దైవశక్తిని ఎరుగుట
"నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది యేదియు నిష్పలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని" - యోబు 42:2.
అర్ధము:- మనమెంత అసాధ్యమైన సంగతి ఎత్తి ప్రార్ధించినను దేవుడు నెరవేర్చగలడని బోధించునట్టి వాక్యములలో యిదియొకటి. గనుక ప్రార్ధనాపరులు హడలి నిరాశపడనక్కరలేదు. ఈ వచనములో రెండు భాగములు గలవు.
- 1) దేవుడు సమస్తమును చేయగలడు.
- 2) దేవుడు చేయగోరి ఉద్దేశించినది యేదియు వ్యర్థము కాదు.
షరా:-
సమస్తమును చేయగలవాడు ఎవరై ఉండును? సృష్టికర్తయే. ఆదిలో భూమ్యాకాశములను వాటిలో
ఉండే వాటిని చేసినవాడు. ఆ తరువాత
లోకాంతము వరకు
చేయవలసిన పనులను కూడ చేయగలడు. ఇది దేవుడు చేయలేడని అనకూడదు.
దేవుడు అన్నియు చేయ కలిగినవాడైతే
పాపము చేయగలడా?
అని కొందరడుగుచున్నారు. భూమి, ఆకాశములు చేయుట శక్తియైతే పాపము చేయుట శక్తికాదు. అశక్తి గనుక
శక్తిగల దేవుడు
అశక్తిగల కార్యమును చేయడు, చేయలేడు. పాపము చేస్తే ఆయన శక్తిలేనివాడని అనిపించుకొనును. మరియు
దేవుడు సాతానును
మార్చగలడా? నరకములో పడేవారందరిని మార్చగలడా? అని కొందరు అడుగుచున్నారు. దేవుడు వారికి స్వంత
ఇష్టము అనగా స్వతంత్రము
అనే
లక్షణమును ఇచ్చినాడు. కాబట్టి వారి ఇష్టము లేకుండా వారి గుణమార్పు విషయములో ఏమియు చేయడు. ఒకవేళ
చేస్తే
ఇచ్చిన స్వాతంత్ర్యమును (స్వతంత్రత) తీసివేసికొన్నట్టే; అట్లు చేయుట అన్యాయము, అన్యాయమే
పాపమగును; అందుచేత
చేయడు. నా మనస్సు
మార్చుమని అడిగితే, మార్చగలడు. దేవుడు సమస్తము చేయగలడు అనుమాటకు మరియొక అర్థమేమి? మంచి
కార్యమును మాత్రము చేయగలడు,
న్యాయమైన
కార్యమును చేయగలడు కష్టములను తొలగించగలడు. కావలసినవి ఇవ్వగలడు. క్రొత్తవి సృష్టించగలడు. ఇదియే
దాని
అర్ధము.
స్వాతంత్ర్యమను లక్షణములను తీసివేసిన ఏమగును? తీగెను తీసివేసిన డొంక అంతయును కదలును, అనగా స్వాతంత్ర్యము తీసివేసిన అన్ని మంచిగుణములు హరించిపోవును. అదిపోతే నరులు నశించిపోదురు.
3) దేవుడుద్దేశించినది వ్యర్థముకాదు. దేవుడేమి ఉద్దేశించినాడు? రెండు సంగతులు గమనించండి.
- a) భూమ్యాకాశములను, దూతలను, నరులను కలుగజేయవలెనని ఉద్దేశించినాడు. ఇది నెరవేరినది. ఆటంకము కలుగలేదు.
- b) సృష్టియైన తరువాత ప్రతిదినము నూతన సృష్టిచేయనుద్దేశించినాడు. నేడు నెరవేరుచున్నదిగదా!
ఇంకా ఏమి ఉద్దెశించినాడు? నరుడు పాపములో పడినప్పుడు రక్షణ సంకల్పన నేర్పింపవలెనని నుద్దేశించినాడు. ఇదికూడ నెరవేరినది. ఆటంకములు వచ్చినను నెరవేరినది. నేరములకు శిక్ష అని దేవునికి తెలియును. ఇదికూడ నెరవేరుచున్నది. అన్నియు చివరకు నెరవేరును. పాపమునకు ఫలితము వచ్చుటచూచి దేవుడు ఊరుకొనునుగాని తీసివేయమని కోరేవారుంటే తీసివేయగలడు. కాబట్టి ప్రార్థనాపరులారా! మీరు పట్టుపట్టి నమ్మకముతో చేసే ఏ ప్రార్ధనయు నిష్పలముకానేరదు. ఇది గొప్ప ఆదరణగలమాట.