నిత్య ప్రార్థన - జీవసాధనము
"విసుగక నిత్యము ప్రార్ధనచేయుడి." - లూకా 18:1.
మానవుని జీవితములో విసుగుదల రాకమానదు. ఎంత గొప్పవాడైనను ఎంత సహనశాలియైనను ఎంత దైవభక్తిగల వాడైనను కష్టములు వచ్చినపుడు విసుగుదల రాకమానదు. బైబిలు చదువునప్పుడు, వర్షము కురియునప్పుడు, ఎండ విస్తారముగా కాయునప్పుడు విసుగుకొనుచున్నాము.
దైవ ప్రార్ధన 2 భాగములు:-
- 1. విసుగక ప్రార్ధనచేయుట
- 2. నిత్యము ప్రార్ధనచేయుట
విసుగుదల ఎప్పుడు కలుగును?
- 1. సమయము దొరకనప్పుడు
- 2. ప్రార్ధనా స్థలము దొరకనప్పుడు, వీలులేనప్పుడు విసుగుదల కలుగును.
విసుగుకొనినప్పుడు అది దైవప్రార్థన అనబడదు. ఎందుకనగా ప్రార్ధనలో విసుగుదల అనేది యున్నది. ముఖ్యముగా చెప్పవలెనన్న ఇది ప్రార్ధనకాని ప్రార్ధన. బైబిలులో ఒక స్త్రీ యున్నది. ఆమె అధికారియొద్దకు వెళ్ళినది. అనేకసార్లు వెళ్ళినది. గాని జవాబు దొరకలేదు. అయినను విసుగక అధికారియొద్దకువెళ్ళి అడుగుచున్నది. దీనినిబట్టి చూస్తే ఆమె విసుగుకొనవలసినది. విసుగుకొనుటకు కారణమున్నది. అటువంటి సమయములోకూడ ఆమె, విసుగుకొనలేదు. అదికారి ఆమె మనవి పరిష్కరించవలసినదేగాని త్వరగా పరిష్కరించలేదు. అయినను ఆమె విసుగుకొనలేదు. అలాగే మనము ప్రార్ధించినప్పుడు త్వరగా జవాబు ఇవ్వలేకపోతే విసుగుకొనరాదు. ఒక విషయమునుగూర్చి మనము ప్రార్ధించినప్పుడు దానినిగూర్చి త్వరగా జవాబురానియెడల విసుగుకొందుము. దేవుడు నా మనవి ఆలకించలేదని మనము విసుగుకొనరాదు. ప్రార్థనచేయుట మానరాదు.
మనకు ఒక న్యాయమున్నది: - ఎల్లప్పుడు ప్రార్ధన చేయవలెను. దేవుడు మన ప్రార్ధన విని జవాబిచ్చును. మనము ప్రార్ధనచేసేటప్పుడు విసుగుదల ఉన్నయెడల మనము ప్రార్థనచేసే న్యాయము పోయినది. గనుక తండ్రి న్యాయ నెరవేర్పు జవాబు దొరకదు. మనము న్యాయప్రకారము నెరవేర్చితే ఆయన నెరవేర్చవలసిన న్యాయము నెరవేర్చును. ఈ ఉపమానములో చూపింపబడియున్నది. న్యాయాధికారి స్త్రీ యొక్క మనవి ఆలకించి న్యాయము జరిగించునట్లు మనకును న్యాయము దొరుకును.
ఎందుచేత విసుగుకొనకూడదు:- కొంచెము ఆలస్యమైనను దేవుడు మన మాట ఆలకించును. గాన మనము విసుగుకొనకూడదు. దేవునియొద్దనుండి రావలసిన జవాబు రాలేదని, నెరవేర్పు లేక రాలేదని విసుగుకొనుచున్నాము. వీటివైపు మనము చూడకూడదు.
విసుగుకొనకుండుటకు కారణము:- తప్పక న్యాయము తీర్చును, జవాబు ఇచ్చును. పై కారణమును చూడక నెరవేర్పు కారణము చూడవలెను.
విసుగుదల చేసే కీడు:-
1) నిత్యప్రార్ధన యుండుట
2)
ప్రార్ధన ఆగిపోతుంది.
గోజాడి
ప్రార్దనచేస్తిని, ఇంక
ఎందుకులే అను తలంపువచ్చును. నెరవేర్పులేదని విసుగుకొనవద్దు, ఎప్పటికైనా నెరవేర్పు వచ్చునని ఆ
ప్రార్ధన సాగించండి.
విసుగుదల
కొట్టివేసి నిత్యప్రార్ధనలోకి ప్రవేశించండి. విసుగుదలవల్ల ప్రార్ధన ఆగిపోవును. 4రోజులు
ప్రార్ధనచేసి ఊరుకొంటే
ప్రార్ధనకాలేదు, ప్రార్ధన నవరూపము ధరించలేదు గాని విసుగుదల ధరించినది.
1. స్త్రీ యెదట అనుభవములో
ఒక వృత్తాంతము
కనబడుచున్నది.
ఆలకించలేదు.
2. స్త్రీ మనస్సులో తప్పక ఆలకించును అను వృత్తాంతమున్నది.
మొదటి వృత్తాంతమును రెండవ
వృత్తాంతమునకు
వ్యతిరేకముగా కనబడుచున్నది. అయితే మానవుని హృదయములోనుండవలసినది
ఇప్పటికైతే
ఆలకించనప్పటికిని ఎప్పటికైనా ఆలకించును
విశ్వాసి రెండవది పట్టుకొనును ఆలకించలేదు. ఇందుచేత
నిరాశలోనికి వెళ్ళిపోవును.
