సన్నిధిపరులు చేయవలసిన ప్రార్ధనలు
- 1. దేవా! నీవు సైతానును, ఆదిసర్పమును,
ఘట సర్పమును, ఆ
ఎర్ర సర్పమును
ఏడేండ్ల శ్రమకాలమందు, మట్టులేని ఆ గోతిలో పాతాళ లోకములో బంధింపనైయున్నావు. గనుక
నీకనేక నమస్కారములు. దానికి
ముంగుర్తుగా
ఇప్పుడే న్యాయ పద్ధతిని ఎంతగా బంధింపవలెనో అంతగా బంధించుము. ఆమేన్.
- 2. దేవా! సైతానుయొక్క
జట్టువారైన
చెడ్డదూతలను,
చివరకు నరకములో పడవేయుదువు గనుక నీకు నమస్కారములు. ఆ పనికి ముంగుర్తుగా ఇప్పుడు న్యాయపద్ధతిగ
పనిచేయుము.
ఆమేన్ .
- 3. సైతాను యొక్క అనుచరులు, అతని
ప్రేరేపణవలన అతనితోపాటు
చెలరేగియున్నారు. వారినికూడ ఏడేండ్ల శ్రమ కాలములో ఆపుచేస్తావు గనుక నమస్కారములు. దానికి
ముంగుర్తుగా ఇప్పుడు
న్యాయపద్ధతిని
ఆపుచేయుము ఆమేన్.
- 4. ఏడేండ్ల పరిపాలనాంతమందు అంతెక్రీస్తును నరకములో పడవేయుదువు,
నమస్కారము. ఇప్పుడుకూడ
అంతెక్రీస్తువంటివారు మనుష్యులలోకూడ ఉన్నారు. వారు నీ విరోధులు. దానికిముంగుర్తుగా ఇప్పుడు
వీరిని పడవేయుము.
ఆమేన్.
- 5. ఏడేండ్ల చివర అబద్ధ ప్రవక్తలను నరకములో పడవేయుదువు. అతనివలె
తప్పుబోధలుచేసే అబద్ధ ప్రవక్తలు
ఇప్పుడు ఉన్నారు. దానికి ముంగుర్తుగా న్యాయపద్ధతిని వీరినికూడ పడవేయుము. ఆమేన్.
- 6.
ఏడేండ పరిపాలనలో మెడ వంచనివారు
శ్రమలలో సహితము మారుమనస్సు పొందనివారు మరణమౌదురు. ఆ మృతులు సజీవులకు ఆటంకముగా నుండకుండ
చేయుదువు.
నమస్కారములు. దీనికి
ముంగుర్తుగా న్యాయపద్ధతిని మరణమగు చున్నారు.
- 7. మానవులనందరిని దైవభక్తులుగా చేయుటకై
ఏడేండ్ల శ్రమకాలములో
ఎండవల్ల,
నీళ్ళవల్ల, జంతువులవల్ల, కరువులవల్ల బాధలు కలిగించెదవు నమస్కారము. దీనికి
ముంగుర్తుగా ఇప్పుడుకూడా బాధలు
కలిగించుచున్నావు,
నమస్కారములు.
- 8. వెయ్యేండ్ల పరిపాలనలో నైజపాపము కలవారు అనేకమంది ఉంటారు. వారి గతి
ఏమగునో మీకే తెలుసు.
ప్రభువా!
నీవు న్యాయము చేస్తావు గనుక నమస్కారము. ఇప్పుడు కూడా దీనికి ముంగుర్తుగా న్యాయపద్ధతిని
న్యాయము చేయుము. ఆమేన్.
- 9.
హేడెస్సులో మారుమనస్సులేని మృతులు అనేకమంది ఉన్నారు. వారి విషయములో నీవు న్యాయము, కృప
చూపిస్తావు.
గనుక నమస్కారములు. ఇప్పుడుకూడా అట్టివారు భూమిమీద ఉన్నారు. వారి
న్యాయపద్ధతిని
నీ
ఇష్టమువచ్చినట్లుగా నడిపించుము, ఆమేన్.
- 10. ప్రభువా! కడవరి తీర్పు రాకముందు భూలోకములో
ఉన్న ప్రతివారికిని,
హేడెస్సులోనున్న ప్రతివారికిని నీ సువార్త పూర్తిగా వినిపించుము. ఆమేన్.
- 11.
పిశాచియొక్కదుష్ట
ప్రయత్నములన్నిటిని
సమూలముగా నాశనము చేయుము. ఆమేన్.
- 12. తండ్రీ! నీ విశ్వాసులు అభిమానులు చేయుచున్న
మంచి పనులన్నిటిని
వృద్ధిలోనికి
తీసికొనిరమ్ము. ఆమేన్.
- 13. ఓ తండ్రీ! 1938 సం॥లో ప్రత్యేకమైన మా బైబిలు మిషనును
స్టాపించియున్నావు గనుక దీని
విషయములో నీకుగల ఉద్దేశములన్నిటిని అంచీలమీద నెరవేర్చుము ఆమేన్.
- 14.
ప్రత్యక్షమగుచున్న మా తండ్రీ!
సృష్టిద్వారా,
మానవ జ్ఞానముద్వారా, బైబిలుద్వారా, క్రీస్తు ప్రభువుద్వారా, సంఘము ద్వారా బైలుపడుచున్న
తండ్రీ! నీకు అనేక
నమస్కారములు.
