ఏకాంత ప్రార్ధన
"నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసికొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్ధనచేయుము. అప్పుడు రహస్యమందు చూచునీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును" - మత్తయి 6:6
- 1. సంఘములో ప్రార్ధనకూటము జరుపుట అనగా బహిరంగ కూట సమాజము గురించి బైబిలులోనున్నది. అపో॥కార్య॥ 2:1. అట్లే,
- 2. ఏకాంత ప్రార్ధనను గురించి కూడ కలదు అనగా ఒక్కొక్కరు ఎవరికి తెలియకుండా
ప్రార్ధనచేసికొను
ఏర్పాటుగలదు.
ఇది ఈ వచనములో నున్నది. ఇద్దరు ముగ్గురు కలిసిచేసే ప్రార్ధన. మత్తయి 18:16-20లో నున్నది
(యోహాను 1:48-50)
నతానియేలు
అంజూరపుచెట్టు క్రింద చేసినది ఏకాంత ప్రార్ధన, అపో॥కార్య॥ 10 అధ్యా॥లో కొర్నేలీ
ఇంటిలో ప్రార్ధన.
మందితో కూడి రహస్య విషయములనుగూర్చి ప్రార్థించుటకు బిడియపడుదురు. కాబట్టి మన అంశ వచనము చాలాముఖ్యము. చూచు తండ్రియని యున్నది. వినేతండ్రియని వ్రాయవచ్చును. మనస్సులోపలచేసే ప్రార్ధన గనుక, చూచే తండ్రియని వ్రాయబడినది. తలుపువేసికొంటే, హృదయములో ప్రార్థనచేస్తే ఎవరికి తెలియదు. - 3. హృదయ ద్వారములు
మూసినను మన హృదయములోనికి
తొంగి చూడగలడు కొన్ని ప్రార్ధనలకు స్వరములేదు.
- 1) తలంపులు
- 2) హృదయము
- 3) నోరు మూయబడినవి.
తండ్రి హృదయము లోపల ఏయే మూల్గులు గందరగోళములు ప్రయాసములు జరుగుచున్నవో చూడగలడు. ప్రతిఫలము దొరుకుననగాయేమి? ఎంత కష్టమున్న లోపట లోపటనే ప్రార్ధనచేసిన వ్యర్థముకాదు. వ్రాత స్వరములేని అర్జీకీ జవాబైయుండును. నాకొరకు ప్రార్థించుము, ఇంకొకసారి చెప్పుచున్నాను నా కొరకు ప్రార్ధన చేయండని యడిగిన కొందరు ప్రార్ధన చేయరు. మీరైన చేయండని యనినను కొందరు చేయరు. చేయునట్లు ఋజువేమి? వారికి ఆదరణలేదు. నెరవేర్పులేదు గనుక మన అంశప్రకారము, ప్రార్ధన చేయవలెను. ఫలము దొరకదు ఏకాంత ప్రార్ధనలోకూడ ఇద్దరుందురని యొక బోధకుడనుచున్నాడు. మానవుడైన యేసు ప్రభువును, నీవును తండ్రియెదుట మోకరించెదరు. కావున నెరవేర్పునకు ముందు గదిలో గలిగే ఆదరణయే మొదట నెరవేర్పు. నాయకులు కూటములను జరుపునప్పుడు మనోనిదానము కలిగియుండవలెనని చెప్పుచు, మీ హృదయ ద్వారములు మూయండి.
వెనుకనున్న శబ్దములు మీకు వినబడకుండ లోపలికి మంచి తలంపులుగాని చెడ్డతలంపులుగాని రాకుండ మూయండి. ఏకాంత ప్రార్ధనలో తండ్రి సహవాసము దొరుకును. యేసు ప్రభువు అట్లే చేసెను. పేతురు భోజనము సిద్ధమగుచున్నపుడు యొప్పేలో మేడలో ఏకాంత ప్రార్ధనలో నుండెను. భక్తులందరట్లు చేసిరి. అప్పుడు సంపూర్ణ తృప్తి కలుగును. ఒకరి ధ్యానములో మనము పాల్గొనలేము. ఎవరి ధ్యానము వారిదే. సాధు సుందరసింగు దినమంతయు ధ్యానములో యుండగ ఆయనను చంపవలెనని వచ్చిన శత్రువులు విసిగికొని వెళ్ళిపోయిరి.