దైవ సహాయము
"అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారినిచూచి ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను" - మత్తయి 19:26.
ఈ వాక్యములో రెండు కథలు కనిపించుచున్నవి.
- 1) ధనవంతులు
- 2) ఒంటె.
1. దేవుని రాజ్యము సూదిబెజ్జము, ధనవంతుడు దేవుని
రాజ్యములో
ప్రవేశించుట
అసాధ్యమట. బెజ్జములో లొట్టపిట్ట (ఒంటె) దూరుట సాధ్యమట. ఇది మన తలకు
మించిన
కథ. ఎక్కడ ఒంటె ఎక్కడ బెజ్జము? రక్షణ ఇందులోని విషయమైయున్నది. ఒక ఘోరపాపి తన పాప
జీవితమును తలంచుకొని
ఆలోచించినయెడల ఈ కథ
నిజమని తెలియును. నేను మారుమనస్సు పొందలేకపోవుచున్నాను గనుక నాకు రక్షణలేదనుట నిశ్చయమే.
పొందగలిగితే రక్షణ
యున్నది. గాని
నేను పొందలేకపోవుచున్నాను. రక్షణ యిచ్చుట దేవునికి సుళువేగాని నేను పొందుట అసాధ్యమని
అతడొప్పుకొనును. అతని దృష్టిలో
ఎత్తైన గోపురము గల ఒంటెగలదు. అతనిదృష్టిలో కొండలవలె పెరిగియున్న పాపరాశి గలదు. ఆ ఒంటె
బెజ్జములోనికి వెళ్ళగలదా?
అంటే వెళ్ళవచ్చునని చెప్పవచ్చును. దేవుని రాజ్యములోనికి వెళ్ళగలవా అంటే అబ్బా ఎక్కడమాట అని
చెప్పవచ్చును. ప్రభువు
ఇచ్చిన
జవాబు చిత్రముగా నున్నది. పాపియొక్క ఊహ వ్యతిరేకముగా నున్నది. నరులకసాధ్యము ఇది నిజమే.
దేవునికి సాధ్యము ఇది
నిజమే.
ఈ రెండు వ్యతిరేక వృత్తాంతములను పొందుపరచుట ఎట్లు? నాకు వర్తమానము రావడములేదు. పాపికి
అదిగొప్ప ఆదరణ
వాక్యము. దేవా!
రక్షణ పొందుట నాకు అసాధ్యముగానె కనిపించుచున్నది. నీకైతే సాధ్యమని కన్పించుచున్నది. గనుక
రక్షించుమని గొప్ప
పాపి ప్రార్ధింపవచ్చును. నరునికి ఇది గొప్ప ఆధారమైన ఆదరణ వాక్యము. ఒక వరుస
జ్ఞాపకముంచుకొనవలెను. నరుడు
ఎంత పాపియైననను,
రక్షణ ఆశగలిగిన పాపములో వృద్ధి పొందుచున్నప్పుడు అతని మారుమనస్సు నిమిత్తమై దేవుడు ఎంతో
గడువిచ్చును. గనుక ఆ
గడువులో అతడు
ప్రార్ధించినయెడల రక్షణ దొరకును. గడువు ఎట్టిదనగా ఆశను పెంపుచేసే గడువు. ప్రార్ధన చేయించే
గడువు, రక్షణ యెరచూపించే
గడువు.
అతడు రక్షణ పొందేటందుకు ఎన్ని సాధనములు అవసరమో అన్ని సాధనలతోను దొంతలుగా నిండియుండే గడువు.
నరుడు రక్షణ
పొందేటందుకు
దేవుడు చేయవలసినవన్నియు నయానభయాన చేసితీరును. రవ్వంత ఆశ
కనపరచినయెడల అతడు
బాగుపడును. అనగా బాగుపడుటకు దేవుడు సహాయము చేయును. నరుడు తన మనస్సులో అసాధ్యము అనును. దానికి
జవాబుగా దేవుడ నాకు
సాధ్యమే
అనును.
దైవికస్వస్థత గలవారికి రోగికిని జరిగే సంభాషణ వినండి.
బోధకుడు:- నీ జబ్బు ఏలాగున్నది.
రోగి:-
కుదిర్చేవాడైతే
ఇదివరకే కుదుర్చును.
బోధకుడు:- ఇదివరకు సంగతి ఎందుకు? ఇప్పటిమాట చెప్పుచున్నాను. వెనుకటిమాట
మరచిపొమ్ము. కుదర్చగలడు.
