సన్నిధి చార్టు
- 1వ మాట వివరము:- నాయొద్దకు వచ్చువానిని, నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నేను సిద్ధపడలేను, ప్రార్ధనరాదు, హృదయము నిండా కళంకమేదైనను; సరే, ఈ వాక్యమును బట్టి సన్నిధిలోనికి వచ్చి "ఉన్నపాటున వచ్చుచున్నాను" అను కీర్తన అనుసరించి వచ్చుచున్నాను అని వెళ్ళవలెను.
- 2వ మాట:- అడుగుడి మీకు ఇయ్యబడును. దీనినిబట్టి నాకు కావలసినవన్ని అడిగెదను. ఇచ్చినసరే యివ్వకపోయినను సరే ఇస్తానని యున్నది గనుక ధైర్యముగా అడిగెదను. “ప్రార్ధన చేయునప్పుడు-నమ్ముడి”
- 3వ మాట:- ఇది కష్టమైనప్పటికి బాహ్యదృష్టికి కనబడక పోయినప్పటికిని కనబడినట్లు తృప్తిపరచుకొనుడి. రహస్యమందు చూచు నీతండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
- 4వ మాట:- నీకు ప్రార్ధనచేయు గదిలో నా జతకు ఎవ్వరు అక్కరలేదు. నా గదిలో నా తండ్రి, నేను యుందుము. నాకు వచ్చినట్లు ప్రార్ధిస్తాను. బలము కలుగును, తప్పకుండ కలుగును. తండ్రి దగ్గరనుండి బహుమతి పొందకపోను. దివారాత్రములు మొర్రబెట్టుట.
- 5వ మాట:- ఒక వాక్యమునుబట్టి వచ్చివేస్తివి గనుక నేను ఏర్పాటు మనిషినే కాబట్టి (వినడా చార్టు) తన కుమారునిబట్టి అడిగినది ఇచ్చును.
- 6వ మాట:- నేను అడిగినది ఎక్కువైనది, గొప్పదైనది. అయినను కుమారుడు గనుక ఆయనకంటే ఇవి తక్కువే గనుక ఆయనను ఇచ్చివేసినట్లు అన్ని ఇచ్చును.
- 7వ మాట:- నేను ప్రార్థించలేకపోయినా నా కొరకు ఎవరు ప్రార్ధించలేకపోయినను నిరాశపడను వారికంటే నాకంటే ప్రార్థించే వారు నాలోనెయున్నారుగా మరి.
- 8వ మాట:- సన్నిధిలోనికివెళ్ళితే మేలే అనియు, కావలసినవి వాటంతట అవే సమకూడునని యున్నది గనుక చింతపడను.
- 9వ మాట:- ఈ వేళ నేను ఉద్దేశించి అడిగేవి, ఆవేళ తండ్రి ఉద్దేశించినదే లేకపోతే ఈవేళ నేను ఎందుకు వత్తును.
- 10వ మాట:- “నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను.” సర్వశరీరులనే మాటలో నేనున్నాను. నాకుకూడ శరీరమున్నది. అసాధ్యమైతే నాకెందుకు, సాధ్యమైతే నాకెందుకు. సాధ్యపరచే ఆయన నాకుండగా నాకు అద్దుయేమి?
- 11వ మాట:- అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు. మనిషి ఏదైనా సంపాదించగలడు. ఆకాశములోనివి. భూమిమీదివి కూడ రక్షణ మోక్షములోనున్నది. గనుక సంపాదించలేడు. దేవునికి అసాధ్యము కాదు. గనుక నమ్మి అందుకొనవలెను.
- 12వ మాట:-
నా నామమునుబట్టి నన్నేమి
ఏమి అనుమాట భూమిమీదనుండి ఆకాశమువరకును, ఆకాశమునుండి మోక్షమువరకును వ్రాయవచ్చును, అడుగవచ్చును. అడుగకూడదు అనిలేదు. ఇది ఎంత గొప్ప ఆదరణగల వాక్యము. - 13వ మాట:- "అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే" మనము అడిగేవి ఎక్కువ. ఊహించేవి అంతకంటే ఎక్కువ ఇచ్చేవి మరీ ఎక్కువ. ఎందుకు ఇవ్వడు.
- 14వ మాట:- "సమస్తమును" అడుగకముందే సమస్తమును మీవే అని వ్రాయబడియున్నది. గనుక అక్కడివి తీసికొనిన అనుభవించుట నా పని. సర్వశరీరులుయని ఉన్నది. సమస్తమును ఇన్ని కలిసి ఎన్నైనను పుచ్చుకొనగలను.
- 15వ మాట:- "దేనినిగూర్చి చింతింపకుడి" కృతజ్ఞతతో నా హృదయమును నింపుకొంటే దానములతో నా చేతులు నిండును. సామానులతో నా యిల్లు నిండును. వర్తమానములతో నా నోరు నిండును. అన్నిటికంటే ముఖ్యముగా పరిశుద్ధాత్మతో నా హృదయము నిండును. దేవుని వాక్యనిబంధనలు ఎంత పని చేస్తూయున్నవి? నన్ను గురించి నా తండ్రి చింతించుచున్నాడు గనుక నాకు చింతయుండకూడదు. నీ తండ్రి గార్థబలములను గూర్చి చింతించుటలేదు. నన్నుగూర్చి చింతించుచున్నాడు. సమస్తము మీవి. 1కొరింధి 3:21.
- 16వ మాట:- మనము ఎంత భాగ్యవంతులము.
మనము
సన్నిధి గదిలోనికి
వెళ్ళనైయున్నపుడు వెళ్ళకముందు, రెండు వాక్యములు మనము చూడవలెనని జ్ఞాపకము చేయుచున్నాను.
- 1) త్రోసివేయను,
- 2) సమస్తమును మీవి.
ఈ రెండు వాక్యములను చదివి ప్రార్ధనాపరులు ఆనందించవలయును. ఈ రెండు వాక్యములు చదివి ప్రార్ధనాపరులు మధ్యను మోకరించి అన్ని ప్రార్ధనలు చేయవలెను. మీరు ఏవి తలంచుకొంటే అవి మీవే.
దేనిని గురించియు చింతింపకుడిగాని ప్రతి విషయములోను, ప్రార్ధన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6.
ఈ వాగ్ధానముతో, ఆయన సన్నిధియందు ఏ చింతయు లేకుండా హాయిగా జీవింతుము గాక! ఆమేన్. మరనాత.