ఇది నిత్య ప్రార్ధనకాదు. విశ్వాసి ఈ మూడును గుర్తించవలెను.
(1) నా ప్రార్ధన జరుగుతుందా లేదా!
విసుగుదల లేకుండ
(2)
ఆలకించలేదనునట్టిది లేకుండా ప్రార్ధన సాగించుట
(3) తప్పక నా ప్రార్ధన తండ్రి ఆలకించును అను నమ్మకము.
అప్పుడిది నిత్య
ప్రార్థన
అగును.
దివారాత్రులు ప్రార్థన చేయవలెను. దివారాత్రులు అనగా నిత్య ప్రార్థనను జ్ఞాపకము చేయుచున్నది.
తాను ఏర్పర్చుకొన్నవారి
యొక్క ప్రార్ధన. ఎవరైతే విసుగుదల లేకుండా ప్రార్ధన చేయుదురో వారిని ప్రార్ధన పరులను
ఆయన ఏర్పరచుకొన్నాడు. ప్రభువు
మాట, తాను
ఏర్పర్చుకొన్నవారి మాట లేక ప్రార్ధన. ఆయన వినుచున్నాడు. ఏ పనిమీద ప్రార్ధనా
పరులను ఏర్పర్చుకొనుచున్నాడు? ప్రార్థన
నెరవేర్చు పనిమీద ఏర్పాటు చేసికొంటున్నాడు. దేవునికి ప్రార్ధనలు నెరవేరుట కావలయును. ఒక
ప్రార్థన అంశము మనము చేస్తే
దేవుని
కోరిక ఆ ప్రార్ధన అంశమును నెరవెర్చవలయును.
ప్రార్ధనచేయు అంశమును నెరవేర్పు ఆయనకు కావలయును.
గాన నెరవేర్చుటకు
దేవునికి
మనుష్యులు కావలయును. ఎట్టివారు?
1) విసుగక ప్రార్ధన చేయువారు
2) నిత్యము ప్రార్ధనచేయువారు.
బోధచేయుటకు కొందరు
బోధకులు
కావలయును, రోగులను ఆదరించుటకు ఆదరణకర్తలు కావలయును. చిక్కులతో నున్నవారిని విడదీయుటకు
పరిచారకులు కావలయును.
ప్రార్ధన నెరవేర్పు కొరకు ప్రార్ధనపరులు కావలయును. ఈ ప్రకారము నెరవేర్చుకొన్నారు.
సిద్ధపడినారు గాన ఆయా పనులకు
పంపును. దేవునికేమి కావలయును? నెరవేర్పులు కావలయును. నెరవేర్పులు తెచ్చు ప్రార్ధనలు కావలయును.
అట్టి ప్రార్ధనలు
చేయు
ప్రార్ధనా పరులు కావలయును.
క్రీస్తుప్రభువుయొక్క శిష్యులు: - వీరు బాగుగా నేర్చుకొన్నారు, విన్నారు, సిద్ధపడినారు, నూతన బలము పొందియున్నారు. గనుక ఇతరులకు బాగుగా చెప్పగలరు. క్రీస్తు ప్రభువు దగ్గర బాగుగా నేర్చుకొని సిద్ధపడినారు గనుక లోకమునకు సందేశములను అందించిరి. సన్నిధిలో బాగుగా తయారైరి. శిష్యులు నెరవేర్చుకొన్నప్పుడు విసుగుకొన్నారు గాని సేవలో నున్నప్పుడు విసుగుకొనలేదు. మనము కూడ ఈ రెండు అనుభవములును అవలంభించినట్లయితే మనలనుకూడ ఆయన గొప్పగొప్ప పనులకు ఉపయోగించును. దేవుడు నన్ను ఏర్పరచుకొనవలయునని కోరుకొనండి. ప్రభువు సెలవిచ్చిన ప్రకారముచేస్తే ప్రభువు ఏర్పాటుచేసికొన్న వారిలో చేరగలము. ఈ దినములో ప్రార్ధన తగ్గిపోవుచున్నది. కష్టములవలన ఏమి ప్రార్ధన అని అనిపించును. సొమ్మసిల్లిపోవును.
నిత్యము:- నిత్యము ప్రార్ధన చేయుమని చెప్పెనుగాని త్వరగా ఆయన న్యాయము తీర్చును.
1. దివారాత్రులు, 2. త్వరగా నెరవేర్పు లేకపోతే విసుగుదలవల్ల తరచుగా అనేక ప్రార్ధనలు నెరవేర్చవలయును. గాన త్వరగానే నెరవేర్చును. త్వరగా ప్రార్థనలు ఆలకిస్తానన్నది విశ్వాసము. ఆలకిస్తాడనునది రెండు విధములుగా చెప్పగలము.
1వ వృత్తాంతము: స్త్రీయొక్క ప్రార్ధన ఆలకించినాడు.
2వ వృత్తాంతము: భావికాల వృత్తాంతము;
తండ్రి ఆయన
ఏర్పరచుకొనిన వారి ప్రార్ధన వినును.
ప్రార్ధన అనునది ఊపిరి వంటిది. ఊపిరి శరీర జీవనమునకెట్టిదో ప్రార్ధన అనునది ఆత్మీయ జీవమునకు అట్టిదైయున్నది.