నీవు
ముందుకు నడువగలవుగాని గతకాలమునకు అనగా వెనుకకు నడువగలవా? ఆ మాత్రము దానికి వెనుకటి సంగతి
ఎందుకు ఎత్తవలెను.
రోగి:- విశ్వాసముంటేనేగాని కుదర్చడని మీరే అంటారు.
బోధకుడు:- బాగా వినుట, ఆశ, ప్రార్ధన ఇవన్ని
నీకున్నవా?
రోగి:-
ఉండకేమి
ఉంటే కుదుర్చునా? విశ్వాసము లేకపోతే?
బోధకుడు:- విశ్వాసమును కుదుర్చును. అది వచ్చినపిమ్మట
విశ్వాసమును కుదుర్చును!
ఏరోగిలో
ఆశ, వేడుకొనుటయుండదు?
షరా:- ఏ పాపిలో ఆశ, వేడుకొనుట ఉండదు? ఇవి కలిగించిన వారెవరు?
ఆయన నమ్మిక మాత్రము
కలిగించడా?
అందుమీద రక్షణ దయచేయును.
2వ వరుస:- ఒక పాపికి ఆశ ఉండదు. ప్రార్ధన విశ్వాసము లుండవు.
ప్రయత్నములుండవు.
అప్పుడవి
కలిగించుటకు శ్రమలను దేవుడు రానిచ్చును. బోధలకు పంపును. మంచి తలంపులను కలిగించును. వీటినిబట్టి
విశ్వాసము కలుగును.
రక్షణ
దొరుకును.
3వ వరుస:- ఆశ, ప్రార్ధన, విశ్వాసము, ప్రయత్నము ఉండని పాపిసంగతియేమి? కలిగించిన
కలుగని
పాపిసంగతియేమి? ఎంత
చెప్పినను హృదయమును కఠినపరచుకొను పాపి సంగతి ఏమి? పైన ఉదహరింపబడిన ఇద్దరును ప్రభువు చెప్పిన
వాక్యము
చెంతకు చేరగలరు.
ఇతడు చేరడు; వారు చేరువారు గనుక వారి విషయములో ఎన్ని ఆటంకములు వచ్చిన, ఎన్ని ప్రశ్నలు పుట్టిన, ఎంత
బలహీనత
గలిగిన, దేవుడు రక్షించగలడు. అసాధ్యమని
అనుకొనేవారినికూడ రక్షించగలడు.
అసాధ్యము -
సాధ్యమే, అను ఈ వాక్యముయొక్క మొదట మనుష్యుడు, చివర దేవుడు. ఈ వరుసనుగూర్చియే
ప్రభువుచెప్పెను. దేవునిగురించి
ఆలోచనచేస్తే
రక్షణ సాధ్యము! ఇది మనుష్యుల సాధ్యమే. ఈ వాక్యముయొక్క మొదట, చివర, మధ్య అంతట మనిషే ఉండి దేవుని
విషయమును ఆయన
ప్రయత్న విషయమును ఏమిలేకుండా లేనివానికి ఈ వాక్యమేగాని, పైవాక్యముగాని సంబంధింపదు.
షరా:- దేవుడు తన
వాక్యముద్వారా
బయలుపరచిన సంగతినిదాటి వెళ్ళినయెడల, పండుతిన్న అవ్వ పతనము లభించును. అందని పండ్లకు అర్రులు
చాపనేల? దేవుడు మనకు
శరీరసౌఖ్యము, ఆత్మీయ వరములు, జ్ఞానము, శక్తి సంపద, తాత్కాలిక సహాయములు అనుగ్రహించకపోయిన
రక్షణయిస్తే ఇది అంతేచాలు.
ఇట్లు
మనిషి సంతుష్టిపడిన మేలు. ప్రభువు ఇస్తే ఇది అది సంతోషమే అని ఒకరన్నారు. మోక్షములో
అంతస్తులున్నవట అని ఎవరు
గడించగలరు? మోక్షములో ఎక్కడో ఒక్కచోట ప్రవేశించే భాగ్యము దొరికితే అంతేచాలు.
షరా:- ఈ ధనవంతుడు
కృపజీవికాడు, కష్టజీవికాడు, సుకుమారి.
ఈ దినములలో ప్రభువు సంఘవర్తమానములు విన్నవారు పై అంతస్తే
కోరుకొనుచున్నారు.
కష్టాలపాలైతేనేగాని ఆ
అంతస్తు ఎట్లు వచ్చును?