నమ్ముడి
"అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను" - మార్కు 11:24
ప్రభువు ఈ వాక్యములో నాలుగు అంశములను గురించి తెలియజేయుచున్నారు.
- 1) ఒక అంశమును గురించి ప్రార్ధన చేయుడి
- 2) అది నెరవేరదు
- 3) నెరవేరకపోయిందని ఊహించి, అదనముగా నమ్మివేయండి.
- 4) అప్పుడది నెరవేరును.
ఈ వాక్య ప్రకారము చేయవలసినప్పుడు ఒక ప్రశ్న లేచును. నెరవేరనిదే నెరవేరినదని నమ్ముట అబద్దముగాదా? నరదృష్టికి అబద్ధమేగాని దైవదృష్టికి సత్యమైయున్నది. ఎందుకనగా నెరవేర్పు తండ్రికి కనబడును. మరియు ఈ వాక్యప్రకారము చేసేటప్పటికి మన శరీరబలము, జ్ఞానబలము ఉడిగిపోవును.
ఎంత కష్టము! జబ్బుచేత బాధపడుచున్న రోగినిచూచి నీ జబ్బు పోయినది. దేవునికి స్తోత్రమని చెప్పగలడా? ఇది శరీరనైజమునకు అసాధ్యమైనను యత్నింపవలెను.
ఎప్పుడు నమ్మవలెనని వాక్యములో ఉన్నది?
అడిగినప్పుడే నమ్మవలెను. అడిగినాము గనుక నమ్మవలెను. అడిగితే అది వేరే సంగతి.
ఎందుచేత ముందుగా నమ్మవలెను?
ప్రభువు చెప్పినాడుగాని నాకు నెరవేర్పు కనబడడములేదు. నాకు దర్శనము రావడములేదు. కలలు రావడములేదు. నమ్మకము తోచలేదని ఒకరనవచ్చును. దానికికూడ ఇదే జవాబు ప్రభువు చెప్పియున్నారు. మన నమ్మికవేరు ప్రభువు నమ్మికవేరు. మన నమ్మిక కదలిపోవును.
కుమారుని ప్రభువునొద్దకు తీసుకొనివచ్చిన తండ్రి ఏమని ప్రార్థించెను?
ప్రభువా! నమ్ముచున్నానుగాని అపనమ్మిక కలుగకుండ సహాయపడుమని ప్రార్థించెను. మనము ప్రార్థించునప్పుడు ఈ వాక్యము చెప్పినాడు గనుక ఆయన నమ్మికమీద ఆనుకొనవలెను అది ఆయన నమ్మికను వాడుకొనుటయైయున్నది.