బైబిలు మిషనుద్వారా ఇంక ఎక్కువగా బైలుపడుచున్న తండ్రీ! నీకు అనేక వందనములు. ఈ మిషను
పత్రికలద్వారా, స్వస్థి
శాలలద్వారా బైలుపడుచున్న తండ్రీ! నీకు నమస్కారములు. సన్నిధి కూటముల ద్వారా శరీర రూపములో కనబడి
మాటలాడుచున్న
తండ్రీ!
నీకు అనేక నమస్కారములు.
- 15. సువార్త సంపూర్తిగా బోధించే బోధకులను ప్రతి
దేశములో లేపుమని
వేడుకొనుచున్నాము.
- 16.
ప్రభువుయొక్క రాకడను గురించి, ప్రతి దేశములో బోధకులను లేపుమని వేడుకొనుచున్నాము.
- 17.
బైబిలుమిషను పైకెత్తి
చూపించగల
ప్రముఖులను లేపుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
- 18.
బైబిలు గ్రంథము
1400 భాషలలో తర్జుమా చేయించినందుకు నమస్కారములు. మిగతా చిన్న చిన్న భాషలలో కూడా తర్జుమా
చేయించుమని
వేడుకొనుచున్నాము.
ఆమేన్.
- 19. మనుష్యులు క్రొత్త క్రొత్త విషయములు కనిపెట్టు చున్నారు. విమానముకూడా చేసే
విధానములు
కనిపెట్టినారు.
ఏ పద్ధతిని కనిపెట్టిన యెడల ప్రతి మనుష్యునికి సువార్త అందునో, ఆ పద్ధతిని కనిపెట్టుటకు
కొంతమందిని లేపుము.
ఆమేన్.
- 20. లోకములో జరుగుచున్న యుద్ధములకు, పాఠశాలలకు ఇంకా అనేకమైన పనులకు నీవు ఎన్నో
కోట్ల రూపాయలు
ఇస్తున్నావు. నీకు నమస్కారములు అలాగే సువార్త ప్రకటించుటకు అంతకంటే ఎక్కువ కోట్లసొమ్ము నీ
సంఘమున కిమ్మని
వేడుకొనుచున్నాము,
ఆమేన్.
- 21. తండ్రీ! పాపులకు, రోగులకు, బీదలకు, గొడ్రాండకు, పసిపిల్లలకు, భర్తపోయిన
వారికి,
భార్యపోయినవారికి,
అన్యాయము అనుభవించుచున్నవారికి శాంతము కల్గునట్టి పనులు ఇంకా ఎక్కువగా చేయించుమని
వేడుకొనుచున్నాము, ఆమేన్.
- 22. ఓ
తండ్రీ! ఆకాశమందలి జ్యోతులలోనికి వెళ్ళవలెనని కొందరు ప్రయత్నించుచున్నారు. మరికొందరు భూగర్భంలోనికి
పనులు చేయుటకై
వెళ్ళుచున్నారు. దిగి పనిచేయుటకై వెళ్ళుచున్నారు. మరికొందరు సముద్రములో ఇట్లు అపాయకరమైన పనులు
చేయుటకు ప్రయత్నించుచున్న
వ్రతివారికి నీవు తోడైయుండుమని వేడుకొనుచున్నాము, ఆమేన్.
- 23. తండ్రీ! నీవు స్థాపించిన
క్రైస్తవ
సంఘములో
350 మిషనులు వచ్చినవి. ఇవి ఇతర మతస్థులకు మాదిరికాదు. అన్ని మిషనులు ఒకటి అగునట్లు చేయుమని
వేడుకొనుచున్నాము.
- 24.
తండ్రీ! వేల గొర్రెల మంద నాకున్నదనియు, వాటిని తోడుకొని రావలయునని నీవాక్యములో వ్రాయించినావు గనుక
ఇతర
మతముల వారినందరిని తోడుకొని రమ్మని వేడుకొను చున్నాము. ఆమేన్.
- 25.
నీ బైబిలును,
యేసుప్రభువును, క్రైస్తవసంఘమును కొందరు విమర్శించుచున్నారు. ఈ పనిని వారు తెలియకయే చేయుచున్నారు.
గనుక క్షమించుమని
వేడుకొనుచున్నాము. మరియు వారు నమ్మినను, నమ్మకపోయినను సరే వారికి తేటపర్చుమని మా ప్రార్ధన.
ఆమేన్.
- 26.
లోకసంబంధమైన
విషయములో కొత్తవి ఏ ప్రకారముగా బైలుపర్చుచున్నావో ఆ ప్రకారముగానే నీ విషయములను,
క్రొత్త విషయములను మాటిమాటికి
బైలుపర్చుమని
వేడుకొనుచున్నాము. ఆమేన్.
- 27. తండ్రీ! నీవు కలుగజేసిన సూర్యచంద్ర
నక్షత్రములను భూమండలమును,
పక్ష్యాదులను,
పశ్వాదులను, జలచరములను, పురుగులను, చెట్లను, కొండలను, జలములను, గాలిని ఈ మొదలైన వాటిని
అనుదినము దీవించుమని
వేడుకొనుచున్నాము. ఆమేన్.
- 28. తండ్రీ! మేము అడిగినవాటన్నిటికంటే ఎక్కువే దయచేయుమని
వేడుకొనుచున్నాము.
ఆమేన్.
- 29. తండ్రీ! యేసుప్రభువుయొక్క రెండవ రాకడ ఎంత త్వరగా వస్తున్నదో; అంత త్వరగా
శుద్ధికార్యమును, వృద్ధి
కార్యములు సాగించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మరనాత.