జ్ఞాతవ్యము 7: Father M. Devadas
పునరుత్థాన సూక్తులు
యేసుక్రీస్తు తన పునరుత్థాన బలముచే
- 1) మరణమును,
- 2) సమాధిని,
- 3) రాయి (అడ్డులను),
- 4) ముద్రను,
- 5) కావలి వారిని,
- 6) దయ్యములను,
- 7) సాతానును, అన్నింటిని జయించినారు.
- 1) తండ్రి చేయగలిగిన కార్యములన్నిటినిగూర్చి ప్రార్ధించవలెను. ఏలాగు అనగా ప్రార్ధన తండ్రి చేతిని కదలించును. తండ్రి చేయి ప్రపంచమంతటిని కదలించును. అప్పుడు మనకన్నియు సఫలమగును. గనుక నిత్యము ప్రార్ధన చేయవలెను.
- 2) దేవుని కృప వలన మంచి నమాధానవు మాటలే రానిమ్ము.
- 3) ఓర్పును సాధించుము. చెడుగులను ఆర్పుము, వాక్యము నేర్పుము.
- 4) చూచుటకు మెత్తగా కనబడుము. పద్ధతులు స్థిరముగా ఉంచుము.
- 5) ప్రకాశమానముగా ఉండుము.
- 6) నీ నీడవలె వినయము నిన్ను వెంబడించవలెను.
- 7) దేవుని నిమిత్తమే మనుష్యులను గూర్చి మాట్లాడుము.
- 8) జీవితమునకు తగినట్లుగా ఉండుము.
- 9) నీ మనసును నీ సేవకునిగా చేయుము. అది నీకు లోబడునట్లు చేయుము.
- 10) పరిశుద్దాత్మ బాప్తిస్మము నీకు ఇంటియొద్దను, ప్రతిచోటను సహాయపడును.
- 11) ప్రతివారు తేటగా చూడగల కిటికివలెను నీ జీవితము ఉండవలెను.
- 12) మూడు లోకములు కలగి నిన్ను పరీక్ష చేయుటకు ఆహ్వానించు జీవితము కలిసి యుండవలెను.
- 13) నీ పాదములు ఒకప్పుడు పాతాళమందు దిగినట్లయిన, ఆ స్థితి కనబడినను భయపడక, ఆత్మను పవిత్రముగా గాలిలో నిలువబెట్టుకొనుము.
- 14) నీ ప్రవర్తన విషయము జాగ్రత్తగా నుండవలెను. అప్పుడు నీ ఘనత నిన్ను వెంటాడును.
- 15) చిన్న, పెద్ద విషయములలోకూడ నీవు ఎదుగు అవకాశము తేటగా నుండవలెను. (అవకాశము తేటగా నుండునట్లు అన్నిటిలో శ్రద్ధ వహించుము).
- 16) పరిశుద్ధ సజీవయాగము, పరిశుద్ధ సహవాసము, పరిశుద్ధ విస్తార కార్యభారము కలిగియుండవలెను. (కాడి మోయవలెను).
- 17) పరలోక దర్శన జీవితము, పరిశుద్ధ సహవాసము కలిగి ముందుకు సాగుటకు తెగించి, లోక విషయముల యందు నీవు ఎక్కడ నిలువబడి ఉండరాదు.
- 18) ఏ స్థితియందు అయినను నీ యాత్మను, నీ మనోదృష్టిని నిర్మలముగా నుంచవలెను.
- 19) అన్నిటికంటె ప్రాముఖ్యముగా నీ మనసు దేవుని కన్ను క్రింద నిలువబడి ఉండెనని పరిశీలించి తెలుసుకొనుము.
- 20) చిన్న చిన్న పనులయందు శ్రద్ధ కలిగి చేయవలెను. పెద్ద పెద్ద తలుపులు, చిన్న ఇనుప బందులపై తిరుగుచుండునుగదా. ఎందుకనగా మనము దేవుని కన్నుక్రింద ఉన్నామని పరిశోధించి తెలిసికొనుము.
- 21) ప్రతి విషయములోను సాక్ష్య సువార్తను చెప్పించి, ప్రభువును గౌరవపరచవలెను.
రాకడ వాక్యములు:- లూకా 21:86; యెషయా 26:21; ప॥గీ॥ 1:7; 1థెస్స 1:9,10; మత్తయి 17:21; మార్కు 9:29; మత్తయి 7:22 యెహెజ్కేలు 8:24.
అట్టి పునరుత్థాన సూక్తులలోని పరిపూర్ణమైన భక్తి ఆత్మ తండ్రి మనకు నేర్పించి మేఘమెక్కించునుగాక! ఆమేన్.
ఈ పై సందేశమును దైవజనులైన యం. దేవదాసు అయ్యగారు. 1949 సం॥ము ఏప్రిల్ 17న తేదీన ఉపదేశించిరి.