-14)|| దేవ ||

  1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో - పవ్వళించి యున్న దేవ బాల యేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను (ఆది 3:15) || దేవ ||

  2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - భోగమొందెను (ఆది 9:26) || దేవ ||

  3. అందరి వంశంబులు నీ - యందు దీవెన - బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు = అందె క్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ - విశ్వమంతటన్ (ఆది 12:3) || దేవ ||

  4. షీలో వచ్చువరకు యూ - దాలో నిలుచుచు - నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ - పాలకుండౌ - బాలుడు జన్మించెన్ (ఆది 49:10) || దేవ ||

  5. అక్షయమగు చుక్క యొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట వలయు - ను ధాత్రి పై = రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడుదయించె (సంఖ్యా 24:17) || దేవ ||

  6. పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ - నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప - దేవ పుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను (ద్వితీ 18:18) || దేవ ||

  7. మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండె తోడు - నిరతము వరకున్ - దరిని దేవుడుండు గాన - వెరవమెన్నడున్ - పరమ దేవుని సహ - వాసము లభించున్ (యెష 7:14) || దేవ ||

  8. మన నిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదీయదు వినయ భూషణులకు - వేళవచ్చెను (యెష 9:6) || దేవ ||

  9. మొలకలెత్తవలె యెష్షయి - మొద్దునందున - ఫలము లేని మోడు నరుల - వంశ వృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధ - కరుడు వచ్చెను (యెష 11:1) || దేవ ||

  10. 1ఖలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి - పలు విధంబులైన యట్టి - పాప చీకటుల్ = తొలగ జేసి శుద్ధకాంతి - కలుగ జేయను - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో (యెష 9:2) || దేవ ||

  11. అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు - నిల్పవలెను తనదు జన్మ - నిజ చరిత్రను = అల్పులందు సైతమల్ప - మైన యూళ్ళలో - స్వల్ప రక్ష - స్థాపకుడై వచ్చె (మీక 5:2) || దేవ ||

  12. ఆడి తప్పనట్టి దేవ - అనంత స్తోత్రముల్ - నాడు పల్కు వాగ్ధా - నముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు - నీ సుతునంపి - కీడుల్ బాపు - క్రిస్మసుగల్గె (2కొరింథి 1:20) || దేవ ||

  13. నీ నిజ వాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమ నీ - దానామూల్య - జ్ఞాన మొసగుమీ (లూకా 2:29-32) || దేవ ||

  14. గగనమందు క్రిస్మసుండు - గాన కీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు స్థవము గల్గుత = యుగ యుగముల వరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్య గీతముల్ (లూకా 2:14) || దేవ ||



1. పాపులు




Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&

20. krismas^ pravachanamula neravaerpu



    daeva stOtragaanamul^ pai - divya sthalamulO - daevamaaru gaanamul^ bhoo - daeSa sthalamulO = daevalOka paavanulunu - deena narulunu bOva jooDa - bhuvi divi krismas^ (lookaa 2:9-14)|| daeva ||

  1. avvakichchinaTTi vaakku - adigO toTTilO - pavvaLiMchi yunna daeva baala yaesulO = ivvidhamuga saphalamaayae - eedinaMbuna navvumOmu - naruni kabbenu (aadi 3:15) || daeva ||

  2. shaemu daeva vaMdanaMbu - cheppabaDiyenu bhoomi stutula naMdu koneDi - poojaneeyuDu = bhoomipaina naruDugaanu - buTTavachchenu bhoomi krismas^ - bhOgamoMdenu (aadi 9:26) || daeva ||

  3. aMdari vaMSaMbulu nee - yaMdu deevena - boMdunaMchu nabraamunaku naMdenuvaakku = aMde kreestu yoodulakunu anyajanulakun^ viMdu krismas^ - viSvamaMtaTan^ (aadi 12:3) || daeva ||

  4. sheelO vachchuvaraku yoo - daalO niluchuchu - naeluraaju daMDa muMDu nepuDu tolagadu = naelameeda nityaSaaMti paalanajaeya - paalakuMDau - baaluDu janmiMchen^ (aadi 49:10) || daeva ||

  5. akshayamagu chukka yokaTi - yaakObulO - lakshaNamuga buTTa valayu - nu dhaatri pai = rakshaNaardhulae sadaa ni - reekshiMcheDu nakshatraMbagu rakshakuDudayiMche (saMkhyaa 24:17) || daeva ||

  6. puTTavalayu mOshaevaMTi - poorNa pravakta - eTTivaaralaina neruga - naTTi dharmamul^ - diTTamuganu sthaapiMpa - daeva putruDu - puTTen^ goppa - bOdhakuDaayenu (dvitee 18:18) || daeva ||

  7. mariya putra naama - mimmaanuyaelagun^ - narulaku daevuMDe tODu - niratamu varakun^ - darini daevuDuMDu gaana - veravamennaDun^ - parama daevuni saha - vaasamu labhiMchun^ (yesha 7:14) || daeva ||

  8. mana nimittamaina SiSuvu - mahini buTTenu - chanuvuga darijaera SiSuvu - svaamiyaayenu = tanuvu rakshaNanu gaNiMpa - venukadeeyadu vinaya bhooshaNulaku - vaeLavachchenu (yesha 9:6) || daeva ||

  9. molakalettavale yeshshayi - moddunaMduna - phalamu laeni mODu narula - vaMSa vRkshamu = viluvagalugu nityajeeva - phalamuliDuTakai kaLagala janmaardha - karuDu vachchenu (yesha 11:1) || daeva ||

  10. 1khalulu cheekaTin^ naDuchuchu - veluguchoochiri - palu vidhaMbulaina yaTTi - paapa cheekaTul^ = tolaga jaesi SuddhakaaMti - kaluga jaeyanu - velugugaa daevuDu - velase dhaatrilO (yesha 9:2) || daeva ||

  11. alpamaina betlehaemu - naMduna kreestu - nilpavalenu tanadu janma - nija charitranu = alpulaMdu saitamalpa - maina yooLLalO - svalpa raksha - sthaapakuDai vachche (meeka 5:2) || daeva ||

  12. aaDi tappanaTTi daeva - anaMta stOtramul^ - naaDu palku vaagdhaa - namula nanniTin^ = naeDu neravaerchinaavu - nee sutunaMpi - keeDul^ baapu - krismasugalge (2koriMthi 1:20) || daeva ||

  13. nee nija vaagdhattamulanu - nityamu nammi - vaani neravaerpulu vini - vaTTivi yanaka = maanasamuna nanubhaviMchu - manasu - neeyuma nee - daanaamoolya - j~naana mosagumee (lookaa 2:29-32) || daeva ||

  14. gaganamaMdu krismasuMDu - gaana keertulau - jagatiyaMdu krismasuMDu sthavamu galguta = yuga yugamula varaku traiku - DoMdu praNutulu sogasuga barigeDu - chOdya geetamul^ (lookaa 2:14) || daeva ||



1. paapulu